Tuesday, April 14, 2026

 వివాహాది శుభకార్యములలో భోజన ఏర్పాట్లు ఉండు విధానము:-
1. ఆహ్వానితులందరికీ సాంప్రదాయక దుస్తులైన పంచే, ఉత్తరీయము ఏర్పాటు చేయాలి.
2. కాళ్లు చేతులు కడుగుకొనుటకు నీటిని ఏర్పాటు చేయాలి.
3. అందరిని వరుసలలో కూర్చోబెట్టాలి.
4. గంధము కుంకుమ సమకూర్చాలి. 
5. తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి.
6. అరటి ఆకులు లేక విస్తరాకులలో భోజనము వడ్డించాలి.
7. ఔపోసన (చిత్రావతి) పట్టుటకు నీటి గ్లాసులు ఇవ్వాలి. 
8. రకరకాల వంటలు కంటే ఒక అన్నము ఒక పప్పు,ఒక కూర ,ఒక పచ్చడి , ఒక స్వీటు, ఒక హాటు , నెయ్యి, పెరుగులతో మితముగా సంతృప్తిగా సాత్విక ఆహారమును వడ్డించాలి. (అసంఖ్యాకమైన ఐటమ్స్ తో భోజనము చేయు వారిని సంఘర్షణకు గురి చేయరాదు).
9. తాంబూలం తప్పకుండా ఇవ్వాలి. 
10. పెళ్లికి వచ్చిన ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించాలి అది చాలా ముఖ్యం
11.  వీడ్కోలు బహుమతిగా రామాయణము/ మహాభాగవతము లేక సీతారాముల చిత్రపటం వంటివి ఇవ్వాలి . చిన్నపిల్లలకు పంచరంగుల బాలల బొమ్మల రామాయణము /భారతము /భాగవతము /భగవద్గీత వంటి పుస్తకాలు బహుమతిగా ఇవ్వాలి.
12.  ఈ విధముగా హిందూ సంప్రదాయకంగా వివాహాలు జరుపుకుందామని అందరమూ మనసా,వాచా, కర్మణా కోరుకుందాం!
13.  ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పైచేయి కాకుండా వధూవరులు పురోహితుని యొక్క మాటలపైనే లక్ష్యము పెట్టి వివాహ క్రతువును అద్భుతంగా నిర్వర్తించి తమ నూరేళ్ల జీవితానికి చక్కని బాట వేసుకోవాలి .
14.  చిప్పలుచేత పట్టుకొని ఆహార పదార్థాలపైకి ఆబగా ఎగబడి తినే బిక్షకులు లేదా జైలుఖైదీల వలె కాక బఫే పద్ధతిని పూర్తిగా వదిలేసి ,సలక్షణంగా వరుసలలోకూర్చుని అన్నాన్ని పరబ్రహ్మస్వరూపముగా నమ్మి వైష్వానరుణ్ణి తలంచి భుజించే పద్ధతిని అవలంబిద్దాం.! సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేద్దాం!!
భవదీయ కరణం శ్రీపాదరావు నాచారం.9440419743.
విశ్వహిందూ పరిషత్తు, సత్సంగ ప్రముఖులు, కోస్గి ప్రఖండ, పాలమూరు/ నారాయణపేట జిల్లా.

No comments:

Post a Comment