Tuesday, April 14, 2026

దయచేసి ఒకటికి రెండుసార్లు చదవండి* ☺️👍🌹❤️*(నేటి ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*

 *దయచేసి ఒకటికి రెండుసార్లు చదవండి* ☺️👍🌹❤️*(నేటి ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*


నోటితో చెప్పలేక కళ్ళతో మొత్తుకుంటున్నా వినకుండా ఆ నరకాల్లో పడేసి  మన కన్నతల్లిదండ్రుల్ని మనమే అనాధల్ని చేసి ప్రేమ పేరుతో కర్కశంగా చంపాలా ?! అలా చస్తే నిజంగా ఎవరికి లాభం?!?!
కార్పొరేట్ హాస్పటల్స్ కుట్రలు - ఒక సంపూర్ణ విశ్లేషణ
- *డాక్టర్ గౌతమ్ కశ్యప్*

"ఇది అందరికీ ఎంతో ఎంతో ముఖ్యమైన విషయం - దీనిని అమెరికన్ పరిశోధకులే కనుగొని విస్తుపోయిన రహస్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందా? లేక కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందా? అని తేల్చే పచ్చి నిజం ఇది."

అది 1961వ సంవత్సరం..
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో 'రోసెటో' (Roseto) అనే ఒక చిన్న గ్రామం ఉంది. దాని చుట్టుపక్కల అత్యాధునిక సౌకర్యాలతో ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీల నిధులతో నడిచే ల్యాబ్‌లు, పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. కానీ అక్కడ వారికి ఒక వింతైన, నమ్మశక్యం కాని పరిస్థితి ఎదురైంది. రోసెటో ఊరి నుంచి ఒక్క పేషెంట్ కూడా ఆసుపత్రులకు రావడం లేదు!

ఏ వ్యాపార సంస్థకైనా కస్టమర్స్ రాకపోతే అది ఆ వ్యాపార మనుగడకే ప్రమాదం. ఇక్కడ కూడా కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ల్యాబ్‌లు ఉన్నాయి, ఫార్మా కంపెనీల మందులు సిద్ధంగా ఉన్నాయి. ఆసుపత్రులకు రోగులు రాకపోతే అది వారి వ్యాపారానికి అతిపెద్ద నష్టం. అందుకే, అక్కడ ప్రజలు పరీక్షలు చేయించుకోవడం లేదేమో అని చుట్టుపక్కల హాస్పిటల్స్ యాజమాన్యాలు పోటీపడి మెడికల్ క్యాంపులు పెట్టాయి. జనం రాలేదు. ఇది వారికి ఆశ్చర్యం వేసి, టెస్టుల ఖర్చులకు భయపడి రాలేదేమో అని చివరికి 'ఉచిత పరీక్షల' పేరుతో ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయినా ఒక్క పేషంటూ రాలేదు. ఆ రోసెటో జనం మాత్రం "మాకు ఏ జబ్బు లేదు, మీ పరీక్షలు మాకు అక్కర్లేదు" అని ముఖం చాటేశారు.

ఉచిత పరీక్షలకు కూడా ఎందుకు రావడం లేదో అర్థంకాక ఎంక్వైరీ చేస్తే, అక్కడ అసలు జనానికి జబ్బులే రావడం లేదని తెలిసింది! అమెరికాతో సహా ప్రపంచమంతా కోట్ల మంది జబ్బులతో బాధపడుతుంటే, ఈ ఒక్క ఊరిలో ఎందుకు జబ్బులు లేవో తెలుసుకోవడానికి పరిశోధన బృందాలు రంగంలోకి దిగాయి. ఇక్కడ వారి లక్ష్యం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రేమ కాదు—అక్కడ ఏదైనా 'రహస్యంగా రోగాలు రాకుండా చేసే కారణమేదైనా' తెలిస్తే.. దానిని కోట్ల కోట్ల డాలర్ల వ్యాపారంగా మార్చుకోవాలనే అత్యాశతో కూడిన అపరిమిత ఉత్సాహం!

ఈ మిస్టరీని ఛేదించడానికి డాక్టర్ స్టీవర్ట్ వోల్ఫ్ (Head of Oklahoma Medical Research Foundation) రంగంలోకి దిగారు. ఆయన ఏదో మామూలుగా వెళ్లలేదు.. దాదాపు 50 మంది నిపుణులతో కూడిన ఒక భారీ వైజ్ఞానిక సైన్యాన్ని వెంటబెట్టుకుని మందీ మార్బలంతో ఆ ఊరి మీద పడ్డారు. ఆ బృందంలో గుండె నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు, గణాంక నిపుణులు ఉన్నారు. వీరు 1961 నుండి దాదాపు 30 ఏళ్ల పాటు ఆ ఊరిని ఒక ప్రయోగశాలగా మార్చి, 1895 నుండి ఉన్న ప్రతి మరణ ధృవీకరణ పత్రాన్ని జల్లెడ పట్టారు.

అక్కడ వారు గమనించిన ఒక పచ్చి నిజం ఏమిటంటే—నేడు మనం చూస్తున్న MNC కంపెనీల 'ఆహార-వైద్య' మాయాజాలం అక్కడ పని చేయడం లేదు. బయటి ప్రపంచంలో MNC కంపెనీలు ఒక వైపు హోటళ్ల ద్వారా అమ్ముతున్న వారి రుచికరమైన, ప్రాణాంతకమైన ఆహారాలను అమ్ముతూ రోగాలను సృష్టిస్తుంటే, మరో వైపు అవే కంపెనీల పెట్టుబడులు ఉన్న ఆసుపత్రులు మందులు, సర్జరీలను అమ్ముతూ కోట్లు గడిస్తున్నాయి. కానీ రోసెటోలో పరిస్థితి వేరు. వారి ఆరోగ్య రహస్యం ఏ ఫార్మా కంపెనీ మందుల్లోనూ లేదు, ఏ కార్పొరేట్ హాస్పిటల్ చేసే సర్జరీలోనూ లేదు. అది వారి 'సామాజిక ఐక్యత' (Social Bonding) లో ఉంది!

అక్కడ ఎవరూ ఒంటరిగా భోజనం చేయరు, మనుషుల మధ్య అహంకారాలు లేవు. ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు మనస్ఫూర్తిగా పాలుపంచుకుంటారు. ప్రతి రోజూ ఏదో ఒక పండగే వారికి! ఒకరు వండుకున్నది మరొకరికి పెట్టి తింటారు. "నాకు ఏదైనా అయితే నా వెనుక నా ఊరంతా ఉంది" అనే అచంచలమైన భరోసా ఆ ఊరు వారిలో నిండుగా ఉంది. అదే వారిని జబ్బుల బారి నుండి కాపాడుతోంది.

మన పూర్వీకులు కూడా జబ్బును శరీరంలో కాకుండా మనసు మూలాల్లో వెతికారు. మనం కుందేళ్లలా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాం అనే దానికంటే, ఎంతమందితో కలిసి మనస్ఫూర్తిగా నవ్వాం అనేదే మన ఆయుష్షును పెంచుతుంది.

రోసెటోపై కార్పొరేట్ దాడి - ఒక ఆత్మీయ వ్యవస్థ విధ్వంసం
1961లో రోసెటో రహస్యం బయటపడటమే ఒక సంచలనం. కానీ "మనుషులు కలిసి ఉంటే జబ్బులు రావు" అనే సత్యం గనుక ప్రపంచానికి తెలిస్తే, తమ వేల కోట్ల డాలర్ల మందుల వ్యాపారం, జంక్ ఫుడ్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని MNC కంపెనీలు గ్రహించాయి. అందుకే, ఆ సత్యం బయటకు వచ్చిన మరుసటి క్షణం నుంచే ఒక వ్యూహాత్మక యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఆత్మీయ బంధాల పై దాడి చేయడానికి సినిమా స్టార్లు, ఫేక్ సైకాలజిస్టులతో ఒక రకమైన 'సాంస్కృతిక యుద్ధం' (Cultural War) మొదలుపెట్టాయి.

ఆ కాలక్రమం (Timeline) మరియు కుట్రల వివరాలు ఇక్కడ చూడండి:

1964 జూన్ 8 - JAMA సంచలనం: అత్యంత ప్రతిష్టాత్మకమైన Journal of the American Medical Association (JAMA) లో ఈ పరిశోధన వివరాలు అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే, ఫార్మా మరియు ఫుడ్ MNC కంపెనీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి మీడియాను అస్త్రంగా చేసుకున్నాయి. అప్పటికే అమెరికాలో ప్రాచుర్యం పొందుతున్న టీవీ మాధ్యమాన్ని వాడుకుని, ప్రముఖ సినిమా స్టార్లతో ఇంటర్వ్యూలు ఇప్పించారు. ఆ ఇంటర్వ్యూలలో వారు "మాకు ప్రైవసీ (Privacy) ముఖ్యం, ఒంటరిగా గడపడం వల్లనే మేము ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నాం" అని అబద్ధాలు చెప్పించారు. రోసెటోలో ఉన్న ఉమ్మడి భోజనాలు, వీధి కబుర్లను 'పాత కాలపు పద్ధతులు'గా, 'అనాగరికత'గా చిత్రించారు.

FDA ద్వారా కుట్ర: రోసెటో పరిశోధన వెలువడిన కొద్ది నెలలకే (అక్టోబర్ 1964), FDA (Food and Drug Administration) ద్వారా వంట నూనెలపై కొత్త నిబంధనలు తెచ్చాయి. రోసెటో ప్రజలు వాడే సహజమైన కొవ్వులు (Lard) ప్రాణాంతకమని, వారు తయారు చేసే పారిశ్రామిక నూనెలే శ్రేష్ఠమని ప్రచారం చేయించాయి.

ఫేక్ సైకాలజిస్టుల విశ్లేషణలు & భయం: కార్పొరేట్ కంపెనీలు కొందరు పేరున్న సైకాలజిస్టులను కొనుగోలు చేసి, పత్రికల్లో వ్యాసాలు రాయించాయి. "మనుషులు అతిగా కలవడం వల్ల మానసిక స్వేచ్ఛ హరించుకుపోతుంది, అది ఒత్తిడికి దారితీస్తుంది" అని తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఆత్మీయతను 'సామాజిక భారం'గా (Social Burden) మార్చడానికి ప్రయత్నించారు. పెయిడ్ డాక్టర్ల ద్వారా "ఒకరిని ఒకరు తాకడం, కలిసి భోజనం చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తాయి" అని ప్రజలను భయపెట్టారు. ఆత్మీయత అనే 'మందు'ను అంటువ్యాధులకు 'కారణం'గా మార్చేశారు.

వ్యక్తిత్వవాదం (Individualism) అనే విషం: 1970ల నాటికి రోసెటోలోకి విలాసవంతమైన వస్తువులను, టీవీలను ప్రవేశపెట్టాయి. "మీకంటూ ఒక ప్రత్యేక గది, ప్రత్యేక కారు ఉంటేనే గౌరవం" అని నూరిపోశాయి. దీనివల్ల ప్రజల మధ్య పోటీ పెరిగి, ఒకరి ఇళ్ల మధ్య ఒకరు భౌతికమైన మరియు మానసికమైన 'కంచెలు' (Fences) నిర్మించుకోవడం మొదలుపెట్టారు.

విధ్వంసం - తుది అంకం
ఈ నిరంతర ప్రచార దాడి వల్ల రోసెటోలోని యువత మెల్లగా తమ పెద్దల నుండి, సంప్రదాయాల నుండి దూరమవ్వడం మొదలైంది. ఆత్మీయ బంధాల కంటే 'వ్యక్తిగత విలాసాలే' జీవితాల్లో ఎంతో గొప్పవనే ఫిలాసఫీలో, ఆ భ్రమలో పూర్తిగా పడిపోయారు. సామాజిక దూరం పెరిగింది, MNC కంపెనీల జంక్ ఫుడ్ ఇంట్లోకి వచ్చింది, ఆత్మీయత ఆవిరైపోయింది.

ఫలితంగా.. మొట్టమొదటి సారిగా, 1971వ సంవత్సరంలో, రోసెటో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 55 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తి తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ఆయన తన ఇంట్లో, తన వారి మధ్య కన్నుమూయలేదు. పక్కనే ఉన్న కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి, ఐసియులోని యంత్రాల మధ్య, ఒంటరిగా 1971, జూన్ 15 తేదీన తుది శ్వాస విడిచాడు. 
అదీ కార్పొరేట్ కంపెనీలు సాధించిన విజయం. ఇలా కార్పోరేట్ హాస్పటల్స్ ఎందరినో యంత్రాల మధ్య ఈనాటికీ హత్య చేస్తున్నాయి. ఇంట్లో చస్తే ఆ హాస్పటల్స్ వాళ్ళకి డబ్బులు రావు. ఈ విషయం మనకు అస్సలు అర్థమే కావడం లేదు. పైగా పరువు మర్యాదల పేరుతో లక్షలు తగలేసి మన సొంత వాళ్ళని మనమే చిత్రహింసల పాలు చేసి ఒంటరిగా ఆ యంత్రాల మధ్య అనాధల్ని చేసి దారుణ మరణాలకు గురిచేస్తున్నాం. ప్రస్థుతం మనం ప్రేమ ఉన్నదని అందరికీ చూపించుకోవడానికి ఎవరేమనుకుంటారో అనే సామాజిక రుగ్మతలో చిక్కుకుని మనకు ప్రేమ పంచి ఇచ్చిన వాళ్ళకు చిరి క్షణాల్లో నరకం చూపిస్తున్నాం అదీ బతికుండగానే.... హు.. 
ఇది వరకు ఇళ్ళల్లో వయసు ఉడిగిపోయాక మనందర్నీ చూస్తూ మాట్లాడుతూ హాయిగా పండులా రాలి చాలా సహజంగా సంతోషంగా ప్రకృతిలోకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు????
 
ఇవన్నీ నగ్న సత్యాలు. ఒంటరిగా ఏకాంతంగా ఏ డాక్టర్నైనా అడగండి. ఇవి నిజాలో కాదో...

ఒకప్పటి దాకా భారతదేశంలో కూడా మనకు ఇలాంటి వ్యవస్థే ఉండేది. అమ్మో అమ్మమ్మో ఒక పెద్ద స్టీల్ బేసిన్ లో అందరికీ కలిపి అన్నం ముద్దలు కలిపి పెట్టడం, మనం తినడం గుర్తుందా?! అట్లతద్ది నాడు పొద్దున్నే పెరుగన్నం పెట్టడం, మనం పోటీలు పడుతూ తినడం, ఆడుకోమ్మని చెపితే బయటికి వెళ్ళడం, కచ్చికతో పుల్ల పెట్టి పళ్ళు తోముకోవడం.. ఇప్పుడు ఏమైపోయాయ్?!! అలా ఇప్పుడు ఎక్కడన్నా కనబడితే మనమే మనల్ని తక్కువగా చూస్తూ వెక్కిరించుకుంటున్నాం.

మనమీద మనకున్న నమ్మకాన్ని కార్పొరేట్ కంపెనీలు ఎలా విచ్చిన్నం చేస్తాయో, ఎలా వారి క్రిందికి తెచ్చుకుంటాయో అర్థమైంది అనుకుంటాను. మేల్కొనండి! మన ఆరోగ్యం మన ఆత్మీయతలోనే ఉంది.

- Dr. Gautham Kashyap PhD.,

ఆధారాలు (Proofs):
Evidence 1:
"The Roseto Effect" is a well-documented medical phenomenon. Dr. Stewart Wolf led a massive team of over 50 professionals, including physicians and sociologists, starting in 1961. Their findings were published in the book "The Roseto Story" (University of Oklahoma Press, 1979) and "The Power of Clan" (1993). They analyzed medical records dating back to 1895 to confirm that social cohesion was the primary driver of their health.
Source: The Roseto Story: An Anatomy of Health by Stewart Wolf and John G. Bruhn. Page No: 15-40 (Chapter: The Mystery of Roseto).

తెలుగు అనువాదం:
రోసెటో ప్రభావం (The Roseto Effect): డాక్టర్ స్టీవర్ట్ వోల్ఫ్ మరియు సోషియాలజిస్ట్ జాన్ బ్రున్ 1961 నుండి దాదాపు 30 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ నిజాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. వారు రాసిన "The Roseto Story" (యూనివర్సిటీ ఆఫ్ ఓక్లహోమా ప్రెస్, 1979) మరియు "The Power of Clan" (1993) పుస్తకాల్లో రోసెటో ప్రజల గుండె ఆరోగ్యం వారి ఆహారం వల్ల కాక, వారి మధ్య ఉన్న 'కుટુંంబ ఆత్మీయత' (Clan Power) వల్ల కలిగిందని నిరూపించారు.
ఆధారం: The Roseto Story: An Anatomy of Health - రచయితలు: స్టీవర్ట్ వోల్ఫ్ మరియు జాన్ జి. బ్రున్. పేజీ నంబర్: 15-40.

Evidence 2:
"Corporate interests in the late 1960s utilized 'Expert Bias' by hiring psychologists to promote individualism as a sign of progress. Television advertisements featuring celebrities equated health with consumer products and private lifestyles. This 'Social Engineering' was designed to break the communal bonds that the Roseto study had identified as life-saving. By labeling traditional closeness as 'unhygienic' and 'regressive', they successfully dismantled the social fabric by 1970."
Source: The Power of Clan: The Influence of Neighborliness on Health and Longevity by Stewart Wolf and John G. Bruhn. Page No: 140-155.

తెలుగు అనువాదం:
కృత్రిమ సామాజిక మార్పు: 1960 ల చివరలో కార్పొరేట్ శక్తులు 'నిపుణుల' ద్వారా వ్యక్తిత్వవాదాన్ని (Individualism) ప్రగతికి చిహ్నంగా ప్రచారం చేశాయి. టీవీ ప్రకటనలు మరియు సినిమా స్టార్లు విలాసవంతమైన వస్తువులనే ఆరోగ్యానికి మూలంగా చిత్రించాయి. రోసెటోలోని ఆత్మీయ బంధాలను 'అనాగరికత'గా, 'అపరిశుభ్రత'గా ముద్ర వేయడం ద్వారా, ఆ సామాజిక వ్యవస్థను 1970 నాటికి విజయవంతంగా విచ్ఛిన్నం చేశారు. దీని ఫలితంగానే, 1960ల మధ్య వరకు అక్కడ వారికి బిపిలూ, షుగర్ లూ, పెరాలిసిస్ లూ, గుండెపోటు మరణాలు శూన్యంగా ఉన్న అదే రోసెటోలో.. సరికొత్త అమెరికన్ వినియోగదారీ సంస్కృతి వల్ల సామాజిక బంధాలు తెగిపోవడంతో, 1971లో మొదటిసారి ఒక వ్యక్తి ఆసుపత్రిలో ఒంటరిగా యంత్రాల మధ్య గుండెపోటుతో మరణించాడు.
ఆధారం: The Power of Clan - రచయితలు: స్టీవర్ట్ వోల్ఫ్ మరియు జాన్ జి. బ్రున్. పేజీ నంబర్: 140-155.           

No comments:

Post a Comment