మోక్షం పొందితే ఏమవుతుంది? | ఋషులు చెప్పిన చివరి దశ | Hindu Dharma Series - Episode 4 | Ram C Vision
https://www.youtube.com/watch?v=aeLJIxH73Ck
Transcript:
(00:00) ఇప్పటివరకు మూడు ఎపిసోడ్స్ ఇలా వచ్చాయి. కర్మ సిద్ధాంతంలో ఎందుకు పని చేస్తే ప్రతిఫలం ఎలా వస్తుంది కర్మ ఫలితం చేసే పని బట్టే కాదు పని వెనక ఉన్న భావం భావం యొక్క ఉద్దేశాన్ని బట్టే కర్మ ఫలితం అనేది ఉంటుంది. అలాగే భక్తి మార్గంలో దేవుడు బయట కాదు మనలో ఉన్న స్థితి అని అర్థం చేసుకున్నాం. దేవుని రూపాలు మనకు అర్థం అవ్వడానికి మనిషి రూపంలో అవతరించారు అనేది మనం అర్థం చేసుకుందాం విగ్రహాలను మనం ఎందుకు పూజిస్తున్నామో అర్థం చేసుకుందాం.
(00:33) జ్ఞాన మార్గంలో నేను శరీరాన్ని కాదు నేను మనసుని కాదు నేను ఎప్పటికీ మారని చైతన్యం అనేది అర్థం చేసుకుందాం. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకేం మిగిలింది అనే ప్రశ్న. అదే మోక్షం అసలు ఈ మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే సాధారణంగా అందరూ ఇలా అనుకుంటారు. చనిపోవడం స్వర్గానికి వెళ్ళడం వేరే లోకానికి వెళ్ళడం మళ్ళీ జన్మించకపోవడం అని కానీ ఉపనిషత్తుల ప్రకారం మోక్షం అంటే బంధం పోవడం తెలివి రావడం తప్పు గుర్తింపుల నుండి విముక్తి కలగడం అంటే మోక్షం అంటే విముక్తి మరి విముక్తి అంటే ఏంటి? తప్పుగా అర్థం చేసుకున్న దాన్ని వదిలేయడం నిజాన్ని
(01:21) మాత్రమే గుర్తించడం ఇవన్నీ సరే అసలు విముక్తి పొందడానికి నిజాన్ని గుర్తించడానికి ముందు మనిషి నిజంగానే బంధాలలో ఉన్నాడా అనేది చూద్దాం. ఇది అర్థం చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది మోక్షం గురించి ఉపనిషత్తులు ఇలా అంటాయి మనిషి ఎప్పుడూ బంధాలలో లేడు కానీ బంధాలలో ఉన్నాను అనుకొని జీవిస్తాడు. అంటే ఎలా ఉదాహరణకి రాత్రి నువ్వు కలలో ఒక పులి నిన్ను వెంబడిస్తున్నట్టు కలగన్నావు అనుకుందాం.
(01:54) ఆ టైంలో నిజంగానే నువ్వు భయపడతావ్. కానీ ఒక్కసారి మెలుకు వచ్చిన తర్వాత అక్కడ పులి ఉండదు నీకు భయం ఉండదు పులితో ఎలాంటి బంధము ఉండదు. అంటే కలలో భయం మేలుకొన్న తర్వాత విముక్తి సేమ్ జ్ఞానం కూడా ఇంతే జ్ఞానం అంటే మేల్కొనడం మోక్షం అంటే మేల్కొన్న స్థితిలో జీవించడం అయితే మనం చేసే కర్మలో మోక్షానికి సంబంధం ఏంటి? ఇక్కడ పెద్ద క్లారిటీ వస్తుంది జాగ్రత్తగా వినండి.
(02:30) కర్మ ఎప్పుడు నిన్ను బంధిస్తుంది ఈ పని నేను చేస్తున్నాను అని నువ్వు భావించినప్పుడు కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుంది నువ్వు పని చేస్తావు పని జరుగుతుంది కానీ కర్త భావం ఉండదు అంటే నేనే చేశాను ఈ పని అన్నటువంటి భావన అనేది ఉండదు నీవు చేసిన కర్మ ఉంటుంది కానీ ఆ కర్మ నిన్ను బంధించదు అదే కర్మలోని మోక్షం నువ్వు పని చేస్తావు ఆ కర్మ ఉంటుంది కానీ అది నిన్ను బంధించలేదు.
(03:06) అందుకే గీతలో కృష్ణుడు చెప్తాడు ఏమని నీవు కర్మ చేయి కానీ ఫలితానికి కట్టుపడద్దు అని నువ్వు ఫలితానికి కట్టుబడితే ఆ కర్మ నిన్ను బంధించేస్తుంది. కానీ నువ్వు మోక్షంలో ఉన్నప్పుడు నువ్వు పని చేస్తున్న భావమే నీకు ఉండదు అలాంటప్పుడు ఆ కర్మ నిన్ను ఎలా బంధిస్తుంది కర్మ ఉంటుంది కానీ ఆ కర్మ నిన్ను బంధించలేదు అని అర్థం.
(03:31) మరి భక్తి లేకుండా మోక్షం అనేది సాధ్యమా ఇది కూడా పెద్ద డౌట్ ఇక్కడ భక్తి అనేది ఎందుకు వచ్చింది మనసుకు శాంతి కావాలి మనిషికి ఏకాగ్రత కావాలి మనసు నిశ్చలత్వం కావాలి వీటి కారణంగా దేవుని అర్థం చేసుకొని అహంకారం అనేది తగ్గాలి దీని కారణంగా మనకు భక్తి అనేది వచ్చింది. జ్ఞానం అనేది డైరెక్ట్ గా ఒంటరిగా రావడం అనేది చాలా కష్టమైన పని అందుకే ఇక్కడ భక్తి అనేది అవసరమైంది భక్తి అనేది మనసును శుద్ధి చేస్తుంది ఆ శుద్ధి అవ్వబడిన మనసుతో నువ్వు జ్ఞానం సొంతం చేసుకుంటే ఆ జ్ఞానం నువ్వు ఏదైనా తప్పుగా గుర్తిస్తే ఆ తప్పు గుర్తింపులను తొలగించడానికి
(04:15) ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏమైంది భక్తి లేకుండా జ్ఞానం సాధ్యమా అంటే భక్తి ఉంటేనే సాధ్యంవుతుంది. నువ్వు జ్ఞానంలోకి వెళ్ళాలంటే మనసు శుద్ధి అవ్వాలి కదా అది శుద్ధి అవ్వాలంటే నీకు భక్తి అనేది అవసరం ఈ భక్తి జ్ఞానం ఈ రెండు కలిస్తేనే సహజ స్థితి అన్నమాట అదే మోక్షం మోక్ష స్థితి అయితే మోక్షం వచ్చిన మనిషి ఎలా ఉంటాడు మోక్షం పొందిన మనిషి ఎలా ఉంటాడు చూద్దాం ప్రాక్టికల్ గా చెప్తాను మోక్షం వచ్చిన మనిషి బాధపడడని కాదు అతనికి సమస్యలు రావని కాదు వస్తాయి బాధలు వస్తాయి సమస్యలు కూడా వస్తాయి. కానీ బాధ అతన్ని విరగదీయలేదు.
(05:01) బాధ అతన్ని ఏమి చేయలేదు. సమస్య అతన్ని కట్టి పడేయలేదు. అంటే నాకు ఈ సమస్యలు వచ్చాయి నేను ఇలా అయిపోయాను ఇలా ఉండదు ఏమి చేయలేదు అతని సమస్య. సమస్యలు వస్తాయి చిరునవ్వుతోనే ఎదుర్కుంటాడు పోతా అంటాడు కానీ అతనైతే కట్టిపడేయలేం. ఎందుకు ఎందుకు కట్టిపడేయలేవు ఎందుకంటే ఇది నాకు జరుగుతోంది కానీ అది నేను కాదు అనే భావన అతనికి ఉంటుంది కాబట్టి అది నాకు జరుగుతోంది కానీ అది నేను కాదు నేను మారని చైతన్యం అని అతనికి తెలుసు అర్థం చేసుకుంటాడు కాబట్టి ఇదే సాక్షి భావం అంటే అయితే మోక్షం అంటే మళ్ళీ పుట్టకపోవడమా
(05:48) ఇది చాలామంది అడిగే ప్రశ్న చాలామందికి ఈ ప్రశ్న తన మనసులో ఉండే ఉంటుంది ఇప్పుడు ఉపనిషత్తుల ప్రకారం పుట్టడం చావడం అనేది శరీరానికి మనసుకు సంబంధించింది. కానీ నువ్వు అది కాదని నీకు తెలుసు కదా మోక్ష స్థితిలో ఉన్నప్పుడు అది నీకు తెలిసినప్పుడు పుట్టడము చావడము అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే నువ్వు మోక్ష స్థితిలో ఉన్నావు ఆ శరీరం నువ్వు కాదని తెలుసు ఆ మనసు నువ్వు కాదని తెలుసు నువ్వు ఎప్పటికీ మారని చైతన్యం అని తెలుసు అలాంటప్పుడు పుట్టడం చావడము శరీరము మనసు ఈ భావనే నీకు ఉండదు కదా మరి అలాంటప్పుడు ఆ ప్రశ్నకు అర్థం లేనట్టే కదా అందుకే మోక్షం
(06:32) వచ్చిన వాడికి చావు అనే భయం ఉండదు పుట్టాలనే ఆశ ఉండదు నాకు తెలుసు ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుందని ఏంటి ఆ కన్ఫ్యూజన్ ఉపనిషత్తుల ప్రకారం నువ్వు మోక్షం అంటే ఏంటో చెప్తున్నావు కానీ మోక్షం గురించి గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది పురాణాలలో మోక్షం గురించి చెప్పింది వేరుగా ఉంది కదా అని కరెక్టే మోక్షానికి వేరే వేరే భాషలు ఉన్నాయి కానీ వేరే వేరే సత్యాలు అనేటివి లేవు భాషలే వేరు సత్యం అంతా ఒకటే మోక్షం అనేది ఏ విధంగా అయినా ఒకేలా ఉంటుంది కానీ అది మారదు.
(07:13) సరే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గీతలో శ్రీకృష్ణుడు మోక్షం గురించి ఏం చెప్పాడు కృష్ణుడు ఒకే మోక్షాన్ని మూడు రకాలుగా చెప్పాడు. ఒకటి కర్మయోగం రెండు భక్తి యోగం మూడు జ్ఞాన యోగం అని కానీ వీటి గమ్యం అయితే ఒకటే ఇక్కడ కృష్ణుడు చెప్పేది నన్ను తెలుసుకున్నవాడు మళ్ళీ జన్మించడు అని అక్కడ నన్ను అంటే ఎవరో శ్రీకృష్ణుడి శరీరం రూపం కాదు ఆయనలోని చైతన్యం ఆ చైతన్యాన్ని తెలుసుకుంటే మళ్ళీ జన్మించడు అని అర్థం నీలో ఉన్నది చైతన్యమే శ్రీకృష్ణుడిలో ఉన్నది చైతన్యమే అయినప్పుడు రెండు ఒకటే కదా ఇంక మళ్ళీ జన్మ ఏంటి జన్మకు అర్థం ఏంటి ఆ ప్రశ్నే ఉండదు కదా ఇది అర్థం చేసుకోవాలి
(07:59) కాబట్టి ఇక్కడ కృష్ణుడు శరీరం కాదు ఆయన ఒక చైతన్యం ఆ చైతన్యాన్ని తెలుసుకున్నవాడు మళ్ళీ జన్మించాడు. ఆ చైతన్యము నీలో ఉన్న చైతన్యము రెండు ఒకటే అవి రెండు ఒకటే అని నువ్వు ఏ రోజైతే తెలుసుకుంటావో ఆ రోజే నువ్వు జ్ఞానివైతావు మోక్షాన్ని పొందుతావు చావు పుట్టుకలక అనేటికి నీకు ప్రశ్నే ఉండదు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఆ స్థితిలో లేము కాబట్టి ఈ ప్రశ్నలు వస్తున్నాయి.
(08:25) అంటే ఏంటి అర్థము గీత ఉపనిషత్తుల ప్రాక్టికల్ మాన్యువల్ అన్నమాట. అంతేగాని ఇక్కడ మోక్షం అంటే వేరే అని కాదు. అయితే ఇప్పుడు పురాణాల మోక్షం అంటే ఏంటో చూద్దాం జనాలు ఎక్కువగా ఇక్కడే చిక్కుకుంటారు ఎక్కువగా ఇదే నమ్ముతుంటారు. పురాణాలు చెప్పేది ఏంటంటే మోక్షం అంటే వైకుంఠం కైలాసం ఇంకా వేరే వేరే లోకాలు చనిపోయిన వారిని దేవుడు వచ్చి తీసుకెళ్ళడం దేవలోకాలకు వీరు వెళ్ళడం అని అనుకుంటారు.
(08:54) కానీ ఇది లిటరల్ జియోగ్రఫీ అయితే కాదు వేరే వేరే లోకాలకు వేరే వేరే గ్రహాలకు వెళ్ళడానికి. ఇది ప్రతి మనిషికి తన మనసుకు అర్థమయ్యే ఒక భాష అన్నమాట అంటే ఏంటి ఉదాహరణకి వైకుంఠం అంటే భయం లేని స్థితి కైలాసం అంటే స్థిరత్వం కలిగిన చైతన్య స్థితి పురాణాలు మోక్షాన్ని ఒక ప్రదేశంలో చూపిస్తాయి అన్నమాట అదే మోక్షాన్ని ఉపనిషత్తులు ఒక స్థితిలా చూపిస్తాయి.
(09:26) పురాణాలు మోక్షాన్ని ప్రదేశంలో చూపించడం అంటే ఏంటి మనం భక్తి మార్గంలో తెలుసుకున్నాం కదా దేవుడు నిరాకారి అయిన మనిషికి అర్థం కాడు కాబట్టి ఆకారిలో చూపించారు ఆ శక్తులే ప్రతీకగా మన దేవుళ్లుగా ఉన్నారు అని ఇదే పాటర్న్ ఇక్కడ కూడా ఇది ప్రతి మనిషికి మనసుకు అర్థం కావాలని ఈ విధంగా చెప్తారు. కానీ మోక్షం అనేది సత్యం అయితే మారదు అది ఒక్కటేలా ఉంటుంది ఏ విధంగా చెప్పినా కూడా రకరకాల మనసుకు రకరకాలుగా అర్థమయ్యే విధంగా రకరకాల భాషలలో వర్ణించినారు అన్నమాట దాన్ని సింపుల్ గా ఇతిహాసాల్లో రామాయణ మహాభారతాల్లో మోక్షం అంటే రాముడు ధర్మంలో స్థిరత్వం కాబట్టి ఇలా జీవిస్తే విముక్తి
(10:13) అని అర్థం మహాభారతంలో భీష్ముడు ఇచ్చామరణం కృష్ణుడు జ్ఞానవి విముక్తి ఇవన్నీ విముక్తులే విముక్తే మోక్షం అంతే ఇక్కడ ఫైనల్ గా సత్యం ఏంటి కర్మ సిద్ధాంతం మన జీవితం ఎలా నడుస్తుందో చెప్పింది భక్తి మార్గం మన మనసుని ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్తుంది. జ్ఞాన మార్గం నువ్వు ఎవరో చెప్తుంది. మోక్షం బంధం అనేది అసలు లేదని తెలియజేస్తుంది.
(10:43) దేవుడు బయట కాదు దేవుడు ప్రత్యేక వ్యక్తి కాదు దేవుడు అనేది ఒక చైతన్యం ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్న ఒక చైతన్యం అలాగే మోక్షం అనేది బయట కాదు మోక్షం అనేది తర్వాత ఎప్పుడో వచ్చేది కాదు మోక్షం అనేది ఇప్పుడే నిజాన్ని గుర్తించడం కర్మను అర్థం చేసుకొని భక్తిలో మనసును శుద్ధి చేసుకొని జ్ఞానాన్ని సొంతం చేసుకొని మోక్షాన్ని పొంది ఇప్పుడే నిజాన్ని గుర్తించి అది ఏది నీవు కాదన్న స్థితిలో నీవు బతకడమే మోక్షం.
(11:18) నువ్వు ఇంకా ఏదో కావాలి అని నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా బంధంలో ఉన్నావు అని అర్థం. నువ్వు ఇంకా ఏదైనా నేను కావాలి అని కోరుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా ఏదో వెతుకుతున్నావు అని అర్థం కానీ నువ్వు ఇప్పటికే అది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ క్షణమే మోక్షం సో చివరిగా నేను చెప్పేది ఏందంటే ఇది కేవలం వీడియో కాదు ఇది ఉపదేశము కూడా కాదు మన హిందూ ధర్మాన్ని గుర్తు చేసుకోవడం మన హిందూ ధర్మం యొక్క యొక్క మూలాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం.
(11:59) గాయస్ ఈ సిరీస్ ఇంతటితో ముగిసింది. ఈ సిరీస్ ని ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ థాంక్యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా గాని కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో మంచి ఉపయోగకరమైన వీడియోలు నేను మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment