మనల్ని అవమానించిన వాళ్ళు మళ్ళీ వస్తే కలుపుకోవాలా? వద్దా? #howtohandlefakepeople#telugumotivation
Author Name:Nenilaa-unnanu
Youtube Channel Url:https://www.youtube.com/@salmashaik1027
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0H-yemADrsc
Transcript:
(00:01) హలో హాయ్ నమస్తే అస్సలామ అలేకుం నేను ఇలా ఉన్నాను. మరి మీరు ఎలా ఉన్నారు? జోబులో రూపాయి లేనప్పుడు మనల్ని ఒక పురుగులా చూసిన కళ్ళు మనం ఒక స్థాయికి వచ్చి సొసైటీలో సెటిల్ అయ్యాక మనల్ని చూసి ఎందుకు అంతగా నవ్వుతాయి? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఎత్తని చేతులు మన అకౌంట్ లో డబ్బులు చేరాక మన హోదా పెరిగాక మనల్ని పలకరించడానికి ఎందుకు అంతలా ఎదురుచూస్తాయి? ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రతి ఒక్కరి గుండెలు పిండేసే అలాగే ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదుర్కొన్న ఒక చేదు నిజం మనం తక్కువ స్థానంలో ఉన్నప్పుడు మనల్ని నవ్వులపాలు
(00:41) చేసి అవమానించిన వాళ్ళు మనం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత సక్సెస్ అయ్యాక మళ్ళీ మన జీవితంలోకి వస్తే వాళ్ళను కలుపుకోవాలా వద్దా ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు కాస్త డబ్బు రాగానే పాత అవమానాలను మర్చిపోయి పోనేలే మన చుట్టాలే కదా మన స్నేహితులే కదా అని మళ్ళీ వాళ్ళను నెత్తిన పెట్టుకుంటారు.
(01:07) కానీ గుర్తుంచుకోండి వాళ్ళు వచ్చింది మీకోసం కాదు మీ వెనక ఉన్న మీ సక్సెస్ కోసం మీ డబ్బు కోసం మరి ఇలాంటి మనుషులను ఎలా డీల్ చేయాలి? వాళ్ళ మొహం మీదే తలుపులు వేసేయాలా లేక నవ్వుతూ కలుపుకోవాలా అసలు చాణక్య నీతి దీని గురించి ఏం చెప్తుంది? సైకాలజీ ఏం చెప్తుంది ఈ వీడియోలో మనం కేవలం పై పైన మాటలు చెప్పుకోవడం లేదు. ఇలాంటి స్వార్ధపరులైన మనుషుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మన మనశాంతిని ఎలా నిలబెట్టుకోవాలో ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం.
(01:40) ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీ ఆత్మగౌరవం కంటే ఏ బంధము ఎక్కువ కాదు. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక రూపాయి కోసం చేతులు చాచినప్పుడు సమాజం మిమ్మల్ని ఎలా చూసింది బంధువుల ఇంట్లో ఫంక్షన్ జరిగితే మిమ్మల్ని ఎలా పక్కన పెట్టారు మీ స్నేహితులే మిమ్మల్ని గ్రూపుల్లో నుంచి ఎలా దూరం పెట్టారు ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే ఇప్పటికీ గుండె పిండేస్తుంది కదు అవమానం అనేది ఒక మనిషిని నిలువున దహించేస్తుంది.
(02:14) జేబులో డబ్బు లేనప్పుడు మనిషికి విలువ ఉండదు అనేది లోకోక్తి కాదు అది నూటికి నూరుపాయలు నిజం నాడు మనల్ని చులకనగా చూసిన వాళ్ళు వీడేం పీకుతాడులే అని వెటకాలంగా నవ్విన వాళ్ళు ఈరోజు మీరు కష్టపడి రాత్రి పగల గనక శ్రమించి ఒక స్థాయికి వస్తే సొసైటీలో సెటిల్ అయ్యాక అకస్మాతుగా మీ ముందుకు వచ్చి నిలబడతారు. చిత్రం ఏమిటంటే వాళ్ళ ముఖాల్లో ఆనాడు ఉన్న అహంకారం ఇప్పుడు ఉండదు.
(02:43) దానికి బదులు ఒక నకలీ నవ్వు వినయం కనిపిస్తాయి. అరేయ్ బావా ఎలా ఉన్నావురా అసలు ఫోనే చేయట్లేదు అనో లేదా మావాడు ఎప్పుడూ నీ గురించే చెప్తుంటాడు. నువ్వు గ్రేట్ రా అనో పొగడతలను మొదలు పెడతారు. ఇలాంటి సమయంలో మన మనసులో రెండు రకాల ఆలోచనలు వస్తాయి. మొదటిది నాడు నన్ను అంత మాట అన్న వ్యక్తి ఈరోజు నా దగ్గరికి వచ్చి తగ్గి తగ్గి మాట్లాడుతున్నాడు అనే ఒక చిన్న గర్వం లేదా తృప్తి ఉంటుంది.
(03:10) రెండవది అసలు వీడిని నమ్మవచ్చా వీడు నిజంగానే మారాడా లేక నా వెనక ఉన్న నా హోదాను చూసి వస్తున్నాడా అనే ఒక పెద్ద అనుమానం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మీ జీవితంలోకి వస్తే మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. మీ వల్ల వాళ్ళకు ఏదో ఒక పని అవ్వాల్సి ఉంటుంది. లేదా సమాజంలో ఫలానా సక్సెస్ఫుల్ వ్యక్తి మాకు తెలుసు అని చెప్పుకొని తిరగడానికి మీ పేరు వాడుకుంటారు.
(03:38) ఇక రెండవది ఆర్థిక సహాయం. మీరు ధనవంతులయ్యారు కాబట్టి రేపు పొరపాటున వాళ్ళకు ఏదైనా అవసరమైతే సులువుగా అప్పు దొరుకుతుందనే స్వార్థం. ఇక మూడవది గిల్ట్ ఫీలింగ్ ఇది అరుదుగా జరుగుతుంది. తాము గతంలో చేసింది తప్పని నిజంగా రియలైజ్ అయ్యి పశ్చాత్తాపంతో రావడం కానీ ఇలాంటి వాళ్ళు 100 మందిలో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఈ మూడింట్లో వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో ఎలా కనిపెట్టాలి వాళ్ళను మన జీవితంలో ఏ స్థానంలో ఉంచాలి మనల్ని గతంలో అవమానించి ఇప్పుడు మన స్థాయిని చూసి మన దగ్గరకు వచ్చే వాళ్ళు నిజమైన మార్పుతో వచ్చారా లేక కేవలం స్వార్థంతో ముసుగు వేసుకొని వచ్చారా అనేది కనిపెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే
(04:19) పాము చర్మం వదులుతుంది కానీ విషాన్ని వదలదు. అలాగే కొంతమంది మనుషులు సమయాన్ని బట్టి రంగులు మారుస్తారు కానీ వాళ్ళ బుద్ధిని మార్చుకోరు. మరి వాళ్ళ మనసులో ఏముందో ఎలా కనిపెట్టాలి వాళ్ళు మీతో చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్ గా పాత విషయాన్ని గుర్తు చేయండి. గుర్తుందా బావా ఆ రోజు నేను అంత కష్టంలో ఉండి అడిగితే నువ్వు అలా అన్నావు నన్ను పక్కన పెట్టావు అని నవ్వుతూనే అనండి.
(04:44) నిజంగా మారిన వ్యక్తి అయితే వాళ్ళ ముఖంలో తప్పు చేశాననే బాధ కనిపిస్తుంది. అవునురా ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారు. స్వార్థంతో వచ్చిన వ్యక్తి అయితే అబ్బే అనలేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని కవర్ చేయడానికి చూస్తారు లేదా ఆ టాపిక్ ను మార్ చేయడానికి ప్రయత్నిస్తారు.
(05:06) అటువంటి వాళ్ళను ఒకసారి సహాయం అడిగి చూడండి. ఇది చాలా పవర్ఫుల్ టెస్ట్ మీరు ఆర్థికంగా ఎదిగినా కూడా కావాలనే వాళ్ళ దగ్గర ఒక చిన్న సహాయం అడగండి. డబ్బు బాగానే ఉంది కానీ అర్జెంట్ గా ఒక చోట బ్లాక్ అయిపోయింది. ఒకపవే ఉంటే ఇవ్వు వచ్చే వారం ఇస్తాను అనో లేదా ఏదైనా చిన్న పని చేసి పెట్టమనో అడగండి. మీ సక్సెస్ ను చూసి కున్నుకునే వ్యక్తి అయితే వీడికి ఇంత డబ్బు వచ్చినా ఇంకా నా దగ్గరే అడుగుతున్నాడా అనుకొని వెంటనే వెనకడుగు వేస్తాడు.
(05:36) ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. వారి బాడీ లాంగ్వేజ్ ను గమనించండి. సమయం దొరికినప్పుడు వాళ్ళ కళ్ళలోకి నేరుగా చూడండి. మీ ఎదుగుదల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో నిజమైన ఆనందం ఉందా లేదా ఒక రకమైన అసూయ ఇరకాటం కనిపిస్తున్నాయా మాటల్లో పొగుడుతూ చూపుల్లో వెటకారం చూపించే వాళ్ళను నకిలీ మనుషులు అని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ పరీక్షల ద్వారా వాళ్ళు ఎలాంటి వాళ్ళ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
(06:02) అయితే ఒకవేళ వాళ్ళు 100% స్వార్థంతోనే వచ్చారని మీకు అర్థమైతే అప్పుడు వాళ్ళను ఎలా డీల్ చేయాలి మనసులో కోపాన్ని పెట్టుకొని గొడవ పడాలా లేక చాన్క్యుడి లాంటి మేధావులు చెప్పినట్లు సైలెంట్ గా వాళ్ళకు బుద్ధి చెప్పాలా ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. సదరు వ్యక్తులు మనల్ని ఆనాడు అవమానించి ఈనాడు కేవలం మన డబ్బు హోదా చూసి మన దగ్గరకు వచ్చారని తేలిపోయింది.
(06:27) మరి ఇప్పుడు వాళ్ళను ఏం చేయాలి ఆ రోజు నన్ను నా నా మాటలు అన్నావు కదరా ఇప్పుడు ఏ మొహం పట్టుకొని వచ్చావు అని గొడవ పడాలా వద్దు అలా చేస్తే మీరు ఇంకా పాత కాలంలోనే పాత ఆలోచనలతోనే ఉండిపోయారని అర్థం. మీరు ఎదిగారు ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా ఒక స్థాయికి వచ్చారు కాబట్టి మీ డీలింగ్ కూడా చాలా రాయల్ గా ఒక బ్రాండ్ లా ఉండాలి.
(06:49) సమాజంలో బంధువులు లేదా స్నేహితులను పూర్తిగా కట్ చేయడం కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళతో మాట్లాడండి. కానీ ఆ సంభాషణ కేవలం హలో ఎలా ఉన్నారు? అంతా బాగుంది కదా అనేంతవరకే పరిమితం అవ్వాలి. మీ వ్యాపార రహస్యాలు మీ ఇంట్లో విషయాలు మీ ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ముందు అస్సలు ప్రస్తావించకండి ఒక లక్ష్మణ రేఖ గీసి వాళ్ళను ఆ అవతలే ఉంచండి.
(07:15) గతంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకోవడానికే ట్రై చేస్తారు. ఏదైనా పెద్ద సహాయం అడుగుతారు లేదా వాళ్ళ పిల్లలకో వాళ్ళకో మీ రికమెండేషన్ కావాలంటారు. అలాంటి సమయంలో ఏ మాత్రం మొహమాట పడకుండా చాలా సున్నితంగా కానీ బలంగా నో చెప్పేయండి.
(07:39) సారీ అండి ప్రస్తుత పరిస్థితుల్లో నావల్ల ఇది సాధ్యం కాదు అని మొఖం మీదనే నవ్వుతూనే తేల్చేయండి. మీరు చెప్పిన నో వాళ్ళకు పాత రోజులను గుర్తు చేస్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే చూసావా ఆ రోజు నన్ను అన్నావు ఈ రోజు నేను ఎక్కడున్నానో చూడు అని వాళ్ళ ముందు ప్రగల్భాలు పలుకుతారు. ఇది చాలా తప్పు మీ సక్సెస్ ను వాళ్ళ ముందు ప్రదర్శించకండి. మీ ఎదుగుదల వాళ్ళ కళ్ళకు కనిపిస్తూనే ఉంది.
(08:06) దాన్ని మీరు నోటితో చెప్పి మీ స్థాయిని తగ్గించుకోవద్దు. మీ నిశశబ్దమే వాళ్ళకు అతి పెద్ద శిక్ష. వాళ్ళు మీ ముందుకు వచ్చినప్పుడు మీ ముఖంలో పాత కోపం కానీ కళ్ళలో కక్ష కానీ కనిపించకూడదు. ఎందుకంటే మీలో ఇంకా కోపం ఉందంటే వాళ్ళు మిమ్మల్ని ఇంకా కంట్రోల్ చేస్తున్నారని అర్థం. ఎప్పుడైతే వాళ్ళ ఉనికి మీకు ఎలాంటి తేడాను తీసుకురాదో అప్పుడే మీరు వాళ్ళపై పూర్తిగా విజయం సాధించినట్టు.
(08:30) ఇదంతా విన్నాక మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు ఇదంతా సరే బంధాలను మెయింటైన్ చేయడం కోసం మనల్ని మనం ఇంతలా మార్చుకోవాలా అని అసలు వీళ్ళందరినీ పక్కన పెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఒంటరిగా ఎదగడం బెటరా లేక సమాజం కోసం నటిస్తూ బతకాలా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ముఖ్యంగా మనుషుల ప్రవర్తన నిజానికి ఆ రోజు వాళ్ళు మిమ్మల్ని అవమానించడం ఒక రకంగా మీ మంచికే జరిగింది.
(08:58) ఎందుకంటే ఒకవేళ ఆ రోజు వాళ్ళు మిమ్మల్ని నవ్వుతూ ఆదరించి ఉంటే మీరు ఈరోజు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చేవారు కాదు. ఆ రోజు వాళ్ళు విసిరిన అవమానాలే మిమ్మల్ని రాత్రి పగలు కష్టపడేలా చేశాయి. వాళ్ళు చూపించిన చులకన భావమే మీలో నేనేంటో నిరూపించుకోవాలి అనే కసిరి పెంచింది. ఆ రకంగా చూస్తే మీ సక్సెస్ లో మీకు తెలియకుండానే వాళ్ళు కూడా ఒక కారణంఅయ్యారు.
(09:23) అందుకే వాళ్ళ మీద కక్ష పెంచుకొని మీ విలువైన సమయాన్ని మీ ప్రశాంతతను పాడు చేసుకోకండి. గుర్తుంచుకోండి. మీరు శూన్యం నుండి ఈ స్థాయికి వచ్చారు. మీ జాబు ఖాళీగా ఉన్నప్పుడు మీ పక్కన నిలబడిన ఆ నలుగురు ఐదుగురు మనుషులు ఉంటారు చూశారా? వాళ్లే మీ నిజమైన ఆస్తి వాళ్ళకు మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వండి. ఇక మీరు ఎదిగాక వస్తున్న ఈ ప్రేక్షకుల విషయానికి వస్తే వాళ్ళకు మీ జీవితంలో స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీ మనసులో మాత్రం స్థానం ఇవ్వకండి.
(09:52) వాళ్ళతో గొడవలు వద్దు అలాగని అతిగా కలవడం వద్దు. నమస్కారం పెట్టండి మీ దారిలో మీరు సాగండి. ఎందుకంటే మిమ్మల్ని తక్కువ స్థానంలో చూసి నవ్విన వాళ్ళు రేపు మీరు మరింత ఎత్తుకు ఎదిగితే ఏడుస్తారు. ఎదుటివారి నవ్వులను ఏడుపులను పట్టించుకుంటూ కూర్చుంటే మనం అనుకున్న గమ్యాన్ని చేరలేము. చివరిగా ఒక మాట మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మళ్ళీ వస్తే కలుపుకోవాలా వద్దా అనే ప్రశ్నకు ఒకే ఒక సమాధానం వాళ్ళను మీ గతం లాగా గుర్తుపెట్టుకోండి కానీ మీ భవిష్యత్తు లాగా నమ్మకండి.
(10:25) మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి మిమ్మల్ని నమ్మిన వాళ్ళను ప్రాణంగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
No comments:
Post a Comment