Wednesday, August 17, 2022

భగవత్ దర్శనం ఎలా లభిస్తుంది?

 భగవత్ దర్శనం ఎలా లభిస్తుంది?


   శ్రీ రామకృష్ణులు: హృదయ పావనత్వం లేకుంటే భగవత్ దర్శనం కలుగదు. కామినీ కాంచనాల పట్ల అనురక్తితో మనస్సు కలంకమై ఉన్నది. మట్టిచే కప్పబడ్డ సూదిని అయస్కాంతం ఆకర్షించుకోలేదు; మట్టిని కడిగి వేసిన తర్వాత ఆకర్షించుకుంటుంది. అదేవిధంగా మనోమాలిన్యాన్ని అసృవులతో కడిగి వేసుకోవచ్చు. పశ్చాత్తాపంతో 'ఓ భగవంతుడా! నేనిక ఎన్నడు అటువంటి పని చేయను'అంటూ అశ్రుధారలు కురిపిస్తే ఈ మనోమాలిన్యం తొలగిపోతుంది. ఆ తర్వాత అయస్కాంతం అనే భగవంతుడు సూది అనే భక్తుని మనసును ఆకర్షించుకుంటాడు. ఆపైన సమాధి స్థితి కలుగుతుంది. భగవద్దర్శనం పొందుతాడు.


🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

No comments:

Post a Comment