Freedom Was Born With Us — Jean Jacques Rousseau PhiloVi #mindset #trendingshorts #trend #viral #yt
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iTOgxicQRzQ
Transcript:
(00:07) ప్రపంచంలో పిచ్చివాడు ఒకడే పిచ్చివాడు కాదు ఎందుకంటే [సంగీతం] అతను తనకు నచ్చినట్టే బ్రతుకుతాడు. సమయానికి కాదు ఆకలి అయితేనే తింటాడు ఎవరికీ నచ్చాలని కాదు తనకు నచ్చినట్టే జీవిస్తాడు. స్వచ్ఛంగా స్వేచ్ఛగా [సంగీతం] బ్రతుకుతాడు. అలాగే చిన్న పిల్లవాడు కూడా తనకి నచ్చినట్టే ఆడుకుంటాడు. ఏ భయం లేదు ఏ బాధ్యత లేదు ఎవరేమనుకుంటారు అనే ఆలోచన లేదు [సంగీతం] కానీ పెరుగుతున్న కొద్ది మనమే మనల్ని మార్చుకుంటాం.
(00:32) సమాజం కోసం ఇతరుల కోసం చివరికి మనమే మనల్ని కోల్పోతున్నాం. అలా మనం మారిపోతున్న పిచ్చివాళ్ళం అందుకే జీన్ జాక్రూసో గొప్ప నిజం చెప్పాడు. సివిలైజేషన్ హస్ నాట్ మేడ్ మన్ బెటర్ ఇట్ హస్ మేడ్ హిమ స్లేవ్ అంటే నాగరికత మనిషిని అభివృద్ధి చేయలేదు. నాగరికత మనిషిని బానిసగా మార్చింది అందరూ అంటారు పాతకాలం మనుషులు తెలివి లేని వారని అడవిలో జీవించిన మనుషులు అనాగరికులని కానీ రూసో వేరేగా చూశాడు.
(00:55) అడవిలో ఉన్న మనిషికి పక్కవాడిని ఓడించాలని లేదు. అతనికి రేపటి గురించి భయం లేదు. అతను ప్రకృతితో జీవించాడు. [సంగీతం] ప్రకృతి ఇచ్చినదే తీసుకున్నాడు. అతను స్వేచ్ఛగా ఉన్నాడు. మనిషి స్వేచ్ఛగా పుట్టాడు. కానీ ప్రతి చోట గొలుసులతో బంధించబడ్డాడు. ఇది రూసో చెప్పిన అత్యంత శక్తివంతమైన మాట. ఈ మాట ఒక్కటే ఫ్రెంచ్ విప్లవానికి నిప్పు పెట్టింది.
(01:14) ఒకరోజు ఒక మనిషి ఒక భూమిని చుట్టూ కంచి వేశడు. ఆ మనిషి అన్నాడు ఇది నాది అందరూ నమ్మారు రూసో చెప్పాడు ఈ రోజు నుండే మనిషి నాశనం మొదలైంది. ఎందుకంటే [సంగీతం] ఇది నాది అనే మాటతో అసమానత మొదలైంది. ఇది నాది అనే మాటతో యుద్ధాలు మొదలయ్యాయి. ఇది నాది అనే మాటతో హింస [సంగీతం] మొదలైంది. భూమి ఎవరి సొంతము కాదు గాలి ఎవరి సొంతము కాదు నీరు ఎవరి సొంతము కాదు ఇవి అందరి హక్కు ఒక్కడి ఆస్తి కాదు అని రూసో చెప్పిన విప్లవాత్మక మాట.
(01:36) రూసో తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు పొందాడు. అతను తల్లిని పుట్టినప్పుడే పోగొట్టుకున్నాడు. అతన్ని తండ్రి వదిలేశాడు అతనికి సరైన చదువు లేదు అతన్ని పాఠశాలలో చేర్చుకోలేదు పండితులు చిన్నచూపు చూశారు. కానీ ఆ అనుభవమే అతనికి విద్య అంటే ఏమిటో నేర్పింది. రూసో అన్నాడు పిల్లవాడికి పుస్తకాలు చదివించడం విద్య కాదు నిజమైన విద్య జవాబులు చెప్పడం కాదు నిజమైన విద్య సరైన ప్రశ్నలు అడగడం పిల్లవాడు తన సొంత బుద్ధితో ఆలోచించే చదువే అసలైన చదువు అని రూసో వివరించాడు.
(02:01) రూసో సుఖంగా జీవించలేదు. అతను తన ఐదు పిల్లలను అనాధాశ్రమంలో వదిలేశాడు. ఈ నిజం అతనిలో జీవితాంతం తినేస్తూనే ఉంది. అతన్ని అందరూ పిచ్చివాడు అన్నారు. తన స్నేహితులే ద్రోహం చేశారు. అతన్ని ఒక దేశంలో నుండి మరొక దేశానికి తరిమేశారు. అతను ఒంటరిగా అడవిలో నడిచేవాడు. రూసో అన్నాడు నేను నా జీవితాన్ని చాలా తప్పులతో గడిపాను కానీ నా ఆలోచనలు ఒక్కటి తప్పు కాదు.
(02:20) రూసో మనస్సాక్షి గురించి చెప్పాడు. మనిషికి రెండు గొంతులు ఉన్నాయి. ఒకటి సమాజం నేర్పిన గొంతు. [సంగీతం] రెండవది లోపల నుండి వచ్చే గొంతు. సమాజం నేర్పిన గొంతు చెప్తుంది డబ్బు సంపాదించు పేరు తెచ్చుకో పక్కవాడిని ఓడించు కానీ లోపల నుండి వచ్చే గొంతు చెప్తుంది. నిజాయితీగా ఉండు ప్రేమగా ఉండు సహాయం చెయ్ ఆ లోపలి [సంగీతం] గొంతే మనస్సాక్షి అదే మనిషికి ఇచ్చిన అతి పెద్ద కానుక ఆ గొంతు వినడం మర్చిపోయినప్పుడే మనిషి చెడుగా మారుతాడు.
(02:46) చాలా మంది అంటారు స్వేచ్ఛ అంటే ఏదైనా చేయగలగడం కానీ రూసో అన్నాడు స్వేచ్ఛ అంటే నీకు నచ్చినది చేయడం కాదు స్వేచ్ఛ [సంగీతం] అంటే నీకు నచ్చని దాన్ని వద్దు అని చెప్పగలగడం ఎవరైనా నిన్ను అబద్ధం చెప్పమంటే లేదు అనగలగడమే స్వేచ్ఛ ఎవరైనా నిన్ను అన్యాయానికి సహకరించమంటే లేదు అనగలగడమే స్వేచ్ఛ [సంగీతం] ఆ లేదు చెప్పే ధైర్యమే అసలైన స్వేచ్ఛ రూసో చెప్పింది ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి మంచిగా పుట్టాడు మనిషి స్వేచ్ఛగా పుట్టాడు కానీ మంచితనాన్ని స్వేచ్ఛను పీక పిసికి మరి చంపుతున్నాడు
No comments:
Post a Comment