Tuesday, April 14, 2026

ప్రతి పనినీ ఒక ధ్యానంలా మార్చుకోండి | Mindfulness in Daily Actions | Satyagrahi

ప్రతి పనినీ ఒక ధ్యానంలా మార్చుకోండి | Mindfulness in Daily Actions | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=06NLwo1qLBw



Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా గమనించారా మనకు వచ్చే కోపం గాని బాధలు గాని 90% మన వల్ల కలిగేవి కావు మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కలిగేవి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం గంటల తరబడి ఆలోచిస్తాం. ఇంకెవరో మనల్ని తక్కువ చేసి చూశారని కొంగిపోతాం. చిత్రం ఏమిటంటే ఎవరు ఏదన్నా సరే దానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతాం.
(00:21) అంటే అది పొగడత అవ్వచ్చు లేకపోతే తిట్లైనా అవ్వచ్చు. కానీ లాహిరి మహాశయులు లాంటి గొప్ప యోగులు ఏం చెప్పారంటే ప్రపంచాన్ని మార్చడం కంటే ప్రపంచాన్ని చూసే మీ చూపులు మార్చుకుంటే ప్రతి చిన్న మనిషిలోనూ మీరు దైవత్వాన్ని చూడగలరు. ఎందుకు ఈ మాట అన్నారు అంటే ఇప్పుడు మనల్ని పొగిడితే వాడు మన మిత్రుడు పొగడకపోతే వాడు మన శత్రువు అనే స్టేజి లో మనం ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో అందరూ మనల్ని పొగడరు కదా అలా అని చెప్పేసి పొగడాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు కదా సో ప్రస్తుతం మనందరం అనుభవిస్తున్న అతి పెద్ద సమస్య ఎమోషనల్ డిపెండెన్సీ అంటే పక్కవాడు మనలాగా ఉన్నాడా లేదా పక్కవాడు మనలాగా ఉంటే వాడితో
(00:59) మనం సంతోషంగా ఉంటాం లేకపోతే ఉండం ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సినిమా హీరోని ఇష్ట ఇష్టపడుతున్నారు. అవతల వాడు ఇష్టపడట్లేదు. మీకు వాడి మీద కొంచెం కోపం వచ్చేస్తుంది. మీకు వాడు 20% నచ్చకుండా పోతాడు. ఇంకో ముఖ్యమైన విషయం మీకు ఒక పొలిటీషియన్ నచ్చాడు. అవతల వ్యక్తికి ఇంకొకడు నచ్చాడు. సో అతను మీకు 50% నచ్చకుండా పోయే ప్రమాదం ఉంది.
(01:22) ఇక మూడోది మీకు ఒక క్రికెటర్ నచ్చాడు. అతనికి ఇంకొక క్రికెటర్ నచ్చాడు. సో మీకు అతను 75% నచ్చకుండా పోయే ప్రమాదం ఉంది. ఇలా లిస్ట్ తీస్తే మనకి తెలియకుండానే మనకి చాలా మంది శత్రువులు ఉన్నారు అని చెప్పేసి మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ వాస్తవానికి మీకు ఒక మనిషిని ఎలాగైతే ఇష్టపడే స్వతంత్రం ఉందో మీకు ఒక మనిషిలోని మంచి చెడుని క్యాలిక్యులేట్ చేసుకొని ఇష్టపడతారో అవతలి వ్యక్తులు కూడా అంతే కదా మీరు ఉన్నట్టు ప్రపంచం ఉండాలనుకోవడం తప్పు కదా ప్రపంచం ప్రపంచంలా ఉంటుంది మీరు మీరులా ఉండాలి.
(01:52) కానీ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలి వాళ్ళ అభిరుచుల్ని వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ జీవన విధానాన్ని అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే మనం అందరిని మనకి నచ్చినట్లు ఉండాలని కోరుకుంటాం. భార్య ఇలాగే ఉండాలి భర్త అలాగే మాట్లాడాలి పిల్లలు ఇలాగే పెరగాలి ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక గొలుసులా మారి మిమ్మల్ని కట్టిపడేస్తున్నాయి.
(02:16) మనం ఎదుటివారిని ఒక మనిషిలా కాకుండా మన అవసరాలను తీర్చే ఒక సాధనంలా చూస్తున్నాం. నిజం చెప్పాలంటే ఒక రోబోలా చూస్తున్నామ అన్నమాట. ఆ రోబో ఏంటి నేను చెప్పినట్టు చేయాలి. నాకు నచ్చినట్లు నడుచుకోవాలి. ఎప్పుడైతే వారు మన అంచనాలకి తగ్గట్టుగా ఉండరో అప్పుడు మనకి కోపం వచ్చేస్తది. అందులోన మనం వాళ్ళని మనకు నచ్చినట్లు ఉండమని చెప్పేసి ఇబ్బంది పెడుతూనే ఉంటాం.
(02:39) ఈ ప్రపంచంలో కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరినీ మనం మార్చలేం కానీ అందరి మధ్య ఉంటూ మనం మారలేకపోవడమే ఇక్కడ అసలైన సమస్య. ఈ సమస్యకి మూల కారణం మనలో ఉన్న ఈగో మనకు తెలియకుండానే మన మనసులో ఒక జడ్జ్ ని కూర్చోబెట్టేసుకున్నాం. వాడు మంచివాడు వీడు చెడ్డవాడు వాడు నాకు అన్యాయం చేశాడు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక లేబుల్ వేసేస్తాం. లాహరి మహాసయలో ఒక మాట అనేవారు ప్రతి మనిషిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు అని కానీ మనం మనుషులను చూస్తున్నప్పుడు వారి కులం, మతం, హోదా లేకపోతే వాళ్ళు మనకు చేసిన ఉపకారాన్ని బట్టి చూస్తాం కానీ వారిలో ఉన్న ప్రాణ శక్తిని చూడలేకపోతున్నాం.
(03:15) అందుకే ఒక వ్యక్తి తప్పు చేయగానే మనం వారిని పూర్తిగా అసహించుకుంటాం. ఎదుటి వారి తప్పులను క్షమించలేకపోవడం పాత జ్ఞాపకాలు పట్టుకొని వేలాడటం వల్లే మన మనసు ఒక చెత్త కుండిలా మారిపోతుంది. ఆ చెత్త ఉన్నచోట మనిషికి ప్రశాంతత ఉంటుందా ఉండదు. దీనికి పరిష్కారం బాహ్య ప్రపంచంలో లేదు. మీ అంతరాత్మలో ఉంది. మొదటిగా నిరాపేక్ష ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ ని అలవాటు చేసుకోండి.
(03:42) ఎదుటివారు ఎలా ఉన్నా సరే వాళ్ళని స్వీకరించండి. ఇది వినడానికి కష్టంగా ఉండొచ్చు కానీ ఒక్కటి ఆలోచించండి ఒక చెట్టు తనకి నీళ్లు పోసిన వాడికి అలాగే తనని నరికే వాడికి కూడా నీడనే ఇస్తుంది. ఎందుకంటే నీడ ఇవ్వడం దాని స్వభావం. మీ స్వభావం ప్రేమ అయినప్పుడు ఎదుటివాడు ఎలా ఉన్నా మీరు మారకూడదు. ఈరోజు నుంచి మీ ప్రయాణాన్ని కొత్తగా మొదలు పెట్టండి.
(04:03) ఉదయం నిద్ర లేవగానే ఈరోజు నాకు ఎదురయ్యే ప్రతి వ్యక్తికి నేను మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరిని నా మాటలతో బాధ పెట్టకూడదు అని ఒక సంకల్పం తీసుకోండి. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కేవలం మీ మాటలే కాదు మీలోని పాజిటివ్ ఎనర్జీ కూడా వాళ్ళకి అందాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. బాయ్.

No comments:

Post a Comment