Friday, August 15, 2025

 *నాన్న కూతురు జీవితం* 

*ఒక అమ్మాయి నాన్న దగ్గర కూర్చుని నాన్న నాకు ఒక మంచి జీవితపాఠం చెప్పవా అని అడిగింది.*

*నాన్న చెప్పడం మొదలుపెట్టారు.*
*ఒక రాజ్యపు రాజకుమారి చాలా అందంగా ఉండేది. ఆమె పేరు అభినయ. చాలా చలకీతనం అందరితో కలుపుగోలుతనంగా ఆమె ఉండేది.*
*ఆమెకు వీరికంటే ఎక్కువ రాజ్యాలు ఉన్న రాజకుమారుడితో వివాహం జరిగి అత్తరింట్లో అడుగుపెట్టింది.*

*కొన్ని రోజులలోనే ఆమె అక్కడ ఇమడలేక పోయింది.*
*భర్త కొట్టడం తిట్టడం తట్టుకోలేక ఒక రోజు ఆమెను చూడడానికి వచ్చిన తండ్రితో నాన్న నాకు ఈ వివాహ జీవితం వద్దు నేను అతను పెడుతున్న బాధలు భరించలేకపోతున్నాను,మీతో పాటే మన ఇంటికి వచ్చేస్తా అని అంది.*

*అందుకు ఆ తండ్రి*
*అలా కుదరదమ్మా మొగుడిని వదిలేసి వస్తే ఆడపిల్లకు రక్షణ లేదు గౌరవం లేదు*
*అవమానాలే అందరికి నువ్వు ఓర్చుకో అని అన్నారు*

*తల్లి దగ్గర విలపించింది*
*వివాహ జీవితం అంటే ఒక్కోసారి ఇలానే ఉంటుంది*
*సర్దుకుపోవాలి కొన్నిరోజులకు అల్లుడు మారకపోడు. నువ్వు వచ్చి ఇంట్లో కూర్చుంటే నీ తరవాత వారి జీవితాలు ఏమవ్వాలి అని చెప్పింది.*

*స్నేహితులతో పంచుకుంది.*
*ఎలాగైనా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని.*
*అందరూ ఈమెకు సర్ది చెప్పారు కాని ఓదార్పు అన్నది అక్కడ లేదు.*

*చివరగా ఆ అభినయ పుట్టిల్లు చేరుకుంది అని కథ ముగించాడు ఆ తండ్రి.*

*అదేంటి నాన్న కథ అయిపోయిందా ఇక్కడ నేను తెలుసుకోవలసింది ఏంటి అమ్మాయి హ్యాపీగా పుట్టింటికి వచ్చేసిందిగా అని అడిగింది.*

*కాదు తల్లి అభినయ చివరగా పుట్టింటికి శవమై చేరింది. భర్త హత్య చేస్తే శవమై చివరగా పుట్టిల్లు చేరింది అన్నాడు.*

*ఇక్కడ ఆ తండ్రి తన కూతురుకి మాత్రం కథ చెప్పట్లేదు మన అందరికి చెబుతున్నాడు.*

*1. పెళ్ళి చేసేస్తే అమ్మాయి బాధ్యత తీరిపోయింది అని అనుకోకండి.*

*2. భర్త పెట్టే బాధలను భరిస్తూ  ఉండాలి*
 *పుట్టింట్లో ఆడపిల్ల వచ్చేస్తే అవమానం అని చెప్పకండి.*

*3. భర్తకు భార్య చనిపోతే మరో అమ్మాయి భార్యగా వెళుతుంది, కాని మీకు మరో కూతురు దొరకదు.*

*4. ఒక్కసారి ఆమె బాధ విని ఆమె కష్టం తెలుసుకుని ఉంటే ఈనాడు శవమై ఉండేది కాదు.*

*5. అప్పడప్పుడు కూతురిని అల్లుడిని కూడా పలకరిస్తూ ఉండండి.*

*6. భరించడం సర్దుకుపోవడం నేర్పడంతో పాటు ఎదురుతిరగడం కూడా నేర్పించండి..*

No comments:

Post a Comment