Tuesday, April 14, 2026

కొరియన్ డ్రామాకి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? | Shiva Chandana | Square Talks

కొరియన్ డ్రామాకి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? | Shiva Chandana | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VmDRaNClByw



Transcript:
(00:08) వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను చందన ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సహజంగా టీనేజ్ లేదా ఎర్లీ 20స్ లో ఉన్న పిల్లలు లేదా మిడ్ 20స్ లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఫీమేల్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ డ్రామా చూడటానికి ఇష్టపడతారు అదే కొరియన్ కానీ జపనీస్ కానీ చైనీస్ డ్రామా కానీ ఈ డ్రామా చూడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారున్నమాట ఎందుకు అంతలా వీళ్ళక అంత నచ్చుతుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఫస్ట్ ఏంటంటే ఈ పేర్లో ఉన్నట్టే అదిఒక డ్రామా అంటే ఒక నెర్రేటివ్ గా ఒక విషయాన్ని సాగదీస్తే ఎక్స్ప్లెయిన్ చేసి
(00:50) ప్రొలాంగ్ చేస్తూ అలా ఉంటుందన్నమాట సో ఏంటి ఇది మూవీస్ కి డ్రామాకి డిఫరెన్స్ ఏంటి అని మనం చూస్తే మూవీస్ ఎలా ఉంటాయఅంటే ఒక అన్రియల్ సిచువేషన్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఏదో సంథింగ్ జరుగుతుంది దాన్ని ఎవరో హెల్ప్ తో మనం సాల్వ్ చేస్తాము. లేదా ఏదో సంథింగ్ మధ్యలో సాంగ్స్ వచ్చి ఇంటరప్ట్ అవ్వడం ఇట్లా ఉంటుందన్నమాట.
(01:15) బట్ డ్రామాస్ లో ఏంటంటే ఒక ఫైట్స్ వచ్చి ఇంటరప్ట్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది బట్ డ్రామాలో ఏమవుతుందంటే కంటిన్యూటీ ఉంటుంది. అంటే ఒక సీన్ కి ఒక నాలుగైదు సీన్సే ఉంటాయి మొత్తం మీద ఒక నాలుగైదు ప్లేసెస్ లో ఒక వేరియేషన్ ఉంటుంది. బట్ కంటిన్యూస్ గా ఎలా జరుగుతూ ఉంటాయి అంటే అవి ఎక్కువ నెర్రేటివ్ విధానంలో ఉంటాయి అంటే ఎక్కువ ఎక్స్ప్లనేషన్ ఉంటుందన్నమాట.
(01:37) అంటే మాట్లాడుతూ ఉంటారు. ఈ క్యారెక్టర్ కొన్ని మాటలు మాట్లాడితే దానికి రిప్లై ఇంకో క్యారెక్టర్ నుండి వస్తుంది. దానికి ప్రాపర్ రిప్లై దానికి రిప్లై ఇంకో క్యారెక్టర్ ఇస్తుంది. దాన్ని ఇంకో క్యారెక్టర్ జస్టిఫై చేస్తుంది దాన్ని ఇంకొకళ్ళు అపోజ చేస్తారు ఇట్లా నెర్రేషన్ వాళ్ళ మధ్య డైలాగ్స్ అనేవి ఎక్కువ నడుస్తూ ఉంటాయి.
(01:58) ఇలా డైలాగ్స్ తో ఇట్లా ప్రొలాంగ్డ్ గా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు బాగా ఎంగేజ్ అవుతారు అన్నమాట. అంటే ఒక మూవీ చూసిన దానిలో ఎంగేజ్ అయిన దానికంటే ఒక మాటలకి ఈ ఎక్స్ప్రెషన్ కి వాళ్ళు ఒకదాన్ని ఒకటి లాజికల్ గా చెప్తున్న దానికి కవర్ అప్ చేస్తున్న విధానం ఇవి ఏవైతే ఉంటాయో వీటికి ఎస్పెషల్లీ ఫీమేల్ బాగా ఎక్కువ కనెక్ట్ అవుతారు.
(02:23) ఫీమేల్ ఎందుకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అని మనం అర్థం చేసుకుంటే సహజంగా ఏంటంటే ఒక ఇష్యూ ఏదైనా గొడవ జరిగినప్పుడు అబ్బాయిలు సహజంగా ఏం చేస్తారంటే ఫిజికల్ ఫైటింగ్ లోకి వెళ్ళిపోతారు ఏదైనా ఇద్దరు ఒక ఇద్దరు అబ్బాయిల మధ్య ఏదో ఒక ఇష్యూ గురించి ఒక ఆర్గ్యుమెంట్ నడిచింది అనుకోండి అప్పుడు వెంటనే ఏం చేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారున్నమాట గొడవ పెట్టేసుకుంటారు.
(02:47) అమ్మాయిల మధ్య ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు గట్టిగా అరుస్తూ మాట్లాడతారు. అరుస్తూ ఎక్కువ వెర్బల్ గా ఉంటుందన్నమాట. ఫిజికల్ గా కంటే వెర్బల్ గా మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేసి మాటల ద్వారా వాళ్ళని కౌంటర్ చేయడం ఏదో ఒక మాట అనడం ఇలా మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఫీమేల్ లో చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఫిజికల్ కి ఎక్కువ వెళ్లరు.
(03:08) వీళ్ళకి ఏదనా అగ్రెషన్ చూపించాలి అనుకున్నప్పుడు ఫిజికల్ మెథడ్స్ ఎక్కువ యూస్ చేయకుండా వీలైనంతవరకు వెర్బల్ విధానాల్లో లేదా ఐదర్ కంప్లీట్ గా అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం గట్టి గట్టిగా అర చేయడం లేదంటే కంప్లీట్ సబ్మెసివ్ గా ఉండి నేను ఫైట్ చేయలేకపోతున్నాను అని ఒక విక్టిమైజ్ రోల్ ని తీసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఫిజికల్ గా అటాక్ చేయడం అనేది సహజంగా ఫీమేల్ నేచర్ లో ఉండదు.
(03:34) ఈ కొరియన్ డ్రామాస్ కానీ చైనీస్ కానీ జపనీస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే వీళ్ళకి దగ్గరగా ఉంటాయన్నమాట వీటిలో ఎక్కడా కూడా ఫిజికల్ ఫైటింగ్స్ ఉండవు ఎక్కువ కొట్టుకోవడాలు ఒకళ్ళు బ్లడ్ రావడం అలా ఎక్కువ చూపించారు ఒకవేళ ఏదన్నా ఒక మర్డర్ సీన్ చూపించాలి వెంటనే ఒక కత్తి తీసుకొని ఒకళ్ళు పొడి చేశారు అలా ఉంటుంది తప్ప చాలాసేపు వాళ్ళఇద్దరి మధ్య ఫైటింగ్ అని అప్పుడు ఏదో చంపేయటము ఇలాంటివి అసలు ఉండవున్నమాట వీలైనంతవరకు ఏంటంటే మాటల ద్వారా ఎక్కువ వాళ్ళ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు లేదా వాళ్ళ ఎమోషన్స్ ని గాని వాళ్ళకున్న జెలసీ వాళ్ళకున్న ఏదైనా ఒక ఫీలింగ్ ని
(04:13) మాటల ద్వారా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఇవి ఎక్కువ రన్ అవుతూ ఉంటాయిన్నమాట అయితే ఇలా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి వీళ్ళ ఆటిట్యూడ్ కి వీళ్ళ వీళ్ళు ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ కొరియన్ డ్రామా చూసే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా రిలే రిలేట్ అవుతుంటారు అన్నమాట సహజంగా ఎలా ఉంటాయి ఐదర్ రీబర్న్ కానీ సెకండ్ ఛాన్స్ మళ్ళీ రావడం కానీ లేదంటే రీఇంకార్నేషన్ కానీ ఇట్లాంటి మెథడ్స్ ఎక్కువ డ్రామాస్ లో చూపిస్తూ ఉంటారు.
(04:47) లేదంటే వీళ్ళకి మళ్ళీ ఒక విషయం తెలియడం కానీ వీళ్ళకి ఎక్స్టర్నల్ సపోర్ట్ దొరకడం ద్వారా వీళ్ళ లైఫ్ ని వీళ్ళు సెట్ చేసుకున్నట్టు ఇట్లా ఉంటుందన్నమాట. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఫీమేల్ కి కూడా తన లైఫ్ ని లీడ్ చేస్తున్న ప్రాసెస్ లో ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ నేను మిస్టేక్ చేశాను ఇక్కడ బెటర్ గా చేసి ఉండాల్సింది. ఇట్లా జరగకుండా ఉంటే నేను ఇట్లా ఉండేది నా లైఫ్ అన్న ఫీల్ ఉంటుందన్నమాట నాట్ ఓన్లీ ఫీమేల్ మేల్ కి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది ఇలాంటిది.
(05:17) ఇలా ఉండడం వల్ల ఏంటంటే అది యాక్చువల్లీ రియల్ లైఫ్ లో పాసిబుల్ అవ్వదు మనం వెనక్కి వెళ్లి పాస్ట్ కి వెళ్లి దాన్ని చేంజ్ చేయలేము ఈ డ్రామాస్ లో ఏంటంటే మనం బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు మనం సెకండ్ ఛాన్స్ నిజంగా దొరికినట్టు దొరికినప్పుడు వాళ్ళు దాన్ని తెలివితేటలతో ఎలా యూస్ చేసుకున్నారు లేదంటే ఒక మంచి అపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని వీళ్ళు ఎలా యూస్ చేసుకొని వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయ్యారు అట్లా ఒక విక్టిం రోల్ గా ఉన్నవి వీళ్ళు బెటర్ గా ఎలా లైఫ్ ని లీడ్ చేసి బెటర్ రోల్ తీసుకోగలిగారు అన్నది ఎక్కువ చూపిస్తూ ఉంటారున్నమాట ఇలా ఎక్కువ ఇవి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి
(05:56) తెలియకుండానే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చేయలేకపోయింది చేయాలని అనుకొని వదిలేసుకోవాల్సి వచ్చిన విషయాల్ని వీళ్ళు ఇక్కడ డ్రామాలో చూసి సాటిస్ఫై అవుతారన్నమాట ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మెల్లమెల్లగా ఈ డ్రామాకి ఎడిక్ట్ అవుతూ ఉంటారు ఎక్కువ సేపు చూడటము ఇట్లా ఇలా చేస్తూ ఉంటారున్నమాట. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఒక స్టేజ్ కి వచ్చాక ఇలా మా లైఫ్ లో కూడా జరిగితే బాగుండు అన్న థాట్ వస్తుంది.
(06:27) బట్ రియాలిటీలో అలా జరుగుతుందా వన్స్ పాస్ట్ అయిపోయాక మళ్ళీ ఆ స్టేజ్ రావడం అనేది జరగదు. అలా జరగనప్పుడు ఏంటంటే ఇట్లా వాళ్ళకు జరిగింది కానీ నా లైఫ్ లో జరగట్లేదు అన్న ఒక పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఇంకా ఆ డ్రామా ఎక్కువ చూడడం ఇలా చేస్తూ ఉంటారున్నమాట ఇలా చేసే ప్రాసెస్ లో ఏంటంటే వీళ్ళు ప్రాపర్ గా నిద్రపోలేరు కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటారు.
(06:50) అండ్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇలా కరెక్ట్ చేసుకోలేకపోయాము అనే గిల్ట్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. పోనీ వదిలేద్దామా అంటే వదిలే వదిలేయలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళకి అసలు అర్థం కూడా కాదన్నమాట. అర్థం కాకుండానే దానిలోకి పూర్తిగా అలవాటు పడిపోతారు.
(07:12) ఈ డ్రామా చూడటానికి అలవాటు పడిపోతారు. ఎంతలా అంటే రోజుకి ఒక్క డ్రామా అయినా కనీసం చూసేలాగా అలా అవుతుందన్నమాట. ఇలా మెల్లమెల్లగా ఏంటంటే వాళ్ళ టైం అంతా వేస్ట్ అవ్వడం. ఈ పెయిన్ లో ఉండడం చూస్తున్నంతసేపు ఒక ఊహా ప్రపంచంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు రియాలిటీలోకి వచ్చి అలా ఊహల్లో ఉన్నట్టు నా లైఫ్ లో లేదు అని కంపేర్ చేసుకొని బాధపడటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారున్నమాట.
(07:37) సహజంగా వీళ్ళు ఎందుకు ఇంత బాధపడతారు అంటే అక్కడ విక్టిమ్ కి ఏదో ఒక స్టేజ్లో ఎక్కడో ఒక చోట హెల్ప్ దొరికి తను సక్సెస్ అయినట్టు చూపిస్తూ ఉంటారు. ఎక్కువ వాళ్ళు టార్గెట్ చేసేది కూడా ఫీమేల్ ఆడియన్స్ నే టార్గెట్ చేస్తూ ఉంటారున్నమాట. ఈ ఛాన్స్ రావడం కానీ లైఫ్ బెటర్ అవ్వడం కానీ ఇవన్నీ ఎవరికి జరుగుతూ ఉంటాయి ఫీమేల్ లీడ్ కి జరుగుతూ ఉంటాయి.
(08:01) ఎక్కువ డ్రామాస్ లో ఫీమేల్ లీడ్ కే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ వాళ్ళు ఓన్ చేసుకొని ఎక్కువ అడాప్ట్ చేసుకొని వాళ్ళని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ రియల్ లైఫ్ లో లేదు అని బాధపడటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం వీళ్ళకి వాళ్ళు చూడొద్దు ఇట్లా జరుగుతుంది అని చెప్పినా కూడా ఏంటంటే వాళ్ళకి అది వదిలిపెట్టబుద్ది కాదన్నమాట వాళ్ళు ఎంత ఇంటెన్సిటీతో దాన్ని ఇన్వాల్వ్ అయ్యారు ఏవి చూస్తున్నారు ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి మనం ప్రాపర్ గా కౌన్సిలింగ్ తీసుకుంటే ఇది ఓవర్కమ్ చేయొచ్చు బట్ మనం ట్రై చేసే
(08:38) కొద్ది ఏంటంటే చూడొద్దు చూడొద్దు అని పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళని ఎస్కేప్ అవ్వడానికి కూడా ఇంకా అది ఎక్కువ చూస్తారు. ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఇంకా వాళ్ళకి సమస్య పెరుగుతుంది అన్నమాట సో ప్రాపర్ గా దాన్ని ఎవరైనా చూస్తున్నారు అని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు ఎంత ఇంటెన్సిటీతో చూస్తున్నారు వీళ్ళకి నిజంగా కౌన్సిలింగ్ హెల్ప్ అవసరమా లేదంటే కొంత వీళ్ళు చెప్తే అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని చూసుకొని ప్రాపర్ గా స్టెప్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఇది ఓవర్కమ్ చేయగలుగుతారు.
(09:09) థాంక్యూ ఫర్ వాచింగ్. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment