*పాంచజన్యము ఎలా పుట్టింది?*
పవిత్రం ‘పాంచజన్యం’
సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు బలరామకృష్ణులు. గురువు కోరిక మేరకు గురుపుత్రుడిని తీసుకువచ్చేందుకు బయల్దేరుతారు. ప్రభాస తీర్థంలో సముద్రంలో దాగి ఉన్న పంచజనుడు అనే రాక్షసుడు గురుపుత్రుడిని అపహరించాడని తెలుసుకుంటారు. సముద్ర గర్భంలోకి వెళ్లి పంచజనుడి పొట్టను చీల్చి సంహరిస్తాడు కృష్ణుడు. అప్పుడు ఆ రాక్షసుని పొట్టలో నుంచి శంఖం బయటపడుతుంది. దానిని జ్ఞాపికగా గ్రహిస్తాడు కృష్ణుడు. పంచజనుడి కడుపులో దొరికింది కాబట్టి దానికి పాంచజన్యం అని పేరు. నాటి నుంచి పాంచజన్యం కృష్ణుడి మృదుమధుర అధర స్పర్శను అనుభవిస్తూనే ఉంది. సమస్తలోకాలకు ప్రాణాధారుడి నుంచి ప్రాణవాయువు గ్రహించి విజయ నాదాన్ని వినిపిస్తూనే ఉంది.
🕉️❤️🕉️
*మనువులు:*
మన్వంతరాలు ఎవరి పేరు విూద ఏర్పడ్డాయో వారు. 1. స్వాయంభువుడు, 2. స్వారోచిషుడు, 3. ఉత్తముడు, 4. తామసుడు, 5. రైవతుడు, 6. చాక్షసుడు, 7. వైవస్వతుడు, 8.సూర్య సావర్ణి, 9. దక్ష (పాఠాంతరం రౌచ్యక) సావర్ణి, 10. బ్రహ్మ సావర్ణి, 11. రుద్ర సావర్ణి, 12. ధర్మ (అగ్ని) సావర్ణి, 13. ఇంద్ర సావర్ణి, 14. భౌచ్యుడు. (పాఠాంతరాలు ఉండవచ్చు.)
మన్వంతరము :
డెబ్బదియొక్క దివ్యయుగములు|
No comments:
Post a Comment