“పరిప్రశ్న - గురుబోధ”
- శాస్త్రి ఆత్రేయ.
ప. సచ్చిదానందము అంటే ఏమిటి?
గు. జ్ఞానము యొక్క స్వరూపమే సచ్చిదానందము (సత్ + చిత్ + ఆనందము).
“సత్” అంటే నాశనము లేనిది, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలలో మార్పు చెందనిది!
“చిత్” అంటే జ్ఞానవంతమైనది, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలలో సర్వము గ్రహించేది!
“ఆనందం” అంటే దేనియందు ఆశలేని స్థితి, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలలో కూడా అనుభవించేది!
ప. జీవుడు సచ్చిదానంద స్వరూపుడేనా?
గు. అవును! నూటికి నూరు పాళ్ళు సచ్చిదానంద స్వరూపుడే!
No comments:
Post a Comment