నువ్వు శక్తివంతమైన వాడిగా అవ్వాలంటే నీకంటే శక్తివంతుడ్ని పట్టుకోవాలి.
నీకంటే బలహీనులని పట్టుకొని నాప్రాణం, నాసర్వస్వం అంటూ ఉంటే బలహీనుడైపోతావు. అనంతరం నిన్ను గెంటేస్తారు.
నీకంటే శక్తి వంతుడిని పట్టుకొని శక్తి ని సంతరించుకుని ఆ శక్తిద్వారా నీపై ఆధారపడ్డవారికి శక్తిని అందిస్తే ఆ శక్తిని అందుకున్న నిన్ను ఆధారంగా పట్టుకొని ముందుకి వెళతారు.
శక్తివంతుడితో స్నేహం చెయ్. అతనిద్వారా శక్తిని పొందు. నీద్వారా ఇతరులకు ఆ శక్తిని అందించు. నీకంటే శక్తిమంతుడు భగవంతుడే. ఫలానా మతం అని ఏమీలేదు. ఉన్నది ఒక్కటే పరమాత్మ. మతాలతో విభజన చేసినంత మాత్రం చేత కొత్తశక్తులు ఏమీ పుట్టుకురావు. అన్ని మత గ్రంథాలకు ఆధారం వేదమే. మనవులంతా ధ్యానులు అవ్వాల్సిందే. అప్పుడే శక్తిని సంతరించుకోగలరు.
No comments:
Post a Comment