Monday, August 15, 2022

స్వార్థం అంటే ఏమిటి

 స్వార్థం అంటే ఏమిటి

ఇది 'అహంభావం' అనే పదం నుండి వచ్చింది మరియు లాటిన్ అహం ('నేను') మరియు ప్రత్యయం - ఇస్మ్ నుండి వచ్చింది . సాధారణ దృక్కోణంలో, స్వార్థపరుడైన వ్యక్తి ఇతరులను పరిగణనలోకి తీసుకోకుండా శాశ్వతంగా తన ఆసక్తిని కోరుకునే వ్యక్తిగా భావిస్తారు. స్వార్థం విభిన్న వ్యక్తిత్వాలుపూర్తిగా భిన్నమైన మార్గాల్లో గ్రహించబడుతుంది. ఒక వ్యక్తికి ప్రమాణంగా పరిగణించబడేది, మరొక వ్యక్తి చేత అది అధిక స్వార్థం అని భావించవచ్చు
ఇది ప్రతి వ్యక్తిని బట్టి మారుతున్న విస్తృత భావన. ఒక వైఖరి లేదా ప్రవర్తనను కొంతమంది స్వార్థపూరితంగా వర్ణించవచ్చు మరియు ఇతరులు సాంస్కృతిక, సామాజిక, నైతిక మరియు నైతిక సమస్యలపై ఆధారపడి ఉండరు.
ఇది విలువల  వ్యతిరేకతను సూచిస్తుంది, అనగా మన ప్రవర్తన మరియు జీవితంలో విలువలు ప్రాతినిధ్యం వహిస్తున్న దానికి విరుద్ధమైన భావన లేదా నమ్మకం . స్వార్థం అంటే ఒక వ్యక్తి తన గురించి తాను పెంచుకోగల అధిక ప్రేమ యొక్క ఆలోచన లేదా భావన, ఆ స్వలాభం అతన్ని ఇతరులపై ఆసక్తి చూపడానికి లేదా చూడటానికి అనుమతించదు.
మనుషుల్లో మూడు రకాల స్వార్ధ స్థితులు ఏర్పడుతాయి.
1.స్వార్థం తెలియని తనం
2.స్వార్థం
3.నిస్వార్ధం
ఇందులో పై నుంచి ఒకదాని కన్నా ఒకటి ఉత్తమం. మొదటి.. చివరి స్థితులు ప్రత్యేకంగా సాధించే అవసరం లేదు.వాటికవే వస్తాయి. సాధించే స్థితి స్వార్థం ఒక్కటే!
స్వార్థం తెలియని వారికి..
 తన సహాజత కోరికలపైన(రుచులు,నిద్ర,కామం,వినోద కాలక్షేపం..etc),.. తన ఎమోషన్స్ పైన,..తన పనులపైన..తన ఆలోచనలపైన చివరకు తనపైన తనకు అదుపు లేకుండా ఉంటుంది. వారు.. పై అన్ని విషయాల్లోనూ ఇతరుల ప్రభావాన్ని తనపై మోస్తూ ఉంటారు. ఏ విషయంలో ఆకలి,నిద్ర,దప్పికలు,కాలం కూడా మరచి తాను చైతన్యంగా ఉంటారో.ఏ విషయం తనను అత్యంత ఆనందంగా ఉంచగలుగుందో.తానే ఏ విషయాలుగా మారినట్లుగా అనిపిస్తుందో
ఆ విషయాలను ఇతరుల కొరకు వదిలి వేసి ఆత్మ త్యాగం చేసి ఇతరుల కోరికలను తృప్తి పరచడానికి తాను డాక్టర్..లేదా ఇంజనీయర్..లేదా వ్యాపారి లేదా మరేదైనా అవుతారు.
ఇతరులతో పోల్చుకుని రాబోయే ఎండమావి లాంటి ఆనందాన్ని గూర్చి కలలు కంటారు. తాను లేని పనులు డబ్బును..వస్తు సామాగ్రిని..రుద్దబడిన కీర్తిని మోయవచ్చు గాక కానీ ఆనందాన్ని తీసుకుని రాలేవు. ఈ అలవాటు అయిన ఆత్మత్యాగం మరింత ఆత్మ త్యాగాన్ని...ఆత్మ విక్రయాన్ని తీసుకువస్తుంది. తనను ఆనంద..చైతన్య పరిచే విషయాల స్థానం...దాదాపు అవే లక్షణాలు కలిగిన చైతన్య రహితం..నిర్జీవం చేసే అనవసర కాలక్షేపాలతో..వినోదాలతో నింపే ప్రయత్నం చేస్తూ మరింతగా తాను తన నుండి లేకుండా చేసుకుంటారు.
తాను తన నుంచి ఎంతగా దూరమౌతున్నారో అంత ఆనందానికి దూరం అవుతున్నామని.. ఆ స్థానం అశాంతితో నిండిపోతుందని గ్రహించలేకపోతారు. చుట్టూ ఎంతమంది ఉన్నా తనలో పెరిగే ఆ ఒంటరితనాన్ని భరించలేక తోడుగా మరింత మందిని తనలాంటి వారినే తయ్యారు చేసే వృథా ప్రయత్నం చేస్తూ ఉంటారు.లేదా ముందు చెప్పినట్లు తనను మరిచిపోయ్యేలా చేసే.. అచైతన్యం లో ఉంచే వినోద విషయాలను ఆశ్రయిస్తారు.తాను తనలో ఎంత లేకుండా ఉండి.. ఇతర ప్రభావంతో నిండి పోయాడో అంత అశాంతి ఉంటుంది. ఆ అశాంతి ఏదో రకంగా ఇతరులను ఏదో రకంగా ప్రభావితం చేస్తూ తన అధికారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తనలో తనకు ఏర్పడిన లోటును బయటదానితో నింపుతూ అశాంతి తొలగించుకునే వృథా ప్రయత్నం చేస్తూ మరింతగా తనను తాను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది.అంతే కాదు ఇదొక వైరస్ లా అంతటా వ్యాపిస్తూ తన లాంటి అశాంతిపరులను తయ్యారు చేస్తూ ఉంటుంది.
రెండవది 
స్వార్థం పెరుగుతున్నా కొద్దీ క్రమంగా మొదట తన సహజాత కోరికలపైన.. తర్వాత ఎమోషన్స్ పైన...ఆ తర్వాత తన పనుల పైన..తర్వాత తన ఆలోచనల పైన అదుపు ఏర్పడుతూ ఉంటుంది.ఇది కూడా క్రమ పరిణామ ఫలితమే.మొదట కోరికలపైన ఏర్పడిన అదుపు స్థానం ఎమోషన్స్ తో నిండుతుంది. ఎమోషన్స్ పైన ఏర్పడిన అదుపు స్థానం పనిపై ఏకాగ్రతతో నిండుతుంది. పనులపై ఏర్పడిన అదుపు స్థానంలో ఆలోచనాశక్తి వచ్చి చేరుతుంది.
ఆలోచనల పై ఏర్పడిన అదుపు స్థానం అచ్చంగా తన కాన్సియస్ తో నిండుతూ తనకు తాను క్రమంగా తెలుస్తూ పోతుంది.ఇతరుల ప్రభావం కనుమరుగౌతూ ఆ స్థానం తనతో నిండుతున్నా కొద్దీ హృదయంలో శాంతి పెరుగుతూ ఉంటుంది.ఇక్కడ అదుపు అంటే బయట ప్రభావంతో.. ఒత్తిడితో కాకుండా ఆ విషయం తన ఎఱుకలో,కాన్సియస్ లో,స్వేచ్ఛలో చివరకు తన నియంత్రణలో ఉంచుకోవడం..
మూడవది 
ఇలా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందిన స్వార్థం తాను తృప్తిగా..శాంతిగా..సృజనాత్మక శక్తిగా..అభివృద్ధి గా..ఆనంద నిధిగా..చివరకు జ్ఞానంగా మారుతూ తన పరిసరాలలో కూడా ఆ ప్రభావాన్ని చూపుతుంది.ఆలోచనలపైన పూర్తి అదుపు ఏర్పడుతూ తాను తన కాన్సియస్ తో..తన చైతన్యం తో..తన శరీరంలో ఉన్న శుద్ధమైన తనతో నిండిపోతున్నా కొద్దీ ... తానే అనేకత్వంగా వ్యాపించి ఏకాంతమౌతాడు.


ఈ మూడో స్థితి నిస్వార్థ స్థితి. ఈ మూడు స్థితులు అభివృద్ధి మార్గంలో అనివార్యంగా వచ్చే స్థాయిలు.స్వార్థం తెలియని తనం నుంచి స్వార్థానికి ప్రయాణించవలసే ఉంటుంది. స్వార్థంతో నిండిపోయినప్పుడే నిస్వార్ధం అంటే ఏమిటో తెలిసేది. నిస్వార్ధం ముసుగు వేసుకుని.. ఏ రకంగా తన పట్ల తనకు అదుపులేని స్వభావం వల్ల ఉన్న 'స్వార్థం తెలియని తనం' వల్లనే అశాంతి. నాకు స్వార్థం లేదు అనుకోవడం అశాంతికి మొదటి మెట్టు. ఎందుకంటే అక్కడ స్వార్థం లేకపోవడం కాదు..స్వార్థం తెలియక పోవడం ఉంది.ఒకరకంగా చెప్పాలంటే పిల్లతనం నిస్వార్ధం అనేది ఉద్దేశ్య పూర్వకంగా అనుకుని తెచ్చుకునేది కాదు.. అది అభివృద్ధి దశలో సహజంగా వచ్చేది. స్వార్థం తెలియని పిల్లతనం మనుషుల్లో జీవశక్తిని లేకుండా చేస్తూ యంత్రాల్లా తయ్యారు చేస్తుంది.
ఆధ్యాత్మికంగా
అహంకారం =అహం+ఆకారం =నేనే శరీరాన్ని.
అహంబ్రహ్మస్మి =నేనే బ్రహ్మాన్ని అన్నట్లుగా
              ఒకవ్యక్తి యొక్క మానసిక మట్టం చుట్టూ ఏర్పడే పరిమితమైన స్థితిని అహంకారం అంటారు.సహజత్వా నికి   విరుద్ధంగా సమత్వాన్ని  కోల్పోయిన స్థితినే అహంకారం అంటారు.నేను ఫలానా ,ఇదినాది,నాకు కావాలి అనే భావనలతో జీవించే స్థితినే అహంకారం అంటారు. స్వార్థం అంటే కేవలం తన ప్రయోజనం చూసుకునే వాడు. అహంకారం  అనగా తన ప్రయోజనమే ప్రధానమైన నైతిక  సిద్దాంతం. ఇంకా గర్వం అనికూడా అర్థం.
ఈ స్వార్థమైన మనస్సు నుండి పైన వివరింపబడిన లక్షణాలన్నీ హృదయములో చోటు చేసుకొని మనిషిని భ్రష్టుడిగా చేస్తుంది. దీని నుండి మనుషులకు ఎన్నో విధములైన అపాయాలు జరుగుచున్నవి. తనను తాను ప్రేమించుకొని ఏవేవో కోరుకొని, ఆ కోరికలు తీరటానికి ఎంతటి హీన స్థితికైనా దిగజారి తన కోరికను తీర్చుకుంటాడు. ఈ క్రమములో ఎదుటి వారు ఏమైనా పర్వాలేదు. అలెగ్జాండర్ ది గ్రేట్ లోకమంతటిని జయించినా తన ప్రాణాన్ని నిలుపుకోలేక మరణ సమయములో తెలుసుకున్నాడు సత్యమేంటో. లోకమంత సంపాదించుకున్నా, ప్రాణం పోతే ఉపయోగము లేదని. స్వార్థంతో జీవితమంతా ఖర్చు చేసి ఏవేవో సంపాదించుకుంటారు. కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటారు. మిగిలిన జీవితంలో సంపాదించినదంతా ఖర్చు పెట్టి పోయిన ఆరోగ్యాన్ని సంపాదించుకోటానికి ప్రయత్నిస్తారు. ఫలితం జీవితమంతా ఆయాసమే. సంతోష సమాధానాలు ఉండవు.
చాలామంది స్వార్థానికి మనలను వాడుకోటానికి నీవు నా కొడుకువి నా వారసుడివి అని ఇంకా ఏవేవో చెబుతారు. చివరకు వారిఇష్టులయిన  వారికే  ఆస్తిని పంచుతారు. ఇలాంటి విషయాలు ఎన్నో మనం చూశాం. నా కొడుకు, నా పెద్ద కొడుకండీ అని పరిచయం చేస్తారు. పని చేయించుకుంటారు. చివరకు గానీ అర్థం కాదు వారు ఎంత స్వార్థపరులో.
తన ప్రాణము స్వార్థముతో కాపాడుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకోవటం ఖాయం. చిన్నచిన్న విషయాలలో కూడా స్వార్థం ఎలా ఉంటుందో చూడండి. బస్టాండ్‌లో నించొని బస్సు ఆపకపోతే రెస్ట్‌లెస్ అయిపోయి ఇష్టమొచ్చినట్లు తిడతారు. బస్సు దొరికి ఎక్కిన తరువాత అక్కడక్కడ బస్సు ఆగి ప్రయాణీకులను ఎక్కించుకుంటుంటే కూడా డ్రైవర్‌ను తిడతారు. చూడండి ఎంత స్వార్థమో. ఆపకపోయినా, ఆపినా సమస్యే? కుటుంబాలలో స్వార్థముండుట వల్ల ఆ కుటుంబాలు నిలువటం లేదు. నేనే చేస్తున్నాను నేనే కష్టపడుతున్నాను నా వల్లనే అనే స్వార్థము వచ్చిందంటే - అంతే ఆ కుటుంబం నిలవటం కష్టమే
ప్రపంచములో సెకనుకు ఒకరు ఆకలితో చనిపోతున్నారంటే కారణం భూమి మీద ఆహారము లేక కాదు. భూమిమీద ఉన్న ప్రతి ఒక్కరికి సరిపడ్డ ఆహారము పండుతుంది. కానీ దానిని సరైన రీతిలో వాడకపోవటం వల్లనే. పండిన పంటలో మూడింట ఒక వంతు వృథా అయిపోతోంది. అంటే ఆహారము లేక కాదు గానీ దానిని సరైన రీతిలో పంచుకోలేక, కొంతమంది స్వార్థపరుల వల్ల అనేక మందికి ఆహారము అందటంలేదు. కొంతమందికి నిలువ నీడ లేదు, కొంతమంది ఆకాశాన్ని అందుకుంటున్నారు గానీ నిలువ నీడ లేని వారిని పట్టించుకోవటం లేదు. ఒక మనిషిగా కూడా చూడటం లేదు.

No comments:

Post a Comment