Wednesday, November 8, 2023

అప్పుడు ఎట్టి దుర్గుణములూ మనలోకి చొరబడలేవు.

 0104.    2-1.  050323-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀789.
నేటి…
              *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖✍️


*మానవుని జీవితమునకు ఆన్ని విధములా తగిన భద్రత కావలెనంటే భగవన్నామ స్మరణ    తప్పక చేస్తూ ఉండాలి.* 

*ఎంతో శ్రమపడి పండించిన పంట పశువులు మేయకుండా రైతు ముళ్ళకంచే ఏర్పాటు చేసుకొని జాగ్రత్తపడతాడు.* 

*మరి ఎన్నో జన్మల పుణ్య ఫలము చేత లభించిన ఈ మానవ జన్మను సార్థకం గావించుకోవలెనంటే  మనము ఇంకెంత జాగ్రత్త పడాలి!?* 

*కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు   అనే  పశువులు మనలోకి చొరబడి సహజముగా  మనలో ఉండిన ఆధ్యాత్మిక శక్తిని తినేయకుండా ఉండాలంటే భగవన్నామము అనే దృఢమైన ముళ్ళకంచే ఏర్పాటు చేసుకోవాలి.* 

*నిత్యమూ దానిని పర్యవేక్షిస్తూ ఉండాలి. అనగా నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి, భజిస్తూ ఉండాలి, సేవిస్తూ ఉండాలి.*

*అప్పుడు ఎట్టి దుర్గుణములూ మనలోకి చొరబడలేవు. సంపూర్ణమైన రక్షణతో జీవితమును ముగించి పరమాత్మను చేరుకొనుటకు మార్గం సుగమం అవుతుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!

No comments:

Post a Comment