Friday, December 1, 2023

ఈ భగవద్ వాక్యాన్ని పాటించడానికి వీలైనంత కృషి చేద్దాం మనమందరం.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝*కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన*
💕*కర్మలు చేయుటయందే నీకు అధికారం. ఫలితాన్ని ఎప్పుడూ కోరవద్దు. ఫలాలు కోరేవాడు పిసినిగొట్టు - 'కృపణా ఫల హేతవః' - అని అన్నారు.*
❤️ *ఇది భగవద్గీత సారమేగాదు. చెప్పిన భగవానుని జీవితసారం కూడా ఇదే.*
💕*దేవకీ వసుదేవులకు జన్మించినా తల్లిదండ్రుల వాత్సల్యాన్ని కోరలేదు.*
💕*నంద గోకులంలో వెన్న దొంగిలించినా తనకోసం కాదు, స్నేహితులకు కోతులకు పెట్టేవాడు .*
💕*కంసుని చంపినా రాజ్యాధికారాన్నికోరలేదు. ఉగ్రసేనునికే కట్టబెట్టాడు.*
💕*జరాసంధుని చంపించినా రాజ్యాన్ని అతడి కుమారుడు సహదేవునే పట్టాభిషిక్తుని చేశాడు.*
💕*శిశుపాలుని వధించినా అతని కుమారుడు దృష్టకేతువుకే రాజ్యాన్ని అప్పగించాడు.*
💕 *నరకుని చంపి అతని కుమారుడు భగదత్తునినే రాజుగా చేశాడు.*
💕*దంతవక్త్రుని చంపి అతడి రాజ్యాన్ని అతని కుమారునికే ఇచ్చాడు.*
💕*పౌండ్రక వాసుదేవుని చంపి అతని కుమారుడినే రాజ్యాభిషిక్తుని చేశాడు.*
💕*దుర్మార్గుడైన దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యం మొత్తాన్ని త్యాగం చేశాడు. నాకేం ఇస్తావు? అని అడగలేదు.*
💕*పాండవులకు ఎంతమేలు చేసినా, యుద్ధంలో ఎంత సాయపడినా తానేమీ ఫలితాన్ని కోరలేదు. రాజ్యంలో వాటా కోరలేదు.*
💕*రథాన్ని తోలేపని అప్పగించినా అప్పగించిన పనిని శ్రద్ధగా - సక్రమంగా నిర్వర్తించాడే గాని ఏ ఫలితాన్ని ఆశించలేదు. ఇంత చిన్నపనియా? అనలేదు.*

❤️ *ఆయన ఏపని చేసినా, ఆ పనిని సక్రమంగా నిర్వర్తించటమే గాని కర్మఫలంపై ఏమాత్రం ఆసక్తి లేదు. దేనినీ కోరలేదు.*
 ❤️ *~మరి మనం మాత్రం ‘ఏఫలితమూ లేకుండా ఎందుకు కర్మలు చేయాలి?’అంటాం.*
💕*సూర్యుడు వెలుగునిచ్చి నీనుండి ఏం కోరుతున్నాడు?*
💕*వాయుదేవుడు గాలినిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతూ ఏం కోరుతున్నాడు?*
💕*నదులు నీటినిచ్చి దప్పిక తీర్చి నీనుండి ఏమి కోరుతున్నాయి?*
💕*భూమి నీకు ఆధారంగా ఉండి, పంటల నిచ్చి ఏమి కోరుతున్నది?*
💕*చెట్లు ఫలాలను, పుష్పాలను, నీడను ఇచ్చి ఏమి కోరుతున్నాయి?*
💕*చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఏమి కోరుతున్నాడు?*
💕*మన సమస్త ఇంద్రియాలకు శక్తి నిచ్చి పరమాత్మ ఏమి కోరుతున్నాడు?*

❤️ *~అందుకే  కర్మణ్యే వాధికారస్తే మాఫలేషుకదాచన.*
💕 *~ఈ భగవద్ వాక్యాన్ని పాటించడానికి వీలైనంత కృషి చేద్దాం మనమందరం.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment