కాలభైరవుడు చెప్పిన 3 టైమ్ మేనేజ్మెంట్ సీక్రెట్ | STOP WASTING TIME | Motivation | SEETAKANTH TALKIE
Author Name:SEETAKANTH TALKIE
Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE
Youtube Video URL:https://www.youtube.com/watch?v=X2aL_9-h6Nc
Transcript:
(00:00) లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళకి టైం ని సరిగ్గా ఉపయోగించుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అక్కర్లేదు మీ టైం వేస్ట్ చేయని ఏదైనా వీడియో ఉంటే దానికి మీరు వెళ్ళిపోవచ్చు. ఇక విషయానికి వద్దాం కాలభైరవుడు పుట్టి పుట్టగానే తన ఎడమ చేతి చిటికిన వేలి గోరుతోటి సృష్టి చేయకుండా టైం వేస్ట్ చేస్తున్న బ్రహ్మగారి ఐదో తలని గిల్లేసాడు ఎందుకు అసలు బ్రహ్మదేవుడు సృష్టి చేయడం ఎందుకు ఆపేసాడు కాలభైరవుడు ఎలా పుట్టాడు ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు అసలు మనం మన టైం ని ఎలా వేస్ట్ చేసుకుంటున్నామో కాసేపు మాట్లాడుకుందాం ఆ తర్వాత ఈ కాలాన్ని వృధా చేసుకునే జబ్బు
(00:35) నుంచి ఎలా బయట పడాలో మాట్లాడుకుందాం ఉదయం ఆరు గంటలు సూర్యుడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవలేదు కానీ మన గదిలో మాత్రం ఒక చిన్న వెలుతురు అది మన ఫోన్ స్క్రీన్ అలారం మోగింది. మన జీవితాన్ని మార్చుకోవడానికి మన తలరాతను మనమే తిరగరాయటానికి ఆ దేవుడు మనకి అవకాశంగా ఇచ్చిన ఇంకొక కొత్త రోజు అది కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు కళ్ళు నలుపుకుంటూ బద్ధకంగా ఆ స్క్రీన్ వైపు చూసాం.
(01:00) ఒక్క నోటిఫికేషన్ ఒక్కటే కదా అని లోపలికి వెళ్తాం. అక్కడవాట్ప్వాట్ నుండిఇస్గ కి అక్కడి నుంచి రీల్స్ కి ఇంకొక ఐదు నిమిషాలు జస్ట్ లాస్ట్ రీల్ అని మనసుకు మనమే చెప్పుకున్న ఆ చిన్న అబద్ధం ఉదయం మనకున్న అత్యంత విలువైన గంటన్నర సమయాన్ని రాబందులా మింగేసింది. కానీ మన టైం ని మింగేస్తున్న రాక్షసుడు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాదు పగటి పూట మన చుట్టూ ఇంకా చాలా మాయలు ఉన్నాయి.
(01:25) ఉదయం 8ఎమిది గంటలకి ఆ ఫోన్ పక్కన పడేసి గిల్ట్ తో ఎలాగలాగా బ్రష్ చేసి ఇక చదువుకుందాం లేదా పని చేసుకునే వాళ్ళయితే పని చేసుకుందాం అని టేబుల్ ముందు కూర్చుంటాం సరిగ్గా అప్పుడే మన ఫోన్ మోగుతుంది. మన ఫ్రెండ్ ఫోన్ చేసి మామా కిందకా రా జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఛాయి దాక వచ్చేద్దాం అంటాడు. ఆ ఐదు నిమిషాల ఛాయ కోసం కిందకి వెళ్తాం.
(01:46) అక్కడ మన ముచ్చట్లు ఏంటి రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఎంత కలెక్ట్ చేయొచ్చు పక్కోడి లైఫ్ లో ఏం జరుగుతుంది అని ఆలోచించండి మనం మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉన్నారు కానీ సంబంధం లేని వాళ్ళ గురించి గొంతు చించుకొని అరుస్తూ మన జేబులో ఉన్న లేదా మన ఫోన్ పే లో ఉన్న ఆఖరి ప రూపాయల్ని మన జీవితంలో మళ్ళీ తిరిగిరాని రెండు గంటల సమయాన్ని ఆ ఛాయి బండి దగ్గర బోడిద చేస్తున్నది ఎవరు మనం సరే టైం వేస్ట్ అయిందని రియలైజ్ అయ్యి గదిలోకి వస్తాం అప్పుడు ఏం చేస్తాం పుస్తకం తీసినా
(02:20) చదవాలన్న ఇంట్రెస్ట్ రాదు టైం చూస్తాం 11 15 అయిఉంటుంది అరే 11 15 కి ఎందుకు మొదలు పెట్టడం రౌండ్ ఫిగర్ 11న్నరకి పక్కగా స్టార్ట్ చేద్దాం అని ఇంకో మాయలో పడతాం ఈ ఉన్న 15 నిమిషాలు బోరు కొడుతుందని జస్ట్ టీవీ ఆన్ చేస్తాం రిలాక్స్ అవుదాం అని అక్కడ ఒక వెబ్ సిరీస్ కనిపిస్తుంది ఆ ఎపిసోడ్ ఓపెన్ చేస్తాం అంతే ఆ ఒక్క ఎపిసోడ్ కాస్త మొత్తం సీజన్ అయిపోయేదాకా మనల్ని కుర్చీలో లో నుంచి లేవనివ్వదు.
(02:44) ఇంకొంతమంది అయితే మరీ ఘోరం పని చేయడం మానేసి ప్లానింగ్ కి ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు. ఎలా సక్సెస్ అవ్వాలి అని YouTube లో ఒక 10 మోటివేషనల్ వీడియోలు చూస్తారు. నాలుగు కలర్ పెన్లు తీసుకొని ఒక అందమైన టైం టేబుల్ గీసుకుంటారు అబ్బా భలే ప్లాన్ చేశంరా అని ఆ ప్లానింగ్ తోనే ఒక ఫేక్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయిపోయి పడుకుంటారు.
(03:03) ప్లానింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ పని చేయడంలో మాత్రం ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే మనం ఎప్పుడూ పర్ఫెక్ట్ మూడ్ కోసం వెయిట్ చేస్తుంటాం. మూడ్ బాగలేదు టైం సెట్ అవ్వలేదు రేపు ఫ్రెష్ గా మొదలు పెడదాం అని మనకు మనం చెప్పుకునే భయంకరమైన ఎక్స్క్యూస్ అది నిజం చెప్పాలంటే ఈ వ్యసనాలు ఈ డిస్ట్రాక్షన్స్ మన టైం ని తింటలేదు మన నెత్తురుని తాగుతున్నాయి.
(03:24) మనలో ఉన్న కసిని మన పౌరుషాన్ని ఒక చీప్ డోపైన్ కి తాకట్టు పెట్టేలా చేస్తున్నాయి. ఒక గొప్ప ఆఫీసర్ అవ్వాల్సిన వాడిని ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాల్సిన వాడిని కేవలం ఒక వ్యూవర్ లాగా ఒక గల్లీలో మాట్లాడే ఒక ప్రేక్షకుడు లాగా కట్టిపడేసి మన సగం జీవితాన్ని తినేస్తున్నాయి. ఇప్పుడు విషయానికి వద్దాం సరిగ్గా సాయంత్రం ఆ రోజంతా ఏమి చేయలేకపోయానన్న గిల్ట్ తో మన మైండ్ లోపల పుట్టే ఆలోచన ఏంటి ఈ రోజుకైతే మొత్తం మూడు పాడైపోయింది డే మొత్తం వేస్ట్ అయిపోయింది పోనీలే రేపు ఉదయం 5దు గంటలకే పక్కగా అలారం పెట్టి మొదలెడదాం చూసారా గిల్ట్ ని కవర్ చేసుకోవడానికి మన బ్రెయిన్
(03:58) ప్లే చేస్తున్న సైకలాజికల్ గేమ్ ఏంటది రేపు మళ్ళీ రేపు మళ్ళీ మళ్ళీ రేపు ఒకవైపు ఫోన్లు ఒకవైపు వెబ్ సిరీస్లు ఫ్రెండ్స్ తో ముచ్చట్లు మన సగం జీవితాన్ని తినేస్తుంటే మిగిలిన సగం జీవితాన్ని ఈ రేపు టుమారో అనే మాయరోగం మింగేస్తుంది. మనం రోజు మనల్ని మనం మోసం చేసుకుంటున్న అతి పెద్ద అబద్ధం పేరు రేపు టుమారో ప్రపంచంలో ఒక సక్సెస్ఫుల్ మనిషికి ఫెయిల్యూర్ మనిషికి మధ్య ఉన్న ఒకే ఒక తేడా ఈ టుమారో రేపు టుమారో ఇస్ ద గ్రేవ్యార్డ్ వేర్ ద గోస్ ఆఫ్ యువర్ పొటెన్షియల్ వండర్ అంటే మన అందరిలో ఉన్న టాలెంట్స్ మన భవిష్యత్తులు మొత్తం శవాల్లా మారిపోయి తిరిగే ఒకే ఒక
(04:38) భయంకరమైన స్మశానం పేరు ఈ రేపు ఈ టుమారో ఎప్పుడూ రాదు వచ్చినా కొత్తగా ఇరగదీసేది ఏమీ ఉండదు మన చేతుల్లో లో ఉన్నది ఈరోజు ఈ క్షణం మాత్రమే మనక ఏదైనా పని ఉంటే సాధించాలని ఒక గోలు ఉంటే మరి దాన్ని ఈరోజే ఎందుకు చేయట్లేదు ఈ క్షణమే ఎందుకు మొదలు పెట్టట్లేదు సమయం ఇంకా చాలా ఉందిలే వయసు ఉందిలే అని మన కళ్ళకి గంతలు కట్టి మనల్ని ఈ రేపు అనే స్మశానంలోకి నెట్టేస్తున్న మాయ ఏంటి దాన్ని ఎవరు బ్రేక్ చేస్తారు అసలు నిజమైన టైం మేనేజ్మెంట్ అంటే ఒక టైం టేబుల్ గీసుకోవడం కాదు ఆ మాయను చంపి కాలాన్ని శాసించడం అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మరి మనకు తెలియకుండానే మన చుట్టూ
(05:13) అల్లుకున్న ఈ ఇల్యూషన్ ఆఫ్ టైం అనే అనే ట్రాప్ ని ఎవరు తెంచుతారు? రేపు చూసుకుందాంలే అని మన మైండ్లో పేరుకుపోయిన ఈ మాయను ఎవరు చంపుతారు? మనం రోజు ఎన్నో టైం మేనేజ్మెంట్ బుక్స్ చదువుతాం. కొత్త కొత్త యప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటాం మోటివేషనల్ వీడియోస్ చూస్తాం. కానీ రెండు రోజుల తర్వాత మళ్ళీ మామూలే ఎందుకంటే బయట నుంచి వచ్చే ఏ మోటివేషన్ అయినా టెంపరరీే మనల్ని నిద్రలేపే ఒకే ఒక పవర్ఫుల్ శక్తి ఒక డివైన్ ఎనర్జీ మన పురాణంలో ఉంది అదే కాలభైరవాష్టకం ఆయనే కాలభైరవుడు సాధారణంగా మనం భైరవుడు అనగానే ఉగ్ర రూపంలో ఉండే ఒక దేవుడు అనుకుంటాం కానీ ఆయన పేరులోనే ఒక
(05:51) అద్భుతమైన సైకాలజీ దాగి ఉంది కాల ప్లస్ భైరవ కాలం అంటే టైము భైరవ అంటే ద ఫియర్స్ ద టెరిఫైంగ్ ద అన్స్టాపబుల్ ఎవరికీ భయపడని ఎవరి కోసం ఆగని ఒక అద్భుతమైన ఉగ్ర రూపం కాలభైరవుడు అంటే కాలాన్ని శాసించేవాడు సాక్షాత్తు దేవతలకు కూడా టైం అయిపోతుంది అని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలని గుర్తు చేసే మహాశక్తి అసలు ఆ ఉగ్ర రూపం ఎందుకు పుట్టిందో తెలుసుకుందాం దాని వెనక మన బ్రెయిన్ బ్లాక్ అయ్యే ఒక అద్భుతమైన సైకాలజీ ఉంది.
(06:22) మత్య పురాణం శివపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి చేసే క్రమంలో శతరూప అనే అత్యంత అందమైన స్త్రీ మూర్తిని సృష్టిస్తాడు కానీ సృష్టికర్తగా తన ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బ్రహ్మ తానే సృష్టించిన ఆ మూర్తి మీద అంటే ఆ స్త్రీ మూర్తి మీద తీవ్రమైన వ్యామోహాన్ని ఇది నా సృష్టి దీని మీద నాకే పూర్తి హక్కు ఉంది అన్న అహంకారాన్ని పెంచుకుంటాడు బ్రహ్మగారు చూస్తున్న ఆ చూపును ఆవిడ భరించలేక ఆవిడ ఏ దిక్కుక వెళ్తే ఆ దిక్కున ఇంకొక తలను బ్రహ్మగారు సృష్టిస్తారు ఆవిడ తప్పించుకొని ఆకాశం వైపు పరిగెత్తినప్పుడు ఆవిడను చూడటం కోసం బ్రహ్మ తనకి ఐదో తలను సృష్టించుకుంటాడు. ఈ ప్రాసెస్ లో ఏం
(06:59) జరిగిందంటే బ్రహ్మగారు తన అసలైన పవిత్రమైన సృష్టి కార్యాన్ని గాలికి వదిలేసి తన అహంకారం చుట్టూ ఆ మాయ చుట్టూ ఆయన వ్యామోహం చుట్టూ తిరగటం మొదలు పెడతాడు. క్రియేటర్ తన ఫోకస్ మొత్తం ఒకే మాయ మీద పెట్టడం వల్ల అసలు ఈ సృష్టి ప్రక్రియ బ్యాలెన్స్ తప్పి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. సరిగ్గా అప్పుడే అనంతమైన విశ్వంలో కాలం ఎవరి సొత్తు కాదు అది ఎవరి కోసం ఆగదు అని గుర్తు చేయడానికి మహాశివుడి నుదిటి మీద ఉన్న మూడో కన్నులో నుంచి ఒక ఉగ్రమైన అగ్ని జ్వాల పుట్టుకొచ్చింది ఆ అగ్ని జ్వాలే మన కాలభైరవుడు ఆ కాలభైరవుడు పుట్టగానే ఏ ఆయుధం తీసుకోలేదు ఎవరితోన యుద్ధం చేయలేదు
(07:36) మహా వేగంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి తన ఎడమ చేతి చిటికిన వేలి గోరుతోటి ఆ బ్రహ్మదేవుడికి ఉన్న ఐదో తలను అమాంతం గిల్లి పడేసాడు అంతే నాకు చాలా సమయం ఉంది అని విర్రవీగిన బ్రహ్మదేవుడి అహంకారం ఒక్క దెబ్బతో నేలకూలింది. తన టైం చాలా వేస్ట్ చేశాను అని రియలైజ్ అయిన బ్రహ్మ వెంటనే తప్పు తెలుసుకొని తన ధర్మాన్ని అంటే తన పనిని మళ్ళీ సైలెంట్ గా మొదలు పెట్టాడు విన్నారు కదా ఒక్కసారి ఈ పురాణాన్ని మీ రియల్ లైఫ్ కి అప్లై చేసి చూసుకోండి బ్రహ్మదేవుడికి ఉన్న ఆ ఐదో తల ఇంకెవరిదో కాదు అది మనదే మన బ్రెయిన్ దే నాకు ఇంకా వయసు ఉందిలే రేపు చేద్దాంలే అని మనం
(08:11) ప్రతిరోజు చూపిస్తున్న ఆ బద్ధకం ఉందే అదే ఆ ఐదో తల అదే మన అహంకారం ఆ అహంకారాన్ని ఆ పొగరుని సమూలంగా నాశనం చేయడానికే సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు వారు కాశీ నగరానికి వెళ్ళినప్పుడు ఆ నగరాన్ని శాసించే అధిపతి అయిన కాలభైరవుని స్తుతిస్తూ మనకోసం ఒక అద్భుతమైన స్తోత్రం రాశారు అదే కాలభైరవాష్టకం మనిషి లోపల ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేయడానికి శంకరాచార్యులు వారు అందించిన ఒక పవర్ఫుల్ యాక్టివేషన్ కోడ్ ఈ కాలభైరవాష్టకం అసలు దేవుడి స్తోత్రానికి మన టైం మేనేజ్మెంట్ కి ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు ఈ అష్టకంలో ఉండే ఒక రెండు లైన్స్
(08:51) చెప్తాను జాగ్రత్తగా వినండి మీ టైం పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది. ధర్మ సేతు పాలకం తధర్మ మార్గ నాశకం కర్మపాశ మోచకం సుశధర్మదాయకం విభుం అంటే ఏంటంటే ధర్మాన్ని కాపాడేవాడు అధర్మాన్ని నాశనం చేసేవాడు అలాగే మనల్ని బంధించిన ఆ కర్మ పాశాలను తెంచేవాడు ఆ కాలభైరవుడు అని టైం మేనేజ్మెంట్ పరంగా ఒక మనిషి సైకాలజీ పరంగా దీనికి అసలైన అర్థం ఏంటో తెలుసా ఇక్కడ ధర్మం అంటే గుడికి వెళ్ళటమో పూజ చేయడమో కాదు ఒక కుర్రాడు ఒక లక్ష్యం పట్టుకొని ఆ కల కోసం ఉదయాన్నే లేచి కష్టపడి చదువుకోవడం వాడి ధర్మం ఒక తండ్రి తన ఫ్యామిలీ పోషించడం కోసం నిజాయితీగా పని చేయడం అతని
(09:30) ధర్మం కానీ మనం ఏం చేస్తున్నాం ఆ పనిని పక్కన పెట్టేసి చేతిలో ఫోన్ పట్టుకొని మనకు ఉపయోగపడే వీడియోస్ మనం చూడాల్సిన రీల్స్ కాకుండా అలగారిథం మనకి ఏ రీల్స్ పంపిస్తే వాటన్నిటిని స్క్రోల్ చేస్తూ రోజు నాలుగు గంటల టైం వేస్ట్ చేస్తున్నాం రేపు చూద్దాంలే అని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ఇదే ఆ ధర్మం అలాగే ఈ డిజిటల్ అడిక్షన్ ఈ బద్ధకం మనల్ని ఒక అదృశ్యమైన ఇనప గొలుసులాగా కట్టి పడేసాయి ఈ ట్రాప్ లో నుంచి బయటికి రావాలని మనం ఎంత గింజుకున్నా రాలేకపోతున్నాం.
(10:02) మరి ఆ అష్టకం విన్నప్పుడు ఆ కాలభైరవుడు మనలో ఏం చేస్తాడు ఆయన చేతిలో ఉన్న డమరకం శబ్దం ఆయన నుంచి వచ్చే ఆ పవర్ఫుల్ వైబ్రేషన్ ముందుగా మనం చేస్తున్న ఆ అధర్మాన్ని అంటే రేపు చేద్దాం అని ఆ వాయిదా వేసే బుద్ధిని నిర్దాక్షణంగా నాశనం చేస్తాడు. ఆ తర్వాత నిన్ను స్క్రీన్ కి కట్టిపడేసే ఆ బద్ధకం అనే గొలుసులను ఒక్క దెబ్బతో ముక్కలు ముక్కలుగా తెంచేస్తాడు.
(10:25) నిన్ను పట్టి పీడిస్తున్న ఆ జడత్వాన్ని చంపి నిన్ను నీ లక్ష్యం వైపు పరిగెత్తేలా చేస్తాడు. ఇది ఆ శ్లోకం తాలూకు అసలైన యాక్టివేషన్. అష్టకం అంటే ఎనిమిది శ్లోకాలు అందులోని ఒక్కొక్క శ్లోకం అక్షరాల రూపంలో ఉన్న ఒక అగ్ని పర్వతం. ఏం అగ్ని పర్వతం? చీకటిగా నిరాశగా మారిపోయిన మన మెదళలోకి సూటిగా దూసుకుపోయి బద్ధకం అనే చీకటిని చీల్చుకుంటూ మనసులో ఒక భయంకరమైన చైతన్యాన్ని రగిలించే అగ్ని పర్వతం ఆ అష్టకం వింటున్నప్పుడు ఆ కాలభైరవుడి డమరకం నుంచి వచ్చే ప్రతి నాధం మన నరాల్లో నిద్రిస్తున్న పౌరుషాన్ని తట్టి లేపి నువ్వు పుట్టింది సమయాన్ని చంపటానికి కాదురా ఒక చరిత్రను
(11:02) సృష్టించడానికి అని గుండెల్లో దడ పుట్టించే ఒక దివ్యమైన మంత్రం సమయం అనేది మన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి ఉన్న ఒక ఫ్రీ రీసోర్స్ కాదు అది మనం మాస్టర్ చేయాల్సిన ఒక పవిత్రమైన రితం దాన్ని మాస్టర్ చేయాలంటే ముందు ఆ కాలభైరవుడి తత్వాన్ని మన బ్రెయిన్ లోకి ఎక్కించుకోవాలి మనం ఏమనుకుంటున్నాం అంటే ఫోన్ లో ఒక క్యాలెండర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటేనో లేదా మనం పని చేసేటప్పుడు పోమో డోరో టైమర్ ని ఆన్ చేసి పెట్టుకుంటేనో మన బద్ధకం వదిలిపోతుంది అనుకుంటాం.
(11:30) కానీ అదంతా ఒక భ్రమ టైం మేనేజ్మెంట్ అనేది యాప్స్ తో వచ్చేది కాదు అది మన బ్రెయిన్ లో ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఒక పవర్ఫుల్ రిచువల్ తో మొదలవ్వాలి. దానికి ఒక చిన్న ప్రోటోకాల్ ఉంది అది చెప్తాను మొత్తం త్రీ పాయింట్స్ జాగ్రత్తగా వినండి రేపటి నుంచి ఈ త్రీ పాయింట్స్ ని మీ ఆయుధాల్లా వాడండి ఒకటి ది మార్నింగ్ ప్రొటోకాల్ ఉదయం లేవగానే దిండు కింద ఉన్న ఫోన్ తీసుకొని నోటిఫికేషన్స్ చెక్ చేయటం మనందరికీ ఉన్న ఒక భయంకరమైన జబ్బు దాన్ని రేపటి నుంచి ఒక చిన్న ఛాలెంజ్ గా తీసుకుందాం ఉదయం లేచాక మొదటి 30 నిమిషాలు ఫోన్ ముట్టుకోకండి రాత్రికి రాత్రి ప్రపంచంలో ఎవడేమైపోతే మనక ఎందుకు
(12:03) వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు ముందు మన లైఫ్ ని మనం కాపాడుకో ోవాలి కదా లేవగానే ఒకే ఒక్క పని చేయండి నీట్ గా స్నానం చేసి కాలభైరవాష్టకం వినండి లేదా పట్టించండి. దానికి పట్టేది కేవలం ఒక 10 నిమిషాలు ఆ 10 నిమిషాలు మీరు దేవుడికి ఇస్తున్న టైం కాదు మీకు మీరు ఇచ్చుకుంటున్న టైం అది మనకి మనమే మన బ్రెయిన్ కి పంపుకునే ఒక స్ట్రాంగ్ డిక్లరేషన్ అదేంటంటే ఈరోజు నాది నా టైం నా కంట్రోల్ లో ఉంది నా ఫోకస్ అంతా నా చేతుల్లో ఉంది అని మన మైండ్ ని ఒక యుద్ధానికి రెడీ చేసే పవర్ఫుల్ మార్నింగ్ రిచువల్ ఇక రెండో పాయింట్ చెప్తాను ది ఎయిట్ అవర్స్ కర్మక్షేత్రం
(12:38) కాలభైరవాష్టకంలో ఎనిమిది శ్లోకాలు ఎలా అయితే ఉన్నాయో మన రోజులో మనకి కి ఒక క్వాలిటీ వర్కింగ్ టైం ని అలా డిజైన్ చేసుకుందాం. ఆ ఎనిమిది గంటల్ని ఒక్కో గంటకి ఒక్కొక్క శ్లోకం లాగా ఒక్కొక్క బ్లాక్ లాగా డివైడ్ చేసుకుందాం. మొదటి గంట మన రోజులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కష్టమైన టాస్క్ ని కంప్లీట్ చేద్దాం. రెండో గంట మన క్రియేటివ్ వర్క్ కి ఇద్దాం.
(12:58) మూడో గంట కమ్యూనికేషన్స్ కాల్స్ లేదా కొత్త స్కిల్స్ ని నేర్చుకోవడానికి వాడదాం. కానీ ఇక్కడ ఒక రూల్ ఏంటంటే ఒక్కో బ్లాక్ లో ఒక్కొక్క పని మీదే ఫోకస్ పెట్టాలి. ఈ మల్టీ టాస్కింగ్ అనే అబద్ధాన్ని గుడ్డిగా నమ్మకండి అది మీరు నాలుగు పనుల్లో ఎక్స్పర్ట్ అయ్యాక నాలుగు పనులు ఒకేసారి చేయగలిగే కేపబిలిటీ మీకు వచ్చాక చేసే పని అంతేగాని నేర్చుకునే టైంలో చేయాల్సిన పని కాదు అయినా నాలుగు పనులు ఒకేసారి చేస్తే మనమేం తోపులం అయిపోం ఏ పని సరిగ్గా అవ్వక మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది.
(13:28) ఇక ఎనిమిది గంటల పాటు మీరు కూర్చునే టేబులు ఒక టేబుల్ కాదు అది మీ కర్మక్షేత్రం మర్చిపోవద్దు ఆ టైంలో మీ ఫోన్ నోటిఫికేషన్స్ అన్ని కంప్లీట్ గా ఆఫ్ లో ఉంచండి. ఇక మూడో పాయింట్ కి వద్దాం రూత్లెస్ టైం కటింగ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా ప్రొక్రాస్టినేషన్ అని ఈ ప్రొక్రాస్టినేషన్ కి ముగ్గురు దరిద్రపు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ పేర్లు భయం సందేహం సోమరితనం భయం మనతో చెప్తుంది నువ్వు ఇది చేయలేవు ఫెయిల్ అవుతావు అని సందేహం చెప్తుంది అసలు నువ్వు ఎంచుకున్న ఈ దారి కరెక్టేనా అని సోమర్తనం చెబుతుంది ఏముందిలే రేపు చేద్దాం అని ఈ ముగ్గురు రాక్షసులని చంపాలంటే మనం కూడా ఆ కాలభైరవుల
(14:02) రూత్లెస్ గా మారాలి. ఎలా మారాలో తెలుసా ప్రతి పని ముందు మనల్ని మనం ఒక క్వశ్చన్ అడగాలి. ఈ పని చేస్తే నా లక్ష్యానికి నా గోలుకి ఇది హెల్ప్ చేస్తుందా అని హెల్ప్ చేస్తే ఆ పని లిస్ట్ లో ఉంచండి ఒకవేళ చేయకపోతే అది జస్ట్ టైం పాస్ పని అయితే ఆ పని నిర్దాక్షణంగా ఎలాంటి జాలి లేకుండా లిస్ట్ లో నుంచి కోసి పడేయండి. ఎందుకంటే పనికి మాలిని పనులు వ్యర్థమైన ఆర్గమెంట్స్ చిల్లర చిల్లర డిస్ట్రాక్షన్స్ మన టైంని తినటమే కాదు మన ఎనర్జీని దారుణంగా పీల్ చేస్తాయి.
(14:33) మన లక్ష్యం వైపు పరిగెత్తాల్సిన మన నెత్తురుని ఒక చీపు డోపమైన్ లాగా మార్చేస్తాయి. ఈ రూత్ లెస్ కటింగ్ మనకి అలవాటయితే ఆటోమేటిక్ గా మన టైం మన కంట్రోల్ లోకి వస్తుంది. ఒక పచ్చి నిజం చెప్తాను వినండి ఆ కాలభైరవుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒకే టైం ఇచ్చాడు కేవలం 24 గంటలు ఈ ప్రపంచంలో అందరికీ ఇచ్చింది ఆ ఒకే 24 గంటలు స్పేస్ఎక్స్ నడిపే ఎలన్ మస్క్ కి 24 గంటలే దేశాన్ని నడిపే ప్రైమ్ మినిస్టర్ కి 24 గంటలే నీకు 24 గంటలే నాకు 24 గంటలే అంటే ప్రపంచాన్ని ఏలుతున్న వాళ్ళకు ఏమి చేయలేక ఏడుస్తున్న వాళ్ళకు ఉన్న అసలైన వ్యత్యాసం ఏంటి వాళ్ళు ఆ 24 గంటల్ని ఎలా వాడుకుంటున్నారు మనం మన
(15:10) సమయాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నాం అనే దానిలో మాత్రమే తేడా ఉంది. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నాం కదా ఫోన్ చూస్తూ రీల్స్ స్క్రోల్ చేస్తూ తెలియకుండానే ఒక గంటన్నర టైం వేస్ట్ చేస్తుంటామ అని ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమయింది కదా ఆ గడిచిపోయిన గంటన్నర మళ్ళీ ఎప్పటికీ మన ప్రాణం ఇచ్చినా సరే తిరిగి రాదు అని పోనీ జరిగిపోయిన నష్టం జరిగిపోయింది.
(15:30) గడిచిన కాలం మనది కాదు కానీ ఇప్పటి నుండి రాబోయే గంటలు అవి మనవే కదా రేపటి నుంచి కాదు ఇప్పుడే ఈ క్షణం నుంచే ఆ కాలభైరవాష్టకంలో ఉన్న ఇంటెన్సిటీని మన బ్రెయిన్ లోకి తీసుకుందాం. మన ఫోన్ పక్కన పడేద్దాం. మన ఎనిమిది గంటల ఫోకస్ సైకిల్ ని మొదలు పెడదాం. మనలో ఉన్న ఆ రేపు చేద్దాం అనే రాక్షసుడిని ధైర్యంగా ఫేస్ చేద్దాం. కేవలం ఈ వీడియోని ఒక సినిమా చూసినట్లుగా పాసివ్ గా వినటం సరిపోదు.
(15:55) ఫ్రెండ్స్ కమిట్మెంట్ కావాలి యక్షన్ కావాలి అది కూడా ఇప్పుడే మొదలవ్వాలి కాలం ఎవరి కోసం ఆగదు కానీ మనం గట్టిగా తలుచుకుంటే ఆ కాలాన్ని మన గుప్పెట్లోకి తీసుకొని మాస్టర్ చేయగలం. ఆ కాలభైరవుడి అనుగ్రహంతో మన జీవితాన్ని మార్చుకోగలం. ఈ ఎపిసోడ్ మన పర్స్పెక్టివ్ ని మనలో ఉన్న బద్ధకాన్ని ఖచ్చితంగా చంపేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియోని వాయిదా వేసే అలవాటు ఉన్న మీ ప్రతి ఫ్రెండ్ కి ఖచ్చితంగా షేర్ చేయండి.
(16:17) వాళ్ళలోని బద్ధకాన్ని కూడా ఈరోజే చంపేద్దాం. కామెంట్స్ లో నిజాయితీగా చెప్పండి మీరు కూడా ఉదయాన్నే లేవగానే ఫోన్ చూస్తూ ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు ఈ ఎపిసోడ్ చూశాక మీలో మీరు ఏం మార్చుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ కంటెంట్ మీ గుండెని తాకితే కామెంట్స్ లో ఓం నమో కాలభైరవాయ అని టైప్ చేసి మీలో ఉన్న ఆ భయంకరమైన బద్ధకాన్ని ఆ దేవుడి పాదాల దగ్గర శాశ్వతంగా వదిలేయండి.
(16:41) మరో పవర్ ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం
No comments:
Post a Comment