Tuesday, April 14, 2026

 ప్రకృత్యైవ చ కర్మాణి
క్రియమాణాని సర్వశః । యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ।। (శరీరము యొక్క) అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే, దేహమునందున్న జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు, అని అర్థంచేసుకున్నవారు నిజముగా చూసినట్టు. అహంకారము అనేది మనలను మనం ఈ శరీరమే అనుకునేలా చేస్తుంది, అందుకే మనం శరీర కార్యములను, ఆత్మకు ఆపాదించి, ‘నేను ఇది చేస్తున్నాను... నేను అది చేస్తున్నాను’ అని అనుకుంటూఉంటాము. కానీ, జ్ఞానోదయమయిన జీవాత్మ, భుజించేటప్పుడు, త్రాగే టప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు మరియు మిగతా అన్నీ పనులు చేసేటప్పుడు, శరీరమే ఈ పనులు అన్నీ చేస్తున్నది అని గమనిస్తుంది. అయినా, శరీరము చేసే పనులతో నాకు సంబంధం లేదు అని అది భావించరాదు. వశిష్ఠ మహర్షి రాముడికి ఈ విధంగా ఉపదేశం చేసాడు. ‘రామా, పని చేసేటప్పుడు, ఫలితములు నీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నట్లు పరిశ్రమించుము; కానీ మనస్సులో మాత్రం చేసేది నీవు కాదు అని గుర్తుంచుకో. *** ప్రకృతి అనేదే జగన్మాత స్వరూపం. ఆ ప్రకృతినుంచే ఈ ఆలోచనలు పుడతాయి, అంటే ఈ త్రిగుణాలతో ఉన్న ఆలోచనలు—తమోగుణం, రజోగుణం, సత్త్వగుణం—పుడతాయి. కానీ జీవాత్మ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, నేను ఆలోచనలు కాదు, నేను ఆత్మస్వరూపం. మన దేహంతో జరిగే పనులన్నీ కూడా జీవాత్మ గమనిస్తూ ఉండాలి, *నేనే చేస్తున్నానని భ్రమనించి బయటకు రావాలి.*

http://youtube.com/post/UgkxNQ1doqQswzTA5-FBlv9x3E0rKJaAokzj?si=YSFInlDvyWMKFAki

No comments:

Post a Comment