0203023f1849. 030323-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*అమ్మవారి చీరెను భక్తులు*
*ధరించవచ్చా ..?*
➖➖➖✍️
*సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అలంకరింప చేసిన చీరె(శేష) వస్త్రాన్ని భక్తులు (మహిళలు) ధరించవచ్చా..?*
*అందులో లాభాలేంటి పాటించాల్సిన నియమాలేంటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే మనం ఈ వార్త చదవాల్సిందే…*
*శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి ఉంటారు.*
*పురుషులకంటే ఎక్కువగా మహిళలు ఆ దేవాలయాలకు క్యూ కడుతుంటారు.*
*పూలు, కుంకుమ, గాజులు, చీరె, రవికెలను కానుకలుగా సమర్పిస్తుంటారు.*
*ఆ చీరెను విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి అలంకరింప చేయమని పూజారులకు చెబుతుంటారు.*
*ఆ తరువాత ఇలాంటి చీరెలను ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు.*
*ఆ చీరె దక్కితే చాలని చాలా మంది భక్తులు వేలంలో కొనుక్కుంటుంటారు.*
*అయితే అసలు అమ్మవారి చీరె(శేష వస్త్రం)ను సాధారణ మహిళలు ధరించవచ్చా ?*
*అనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. అమ్మవారి చీరెలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. *
*కానీ, ధరించినప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి?ఎంత సంతోషంగా వేలం పాటలో సొంతం చేసుకుంటామో.. ఆ చీరెను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆ మహిళలు ఉండాలి. అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి.*
*అమ్మవారి శేష వస్త్రాన్ని ధరించే ముందు తిథి – వర్జ్యం చూసుకుని “శుక్రవారం” రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి.*
*ఈ చీరెను ధరించినంత సేపు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. రాత్రి సమయాల్లో ఈ చీరెను ధరించ కూడదు. ఆ చీరెను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి వుంటుంది.*
*అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా కాకుండా నియమాలను పాటించకపోతే, ఫలితం ఉండదు. ఆ పవిత్రత మనకు దక్కదు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment