Tuesday, April 14, 2026

*******ఈ జనరేషన్ ఒంటరితనం వెనుక ఉన్న భయంకరమైన నిజం | Dark Psychology Telugu | Mr AK Prime

ఈ జనరేషన్ ఒంటరితనం వెనుక ఉన్న భయంకరమైన నిజం | Dark Psychology Telugu | Mr AK Prime

Author Name:Mr AK Prime

Youtube Channel Url:https://www.youtube.com/@MrAKPrime

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PfsAcy8Kn-Y



Transcript:
(00:00) నమస్కారం మిస్టర్ ఈకే ప్రైమ్ కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక మామూలు టాపిక్ కాదు. ఇది మీ గురించి నా గురించి మనందరి జీవితాలను నిశబ్దంగా మింగేస్తున్న ఒక భయంకరమైన నిజం గురించి. ఈ వీడియో పూర్తఅయ్యేసరికి మీ జీవితాన్ని మీరు బ్రతుకుతున్న విధానాన్ని చూసే కోణం పూర్తిగా [సంగీతం] మారిపోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
(00:21) ఎందుకంటే ఈ నిజం తెలుసుకోకపోతే జీవితాంతం ఒక కనబడిన జైలులో ఖైదీలానే మిగిలిపోతారు. ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పచ్చి నిజాలు మీకు మరెక్కడా దొరకవు. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. శనివారం సాయంత్రంఆరు గంటల సమయం బయట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు మీ రూమ్లో ఒంటరిగా ఉన్నారు. ఆఫీస్ లో లేదా కాలేజీలో వారం రోజుల పాటు పడిన ఒత్తిడి టెన్షన్ అంతా మర్చిపోవాలని మనసు తహతహలాడుతోంది.
(00:45) నాలుగు గోడల మధ్య ఆ ఊపిరాడని వాతావరణం నుండి బయట పడాలనిపిస్తుంది. మెల్లగా ఫోన్ తీశారు. WhatsAppట్ కాంటాక్ట్స్ అన్ని ఒకసారి పైకి కిందకి స్క్రోల్ చేశారు. వందలాది పేర్లు కానీ ఒరేయ్ బయటికి వెళ్దాం రారా అని హక్కుగా ఏ మొహమాటం లేకుండా పిలిచే స్నేహితులు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఎవరైనా దొరికినా వాళ్ళతో కలిసి ఎక్కడికి వెళ్ళాలి [సంగీతం] సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
(01:06) మీరు బయట కాలు పెట్టాలి అంటే జేబులో కనీసం 500 రూపాయలు లేకుండా అడుగు బయట పెట్టగలరా ఒకసారి ఆలోచించండి. ఏ ఉద్దేశం లేకుండా కేవలం కాసేపు ప్రశాంతంగా గడపడానికి ఈ నగరాల్లో ఒక చోటు ఉందా? ఎక్కడికి వెళ్ళినా మాల్స్ మల్టీప్లెక్స్ లో ఖరీదైన కేఫ్ లో రెస్టారెంట్ లో లోపలికి అడుగు పెట్టగానే ఒక నవ్వుతో కూడిన పలకరింపు ఎదురవుతుంది. కానీ ఆ నవ్వు వెనుక ఇక్కడ మీ సమయానికి మీరు ఎంత బిల్లు కడతారో అనే ఒక వ్యాపార కోణం దాగి ఉంటుంది.
(01:30) మనం ఇంటర్నెట్ ప్రపంచంలో అత్యంత కనెక్ట్ అయి ఉన్న జనరేషన్ మన చేతిలో ఉన్న ఫోన్ ప్రపంచంలో ఏ మూలం ఉన్న వ్యక్తినైనా క్షణాల్లో కలుపుతుంది. కానీ వాస్తవ జీవితంలో మనం అంతకంటే ఎన్నో రెట్లు ఒంటరి వాళ్ళం. మన తాతలు తండ్రుల కంటే ఎక్కువ సౌకర్యాలు అనుభవిస్తున్నాం. కానీ వాళ్ళకంటే ఎక్కువ డిప్రెషన్, యంజైటీ స్ట్రెస్ తో బ్రతుకుతున్నాం.
(01:48) ఎందుకు మనల్ని ఇంత ఒంటరి వాళ్ళని చేసింది ఎవరు? ఈ 9 టుఫైవ్ మాట్రిక్స్ లో పడిపోయి ఒక రోబోట్లా ఎందుకు మారిపోతున్నాం? దీని వెనుక ఉన్న అతి పెద్ద సైకలాజికల్ కారణమే ది డెత్ ఆఫ్ ది థర్డ్ ప్లేస్ అంటే మన జీవితాల్లో ఆ మూడవ ప్రదేశం చచ్చిపోవడం అసలు ఏమిటి థర్డ్ ప్లేస్? ఎందుకు అది మన మానసిక ఆరోగ్యానికి ప్రాణవాయువు లాంటిది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త రే ఓల్డెన్బర్గ్ మనుషుల జీవితాన్ని వాళ్ళు గడిపే ప్రదేశాలను బట్టి మూడు రకాలుగా విభజించాడు.
(02:17) ఇందులో మొదటి ప్లేస్ మన ఇల్లు ఇది మనం నిద్రపోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఉన్న ప్రదేశం కానీ నిజానికి ఇంట్లో కూడా మనకు పూర్తి స్వేచ్ఛ ఉండదు. కుటుంబ బాధ్యతలు, బంధుత్వాలు, ఆర్థిక సమస్యలు, పేరెంట్స్ అంచనాలు ఇవన్నీ మొదటి ప్లేస్ లో మన మీద ఒక తెలియని భారాన్ని మోపుతాయి. ఇక రెండవ ప్లేస్ మన ఆఫీస్ లేదా కాలేజ్ ఇది పూర్తిగా ఒత్తిడి బాధ్యత టార్గెట్స్ [సంగీతం] డెడ్ లైన్స్ తో నిండిన ఒక యుద్ధభూమి ఇక్కడ మీరు మీలా ఉండలేరు.
(02:43) బాస్ కి భయపడాలి కలీగ్స్ తో పోటీ పడాలి ప్రమోషన్స్ కోసం ప్రాకులాడాలి ఒక ఫేక్ నవ్వు ముఖం మీద పెట్టుకొని బ్రతకాలి. ఈ రెండవ ప్లేస్ మిమ్మల్ని [సంగీతం] శారీరకంగా మానసికంగా పిండేస్తుంది. మరి ఈ మొదటి ప్లేస్ లో ఉన్న కుటుంబ బాధ్యతలు రెండవ ప్లేస్ లో ఉన్న ఆఫీస్ ఒత్తిడి. ఈ రెండింటి నుండి తప్పించుకుని మనిషి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి ఒక ప్రదేశం కావాలి.
(03:04) ఎవరు ఏమి ఆశించని జేబులో రూపాయి లేకపోయినా దర్జాగా కూర్చోగలిగే మీ స్థాయి [సంగీతం] మీ జాబ్ మీ బ్యాంకు బాలెన్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక మనిషిగా మిమ్మల్ని ఆహ్వానించే ప్రదేశం. అదే ఈ థర్డ్ ప్లేస్. ఈ మూడవ ప్రదేశం అనేది కేవలం కాలక్షేపం కోసం కాదు. మనిషి మెదడుకు వాడి భావోద్వేగాలకు అదిఒక రీచార్జ్ స్టేషన్ అక్కడ మీరు జడ్జ్ చేయబడరు.
(03:22) అక్కడ మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. కేవలం చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడుతూ నవ్వుతూ మీ బాధలు [సంగీతం] పంచుకుంటూ జీవితంలో ఉన్న కాస్త బరువుని దించుకునే ఒక అద్భుతమైన మానసిక ఆసుపత్రి అది. కానీ ఈ రోజుల్లో మీ జీవితంలో అలాంటి థర్డ్ ప్లేస్ ఎక్కడైనా ఉందా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించండి. గతానికి వర్తమానానికి మధ్య జరిగిన ఒక భయంకరమైన మార్పుని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను.
(03:43) ఒక 30 40 ఏళ్ల క్రితం పల్లెటూళ్లలో గాని పాత [సంగీతం] పట్టణాల్లో గాని సాయంత్రం అవ్వగానే మనుషులు ఎక్కడికి వెళ్ళేవారు ఊర్లో రచ్చబండ దగ్గరికి లేదా గుడి ఆవరణంలో ఉన్న చెట్టు కిందకి వీధి చివర ఉన్న చిన్న అరుగుల మీదకో లేదా ఒక లైబ్రరీకో పక్కనే [సంగీతం] ఉన్న ఒక ఖాళీ గ్రౌండ్ కో వెళ్ళేవారు. అక్కడ అందరూ ఒక చోట చేరేవారు. అక్కడ కలవడానికి ఎవరికీ ఎలాంటి ఎంట్రీ ఫీజ లేదు.
(04:05) అక్కడ ఒక డాక్టర్ ఒక కూలి పని చేసుకునేవాడు ఒక టీచర్ ఒక నిరుద్యోగి అందరూ సమానంగా కూర్చుని మాట్లాడుకునేవారు. అక్కడ కులాలు మతాలు డబ్బు స్టేటస్ అనే గోడలు లేవు. ఒక టీ తాగకపోయినా ఒక రూపాయి ఖర్చు పెట్టకపోయినా గంటల తరబడి కబుర్లు చెప్పుకొని ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకొని ఇంటికి ప్రశాంతంగా వెళ్ళేవారు. అదే వారి థర్డ్ ప్లేస్ అది మనుషుల్ని మనుషులుగా కలిపే ఒక అద్భుతమైన వ్యవస్థ.
(04:25) కానీ ఇప్పుడు ఏమైంది ఆ రచ్చబండలు లేవు ఆ అరువులు లేవు ఆ గ్రౌండ్స్ ఎప్పుడో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి. మరి ఇప్పుడు ఇద్దరు స్నేహితులు కలవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి క్యాపిటలిజం పెట్టుబడిదారి వ్యవస్థ మన జీవితంలోకి ఎలా చొరబడిందంటే స్వేచ్ఛగా గడిపే ప్రతి ప్రదేశాన్ని అది మింగేసింది. ఉచితం అనే పదానికి సమాధి కట్టేసింది.
(04:44) ఆ స్థానంలో కేఫ్లో బార్స్, మాల్స్, సినిమా థియేటర్లను తీసుకొచ్చింది. దీని అర్థం ఏమిటో తెలుసా యు హావ్ టు పే టు ఎగ్జస్ట్ అవును [సంగీతం] ఈ సమాజంలో మీరు కేవలం బ్రతికి ఉన్నందుకు కూడా డబ్బు కట్టాల్సిందే. ఇప్పుడు స్నేహం అంటే ఒకరికి ఒకరు సమయం ఇవ్వడం కాదు. ఇద్దరూ కలిసి ఒక చోట కూర్చుని డబ్బులు ఖర్చు పెట్టడం ఒక కాఫీ షాప్ కి వెళ్లి కూర్చుంటారు.
(05:04) అక్కడ ఒక కాఫీ ఖరీదు 300 రూపాయ ఉంటుంది. అది ఆ కాఫీ గింజల ఖరీదు కాదు ఆ రెండు గంటలు మీరు అక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి మీరు కడుతున్న అద్దే మీ కష్ట సుఖాలు పంచుకోవడానికి ఈ సమాజం మీకు విధించిన పన్ను అది. మీరు ఏమి ఆర్డర్ చేయకుండా ఒక మాల్ లోనో ఒక కేఫ్ లోనో వెళ్లి కూర్చోండి. అరగంటలో మేనేజర్ వచ్చి సార్ ఏదైనా ఆర్డర్ చేస్తారా అని అడుగుతాడు.
(05:23) దాని వెనుక ఉన్న అసలు అర్థం నువ్వు ఇక్కడ కూర్చోవాలి అంటే డబ్బు కట్టు లేకపోతే బయటికి వెళ్ళిపో అని అంటే ఈ ఆధునిక ప్రపంచంలో నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు లేకపోతే నలుగురితో కలిసి కూర్చునే అర్హత కూడా నీకు లేదు. ఈ కన్స్యూమర్ కల్చర్ మనల్ని ఒక ప్రొడక్ట్ లా మార్చేసింది. ఇది ఎంత భయంకరమైన విషయమో ఎప్పుడైనా గమనించారా మన తాతల కాలంలో ఉన్న మానవ సంబంధాలు ఇప్పుడు ఎందుకు లేవు అంటే సంబంధాలు పెంచుకోవడానికి కూడా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ముందు భాగంలో మాట్లాడుకున్నట్లుగా బయట ప్రపంచంలో మనం స్వేచ్ఛగా గడిపే ప్రదేశాలు కనుమరిది
(05:50) అయిపోవడాన్ని కొన్ని పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలు గమనించాయి. మనిషిలోని ఈ ఒంటరితనాన్ని నలుగురితో కలవాలనే తప్పనను వాళ్ళు ఒక వ్యాపారంగా మార్చుకోవాలనుకున్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ళు మన ముందుకు ఒక మాయాజాలాన్ని తీసుకొచ్చారు అదే సోషల్ మీడియా Facebookఇగ [సంగీతం] డిస్కార్డ్ ఇవన్నీ ఇంటర్నెట్ ప్రపంచంలో మనకు పరిచయం చేయబడిన కొత్త థర్డ్ ప్లేసెస్ మీ ఊర్లో రచ్చబండ లేదా ఇదిగో [సంగీతం] Facebook గ్రూప్ ఇందులో మాట్లాడుకోండి.
(06:14) మీకు గ్రౌండ్ లో ఆడుకునే స్నేహితులు లేరా ఇదిగోపబ్gి కాల్ ఆఫ్ డ్యూటీ ఆన్లైన్ లో ఆడుకోండి. మీరు బయటికి [సంగీతం] వెళ్లి నలుగురితో మీ ఆనందాన్ని పంచుకోలేకపోతున్నారా? ఇదిగోఇ రీల్స్ ఇక్కడ మీ టాలెంట్ చూపించండి. ఇలా మనకు తెలియకుండానే మనకు దూరమైన నిజమైన థర్డ్ ప్లేస్ స్థానంలో ఈ వర్చువల్ థర్డ్ ప్లేస్ ని మన మెదడులోకి ఎక్కించారు.
(06:33) మొదట్లో ఇది చాలా అద్భుతంగా అనిపించింది. ప్రపంచంఅంతా మన గుప్పెట్లో ఉన్నట్లు ఒక భ్రమ కలిగింది. [సంగీతం] కానీ ఇక్కడే ఒక అతి పెద్ద సైకలాజికల్ ట్రాక్ ఉంది. నిజమైన థర్డ్ ప్లేస్ కి ఈ సోషల్ మీడియా థర్డ్ ప్లేస్ కి ఒక ప్రాణాంతకమైన తేడా ఉంది. బయట నిజ జీవితంలో మనం నలుగురితో కూర్చున్నప్పుడు అక్కడ మనం మనలా ఉంటాం. మన బాధలు, కష్టాలు, సంతోషాలు అన్ని పంచుకుంటాం.
(06:52) కానీ సోషల్ మీడియా అనేది ఒక కమ్యూనిటీ కాదు. [సంగీతం] అదిఒక పర్ఫార్మెన్స్ స్టేజ్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక నాటకం ఆడుతున్నారు. [సంగీతం] ఎవరు తమ నిజమైన జీవితాన్ని చూపించరు. కేవలం తాము ఎంత సంతోషంగా ఉన్నామో ఏ ఖరీదైన బట్టలు వేసుకున్నామో ఏ రెస్టారెంట్ లో తింటున్నామో ఇలా తమ జీవితంలో ఉన్న ఫిల్టర్ చేయబడిన ఒక శాతం అబద్ధపు సంతోషాన్ని మాత్రమే 100% నిజంగా చూపిస్తుంటారు.
(07:12) దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఫాలోవర్ కి ఒక ఫ్రెండ్ కి మధ్య ఉన్న తేడా మనకు మర్చిపోయేలా చేస్తుంది. ఒక ఫ్రెండ్ అంటే మీ పక్కన కూర్చుని మీ కన్నీళ్లు తుడిచేవాడు. ఫాలోవర్ అంటే మీరు కన్నీళ్లు దాచుకొని పెట్టిన ఒక నవ్వు ముఖం ఫోటోకి లైక్ కొట్టేవాడు. మీకుఇగ లో 10వేల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు.వాట్ లో వందల మంది కాంటాక్ట్స్ ఉండొచ్చు.
(07:30) కానీ [సంగీతం] అర్ధరాత్రి మీకు ఒక చిన్న కష్టం వస్తే ఏ మొహమాటం లేకుండా కాల్ చేసి పిలిచే స్నేహితులు ఎంతమంది ఆ క్షణం మీరు మీ ఫోన్ కాంటాక్ట్స్ చూసుకున్నప్పుడు మీకు ఎదురయ్యే ఆ శూన్యం ఉంది. అది నరకం కంటే భయంకరమైనది. ఈ సోషల్ మీడియా మనల్ని ఎంతలా దిగజాచింది అంటే ఇద్దరు స్నేహితులు ఎప్పుడో ఒకసారి అతి కష్టం మీద సమయం కుదుర్చుకొని ఒక కేఫ్ లోనో టీ కొట్టు దగ్గరో కలుస్తారు.
(07:50) కానీ పక్క [సంగీతం] పక్కనే కూర్చుని కూడా ఇద్దరు ఎవరి ఫోన్ లో వాళ్ళు రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు. భౌతికంగా వాళ్ళు ఒకే దగ్గర ఉన్నారు. కానీ మానసికంగా వాళ్ళ మధ్య లక్షల కిలోమీటర్ల దూరం ఉంది. ఆ అరగంట ఏదో మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్ కి వెళ్ళాక ఎందుకు వెళ్ళానురా బాబు వెళ్ళినా ఒంటరిగానే ఉన్న ఫీలింగ్ ఏంటి అనిపిస్తుంది.
(08:09) ఈ ఫీలింగ్ ని సైకాలజీలో ఫంబింగ్ అంటారు. అంటే పక్కన మనిషి ఉన్నా కూడా వాళ్ళను పట్టించుకోకుండా ఫోన్ కి అతుక్కుపోవడం. ఇలాంటి అనుభవం మీలో ఎంతమందికి ఎదురైందో ఒక్కసారి మనస్సాక్షిని అడగండి. ఇలా నిజమైన థర్డ్ ప్లేస్ లేకపోవడం వల్ల మన మెదడు మీద సమాజం మీద పడుతున్న ప్రభావం మామూలుగా లేదు. మనిషి పుట్టుకతోనే ఒక సంఘజీవి. గుంపుగా బ్రతకడం మన జీన్స్ లోనే ఉంది.
(08:29) మనకు కష్టం వస్తే నలుగురు అండగా ఉంటారు అనే భరోసా మన మెదడులో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. కానీ ఇప్పుడు ఆ థర్డ్ ప్లేస్ లేక ఆ నలుగురు మనుషులు లేక మనిషి మెదడు ఎప్పుడూ ఒక రకమైన అభద్రత భావంతో సర్వైవల్ మోడ్ లో ఉంటుంది. అందుకే ఈ జనరేషన్ యువతలో యంజైటీ డిప్రెషన్, పానిక్ అటాక్స్ ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి.
(08:50) నాకు ఎవరూ లేరు నేను ఒంటరి వాడిని అనే భావన లోపలి నుండి ప్రతి ఒక్కరిని తినేస్తుంది. దీనివల్ల వస్తున్న మరో భయంకరమైన సమస్య ఎకో చాంబర్ ఎఫెక్ట్ పాత రోజుల్లో రచ్చబండ దగ్గర అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళు కలిసేవాళ్ళు ఒకడికి ఒక [సంగీతం] పార్టీ ఇష్టం ఇంకొకడికి ఇంకో పార్టీ ఇష్టం ఒక టాపిక్ మీద 10 మంది 10 రకాలుగా వాదించుకునేవాళ్ళు.
(09:08) కోపాలు వచ్చేవి మళ్ళీ కలిసిపోయేవాళ్ళు. ఒకడి అభిప్రాయాన్ని ఇంకొకడి ఎలా గౌరవించాలో అవతలి వాడి మాట కూడా ఎలా వినాలో నేర్చుకునేవాళ్ళు. అక్కడ మనుషుల మధ్య సహనం పెరిగేది. కానీ ఇంటర్నెట్ లో అలా కాదు ఆల్గరిథమ్స్ ఎప్పుడూ మీకు నచ్చిన విషయాలనే మీకు చూపిస్తాయి. మీ ఆలోచనలతో ఏకీభవించే వాళ్ళను మాత్రమే మీకు కనెక్ట్ చేస్తాయి. [సంగీతం] మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాడిని ఒక శత్రువులా చూసేలా మీ మెదడుని ప్రోగ్రాం్ చేస్తాయి.
(09:31) నచ్చకపోతే వెంటనే బ్లాక్ చేస్తారు లేదా బూతులు తిడతారు. అందుకే ఈ రోజుల్లో మనుషుల్లో సహనం పూర్తిగా చచ్చిపోయింది. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపం రోడ్ల మీద చిన్న గొడవకి ప్రాణాలు తీసుకునేంత ఆవేశం ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు. వాళ్ళలో ఎంపతీ అంటే ఎదుటివాడి స్థానంలో ఉండి ఆలోచించే గుణం చచ్చిపోయింది. దానికి కారణం వాళ్ళు నలుగురు వేరు వేరు మనస్తత్వాలు ఉన్న మనుషులతో కూర్చొని మాట్లాడే థర్డ్ ప్లేస్ వాళ్ళ జీవితంలో లేకపోవడమే.
(09:52) మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం రాత్రికి రాత్రే కొత్త పార్కులు కట్టలేము, రచ్చబండలు తీసుకురాలేము. కానీ మన జీవితాల్లో థర్డ్ ప్లేసెస్ ని మనమే తిరిగి సృష్టించుకోవాలి. బ్రతకడం అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు గాడిదలా పని చేసి వీకెండ్ రాగానే [సంగీతం] ఏదో ఒక పబ్ కో రెస్టారెంట్ కో వెళ్లి వారమంతా సంపాదించిన డబ్బుని అక్కడ తగలేసి దాన్ని ఫోటోలు తీసిఇ లో పెట్టి 10 మందికి నేను బ్రతుకుతున్నాను అని ప్రూవ్ చేసుకోవడం కాదు.
(10:15) సమయం గడపడం అంటే డబ్బు ఖర్చు పెట్టడం అనే ఆలోచన నుండి ముందు బయట పడండి. డబ్బుతో సంబంధం లేని వ్యాపకాలను వెతుక్కోండి. [సంగీతం] వీకెండ్ వస్తే ఉదయాన్నే ఒక చిన్న ట్రెక్కింగ్ కి వెళ్ళండి. దగ్గరలో ఉన్న ఖాళీ గ్రౌండ్ కి వెళ్లి పరిచయం లేని వాళ్ళతో కలిసి ప్లాస్టిక్ బంతితో క్రికెట్ ఆడండి లేదా వాలీబాల్ ఆడండి. ఒక లైబ్రరీ కి వెళ్లి బుక్స్ చదవకపోయినా పర్లేదు అక్కడ ఒక [సంగీతం] గంట కూర్చోండి.
(10:35) లేదా ఎవరైనా స్నేహితులు ఉంటే బైక్ వేసుకొని ఊరి చివరకు వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని వాటర్ బాటిల్ పెట్టుకొని గంటలు గంటలు మాట్లాడుకోండి. ఎటువంటి అంచనాలు జడ్జిమెంట్ లేని మనుషులను కలవండి. స్క్రీన్లు పక్కన పెట్టి మనుషుల కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం నేర్చుకోండి. గుర్తుపెట్టుకోండి. జీవితం అంటే ఈ ఈఎంఐలు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం కోసం బ్రతకడం కాదు.
(10:54) ఆ బిల్లులు కట్టేంత ఎంజాయ్ చేస్తున్నామని లోకానికి చూపించడం అంతకంటే కాదు. జీవితం [సంగీతం] అంటే మనుషులతో మనుషుల్లా బ్రతకడం ఒక నవ్వు ఒక పలకరింపు ఒక భుజం మీద చెయ్యి ఇవిఆపిల్ ఐఫోన్ ల కంటే ఖరీదైన కాఫీల కంటే చాలా విలువైవి. మనకు కావాల్సింది ఒక ఏసీ గది కాదు మనం ఏడ్చినా నవ్వినా మనిషిగా మనల్ని స్వీకరించే ఒక థర్డ్ ప్లేస్.
(11:12) ఆ ప్లేస్ ని వెతుక్కోండి లేదా మీరే సృష్టించండి. [సంగీతం] లేకపోతే ఈ ఒంటరితనం అనే సైలెంట్ కిల్లర్ మిమ్మల్ని ఎప్పుడు మింగేస్తుందో మీకే తెలియదు. ఇది మిస్టర్ ఏకే ప్రైమ ఎప్పుడు మీకు కఠినమైన నిజాలను మాత్రమే చూపిస్తూ మీ ఆలోచనలను మేలుకొల్పే మీ సొంత ఛానల్ ఈ వీడియో చూసాక మీ మనసులో ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి.
(11:29) అలాగే మీ జీవితంలో ఇలా డబ్బులు ఏమాత్రం ఖర్చు లేకుండా మీరు ప్రశాంతంగా గడిపే మీ థర్డ్ ప్లేస్ ఏదైనా ఉందా ఉంటే అది ఏంటో కామెంట్స్ లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఒక నిజం తెలియాల్సిన మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
(11:45) అంతవరకు ఆలోచిస్తూ ఉండండి జాగ్రత్త

No comments:

Post a Comment