Friday, August 12, 2022

మానవ శరీరం ఓ అణువుల సముదాయం

 మానవ శరీరం ఓ అణువుల సముదాయం అని  మనం అనుకున్నాం. ఓ వైరస్ మనల్ని చూస్తే దానికి మన శరీరం అణువుల సముదాయంగానే కనిపిస్తుంది. ఇంకో రకంగా ఆలోచిస్తే మానవుడు కొన్ని రసాయనాల మిశ్రమాలతో ఏర్పడినవాడని కూడా అనిపిస్తుంది. 
                                          మానవశరీరంలో అనేక రసాయనిక పదార్థాలు ఉన్నాయి. శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది. ఈ మాటకు మొదటి పాఠంలో ని ఏదయినా మాటకు తేడా ఉందని మీకు అనిపిస్తే నీరు కూడా అణువుల సముదాయంతో ఏర్పడిందే నన్న నిజాన్ని ఓసారి గుర్తు చేసుకోండి. ఓ వైరస్ కి మీరు గనక మాటలు నేర్పితే ! "మీ దేహంలో ఎక్కువ నీళ్ళు కనబడుతున్నాయి" అని ఆ జీవి మీకు తప్పకుండా చెబుతుంది. అలాగే ఇంకో మాట కూడా అంటుంది- " మీ శరీరంలోని గాలి అణువులని చూస్తే సముద్రం ఒడ్డులోని ఇసుకలాగే నాకు కనిపిస్తుంది’ అని. ఇక మన శరీరంలోని రసాయనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 
                                       మనం ఓ ఎలక్ట్రిక్ షాపుకి వెళ్ళి ఓ టార్చిసెల్ ని కొన్నామనుకోండి. ఆ టార్చిసెల్ మధ్యలో ఓ పెన్సిల్ మందంలో ఓ కర్బన్ కడ్డి ఉంటుంది. దాని చుట్టూ కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ మొత్తం ఓ జింకు పైపులో బిగించబడి ఉంటాయి. సెల్ లోపల బాగా తడిగా ఉంటుంది. పైకి మాత్రం పొడిగా కనిపించే ఈ బ్యాటరీసెల్ ని డ్రై సెల్ అంటారు. ఇట్లాంటి సెల్స్ కొన్ని కలిపితే బ్యాటరీ అంటాము. ఈ బ్యాటారీలను టార్చిలైటులో ఉంచి స్విచ్ నొక్కగానే ఆ సెల్స్ లో విద్యుత్తు సృష్టించబడి ఓ లైటు వెలుగుతుంది. స్విచ్ ఆపగానే బ్యాటరీలోని రసాయన చర్య ఆగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. రసాయనిక చర్యకు జింకు రేకు కొద్దికొద్దిగా కరుగుతూ ఉంటే విద్యుత్ పుట్టడం ప్రారంభమౌతుంది. రసాయనిక చర్య జరగకముందు బ్యాటరీ సెల్ లో విద్యుత్ ఉండదు.
                                       ఉప్పు నీళ్ళలో ఊరకే నిలబడి ఉన్న చిన్న పడవలలో, పెద్ద ఓడలలో కూడా ఇలాగే విద్యుత్ తయారవుతుందనే విషయం గురించి బహుశా మీరు వినే ఉంటారు. ఉప్పు నీళ్ళలో తేలుతున్న పడవ ఆడుగుభాగం లో ఉన్న రెండు విభిన్న లోహపు రేకుల మధ్య కొన్ని పరిస్థితులలో ఇలాంటి విద్యుత్ తయారవుతుంది. దురదృష్టవశాత్తు ఓ పడవకి అడుగుభాగం లో రాగి రేకు తాపడం చేసిఉందనుకోండి. ఆరాగి రేకుకు పైన కొన్ని ఇనుప బద్దీలను స్క్రూలతో గానీ మేకులతో గానీ బిగించి ఉంచారనుకోండి. కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే .... ఉప్పునీళ్ళలో ఎలక్ట్రాలసిస్ చర్యవల్ల ఆ రాగి రేకు ఇనుపబద్దీల జంక్షను చిలుంపట్టిపోయి పొడిపొడిగా రాలిపోయి నామరూపాలు లేకుండా పోతుంది. ఇలాంటి ఉపద్రవం జరగకుండా ఉండటానికి, పడవ పాడైపోకుండా ఉండటానికి ఓ ’త్యాగపు ధన దృవాన్ని’ ఓ జింకు రేకులాంటి దాన్ని ఉపయోగిస్తారు. రసాయనిక చర్య జరిగితే ఈ జింకు రేకు పాడై పోతుందే తప్ప మిగతా పడవ పాడుకాదు. అప్పుడు జింకు రేకును మార్చుకుంటూ ఉంటే చాలు. రాగి, కంచు ఋణవిద్యుత్తుకు జింకు అల్యూమినియం, మెగ్నీషియం ధన విద్యుత్తుకు ఆలంబనగా ఉంటాయి. ఓడకి ఉపయోగించే ప్రొపెల్లర్లను కాంస్యంతో తయారు చేస్తారు. ఇవి ఎలక్ట్రాలిసిస్ ద్వారా పాడైపోకుండా ఉండటానికి షిప్ ఇంజనీర్లు ఓ ఆనోడ్ ని ప్రొపెల్లర్ల దగ్గర అమరుస్తారు. ఇదంతా ప్రస్తుతం చెప్పడం ఎందుకంటే విద్యుత్ ఎలా ఉంటుందో, ఎన్ని విచిత్ర పద్ధతులల్లో పరిస్థితుల్లో అది తయారవుతుందో అర్ధం కావడానికే !
                                      మానవుని మెదడులో కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది! మన శరీరంలో అనేక లోహాల కణాలు ఉంటాయి. జింకు, కార్బన్ అణువులు ఉంటాయి. మన శరీరం అనేక కార్బన్ అణువులతో నిర్మితమైఉందనే విషయాన్ని మర్చిపోకండి. శరీరంలో నీళ్ళున్నాయి. ఇంకా ఉప్పు, పొటాషియం, మెగ్నీషియం లాంటి రసాయనాలు కూడా ఉన్నాయి. వీటి రసాయనిక చర్య వల్ల మెదడులో కొద్ది మొత్తంలో విద్యుత్ తయారవుతుంది. దీన్ని మనం గుర్తించవచ్చు. రికార్డ్ చెయ్యవచ్చు. ఎంత విద్యుత్ప్రవాహం ఉందో లెక్కించనూవచ్చు. 
                                           ఓ మానసిక రోగి మెదడులోని విద్యుత్తరంగాలని ఓ గ్రాఫు పేపరు మీద రికార్డ్ చేసే యంత్రాలను మీరు చూసే ఉంటారు. ఓ రోగి తల మీదా, కణతల మీదా చిన్న రేకు ముక్కలని టేపుతో అంటించి ఆ రేకు ముక్కల్ని వైర్లతో కలిపి, "ఎలక్ట్రో ఎన్ సెఫెలో గ్రాఫ్" అనే యంత్రానికి అనుసంధానం చేస్తారు. బ్రెయిన్ వేవ్స్ (మెదడు నుంచి వచ్చే విద్యుత్ తరంగాలు) ని ఈ యంత్రం రికార్డ్ చేస్తుంది. తెలివిగల డాక్టర్లు ఈ గ్రాఫుని పరీక్షగా చూచి ఆ రోగి జబ్బేమిటో సులభంగా తెలుసుకుంటారు. 
                                         మానవుని మెదడు విద్యుత్ తరంగాలను సృష్టించడమే కాదు,  పరమాత్మ నుంచి వచ్చే విద్యుత్ తరంగాల్ని ఓ రేడియో రిసీవరులాగా కూడా గ్రహించగలదు. మానవుడు పరిశీలించి నేర్చుకునే సమస్త విజ్ఞానాన్ని, అనుభవాలని విద్యుత్ సంకేతాలుగా మార్చి పరమాత్మకు అంటే ఆత్మకు అందిస్తూ ఉంటుంది మానవుని మెదడు.

No comments:

Post a Comment