Saturday, August 13, 2022

దుఃఖభాగులు

దుఃఖభాగులు
➖➖➖


ప్రపంచంలో సుఖం, సంతోషం ఎరుగనివారు ఎవరైనా ఉన్నారా ?

అంటే ఉన్నారంటున్నాయి శాస్త్రాలు.

మామూలుగా మనం వాడే పదాలలో ‘సుఖం,సంతోషం,ఆనందం’ అనే పదాలు వాడతాం.

’సుఖం’ అంటే శరీరం అనుభవిస్తుంది. ‘సంతోషం’ మనసు అనుభవిస్తుంది. ఆనందం అనేది ఆత్మ అనుభవిస్తుంది.

అయితే ఇతరులు సుఖ పడినా, సంతోష పడినా చూసి ఓర్వలేని మనస్థత్వం కలవారు ఉంటారు.

వారిని "దుఃఖభాగులు"అంటారు వారి వివరాల్లోకి వెళితే వారు ఆరు రకాలు.


1. :ఈర్ష్యాళువు:

వీళ్లు ఎవరి వృద్ధినీ లేక ఎదుగుదలను చూడలేరు.

వీరికి ఈర్ష్య ఎక్కువ అలాంటివారిని ‘ఈర్ష్యాళువు’అంటారు.


2. జుగుప్సావంతుడు:

వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు, మొహం ఒకరకంగా పెట్టుకుంటారు వీరికి ఏదీ నచ్చదు.


3. నిస్సంతోషి:

వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు.

ఎంత ఉన్నా ఏదో కొరత, ఇంతకు ముందుకన్నా బాగుండి కొద్దిగా సంపాదిస్తున్నా సంతోషం ఉండదు, నాకేమి లేదు, అసలు రూపాయి రావటంలేదు ఇలా మాట్లాడుతూ ఉంటాడు.

ఇలాంటివాడికి ఇలా అంటే ధనం కలిసొస్తుందేమో కాని వాడికి సంతోషం ఉండదు. ఎదుటివాడిమీద ఏడుపు


4. క్రోధనుడు:

వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ కోపంతో ఉండే కోపిష్ఠి.

క్రోధం ఉన్నవాడికి సుఖం సంతోషం తక్కువ.


5. నిత్యశంకితుడు:

అన్నీ చోట్లా, అందరినీ శంకించేవాడు వీడు.

అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది అనుమానమే జీవితం.

ఈ అనుమానంతో ఒక శాడిస్ట్ లా ఒక సైకోలా అవతలి వారిని అరాచకంగా పైశాచికంగా హింసిస్తూ ఉంటాడు.

ప్రస్తుత కాలంలో వీళ్లు ఎక్కువ. ప్రేమించానని ప్రేమించిన పిల్లని, అలానే పెళ్లి చేసుకుంటే కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానంతో సైకోలా ప్రవర్తించటం వీరిలక్షణం.


6. #పరభాగ్యోపజీవి:

ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు వీడికి ఎప్పుడూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే గాని లేదంటే దుఃఖమే.


ఈ ఆరుగురూ ఎప్పుడూ సుఖం, సంతోషం, ఆనందం లేకుండా బాధతో అసంతృప్తితో జీవిస్తుంటారు.

కాబట్టి వీరిని దుఃఖభాగులు అంటున్నాయి శాస్త్రాలు.

సేకరణ

No comments:

Post a Comment