తుంటరి పరీక్ష
వివేకానంద పశ్చిమ అమెరికా పర్యటనలో భాగంగా ఓ సభలో ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఒక విదేశీయుడు లేచి 'మనం ప్రశాంతంగా ఉండాలంటే, అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి?' అనడిగాడు.
వివేకానంద చిన్నగా నవ్వి 'మనోనిగ్రహం కావాలి. మనసు కనుక స్థిరంగా ఉంటే మన ప్రశాంతతకు బాహ్యపరిస్థితులు భంగం కలిగించలేవు' అన్నారు. ఆ ప్రసంగం విన్న తుంటరి యువకులకు 'వివేకానంద ఇలాంటి మాటలను చెప్పడమేనా? లేక ఆచరణలో పెడతారా' అనిపించి, పరీక్షించాలను కున్నారు. ఒకరోజు ప్రసంగానికి ఆహ్వానించారు. బోర్లించిన తొట్టి మీద నిలబడి మాట్లాడమన్నారు. వివేకానంద అలాగే ప్రసంగిస్తూ, అందులో లీనమయ్యారు. ఇంతలో ఆ యువకులు స్వామీజీ చెవులు దద్దరిల్లేలా తుపాకీ గుళ్లు పేల్చసాగారు. వివేకానంద కాస్తయినా చలించకుండా ప్రశాంతంగా ఆరంభించిన ప్రసంగాన్ని అంతే శాంతంగా ముగించారు.
ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment