Wednesday, December 11, 2024

 *నేడు `గీతా జయంతి` సందర్భంగా...*

*మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతి ఆచరిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసింది ఈ ఏకాదశి రోజునే కాబట్టి ఇది గీతాజయంతిగా ప్రసిద్ధి చెందింది. గీత జయంతి నాడు భగవద్గీతను పూజించి గీతాపారాయణము చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. కాగా ఈ గీత జయంతిని కార్తీక బహుళ అమావాస్య రోజున జరపాలని పాఠాంతరం కూడా ఉంది.*

*భగవద్గీత మత గ్రంథం కాదు. ఇది మనిషికి స్వసరూప జ్ఞానాన్ని అందిస్తుంది. భగవంతుని స్వరూపాన్ని విశ్లేషించి చెబుతుంది. వివిధ స్థాయిలో ఉన్న వ్యక్తులకి వివిధ రీతిల్లో సాధనల్ని  చెబుతుంది. అనేకమైన ఆధునిక విమర్శలకి కూడా సమాధానాలు దీనిలోనే లభిస్తాయి.*

*గీత ప్రధానంగా మనకు కర్మయోగాన్ని ప్రవచించింది. ప్రకృతి, స్వీయ స్వభావం, ఈశ్వరుడు అనే ముగ్గురు యజమానులకు వశుడై  మానవుడు పరాధీనుడవుతున్నడు. ఆ ముగ్గురి నియంతృతవ్యం నుంచి బయటపడడానికి అంతఃకారణంలో సన్యాసాన్ని, బాహ్యంగా కర్మయోగాన్ని అవలంబించాలని గీత మనకు చెప్పింది. అంతరంగా సంఘటనల నుంచి వెలుగు మార్గం చూపింది.*

 *┈┉┅━❀꧁ॐ🪷ॐ꧂❀━┅┉┈*
           *ఆధ్యాత్మికం ఆనందం*
 🌺🌹🌺 🙏🕉️🙏 🌺🌹🌺

No comments:

Post a Comment