Wednesday, February 1, 2023

****కష్టాలంటే ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

 కష్టాలంటే ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువు గారిని తన శిష్యుడు గమనిస్తు 
గురువు గారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధ పడుతూ వుంటాడు 
ఒక రోజు ఒక అగ్ని ప్రమాదం లో
గురువు గారి ఆశ్రమం అంత ఏమి
మిగలకుండ అంతా కాలి బూడిద
అయి పోతుంది .అప్పుడు శిష్యుడు కి ఒక సందేహం వచ్చి గురువు
 గారిని ఇలా ప్రశ్నిస్తాడు

గురువు గారు మీరు ఎన్నో కష్టాలు
అనుభవిస్తున్నారు ఇది నేను చూస్తున్నాను
మీ లాగే ఎందరో గురువులు వారు కూడ
మీలాగే ఎన్నో కష్టాలు అనుభవించారు

జీసస్,సోక్రటీస్,కబీర్,బుద్దుడు ఓషో,రాముడు,కృష్ణుడు,సత్య హరిశ్చంద్రుడు,ఇలా, ఇంకా ఎందరో మహానుభావులు అందరు కూడ ఎన్నో కష్టాలను చవి చూశారు కదా

అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే 

మీ గురువులు అందరు కూడ ధర్మం లో ఉండండి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని
అంటుంటారు

మరి ఈ గురువులు అందరు కూడ
దర్మంగానే ఉన్నారు కదా మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు అనుభవించారు అని ప్రశ్నిస్తాడు

ఈ ప్రశ్నవిన్న గురువు గారు శిష్యుడు కి ఇలా సమాధానం ఇస్తారు

నువ్వు గురువులు అందరు ఎన్నో 
కష్టాలు అనుభవించారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ
వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలు అనుకున్నారు


భౌతిక సుఖo కోసం ఆరాట పడే 
వారు సహనం తో ఉండలేరు 
ఎవరైతే సహనం తో ఉండరో  వారు
 ఎప్పుడు సత్యాన్ని చూడలేరు, చేరుకోలేరు 

మనలో సహనాన్ని పెంచేవి జీవిత పరీక్షలు మాత్రమే మనం ఎన్ని పరీక్షలు అయితే ఎదురుకుంటామో మనలో అంత సహనం పెరుగుతుంది .మనం ఎంత సహనాన్ని పెంచు కుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చూడగలుగుతాము , చేరుకొగలుగుతాము

అందుకే గురువు లలో సహనాన్ని పెంచడం కోసమే ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంతో సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులను చేసింది .కాబట్టి మనకు వచ్చే పరీక్షలను
పరీక్షలు అని కూడ అనుకోకండి అవి మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేర వేసే వారధిలు అనుకోండి మిత్రులారా.

అలాగే నిజాయితీ అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం . ఒక వ్యాపారి తాను ప్రయాణం చేయడం కోసం ఒక ఒంటెను కొనాలి అని అనుకుంటాడు, ఒక వ్యక్తి దగ్గర బేరమాడి ఒక ఒంటెను కొనుక్కుని ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటి పనిమనిషిని పిలిచి ఆ ఒంటెను శుభ్రంగా కడగమని చెప్పాడు, యజమాని చెప్పినట్టే ఆ పనిమనిషి ఒంటెను శుభ్రం చేస్తుంటే ఒక చిన్న సంచి కింద పడింది.
అది తీసుకెళ్లి యజమానికి ఇచ్చాడు అతను సంచి తీసి చూడగా నవరత్నాలు ధగధగా మెరిసిపోతున్నాయి. ఇది వెంటనే తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చేయాలి అన్నాడు ఆ పనివాడు అయ్యా ఇది ఎవరికీ తెలిసే అవకామేశమే లేదు మీరే ఉంచేసుకోండి అని చెప్పాడు. మరి ఇది నాకు కూడా తెలియకుండా నువ్వు ఉంచుకోవలసింది కదా అన్నప్పుడు నేను మీరు నమ్మినా బంటును అయ్యా మిమ్మల్ని మోసం చేయలేను అన్నాడు.
నువ్వే నన్ను మోసం చేయలేను అన్నప్పుడు నన్ను నాకెలా మోసంచేసుకోను అన్నాడు ఆ రత్నాల మూటను తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చాడు అతను సంతోషంతో స్వాగతించి మీ ఈ చర్యకు నేను ఆనందంగా ఉన్నాను మీకు కావలసినన్ని రత్నాలు తీసుకోండి అన్నాడు.మీకు ఇచ్చే ముందే రెండు రత్నాలను తీసుకున్నాను అన్నాడు ఈ వ్యక్తి సంచిని రత్నాలను లెక్కపెట్టాడు ఆ రత్నాల యజమాని అన్నీ రత్నాలు ఉన్నాయి ఒక్కటికూడా తగ్గలేదు అన్నాడు అందుకు అతను నా రెండు రత్నాలు నా నిజాయితీ నా ఆత్మగౌరవం అన్నాడు.
మిత్రులారా మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయి, కానీ భయపడుతూ బతకాలి. నిజాయితితో సంపాదిస్తే ఆ ధైర్యమే వేరు.

సేకరణ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment