Tuesday, December 10, 2024

 *_దీపాల చుట్టూ చేరే పురుగుల్ని చూడండి. తమ రెక్కలు కాలిపోతాయని, తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఆ పురుగులు ఆ దీపం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అలా తిరగడమే వాటి జీవితం._*

*_కేవలం కొన్ని గంటల ఆయుష్షు మాత్రమే ఉన్న పురుగే అంత ధైర్యంగా దీపం చుట్టూ తిరుగుతూ ఉంటే... వంద ఏళ్ళు ఉన్న మనిషి మాత్రం చిన్న కష్టానికి భయపడిపోతాడు._*

*_సమస్యలకు భయపడడం మానేయండి. భవిష్యత్తు బావుండాలని మాత్రం కోరుకోండి. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి._*

*_జీవితం మీకే కాదు ప్రతి జీవికి సవాలే. మీ ఒక్కరికే కష్టాలు వస్తున్నాయి అనుకోకండి... ఈ భూమిపై పుట్టిన చీమ నుంచి ఏనుగు వరకు అన్ని జీవులకూ ఏదో ఒక కష్టం వస్తుంది. వాటిని తట్టుకునేందుకు కావాల్సింది మనోనిబ్బరమే._*

*_మన జీవితానికి మనమే శిల్పి. ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే అపురూపమైన విగ్రహంగా మారగలం. దేవుడి మెడలో హారంగా మారాలంటే గుండెల్లో గుచ్చే సూది బాధను పువ్వులు తట్టుకోవాలి._*

*_ఏది సాధించాలన్నా సంకల్ప బలంతో బాధలు, అపజయాలను ఎదిరించక తప్పదు. వేలసార్లు వైఫల్యం వెక్కిరించినా వెనక్కితగ్గకు.👆_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🪷🪷🪷 🌹🙇‍♂️🌹 🪷🪷🪷

No comments:

Post a Comment