Tuesday, April 14, 2026

ఒక్క తప్పు... జీవితం నాశనం || సంజయ్ దత్ జీవితంలో దారుణాలు || The Untold Dark Truth of Sanjay Dutt

ఒక్క తప్పు... జీవితం నాశనం || సంజయ్ దత్ జీవితంలో దారుణాలు || The Untold Dark Truth of Sanjay Dutt

Author Name:Telugu Knowledge Unfiltered

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguKnowledgeUnfiltered

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CXP5KTZQCGw



Transcript:
(00:00) సంజయ్ దత్ మొత్తం ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఇంత పెద్ద కాంట్రవర్షియల్ యాక్టర్ మరొకరు ఉండరేమో. సంజయ్ దత్ పేరు వెనుకొన్న వివాస్ పద చరిత్ర అంత ఇంత కాదు. బొమ్మలతో ఆడుకునే వయసులో రివాల్వర్ తో ఒక వ్యక్తిని షూట్ చేశాడు. చిన్నప్పటి నుంచే సంజయ్ దత్ ప్రవర్తన ఎక్స్ట్రీమ్ గా ఉండేది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ ని గమనిస్తే వెల్తీ ఫ్యామిలీ, రిచ్ ఫాదర్, లావిష్ లైఫ్ కానీ హీరో మాత్రం యాంగర్ ఇష్యూస్, ఆల్కహాల్ ఎడిక్ట్ లేదా డ్రగ్ ఎడిక్ట్ అయి ఉంటాడు.
(00:26) సందీప్ రెడ్డి వంగారు రాసిన హీరో క్యారెక్టర్స్ కి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటాడో తెలియదు కానీ సంజయ్ దత్ లైఫ్ స్టోరీని గమనిస్తే మాత్రం బహుశా ఆ హీరో క్యారెక్టర్స్ కి సంజయ్ దత్ ఇన్స్పిరేషన్ ఏమో అన్నట్లుగా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ని చూసినట్లు అనిపించింది.
(00:44) సంజయ్ దత్త స్టోరీలో కూడా సినిమా రేంజ్ ట్విస్ట్లు చాలానే ఉన్నాయి. స్కూల్ ఏజ్ లోనే సిగరెట్లు తాగడం, హాస్టల్ కి పంపిస్తే అక్కడ ఏకంగా మధ్యానికి బానిస అవ్వడం డ్రగ్స్ ఇల్లీగల్ వెపన్స్ మాఫియాతో సంబంధాలు ఇల్లీగల్ అఫైర్స్ ఇలా సంజయ్ దత్త జీవితంలో అతని చుట్టుముట్టన వివాదమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సంజయ్ దత్త జీవితంలో ఉన్నన్ని ఎత్తు పల్లాలు మరొకరి జీవితంలో ఉండుండవు.
(01:05) సరిగ్గా మూడు నాలుగేళ్ళ జీవితం సాఫీగా సాగిందంటే ఏదో ఒక భారి సంక్షోభం సంజయ్ దత్త జీవితాన్ని కెరీర్ ని నాశనం చేస్తుందని భావించాల్సిందే. డి గ్యాంగ్ తో సంజయ్ దత్తకు ఉన్న సంబంధాలు సంజయ్ జీవితాన్ని జైలుపాల్ చేశాయి. 1993 ముంబై పేలులో వెనక సంజయ్ దత్ పాత్ర ఉందని సిబిఐ చేసిన ఆరోపణలో సంజయ్ దత్త తో పాటు తండ్రి సునీల్ దత్త రాజకీయ జీవితాన్ని కూడా డామేజ్ చేశయి.
(01:28) సంజయ్ దత్తని అక్రమ ఆయుధాల కేసు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలో 1993 నుంచి 2017 వరకు దాదాపు 24 సంవత్సరాల పాటు వెంటాడాయి. దాదాపు ఐదేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. అలా సంజయ్ కెరీర్ లో పైకి వెళ్ళడం మళ్ళీ పాతాళానికి పడిపోవడం ఇలా అనేక ఎత్తు పలాలతో సంజయ్ దత్త కెరీర్ ముందుకు సాగింది. ఇక సంజయ్ పనిైపోయింది అనుకున్న ప్రతిసారి గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చేవాడు.
(01:50) ఇక సంజయ్ దత్ అఫైర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో సంజయ్ దత్త జీవితం యొక్క పూర్తి చరిత్రను స్పష్టంగా తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు సంజయ్ దత్ కథ ఏంటి? సంజయ్ దత్త జీవితంలో వ్యసనాలు ఏ స్థాయిలో ఉండేవి? సినిమాల్లోకి ఎలా వచ్చాడు పడుతూ లేస్తూ సాగిన సంజయ్ కెరీర్ ని డ్రగ్స్ ఎలా పాడు చేశయి సంజయ్ దత్త తో డీ గ్యాంగ్ కి ఉన్న సంబంధాలు ఏంటి ఉగ్రవాదులతో సంబంధాలు ఉండేవా 1993 ఢిల్లీ పేలుల కుట్రలో సంజయ్ నిందితుడా తాడా కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుఏంటి సంజయ్ దత్త ఆఖరికి ఎలా మారాడు? ఇలా సంజయ్ దత్త జీవితానికి సంబంధించిన
(02:22) ప్రతి ఆసక్తికరమైన విషయాన్ని ఏది మిస్ కాకుండా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఎంతో ఆసక్తికర సమాచారం కలిగిన ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకుొక ప్రశ్న బాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు నచ్చిన యాక్టర్ ఎవరో తప్పకుండా వారి పేరుని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు.
(02:42) సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సంజయ్ దత్ 1959 జులై 29న జన్మించాడు. వీరి తండ్రి పేరు సునీల్ దత్ తల్లి పేరు నర్గిస్ తండ్రి హిందూ కాగా తల్లి మాత్రం ముస్లిం కుటుంబానికి చెందినవారు సంజయ్ తల్లి నర్గిస్ ఇస్లామిక్ కుటుంబం నుంచి వచ్చిన మహిళ కావడంతో సంజయ్ మీద కూడా ఇస్లామిక్ రిలీజియన్ ప్రభావం ఉండేది. ఇక సంజయ్ తండ్రి సునీల్ దత్ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా యాక్టర్ గా ఇలా హిందీ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
(03:18) ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ గా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక తల్లి నర్గీస్ కి కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. యాక్టింగ్ మ్యూజిక్ ఇలా పలు రంగాల్లో నర్గీస్ కి గుర్తింపు ఉండేది. కాబట్టి సంజయ్ దత్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పాలి. ఇక తన తండ్రి అంత పెద్ద స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయినప్పుడు సంజయ్ బాల్యం ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు.
(03:38) సంజయ్ చిన్నతనంలో విపరీతంగా అలర చేసేవాడు. నిరంతరం చుట్టూ పనివాళ్ళు ఉన్నత కుటుంబం కావడంతో చాలా లావిష్ గా గారాభంగా పెరిగాడు. అతని గారాభవం ఎంతలా మితిమీరిందంటే ఒకరోజు తన తండ్రి వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ ని తీసుకొని పని మనిషిని షూట్ చేశాడు. అదృష్టం బాగుంది కాబట్టి ఆ పని మనిషి తీవ్రంగా గాయపడ్డ ప్రాణాలతో బయటపడింది. ఆ సంఘటన తర్వాత కూడా సంజయ్ తల్లిదండ్రులు పెద్దగా సంజయ్ ప్రవర్తన మీద దృష్టి పెట్టలేదు.
(04:03) తన తండ్రి సినిమా డైరెక్షన్ ప్రొడక్షన్ యాక్టింగ్స్ లో ఇలా బిజీ బిజీగా ఉండేవాడు. తల్లి కూడా యాక్టర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీ గానే ఉండేది. దాంతో సంజయ్ మీద తల్లిదండ్రుల పరివేక్షణ కాస్త తక్కువగా ఉండేది. దాంతో 10 ఏళ్ల వయసుకే సంజయ్ దత్ సిగరెట్లు తాగడం నేర్చుకున్నాడు. అలా తన ఇంట్లో లాన్లో చెట్ల మధ్య సిగరెట్లు తాగుతూ తన తండ్రికి దొరికాడు.
(04:23) దాంతో సంజయ్ ని సునీల్ దత్ హిమాచల్ ప్రదేశ్ లోని సెనావర్లో ఒక బోర్డింగ్ స్కూల్ లో జాయిన్ చేశడు. అక్కడ కూడా సంజయ్ ప్రవర్తన మారింది లేదు. అక్కడ ఏకంగా ఆల్కహాల్, దేశీ దారు లాంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఇక 1977 లో స్కూలింగ్ పూర్తి చేసుకొని ముంబైలోని ఎల్ఫోన్ స్టోన్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఆ కాలేజీలో కూడా ముంబైలో బడాబాబుల పిల్లలే ఉండేవారు.
(04:44) అప్పటికే వ్యసనపరుడైన సంజయ్ ఇక ముంబై వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయాడు. వయసులో పెద్దోడయ్యాడు. చుట్టూ బడాబాబుల పిల్లలు ఉండడంతో ఇక సంజయ్ అని ఎవరు మాత్రం ఆపగలరు. దాంతో ముంబైలో డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. గాంజా, కోకెన్, హెరయిన్ ఇలా ఇండియాలో లభించే ప్రతి ఒక్క మత్తు పదార్థాన్ని సంజయ్ అలవాటు చేసుకున్నాడు. చివరికి సంజయ్ దత్త అలవాట్ల గురించి తల్లిదండ్రుల కూడా తెలిసిపోయింది.
(05:04) కానీ అప్పటికే అతను బాగా బానిసగా మారిపోయాడు. రాత్రులు నైట్ క్లబ్బుల్లో ఎంజాయ్ చేయడం పగలంతా తన గదిలో ఒంటరిగా గడపడం ఇలా చేసేవాడు. ఇవన్నీ గమనించిన తల్లిదండ్రులు సంజయ్ ని సినిమా యాక్టర్ ని చేస్తే ఇవన్నీ మానేస్తాడని భావించారు. అప్పట్లో సంజయ్ ని సినిమా యాక్టర్ చేయడం సునీల్ దత్ కి పెద్ద విషయం కాదు.
(05:22) ఎందుకంటే ఆయనే స్వయంగా డైరెక్టర్ గం ప్రొడ్యూసర్ కాబట్టి దాంతో 1979 లో సంజయ్ దత్ ని హీరోగా లాంచ్ చేసేందుకు సునీల్ దత్త అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కోటి రూపాయల బడ్జెట్ తో సునీల్ దత్త డైరెక్షన్ లోనే రాకీ సినిమాను ప్లాన్ చేశాడు. రాకీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సంజయ్ తన వ్యసనాలని పక్కన పెట్టలేకపోయాడు. అయినా సునీల్ దత్ ఆ సినిమా డైరెక్టర్ కాబట్టి సంజయ్ మీద పూర్తి నిఘా పెట్టి సినిమా షూటింగ్ పూర్తి చేశాడు.
(05:46) సినిమా షూటింగ్ సమయంలో సంజయ్ తల్లి నర్గిస్ కి క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం ఆమెను అమెరికా తీసుకెళ్ళారు. ఆ సమయంలో కూడా సంజయ్ తన షూలో డ్రగ్స్ దాచుకొని అమెరికా వెళ్ళాడు. ఒకవైపు నర్గీస్ క్యాన్సర్ తో బాధపడుతున్న సమయంలోనే మరోవైపు సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. తన కొడుకుని సినిమా హీరోగా చూడాలని నర్గిస్ ఎంతగానో కోరుకున్నారు. ఆమె కోసం సినిమా రిలీజ్ ని కొంతకాలం వాయిద కూడా వేశారు.
(06:08) కానీ సినిమా రిలీజ్ కి ఐదు రోజుల ముందే సంజయ తల్లి నర్గీస్ మరణించారు. తల్లి మరణం సంజయ్ను మరింత కొంగదీసింది. పైగా మొదటి సినిమా అనుకున్న ఫలితం ఇవ్వలేకపోయింది. దాంతో సంజయ్ వ్యసనాలకు మరింత దగ్గరయ్యాడు. అయితే మొదటి సినిమా ప్లాఫ్ అయినా కూడా సంజయ్ కి సినిమా అవకాశాలు వచ్చాయి. విధాత మరియు మై ఆవరహు లాంటి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలు కాస్త పర్వాలేదు అనిపించాయి.
(06:29) మై ఆవరహు షూటింగ్ సమయంలో సంజయ్ విపరీతంగా తాగి సెట్లోనే స్పృహ లేకుండా పడిపోయాడని మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పట్లో మీడియా అంటే కేవలం ప్రింట్ మీడియా మాత్రమే. మీడియాలో వస్తున్న కథనాలను చూసి సునీల్ దత్ కి సంజయ్ దత్ మీద కోపం పెరిగిపోయింది. సంజయ్ని సినిమాల్లోకి తీసుకొచ్చిందే అతని ప్రవర్తనలో మార్పు వస్తుందని.
(06:49) కానీ ఇండస్ట్రీలో కూడా ఇదే తరహ ప్రవర్తనాన్ని కొనసాగుతుండడం చూసి సునీల్ దత్త సహించలేకపోయాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో సునీల్ దత్త కి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా యాక్టర్ గా స్పెషల్ రెపుటేషన్ ఉంది. కాబట్టి తండ్రికున్న పేరుని కొడుకు చెడగొడుతుంటే అతను మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటాడు సంజయ్ ప్రవర్తన గురించి సునీల్ దత్త స్వయంగా ప్రొడ్యూసర్లకు చెప్పాడు.
(07:07) దాంతో సంజయ్ కి ఒకటి రెండు అవకాశాలు దూరమయ్యాయి. దాంతో తండ్రి కొడుకులకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో సంజయ్ మత్తు పదార్థాల వల్ల మెంటల్ గా కూడా ఇబ్బందులు ఎదుర్కున్నాడు. సంజయ్ని వ్యసనాల నుంచి దూరం చేసేందుకు సునీల్ దత్ రిహాబిలిటేషన్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించాడు. ఆ సమయంలో సంజయ్ టీనాతో ప్రేమలో పడ్డాడు. టీనా సహాయంతో సంజయ్ ని సునీల్ దత్తు జర్మనీకి తీసుకెళ్లి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేయించాడు.
(07:32) కానీ టీనా రాజేష్ కన్నా ప్రేమను యాక్సెప్ట్ చేసింది. అసలే డ్రగ్స్ క్రెడిట్ అయిన సంజయ్ 1982 లో హార్ట్ బ్రేక్ ని కూడా ఎదుర్కొన్నాడు. దాంతో సంజయ్ విపరీతమైన యంజైటీ డిప్రెషన్ ఫేస్ చేశాడు. ఒకరోజు తన మానసిక సంఘర్షణను భరించలేక తన వద్ద ఉన్న రివాల్వర్ తో కిటికీ నుంచి కాలుపులు జరిపాడు. సంజయ్ ఇంటి నుంచి వచ్చిన కాలుపుల శబ్దం ఆ ప్రాంతం అంతా వినిపించింది.
(07:52) ఆ విషయం పోలీసుల వరకు వెళ్ళడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంజయ్ ఆ రాత్రికి పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నాడు. కానీ ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. తన వెపన్ ని క్లీన్ చేస్తున్నప్పుడు యక్సిడెంటల్ గా ఫైర్ అయిందని చెప్పిన నిర్లక్ష్యంగా రివాల్వర్ ని ఆపరేట్ చేసినందుకు సంజయ్ మీద కేస అయింది.
(08:11) ఈ కేసు చిన్నదే కావచ్చు కానీ సంజయ్ ప్రవర్తన ఈ కేసు వల్ల న్యూస్ హెడ్లైన్ గా మారిపోయింది. ఈ సంఘటన తర్వాత సంజయ్ కూడా ఆలోచనలో పడ్డాడు. తనను తాను మార్చుకోవాలి అనుకున్నాడు. ఇక వెంటనే అమెరికాలో ఉంటున్న తండ్రి వద్దకు వెళ్ళాడు. అక్కడ సునీల్ దత్ సంజయ్ కి మరలా డిటాక్స్ ట్రీట్మెంట్ చేయించాడు. ఆ తర్వాత నెల రోజుల పాటు అమెరికాలోనే ఒక రిహాబ్ సెంటర్ లో ఉంచి చికిత్స చేయించాడు.
(08:31) అలా మొత్తానికి సంజయ్లో కాస్త మార్పు కనిపించింది. ఆ తర్వాత సంజయ్ డ్రగ్స్ కి దూరమయ్యాడు. కానీ ఆల్కహాల్ ని మాత్రం వదులుకోలేకపోయాడు. రిహాబ్ సెంటర్ నుంచి ఇండియాక వచ్చి విపరీతంగా ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం తెలిసి సునీల్ దత్ అమెరికా నుంచి ఇండియా వచ్చి సంజయ్కి కౌన్సిలింగ్ ఇచ్చాడు. తన తల్లి నర్గీస్ ని గుర్తు చేస్తూ ఆమె ఉండి ఉంటే సంజయ్ చూసి ఎంతలా బాధపడేది అనే విషయాన్ని గుర్తుచేసి మొత్తానికి సంజయ్ మనసు మార్చాడు.
(08:57) కానీ చేతిలో చేసేందుకు సినిమాలు లేవు. అప్పటికే ఆఖరి సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది. గన్ ఫైరింగ్ కేసు వల్ల డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ సంజయ్కి అవకాశం ఇచ్చేందుకు వెనకాడారు. అలా దాదాపు ఎనిమిది నెలల పాటు సంజయ్ సినిమా ఆఫీస చుట్టూ తిరిగాడు. ఆఖరికి పప్పు వర్మ అనే ప్రొడ్యూసర్ 1984 లో జాన్కి బాజీ అనే సినిమా ఆఫర్ ఇవ్వడంతో సంజయ్ కి కాస్త ఊరట లభించింది.
(09:20) ఆ సినిమా రిజల్ట్ కూడా అనుకున్నట్టే రావడం సినిమా సూపర్ హిట్ కావడంతో సంజయ్ దత్ కెరీర్ కి టర్న్ లభించింది. ఈ సినిమా తర్వాత కుమార్ గౌరవతో నామని మల్టీ స్టార్ చేసే అవకాశం ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ లో సంజయ్ దత్ దిశ తిరిగింది. డ్రగ్స్, హార్ట్ బ్రేక్స్, పోలీస్ కేసెస్, పర్సనల్ ఇష్యూస్, బ్యాడ్ బాయ్ ఇమేజ్ వీటన్నిటిని దాటుకొని చివరికి సంజయ్ సినిమాల్లో ఎదగడం మొదలైంది.
(09:45) ఇంతలో 1985 లో సంజయ్ కి రిచా శర్మ పరిచయం అయింది. ఈ పరిచయం ప్రేమగా మారి 1987 లో సంజయ్ రిచా శర్మను వివాహం చేసుకున్నాడు. సంజయ్ ని పెళ్లి చేసుకోవడం కోసం రిచా శర్మ యాక్టింగ్ కెరీర్ ని కూడా వదులుకుంది. ఇక 1988లో సంజయ్ రిచా శర్మలకి త్రిశాల దత్ జన్మించింది. అయితే వీరికి త్రిశాల జన్మించిన కొన్ని నెలల్లోనే రిచా శర్మకు తీవ్రమైన తలనొప్పి స్టార్ట్ అయింది.
(10:06) ఆ తలనొప్పికి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్తే రిచా బ్రెయిన్ లో ట్యూమర్ ఉందని తేలింది. అది క్యాన్సర్ ట్యూమర్ కావడంతో సంజయ్ కుటుంబం మళ్ళీ ఇబ్బందుల్లో పడింది. రిచాను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్ళారు. కొన్ని రోజులు సంజయ్ అమెరికాలో ఉన్న సినిమా కమిట్మెంట్ల వల్ల ఎక్కువ కాలం రిచాతో ఉండలేకపోయాడు. సంజయ్ కుటుంబం ఆమె కండగా ఉన్న సంజయ్ అడప దడప అమెరికా వెళ్తూ వస్తూ ఉండేవాడు.
(10:30) అలా 1988 1989 ఈ రెండు సంవత్సరాల పాటు సంజయ్ మళ్ళీ వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్ లోకి అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి వారు ఎంట్రీ ఇచ్చారు. దాంతో బాలీవుడ్ లో సంజయ్ కి కాంపిటీషన్ పెరిగిపోయింది. మరోవైపు సినిమాలో పెద్దగా అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదు. భార్య క్యాన్సర్ తో ఇబ్బంది పడుతుంది.
(10:48) ఇలా సంజయ్ జీవితాన్ని మరోసారి సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో సంజయ్ ప్రవర్తన మరోసారి గాడి తప్పింది. పార్టీలు అమ్మాయిలు ఇలా మళ్ళీ వ్యసనాలు అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ లోకి సంజయ్ ఎంటర్ అయ్యాడు. అమృత సింగ్ ఏక్త లాంటి యాక్టర్స్ తో అఫైర్స్ స్టార్ట్ చేశాడు. సంజయ్ మాధురి దీక్షిత్ వీరిద్దరూ తానేదార్ సాజన్ కల్నాయక్ ఇలా వరస సినిమాలో నటించడంతో సంజయ్ మాధురి దీక్షిత్తుల మధ్య రిలేషన్ ఏర్పడింది.
(11:14) మాధురి దీక్షిత్ తో సంజయ్ దత్ కు ఉన్న సంబంధం మీడియాలో విపరీతంగా సర్క్ులేట్ అయింది. సాజన్ సినిమా సూపర్ హిట్ కావడంతో సంజయ్ దత్త కెరీర్ మరోసారి ట్రాక్ లోకి వచ్చింది. ఆ సినిమాలోని సంజయ్ దత్త లాంగ్ హెయిర్ స్టైల్ అప్పట్లో చాలా పెద్ద ట్రెండ్ సెటర్ అని చెప్పాలి. సంజయ్ దత్ మాధురి దీక్షితుల వ్యవహారం అమెరికాలో ఉన్న రిచాకు తెలియడంతో 1992 లో ఆమె ముంబై వచ్చింది.
(11:34) కానీ సంజయ్ ఆమెను సరిగ్గా రిసీవ్ కూడా చేసుకోలేదు. సంజయ్ ప్రవర్తనంలో మార్పు గమనించిన రిచా మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది. ఇక 1993 లో రిచా సంజయ్కి డైవర్స్ నోట్ పంపించింది. 1993వ సంవత్సరం అనేది సంజయ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంవత్సరం. ఇక్కడి నుంచే సంజయ్ జీవితంలో అసలైన డ్రామా మొదలవుతుంది. 1993 లో ముంబై పోలీసులు సంజయ్ని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు.
(11:57) కాబట్టి అసలు ఏం జరిగింది సంజయ్ దత్త కి ఉగ్రవాదులతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఎందుకని పోలీసులు సంజయ్ దత్ మీద ఇంత భారీ ఆరోపణల మోపారు అనే విషయాల్ని ఇక్కడి నుంచే చూద్దాం. కాస్త శ్రద్ధగా వినండి. సంజయ్ తండ్రి సునీల్ దత్ గురించి ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించాలి. సునీల్ దత్ 1980 లో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాడు.
(12:16) ఆ తర్వాత ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ గా కూడా ఎన్నికయ్యాడు. ఇక 1992 లో బాబ్రీ మసీద్ కూల్చివేత దేశ రాజకీయాలని మలుపు తిప్పిన అంశం. అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత దేశంలో ఉన్న కొందరు మత చాందస్త్వాదులకి అవకాశంగా మారింది. ముఖ్యంగా బాబ్రీ మసీద్ కూల్చివేత శత్రు దేశం పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులని ఉగ్రవాదులని సైతం భారతదేశంలో కుట్రల పనిల చేసింది.
(12:42) ఆ క్రమంలో ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ద్వారా ఉగ్రవాదుల కుట్రల పన్ని 1993 మార్చ్ 12న ముంబైలో వరస బాంబు పేలులకు పథకం రచించి అమలు చేశారు. ఒకే రోజు కొన్ని నిమిషాల వ్యవధిలోనే 12 వరస పేలులు చోడ్ చేసుకోవడం ఆ పేలులలో 257 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది అప్పట్లో దేశ చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రవాద దాడి ఈ ఉగ్రకుట్రను చేదించేందుకు ముంబై పోలీసులు రంగంలోకి దిగారు.
(13:05) డి గ్యాంగ్ ఈ పేలులకి సహాయం చేసిందని పోలీసులకు ఆధారాలు లభించాయి. దావూద్ ఇబ్రహీం తమ్ముడు అనీస్ ఇబ్రహీం ఈ పేలులలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకటిగా తేలింది. అనీస్ ఇబ్రహీం బాలీవుడ్ లో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని పేలులకు పాల్పడినట్టు తెలింది. దాంతో అనీస్ ఇబ్రహీం తో సంబంధాలు ఉన్న బాలీవుడ్ ఫిలిం ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో అనగా సలీం హింగోరా హనీఫ్ కదవాల ఇబ్రహీం ముసా చౌహాన్ ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు.
(13:31) పోలీసుల విచారణలో ఇబ్రహీం ముసా చౌహాన్ కొన్ని కీలక విషయాలు చెప్పాడు. సంజు బాబా ఇంట్లో కొన్ని గిటార్లను టెన్నిస్ బాల్స్ ను ఉంచాలని అనీస్ ఇబ్రహీం నాకు అబూ సలీం కి చెప్పాడనే సమాచారాన్ని పోలీసులకు చెప్పాడు. ఇక్కడ గిటార్ అంటే ఏకే 56 రైఫిల్ అని టెన్నిస్ బాల్స్ అంటే హ్యాండ్ గ్రానైట్స్ అని అర్థం. సంజు బాబా అంటే సంజయ్ దత్ అని అర్థం.
(13:51) అప్పట్లో సంజయ్ దత్త ని సంజు బాబా అని పిలిచేవారు. మనం ఆల్రెడీ ఇప్పటి వరకు సంజయ్ దత్ కెరీర్ గురించి తెలుసుకున్నాం. తన కెరీర్ అంతా డ్రగ్స్ అఫైర్స్ వెపన్స్ కేసెస్ ఇలా బ్యాడ్ బాయ్ ఇమేజ్ తో నిండిపోయింది. కాబట్టి సంజయ్ దత్ కి డి గ్యాంగ్ తో సంబంధాలు ఉండటం అనేది పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. అయితే పోలీసులు ముంబై పెల్లల వ్యవహారంలో సంజయ్ దత్ పేరుని గుర్తించిన సమయంలో సంజయ్ దత్ మారిషస్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
(14:15) ఇంతలో ఈ విషయం గురించి మీడియాలో కథనాలు రావడం మొదలైంది. అప్పటికే సంజయ్ దత్త తండ్రి సునీల్ దత్త ఎంపీ గా ఉన్నాడు. కాబట్టి సినిమా పరంగా పొలిటికల్ గా రెండు విధాలుగా ఈ విషయం సెన్సేషన్ గా మారిపోతుంది. అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ కి సంజయ్ దత్త ఫోన్ చేసి తన మీద ప్రసారం అవుతున్న వార్తల గురించి మాట్లాడాడు. అయితే సంజయ్ దత్ అప్పటికే విదేశాల్లో ఉన్నాడు కాబట్టి సంజయ్ పేరును ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు.
(14:36) పైగా ఎంపి సునీల్ దత్ ఈ వ్యవహారాన్ని మలుపు తిప్పేలా ఉన్నాడు కాబట్టి సంజయ్ దత్త తో పోలీసులు చాలా సాఫ్ట్ గా వ్యవహరించారు. ఆ సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్ పవార్ ఉండేవారు. శరత్ పవార్ సునీల్ దత్ వీరిద్దరికీ పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండేవే. కాబట్టి సంజయ్ దత్ విషయంలో పోలీసులు ఆచి తూచి వ్యవహరించారు. సంజయ్ పేరుని పోలీసులు ఎక్కడ బహిరంగంగా కన్ఫర్మ్ చేయకుండా సంజయ్ ఇండియా వచ్చే వరకు జాగ్రత్తపడ్డారు.
(15:02) ఇక 1993 ఏప్రిల్ 23 న సంజయ్ ఇండియా వచ్చాడు. ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన సంజయ్ కి ముంబై పోలీసులు అరెస్ట్ వారెంట్తో వెల్కమ్ చెప్పారు. సంజయ్ ఇండియా వచ్చేసరికి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సంజయ్ మీద తాడా చట్టం ప్రకారం కేస నమోదు చేశారు. తాడా అంటే టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని అర్థం.
(15:23) ఇలా సంజయ్ ని ముంబై పోలీసులు ఎయిర్పోర్ట్ లోని అరెస్ట్ చేసి విచారం మొదలు పెట్టారు. ముంబై దాడులు దేశాన్ని ఎంతలా కుదిపేసాయో అందరికీ తెలిసిందే. అలాంటి దాళ్లకు పాల్పడ్డ వ్యక్తులతో ఒక బాలీవుడ్ హీరో సంబంధాలు పెట్టుకుంటే ఇక మీడియా అటెన్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ దెబ్బతో సంజయ్ నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అయ్యాడు. సినిమా కెరీర్ కాస్త బాగానే సాగుతుంది అనుకుంటున్న సమయంలో సంజయ్ పరువు పూర్తిగా నాశనం అయిపోయింది.
(15:46) సంజయ్ను మీడియా ఒక దేశ ద్రోహగా చిత్రీకరించింది. మరోవైపు సంజయ్ తండ్రి సునీల్ దత్త పొలిటికల్ కెరీర్ మీద కూడా ఈ కేసు ప్రభావం మొదలైంది. ఇక సంజయ్ విచారణలో అన్ని విషయాలు ఒప్పుకున్నాడు. తన వద్ద మూడు లైసెన్స్డ్ రివాల్వర్స్ తో పాటు మరో రెండు రివాల్వర్లు ఉన్నట్టు అంగీకరించాడు. తాను అప్పుడప్పుడు తన ఫ్రెండ్ యోసఫ్ నల్లాతో వేటకు వెళ్తూ ఉంటానుని అంగీకరించాడు.
(16:05) ఇక సంజయ్ కి డి గ్యాంగ్ కి ఉన్న సంబంధాల గురించి కూడా సంజయ్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. 1991లో సంజయ్ దత్ ఒక సినిమా షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ సలీం హింగోరా హనీఫ్ కదవాల ద్వారా దావూద్ ఇబ్రహీం అతని తమ్ముడు అనీస్ ఇబ్రహిం ఇద్దరూ సంజయ్ దత్త నిను కలిశారు. హనీఫ్ కదవాలతో సంజయ్ దత్ సనం అనే సినిమా కూడా అంగీకరించాడు.
(16:26) ఆ సనం సినిమా షూటింగ్ సమయంలో సంజయ్ దత్ కి హనీఫ్ కదవాలకు మధ్య పరిచయం పెరిగింది. ఆ సమయంలో హనీఫ్ కదవాల వద్ద ఒక ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్ ఉన్నట్టు సంజయ్తో చెప్పాడు. ఆ సమయంలో సంజయ్ కి వెపన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ హనీఫ్ కదవాలకు అర్థమైంది. దాంతో 1993 లో హనీఫ్ కదవాల డి గ్యాంగ్ లో ఇంపార్టెంట్ మెంబర్ అయిన అబూ సలీం ని సంజయ్ వద్దకు తీసుకొని వచ్చాడు.
(16:48) అప్పట్లో బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో యాక్టర్లతో డి గ్యాంగ్ కి మంచి సంబంధాలు ఉండేవి. సినిమా ఫైనాన్సింగ్ ద్వారా డి గ్యాంగ్ ఇల్లీగల్ మనీని లీగల్ గా కన్వర్ట్ చేసుకునేవారు. అలా బాలీవుడ్ డి గ్యాంగ్ రెండిటి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. నిజానికి డి గ్యాంగ్ తో రాజకీయ నాయకులకి పోలీసులకు కూడా సంబంధాలు ఉండేవి. అందుకే డి గ్యాంగ్ ఆగణాలు దేశంలో బాంబు దాడులు చేసే వరకు శృతించాయి.
(17:08) అయితే సంజయ్ కి హనీ కదవాల ద్వారా అబూ సలీం తో పరిచయం ఏర్పడిన రెండో రోజే సంజయ్ ఇంటికి ఒక పార్సెల్ వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ లో మూడు ఏకే 56 రైఫిల్స్ తో పాటు 250 బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఆ పార్సెల్స్ ని గమనించిన సంజయ్ దత్తు ఒక్క రైఫిల్ మాత్రమే కావాలి. మిగిలినవి మీరే తీసుకెళ్ళండిని చెప్పాడు. కానీ ప్రస్తుతానికి నీ దగ్గర ఉంచు సమయం వచ్చినప్పుడు తీసుకెళ్తామ అని చెప్పారు.
(17:31) అదే పార్సెల్ వ్యాన్ లో కొన్ని హ్యాండ్ గ్రానైట్స్ కూడా సంజయ్ దత్ వద్దకు పంపించారు. అయితే ఆ హ్యాండ్ గ్రానైట్స్ ని సంజయ్ దత్ తీసుకోలేదు. కానీ మూడు ఏకే 56 రైఫిల్స్ ని మాత్రం తన వద్ద ఉంచుకున్నాడు. కానీ రెండు రోజుల తర్వాత సంజయ్ దత్ తన వద్ద ఉన్న మూడు ఏకే 56 రైఫిల్స్ నుంచి రెండిటిని తిరిగి అబూ సలీం కి ఇచ్చేసాడు. ఫైనల్ గా డి గ్యాంగ్ కి చెందిన అబు సలీం ద్వారా సంజయ్ దత్ కి ఒక ఏకే 56 రైఫిల్ సొంతమైంది.
(17:56) దాంతో పాటు కొన్ని రౌండ్ల బుల్లెట్లు కూడా సంజయ్ దత్ వద్ద ఉన్నాయి. ఆ తర్వాత డి గ్యాంగ్ కి చెందిన కయ్యం ద్వారా 9 mm పిస్టోల్ ని కొనుగోలు చేసినట్టు కూడా అంగీకరించాడు. అయితే సంజయ్ దత్ కి డి గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయనేది వాస్తవం. అలాగే డి గ్యాంగ్ ద్వారా ఇల్లీగల్ వెపన్స్ ని తన వద్ద ఉంచుకున్నాడు అనేది కూడా వాస్తవమే. కానీ 1993 ముంబై పేలులకు సంబంధించిన విషయాలతో సంజయ్ దత్ కి ఎలాంటి సంబంధం సమాచారం రెండు లేవు.
(18:19) అయితే ఈ పేలుల తర్వాత ముంబై పోలీసులు ప్రొడ్యూసర్లు సలీం హింగోరా హనీఫ్ కదవాల వీరిద్దరినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నడంతో సంజయ్ దత్ జాగ్రత్త పడటం మొదలు పెట్టాడు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న సంజయ్ దత్ తన ఫ్రెండ్ యోసఫ్ నల్వాలకు ఫోన్ చేసి తన వద్ద ఉన్న ఏకే 56 రైఫిల్ ని బుల్లెట్లను మిగతా ఇల్లీగల్ వెపన్స్ అన్నిటిని తీసుకెళ్లి వాటిని ద్వంసం చేయమని చెప్పాడు.
(18:41) దాంతో యోసఫ్ నల్వాల సంజయ్ ఇంటికి వెళ్లి అక్కడున్న వెపన్స్ అన్నిటిని కలెక్ట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేసేసాడు. మొత్తం ఆయుధాలు ధ్వంసం అయ్యాయని కన్ఫర్మ్ అయిన తర్వాతే సంజయ్ ముంబైకి వచ్చాడు. అయితే సంజయ్ దత్త తండ్రి సునీల్ దత్ ఒక ఎంపీ గా తన కొడుకు వల్ల తన పరువు ప్రతిష్ట మొత్తం కోల్పోయాడు. కాబట్టి సంజయ్ దత్త అరెస్ట్ కి పూర్తిగా సహకరించాడు.
(19:00) సంజయ్ ప్రయణిస్తున్న ఫ్లైట్ వివరాలని సునీల్ దత్ స్వయంగా పోలీసులకు ఇచ్చి ఎయిర్పోర్ట్ లోనే సంజయ్ని అరెస్ట్ చేసేల సహాయం చేశాడు. ఇక సంజయ్ జీవితం ఆ సంఘటనతో పూర్తిగా తలకిందులయింది. మాధురి దీక్షిత్ కి సంజయ్ కి ఉన్న సంబంధం పూర్తిగా దెబ్బతింది. సంజయ్ ని జైల్కి అండర్ ట్రైల్ ఖైదీగా జైలుకి పంపించారు. ఆ సమయంలో మాధురి దీక్షిత్ సంజయ్ కి బ్రేకప్ చెప్పింది.
(19:21) సంజయ్ ఇంట్లో పోలీసులు చేసిన సోదాల్లో ఎటువంటి ఆయుధాలు లభించలేదు. దాంతో పాటు సంజయ్ మీద ప్రయోగించిన తాడా చట్టానికి బలం చేకూరే ఆధారాలని ముంబై పోలీసులు అప్పటికీ సేకరించలేకపోయారు. దాంతో 1993 మే 5న సంజయ్కి ముంబై హైకోర్టు నుంచి ఇంట్రిమం బెల్ లభించింది. ఇక అనంతరం కొంతకాలం సంజయ్ సినిమాలకు దూరమైనా కూడా కేసు కన్నా ముందే కమిట్ అయిన సినిమాలు ఉండడంతో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాడు.
(19:44) గుమ్ర సాహిన్ సినిమాలు ఈ కేస్ తర్వాతే రిలీజ్ అయ్యాయి. అయినా కూడా సంజయ్ సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో హిట్ కావడంతో సంజయ్ కి మళ్ళీ లైఫ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతో మోడల్ రియా పిల్ల అయితో డేటింగ్ మొదలు పెట్టాడు. ఒకవైపు అక్రమాయుధాల కేసు తాళా కేసు కొనసాగుతూనే ఉంది. మరోవైపు భార్య రిచా శర్మ కూడా కూతురు త్రిశాల కస్టడీ కోసం కోర్టులో కేసు వేసింది.
(20:05) ఇలా రెండు వేరు వేరు కేసులు ఎదుర్కుంటూనే సినిమా కెరీర్ ని కొనసాగిస్తున్న సంజయ్ కి ముంబై హైకోర్టు ఇచ్చిన ఇంట్రిమ్ బెల్ రద్దు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే సంజయ్తో పాటు ఇతరులను కూడా విచారించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు అలాగే ముంబై పేలుల కేసులో ఆ అక్రమ ఆయుధాలు ఉపయోగించారని పోలీసులు ఆధారాలు సేకరించారు.
(20:25) మొత్తంగా సంజయ్ కి ముంబై పేలుల నిందితులతో ఉన్న సంబంధాలని పోలీసులు వాదించడం ద్వారా సంజయ్ బెయిల్ను రద్దు చేయించారు. దాంతో సంజయ్ని తానే సెంట్రల్ జైల్ కి తరలించారు. ఆ జైల్లో సంజయ్ విపరీతమైన ఒత్తిడిని ఒంటరతనాన్ని ఎదుర్కొన్నాడు. ఒంటరతనాన్ని భరించలేక తల గోడకు కొట్టుకొని తనను తాను గాయపరుచుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొడుకు కష్టం చూడలేక సునీల్ దత్ తన రాజకీయ పలుకుబడిను ఉపయోగించడం మొదలుపెట్టాడు.
(20:47) సంజయ్ విడుదలకు తీవ్రంగా అడ్డుపడిన వ్యక్తి శివసేన నాయకుడు బాల్ టాక్రే కారణం ఏంటంటే సునీల్ దత్ కాంగ్రెస్ నాయకుడు కావడం అతని భార్య నర్గీస్ ముస్లిం మహిళ కావడం పైగా ముంబై అల్లర్ల విషయంలో శివసేనకు వ్యతిరేకంగా సునీల్ దత్ ముస్లింలకు మద్దతు ఇవ్వడం లాంటివి చేశాడు. కాబట్టి సునీల్ దత్ కి బాల్ టాక్రేకు మధ్య పొలిటికల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి.
(21:08) దాంతో ఇక సంజయ్ దత్ కి మద్దతుగా బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రైమ్ మినిస్టర్ లెవెల్ లో లాబింగ్ చేశారు. అయినా పని కాలేదు. ఇక 1995 లో మహారాష్ట్రలో ప్రభుత్వం మారింది. శివసేన అధికారంలోకి వచ్చింది. ఇక సునీల్ దత్ కి మరో మార్గం లేదు. బాల్ టాక్రేతో రాజీ పడాల్సిన సమయం వచ్చింది. అలా మహారాష్ట్ర ప్రభుత్వం కాస్త సహాయం చేయడంతో సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.
(21:28) 15 నెలల పాటు జైల్లో గడిపిన తర్వాత సంజయ్ దత్ జైల్ నుంచి విడుదలయ్యాడు. జైల్ నుంచి విడుదలైన వెంటనే సంజయ్ దత్ తన ఇంటికి కూడా వెళ్ళకుండా బాల్ టాక్రే ఇంటికి వెళ్లి కలిశాడు. అయితే 1995 లో ఈ కేసు విచారణని ముంబై పోలీసుల నుంచి సిబిఐ హ్యాండ్ఓవర్ చేసుకుంది. దాంతో అప్పటి నుంచి సిబిఐ విచారణ మొదలుపెట్టింది. ఇక బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత సంజయ్కి సినిమా అవకాశాలు లేవు.
(21:51) పైగా 1996 లో భార్య రిచా శర్మ క్యాన్సర్ తో మరణించింది. కూతురు కస్టడీ విషయంలో ఇబ్బందులు పడ్డాడు. అలా 1998 వరకు సంజయ్ పెద్దగా లైమ్ లైట్ లోకి రాలేదు. ఇక 1998 లో సంజయ్ గార్ల్ ఫ్రెండ్ రియా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 1998 లో సంజయ్ కి సినిమా అవకాశాలు కూడా మొదలయ్యాయి. మహేష్ మంజురేకర్ డైరెక్షన్ లో వాస్తవం అనే సినిమా చేశాడు. ఈ సినిమా హిట్ కావడంతో పాటు సంజయ్ కి బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు ని కూడా తెచ్చిపెట్టింది.
(22:16) ఇంతలో కెరీర్ మళ్ళీ గాడిన పడుతుంది అనుకునే లోపే ముంబై పోలీసులు సంజయ్ దత్ కి డి గ్యాంగ్ తో ఉన్న సంబంధాలను బయట పెట్టారు. దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోట షకీల్ తో సంజయ్ దత్ మాట్లాడుతున్న ఫోన్ కాల్ రికార్డింగ్ ని ముంబై పోలీసులు రిలీజ్ చేశారు. ఆ రికార్డింగ్ లో చాలా క్లోజ్ గా సంజయ్ దత్ చోట షకీల్ మాట్లాడుకున్నారు. ఫ్యామిలీ మేటర్స్ పర్సనల్ మేటర్స్ నుంచి ఏకంగా సెక్సువల్ మేటర్స్ ని కూడా మాట్లాడుకున్నారు.
(22:40) ఆ రికార్డింగ్ వింటే సంజయ్ దత్ కి డి గ్యాంగ్ తో ఉన్న సంబంధాలు ఎంత బలమైనవి అనే విషయం అర్థమవుతుంది. ఇలా సంజయ్ దత్ మరోసారి వార్తలో నిలిచాడు. నిజానికి డి గ్యాంగ్ తో సంజయ్ కుకి ఉన్న సంబంధాలు అతని ప్రాణాల మీదకు కూడా వచ్చింది. అబూ సలీం సంజయ్ దత్ ను చంపేందుకు ప్లాన్ కూడా చేశాడు. నలుగురు షూటర్లు గోవాలో సంజయ్ ఉంటున్న హోటల్ ని రౌండ్ అప్ చేశారు.
(22:59) సంజయ్ ఈ విషయం తెలుసుకొని అబూ సలీం తో మాట్లాడి మేటర్ ని క్లోజ్ చేసుకున్నాడు. ఈ విషయం పెద్దగా బయటకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక సంజయ్ పాకిస్తాన్ బెల్లీ డాన్సర్ నాదియా దురానితో అఫైర్ మెయింటైన్ చేస్తూ దొరికిపోయాడు. దాంతో భార్య రియా పిలాయకి సంజయ్కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. రియా పిలాయ కూడా టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో రిలేషన్ స్టార్ట్ చేసింది.
(23:19) దాంతో సంజయ్ సెకండ్ మ్యారేజ్ కూడా విడాకుల వరకు వెళ్ళింది. ఇక 2003 లో వచ్చిన మున్నాబాయ్ ఎంబిబిఎస్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమానే మన తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ గా రీమేక్ చేసి రిలీజ్ చేశారు. ఇలా మున్నాబాయ్ ఎంబిబిఎస్ హిట్ తర్వాత సంజయ్ ఇమేజ్ మారిపోయింది. సంజయలో ఉన్న కామెడీ యాంగిల్ ని ఈ సినిమా పరిచయం చేసింది. సంజయ్ మీద ఉన్న పబ్లిక్ ఒపీనియన్ ని ఈ సినిమా మార్చేసిందని చెప్పాలి.
(23:40) ఇక ఇంతలో 2005లో సంజయ్కి మరో భారి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్ళు సంజయ్ చేస్తున్న తప్పులని సరిచేస్తూ ఒప్పులని కాపాడుతూ వస్తున్న తండ్రి సునీల్ దత్త 2005 మే 25న అకస్మాత్తుగా నిద్రలో మరణించారు. భార్య లేదు కడుపున పుట్టిన కూతురు తనతో లేదు తల్లిదండ్రులు మరణించారు. దాంతో సంజయ్ జీవితంలో మరోసారి చీకటి కమ్ముకుంది. ఇంతలో సంజయ్ జీవితంలోకి మాన్యత అనే ఒక మహిళ ఎంటర్ అయింది.
(24:05) సంజయ్ కెరీర్ ని ఫైనాన్స్ ని చూసుకునేందుకు మాన్యత సంజయ్ వద్ద ఒక సెక్రటరీగా ఉండేందుకు వచ్చింది. కానీ సంజయ్ ఏమితో కూడా డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంతలో 2006 లో రాజ్కుమార్ హిరాని మున్నాబాయ ఎంబిబిఎస్ కి సీక్వల్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా కూడా హిట్ అయింది. ఇంతలో సంజయ్ మీద నడుస్తున్న తాడ కేసు ఇన్వెస్టిగేషన్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది.
(24:24) ఈ కేసు విచారణ మొదలు పెట్టిన సిబిఐ కోర్ట్ సంజయ్ దత్తికి ముంబై పేలులకి సంబంధం ఉందని నిరూపించలేకపోయింది. కానీ సంజయ్ వద్ద అక్రమంగా ఆయుధాలు ఉన్నాయనే విషయం మాత్రం రుజువైంది. అయితే ఆయుధాలు ఉన్నంత మాత్రాన సంజయను ఉగ్రవాదిగా పరిగణించలేవని కోర్టు తీర్పు చెప్పింది. దాంతో తాడా చట్టం ప్రకారం నమోదైన కేసుని సిబిఐ కోర్టు కొట్టేసింది. కానీ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఆర్మ్స్ యక్ట్ ప్రకారం సిబిఐ కోర్ట్ సంజయ్ దోషిగా తేల్చింది.
(24:49) ఆయుధాలని కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే తన వద్ద ఉంచుకున్నానని సంజయ్ వాదన వినిపించాడు. కానీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం పిస్టల్స్ ని క్యారీ చేయడం ఒక రకంగా కోర్టు అంగీకరిస్తుంది. కానీ ఏకే 56 లాంటి అసాల్ట్ రైఫిల్స్ ని పెట్టుకొని, సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని వాదిస్తే, ఆ వాదన నిలబడదు. సంజయ్ పైగా ఆయుధాలను పోలీసులకు ఇవ్వకుండా ధ్వంసం చేయించాడు.
(25:08) కాబట్టి 2006 నవంబర్ 28న సంజయ్తో పాటు అతని ఫ్రెండ్ యోసఫ్ ని కూడా కోర్టు దోషిగా తేలుస్తూ ఆరేళ్ల కఠిన కారాగారి శిక్ష విధించింది. దాంతో సంజయ్ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక సిబిఐ కోర్టు ని సవాల్ చేస్తూ సంజయ్ సుప్రీం కోర్టుకి వెళ్ళాడు. 2007 నవంబర్ 27 న సుప్రీం కోర్ట్ సంజయ్కు బెయిల్ మంజూరు చేసింది. దాంతో సంజయ్ జైల్ నుంచి విడుదలయ్యాడు.
(25:29) ఇక జైల్ నుంచి వచ్చిన మూడు నెలల్లోనే సంజయ్ మాన్యతను మూడు వివాహం చేసుకున్నాడు. 2009 ఎన్నికలే టార్గెట్ గా సంజయ్ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశాడు. యూపీ కేంద్రంగా తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమాజవాదీ పార్టీ నుంచి రాజకీయాలు చేయడం మొదలు పెట్టాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సంజయ్ మోస్ట్ కాంట్రవర్షియల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అలాగే డి గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని ప్రపంచం మొత్తానికి తెలిసింది.
(25:53) ఇన్ని నిందలు తన మీద పెట్టుకొని కూడా రాజకీయల్లోకి వచ్చాడంటే సంజయ్ దత్త నమ్మకాన్ని ఏమనాలో మీరే చెప్పాలి. ఇక్కడ సంజయ్ దత్ కి లక్నో పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సమాజవాద్ పార్టీ నమ్మకాన్ని కూడా కొట్టిపారేలేం. ఇక 2009 పార్లమెంట్ ఎన్నికల్లో లక్నోలో సంజయ్ హడావిడి చేసిన కోర్టు కేసు వల్ల సంజయ్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయాడు.
(26:12) సిబిఐ కోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని అనుకున్నాడు. కానీ సిబిఐ కోర్టు తీర్పుని సుప్రీం కోర్ట్ కొట్టేయలేదు. అలాగే తీర్పు మీద స్టే కూడా విధించలేదు. కాబట్టి సిబిఐ కోర్టు తీర్పు సంజయ్ పొలిటికల్ కెరీర్ కి బ్రేక్ వేసింది. దాంతో సంజయ్ రాజకీయాలకు దూరమయ్యాడు. ఇక 2009 తర్వాత సంజయ్ బాలీవుడ్ లో బిజీ అయ్యాడు.
(26:33) అలా 2013 వరకు సంజయ్ సినిమాలకే పరిమితమయ్యాడు. కానీ 2013 మార్చ్ లో సంజయను వెంటాడుతున్న కేసులో సుప్రీం కోర్టు ఫైనల్ వెడ్డిక్ ని ఇచ్చింది. సిబిఐ కోర్ట్ ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు సమర్ధిస్తూ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్ను కోర్టు దోషిగా తెలిచింది. కానీ సుప్రీం కోర్టులో సంజయ్కు దొరికిన చిన్నపాటి ఊరట ఏంటంటే సంజయ్కు సిబిఐ కోర్టు ఆరేళ్ల శిక్ష విధిస్తే సుప్రీం కోర్టు ఆ శిక్షను ఐదేళ్లకు తగ్గించింది.
(26:58) దాంతో 2013 మేలో సంజయ్ మరోసారి అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ తీర్పు కన్నా ముందే సంజయ్ 18 నెలలు జైల్లో ఉన్నందుకు మరో మూడున్నర ఏళ్ల పాటు మాత్రమే సంజయ్ జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ మూడున్నర ఏళ్ల పాటు పూణేలోని ఎర్రవాడ సెంట్రల్ జైల్లో సంజయ్ జైలు శిక్ష అనుభవించాడు. జైల్లో సంజయ్ దత్త ప్రవర్తన చాలా మారిపోయింది. జైలు అధికారులు నడిపే రేడియోకి సంజయ్ దత్ రేడియో జాకీగా వ్యవహరించేవాడు.
(27:21) అలా మొత్తానికి సంజయ్ సత్ప్రవర్తన కారణంగా జైలు సెక్షన్ రెండు నెలలు తగ్గించారు. ఇక 2016 ఫిబ్రవరి 25న సంజయ్ జైల్ నుంచి విడుదలయ్యాడు. సంజయ్ జైల్ నుంచి విడుదలైన సమయంలో సంజయ్ ఒక సరికొత్త వ్యక్తిత్వంతో జైల్ నుంచి బయటికి వచ్చినట్టు కనిపించింది. జైలు నుంచి బయటిక వస్తూ వెనక్కి తిరిగి జైలు మీద ఎగురుతున్న జాతీయ జెండాకు సెల్యూట్ చేసి నేలకు దండం పెట్టి బయటిక వచ్చాడు.
(27:42) ఇలా మొత్తంగా చూస్తే సంజయ్ జీవితంలో ఉన్నంత డ్రామా మరో నటుడి జీవితంలో ఉండుండదు. అందుకే సంజయ్ జీవితం ఆధారంగా 2017లో రాజ్కుమార్ హిరాని డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా సంజు అనే సినిమా మొదలైంది. 2018 లో రిలీజ్ అయిన ఆ సినిమాలో సంజయ్ దత్ కి 300 మహిళలతో ఎఫైర్ లో ఉన్నట్టు చూపించారు. సినిమా సంజు జీవితం మీద ఉన్న నెగిటివ్ పబ్లిక్ ఒపీనియన్ ని పూర్తిగా తొలగించేందుకు ఉపయోగపడింది. సినిమా సూపర్ హిట్ అయింది.
(28:06) ఇక సంజయ్ దత్ జీవితంలో కోర్టు కేసులు లేవు. అతని ప్రవర్తన కూడా పూర్తిగా మారింది. జీవితం సాఫీగా సాగుతుంది అనుకునేలోపే 2020 లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో సంజయ్ కరోనా సోకిందని భావించాడు. కానీ చెక్ చేస్తే సంజయ్కి స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అని తెలిసింది. సంజయ్ జీవించడం దాదాపు అసాధ్యం అని డాక్టర్లు కూడా తెలిచేశారు.
(28:25) సంజయ్ కూడా జీవితం మీద ఆశ వదులుకున్నాడు. చాలా కాలం పాటు చికిత్స తీసుకునేందుకు కూడా వెనకాడాడు. కానీ మళ్ళీ జీవితంతో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ట్రీట్మెంట్ కి ఓకే చెప్పాడు. సంజయ్ లంగ్స్ కి ఆర్టిఫిషియల్ గా పైపుని సెట్ చేసి గాలిని లోపలికి పంపించేసేవారు. మరోవైపు కీమోథెరపీ కూడా ఇవ్వడంతో మొత్తానికి సంజయ్ క్యాన్సర్ ని చేయించాడు.
(28:45) సంజయ్కి శ్రవంతి లిమి అనే డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చింది. శ్రవంతి లిమి సంజయ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతూ సంజయ్ దాత్తు ట్రీట్మెంట్ సమయంలో ఎంతో ధైర్యంగా ఉన్నాడని ట్రీట్మెంట్ తో పాటు వర్కవుట్స్ కూడా చేసేవాడని అతని ధైర్యం వల్లే క్యాన్సర్ నుంచి కోలుకున్నాడని శ్రవంతి లిమి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి సంజయ్ ఫైటింగ్ స్పిరిట్ మరోసారి హాట్ టాపిక్ అయింది.
(29:04) క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత వెంటనే సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ సినిమాలు చేస్తూనే 2022 లో కన్నడలో కేజిఎఫ్ లో అదిరాగా 2023 తమిళ్ సినిమా లియోలో ఆంటోనీ దాస్ గా 2024 తెలుగు డబల్ ఇస్మార్ట్ లో బిగ్ బుల్ గా ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 2025 ఆఖరిలో వచ్చిన దురందర్లో ఎస్పి చౌదరి అస్లం పాత్రతో సంజయ్ దత్త పేరు నేషనల్ వైడ్ గా మారుమోగింది.
(29:27) ఇక ప్రభాస్ మూవీ రాజాసాబ్ లో పేక మేడల కనకరాజుగా నటించారు. ఇలా ఇప్పుడు సంజయ్ దత్ బాలీవుడ్ యాక్టర్ మాత్రమే కాదు ప్ాన్ ఇండియా యాక్టర్ కూడా అలా మోస్ట్ కాంట్రవర్షియల్ యాక్టర్ సంజయ్ దత్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గా మారిపోయాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది సంజయ్ దత్ గురించిన పూర్తి విషయాలని మీకు చాలా స్పష్టంగా వివరించడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను.
(29:49) ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లైతే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటవెంటనే రాబోతున్నాయి. నెక్స్ట్ ఇంక ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ యాక్టర్ పేరుని కూడా కామెంట్స్ లో తెలపండి. థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఏ గుడ్ డే.

No comments:

Post a Comment