Tuesday, November 7, 2023

మనసా...వాచా...కర్మణా!!!!... అంటే!!!*

 06022.   2-4.  210223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


      *మనసా...వాచా...కర్మణా!*
                ➖➖➖✍️

*మనసా...వాచా...కర్మణా... అంటే!!!* 

*ఒకసారి శ్రీ ఆది శంకరాచార్యుల వారు, శిష్యులతో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు...*

*గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట...*
 *" నేను 3 దోషములు/పాపములను చేశాను, నన్ను క్షమించండి ” అని ప్రాధేయ పడ్డారు...*

*ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపములు చేశారో ప్రాయశ్చిత్త పడుతున్నారు?” అని అనుకున్నారు.*

*ఒక శిష్యుడు, ఏమిటి ఆపాపము నేను తెలుసుకోవాలి అని, ఆచార్యుల వారిని అడిగాడు.*

*దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు...*

*1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను, సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశీ నగరానికి వచ్చాను..."*

*అంటే  మనసా వాచా కర్మణా  నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను, అది నా నేను చేసిన మొదటి దోషము అని సమాధానమిచ్చారు.*

*2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా                   శ్రీ కాశీవిశ్వనాధ అష్టకం వ్రాశాను.   ”ఇది నేను చేసిన  రెండవ తప్పు!*

*3. నిర్వాణ శతకం లో*
*“న పుణ్యం న పాపం, న సౌఖ్యం                   న దుఖం న మంత్రో న తీర్తం, న వేదా               న యజ్ఞః అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను*
*అర్థము :*
*నాకు పాప పుణ్యములు     సుఖ దుఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము , భోజనము , భోక్త (భుజించేవాడు) నేను కాదు!  నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!*

*ఇంత వ్రాసికూడా నేను తీర్ద యాత్రలు చేస్తున్నాను...   అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడవ తప్పు...!*

*ఈ తప్పులని మన్నించమని , ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.” అన్నారు...*

*నీతి :*
*మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి సంభాషణ మనకి తెలియజేస్తోంది...*

*బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది, భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తారు.*

*“మనస్ ఏకం, వచస్ ఏకం , కర్మణ్యేకం!”*
*ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము...*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

No comments:

Post a Comment