210223a1538. 220223-
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀230.
నేటి...
*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
*" మీ ఇంటికి ఎవరైనా కొత్త స్నేహితుడు వస్తే, “రండి, దయచేసి కూర్చోండి" అని కుర్చీ వేసి మర్యాద చేస్తారు.*
*కానీ, పాత స్నేహితుడే గనుక వస్తే ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా, “రారా, కూర్చోరా" అని ఆహ్వానిస్తారు.*
*ఎందుకంటే పాత స్నేహితునితో మీకు సన్నిహిత సంబంధం ఉంటుంది. త్యాగరాజుకు రామునితో అట్టి సంబంధం ఉండటంచేతనే, “రార మా ఇంటి దాకా.." అని ఎంతో స్నేహంగా, స్వేచ్ఛగా, పవిత్రంగా, ఆర్తితో పిలిచాడు.*
*మీరు కూడా దైవాన్ని మీ పాత స్నేహితునిగా భావించి దైవంతో స్వేచ్ఛగా మెలగాలి. ఎన్నో జన్మలనుండి భగవంతుడు మీ వెంటనే వస్తున్నాడని విశ్వసించాలి. అదే నిజమైన భక్తుని లక్షణం.*
* మీరు భగవంతుడంటే భయం, భయంగా ఉంటే ప్రయోజనం లేదు. పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఉండాలి. ప్రేమచేత, స్వేచ్ఛచేతనే దైవాన్ని పొందడానికి వీలవుతుంది.*
*మీలో దైవభీతి ఉన్నంతవరకు దైవం లభ్యం కాడు. పాపభీతి ఉండాలి గాని దైవభీతి ఉండకూడదు. దైవప్రీతి ఉండాలి. దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించాలి. అప్పుడే దైవం లభ్యమవుతాడు."*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment