"ఆయన రెచ్చగొడుతున్నారా? రియాక్ట్ అవ్వకండి.. రిజల్ట్ చూడండి!" Toxic Husband PART 2| Greeshma Guidance
https://www.youtube.com/watch?v=KEkqC_y9EBo
Transcript:
(00:00) హాయ్ ఎలా ఉన్నారు టాక్సిక్ హస్బెండ్ పార్ట్ వన్ వీడియో కి మీరు చూపించిన రెస్పాన్స్ చూసాక నా మనసు నిండిపోయింది. వందల సంక్షలో వచ్చిన మీ కామెంట్స్ చదువుతుంటే ఒక్కో కామెంట్ వెనుక ఒక్కో కన్నీటి గాధ ఉందని నాకు అర్థమైంది. గ్రీష్మ గారు పరిస్థితులు మారవు అని అర్థమైపోయింది కానీ ఈ నరకంలో ఉంటూ నా మనసును ఎలా కాపాడుకోవాలి నేను పిచ్చిదాన్ని కాకుండా ఎలా ఉండాలి అని చాలా మంది అడిగారు.
(00:30) నిజమే అవతలి వ్యక్తి మారనప్పుడు మారడనే ఆశ వదులుకున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం సెల్ఫ్ ప్రిజర్వేషన్ అది ఒక కళ ఈరోజు ఈ వీడియోలో ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉంటూనే మీ ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు మానసిక బలాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాల గురించి చాలా లోతుగా మాట్లాడుకుందాం. ఈ 10 నిమిషాలు మీ జీవితంలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయని నేను నమ్ముతున్నాను ద రియాలిటీ ఎందుకు అవతలి వారు మారరు ముందుగా ఒక చేదు నిజాన్ని మనం అంగీకరించాలి.
(01:04) చాలా మంది మహిళలు చేసే తప్పుఏంటంటే నేను ఇంకా బాగా చూసుకుంటే ఆయన మారుతారేమో పిల్లలు పెద్దయ్యాక మారుతారేమో అని ఎదురు చూడడం సైకాలజీ ప్రకారం ఒక టాక్సిక్ వ్యక్తికి [సంగీతం] తన ప్రవర్తన తప్పు అని అస్సలు అనిపించదు ఫ్రెండ్స్ వారికి ఇతరులను కంట్రోల్ చేయడంలోనే సంతోషం ఉంటుంది. మీరు ఎంత మంచిగా ఉన్నా వారు మీలో తప్పులు వెతుకుతూనే ఉంటారు.
(01:32) మరి దీనికి సొల్యూషన్ స్టాప్ ట్రయింగ్ టు ఫిక్స్ దెమ్ మీరు వారిని మార్చలేరు. మీరు మార్చగలిగింది కేవలం మిమ్మల్ని మీరు మాత్రమే. ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా కుర్తిస్తే అంత త్వరగా మీ బాధ తగ్గుతుంది. గాలి లేని టైర్ కి మీరు ఎంత గాలి కొట్టినా అది ముందుకు వెళ్ళదు. అలాగే మారాలి అనే కోరిక లేని వ్యక్తి కోసం మీరు ఎంత కన్నీళ్లు కార్చినా ప్రయోజనం లేదు.
(01:58) గ్రే డాక్ మెథడ్ నిశబ్దమే మీ ఆయుధం. టాక్సిక్ భర్తకి కావలసింది మీ రియాక్షన్ ఫ్రెండ్స్. ఆయన మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు మీరు ఏడిస్తేనో లేదా ఎదురు తిరిగితేనో ఆయనకు ఒక రకమైన విజయం లభిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఒక స్ట్రాటజీని వాడాలి. సైకాలజీలో దీన్నే గ్రే రాక్ మెథడ్ అంటారు అంటే ఒక దారి పక్కన పడి ఉన్న బూడిద రంగు రాయిలా మారిపోవడం ఆ రాయిని ఎవరైనా తన్నినా తిట్టినా దగ్గర ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఆయన మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వాదించకండి నిశశబ్దంగా ఉండండి సరే అలాగే మీ ఇష్టం ఇలా ఒక్క మాటతో ముగించండి.
(02:35) ఎప్పుడైతే మీరు రియాక్ట్ అవ్వడం మానేస్తారో అప్పుడు ఆయనకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో కిక్ ఉండదు. మీ ఎమోషన్స్ ని వారికి అప్పగించకండి. మీ కోపం, మీ ఏడుపు ఇవి మీ ఆస్తి వాటిని ఆయనకు దక్కనివ్వకండి. ఎక్స్టిన్షన్ బస్ట్ నిప్పు మీద నీళ్లు పోసినప్పుడు వచ్చే మంట. మీరు గ్రేడా ఆఫ్ మెథడ్ పాటించడం మొదలుపెట్టినప్పుడు పరిస్థితి వెంటనే ప్రశాంతంగా మారిపోదు ఫ్రెండ్స్.
(03:01) నిజానికి కొన్నిసార్లు అది ఇంకా ఎక్కువ అవుతుంది. దీన్నే సైకాలజీలో ఎక్స్టింషన్ బోస్ట్ అంటారు. దీనిని ఒక ఉదాహరణతో చెప్పుకుందాం. ఒక లిఫ్ట్ బటన్ నొక్కినప్పుడు అది పని చేయకపోతే మనం ఏం చేస్తాం వెంటనే వదిలేయం కదా ఇంకా గట్టిగా ఇంకా వేగంగా ఆ బటన్ ని నొక్కుతాం. ఎదుటి వ్యక్తి కూడా అంతే ఆయన ప్రవర్తనలో వచ్చే మార్పులు ఇలా ఉండొచ్చు.
(03:24) మీరు రియాక్ట్ అవ్వకపోతుంటే ఆయనకు కోపం పెరిగి ఇంకా దారుణంగా మాట్లాడవచ్చు. మిమ్మల్ని ఏడిపించడానికి పాత విషయాలను బయటకి తీయవచ్చు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీయవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఈ దశలో మీరు భయపడిపోయి మళ్ళీ ఏడవడం లేదా గొడవ పడడం చేస్తే ఆయనకు నేను ఇంకా గట్టిగా అరిస్తే ఈమె లోబడుతుంది అనే నమ్మకం కలుగుతుంది.
(03:51) కాబట్టి ఆ మంట తగ్గే వరకు మీరు ఓపిక పట్టాలి. ఆ ఎక్స్టింషన్ బర్స్ట్ అనేది ఆయన ఓటమికి సంకేతం. మీరు మీ మౌనాన్ని ఆయుధంగా వాడితే కొద్ది రోజుల్లోనే ఆయన అలసిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తారు. ఎమోషనల్ డిటాచ్మెంట్. మనసును వేరు చేయడం ఒకే ఇంట్లో ఉంటూ మనసుని ఎలా వేరు చేయాలి ఇది చాలా కష్టమైన సాధ్యమే ఫ్రెండ్స్ దీనిని ఆబ్జెక్టివ్ అబ్జర్వేషన్ అంటారు.
(04:17) అంటే ఆయన అరుస్తున్నప్పుడు నా భర్త నన్ను తిడుతున్నాడు అని బాధపడకుండా ఒక వ్యక్తి తన కోపాన్ని అదుపు చేసుకోలేక ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు అని ఒక థర్డ్ పర్సన్ లా అతన్ని చూడండి. ఒక చిన్న ఉదాహరణ రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఎవరైనా పిచ్చివాడు మనల్ని తిడితే మనం బాధపడతామా లేదు కదా ఎందుకంటే అతని బుద్ధి లేదు అని మనకు తెలుసు మీ ఇంట్లో ఉన్న వ్యక్తి కూడా మానసికంగా ఆరోగ్యంగా లేరు అని మీరు భావించినప్పుడు వారి మాటలు మీ మనసుకి తగలవు.
(04:51) ఆయన మాటలను మీ హృదయం దాకా తీసుకు వెళ్ళకండి. కేవలం చెవుల దగ్గరే ఆపేయండి. బిల్డింగ్ యువర్ సీక్రెట్ వర్డ్ మీకంటూ ఒక చిన్న లోకాన్ని సృష్టించుకోండి. చాలా మంది మహిళల ప్రపంచం కేవలం భర్త ఇల్లు, పిల్లలు వీరి చుట్టూనే తిరుగుతుంటుంది. అందుకే అతను పలకరించకపోతే ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. దీనికి సొల్యూషన్ బిల్డ్ ఏ పారలల్ లైఫ్ అతను లేని సమయంలో మీకు ఇష్టమైన పని చేయండి.
(05:20) అది మీ పిల్లలతో ఆడుకోవడం కావచ్చు దేవుడి పాటలు వినడం కావచ్చు మొక్కలు పెంచడం కావచ్చు పుట్లు అల్లికలు చేయడం కావచ్చు లేదా YouTube కోసం వీడియోలు తీయడం కావచ్చు ఏదైనా ఒకటి మీకంటూ ఒక సపోర్ట్ సిస్టం ని ఉంచుకోండి అది మీ అమ్మ కావచ్చు చెల్లి కావచ్చు లేదా ఒక మంచి స్నేహితురాలు కావచ్చు మీ బాధను పంచుకోవడానికి ఒక చోటు ఉండాలి.
(05:44) మనీ ఇస్ ఏ టూల్ ఫర్ కంట్రోల్ చాలా మంది ఇళ్లల్లో భర్తలు డబ్బు కోసం భార్యను వేధించడం మనం చూస్తుంటాం. ఇది కేవలం డబ్బు సమస్య కాదు. ఇది మిమ్మల్ని మానసికంగా అణచివేసే ఒక మార్గం. మీరు డబ్బు కోసం ఆయన మీద ఆధారపడి ఉన్నారని తెలిసినప్పుడు ఆ బలహీనతను ఆయుధంగా వాడుకుంటారు. మీ చేతిలో నాలుగు డబ్బులు ఉంటే వచ్చే ధైర్యమే వేరు. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
(06:08) ఎదుటివారికి మీ మీద ఉన్న చులకన భావాన్ని తగ్గిస్తుంది. స్టాప్ ద బెగ్గింగ్ సైకిల్ ఆయన డబ్బు ఇవ్వను అన్నప్పుడు మీరు ఏడిస్తే అది ఆయనకి ఎక్కువ పవర్ ఇచ్చినట్లు అవుతుంది. అక్కడ కూడా మీరు గ్రేరాక్ మెథడ్ వాడండి ఫ్రెండ్స్. సరే మీ ఇష్టం అని వదిలేయండి. మీ అవసరాల కోసం ప్రాధేయ పడటం మానేయండి. స్మాల్ ఫైనాన్షియల్ స్టెప్స్. మనము డిగ్రీలు చదివి ఖాళీగా ఇంట్లో ఉంటున్నామని చులకనా భావం వారికి ఉండొచ్చు.
(06:34) కానీ గుర్తుంచుకోండి ఆ చదువు మన మెదల్లోనే ఉంది. చిన్నగా ట్యూషన్లు చెప్పడం లేదా ఆన్లైన్ ద్వారా మన నైపుణ్యాన్ని వాడటం మొదలు పెడితే ఆ ఆదాయం ఇచ్చే ఆత్మగౌరవం ముందు ఏ వేధింపు నిలవదు. సైలెంట్ సేవింగ్స్ నిశశబ్ద పొదుపు మీకు అందిన కొద్దిపాటి సొమ్మును ఆయనకు తెలియకుండా దాచుకోవడం తప్పు కాదు. అది మీ ఎమర్జెన్సీ ఫండ్.
(07:00) ఆ నిశశబ్దమైన పొదుపే మీకు రేపు కొండంత అండగా ఉంటుంది. పిల్లల కోసం మీరు బలంగా ఉండాలి. చివరిగా ఒక మాట చాలామంది నా తలరాత ఇంతే అని రాజీ పడి బ్రతుకుతుంటారు. తలరాతను మనం మార్చలేకపోవచ్చు కానీ ఆ రాతను మనము ఎలా చదువుతున్నాము అనేదే ముఖ్యం. మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు. ఒక బాధితురాలిగా ఏడుస్తూ కూర్చిన తల్లిని చూపిస్తారా లేక ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయే ఒక పోరాట యోతురాలిని చూపిస్తారా అది మీ ఇష్టం.
(07:31) మీరు సంతోషంగా ఉంటేనే మీ ఇల్లు నందన వనం అవుతుంది ఫ్రెండ్స్. ఆయన మారకపోవచ్చు. కానీ మీరు శక్తివంతంగా మారండి. మీ సంతోషాన్ని ఆయన చేతుల్లో పెట్టుకోకండి. మీ సంతోషాన్ని మీ చేతుల్లో పెట్టండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఊరటని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినప్పుడు పొంగిపోకండి. మీ మనసులో గట్టిగా ఒక మాట చెప్పుకోండి.
(07:55) అదేంటో తెలుసా? ఐ ట్రస్ట్ మై వాల్యూ. ఈ మాట మీలో ధైర్యాన్ని నింపితే ఐ ట్రస్ట్ మై వాల్యూ అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ప్రతి కామెంట్ నేను చదువుతాను. గుర్తుంచుకోండి ఐ ట్రస్ట్ మై వాల్యూ అనేది కేవలం మాట కాదు అది మీ కవచం. మనమందరము ఒకరికొకరం తోడుగా ఉందాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బి స్ట్రాంగ్ బి హ్యాపీ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడెన్స్
No comments:
Post a Comment