NLP తో Mind చదవండి | 4 Secret Techniques Telugu
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BrmGvWT0Ws8
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చిన్నప్పటి నుంచి మనకి చదవడం నేర్పించారు కష్టపడడం నేర్పించారు. కానీ మన మైండ్ లో వచ్చే నెగిటివ్ ఆలోచనల్ని ఎలా ఆపాలో ఎవరైనా నేర్పించారా ఎవరైనా ఒకరు మిమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు లేదా ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ బాధ నుండి భయం నుండి ఎలా బయటపడాలో ఎవరైనా సరే నేర్పించారా నిజానికి ఆ తప్పు వాళ్ళది కాదు మనది కాదు.
(00:21) మీ బ్రెయిన్ లో చిన్నప్పటి నుంచి పడిపోయిన కొన్ని తప్పుడు ప్రోగ్రామ్స్ కి మీరు తెలియకుండానే బానిస అయిపోయారు. కంప్యూటర్ కి ఎలాగైతే కోడింగ్ మారుస్తామో మన బ్రెయిన్ లోని ఆలోచనలకు కూడా కోడింగ్ మార్చాలి. అండ్ ఆ బ్రెయిన్ లోని కోడింగ్ ని మార్చే ఒక అద్భుతమైన సైన్స్ ఉంది దాన్నే ఎన్ఎల్పి. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని అంటారు.
(00:40) సో ఈరోజు వీడియోలో మనం ఎన్ఎల్పి ద ఎసెన్షియల్ గైడ్ అనే పుస్తకంలోని కొన్ని మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ సీక్రెట్స్ ని తెలుసుకోబోతున్నాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుస్తకంలోని మెయిన్ పాయింట్స్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఎన్ఎల్పి లో అన్నిటికంటే బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఒకటి ఉంది. అదే ద మ్యాప్ ఇస్ నాట్ ద టెర్రిటరీ అంటే మ్యాప్ అనేది కేవలం దారిని చూపించడానికి తప్ప అదే అసలైన రోడ్ కాదు.
(01:11) దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఏదైనా ఒక కొత్త ఊరికి వెళ్ళినప్పుడు ఫోన్ లోగ మ్యాప్స్ అనేది వాడతారు. ఆ మ్యాప్ లో మీకు కేవలం ఒక బ్లూ కలర్ లైన్ మాత్రమే కనిపిస్తుంది. కానీ రియాలిటీలో ఆ రోడ్డు మీద ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని బైక్లు ఉన్నాయి అక్కడ ఎన్ని గుంతలు ఉన్నాయి అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది ఆ మ్యాప్ మీకు చూపించదు.
(01:30) మ్యాప్ అనేది కేవలం ఒక రిప్రజెంటేషన్ మాత్రమే అసలైన ఎక్స్పీరియన్స్ అక్కడికి మనం వెళ్తే గాని మనకు తెలియదు. సరిగ్గా మన బ్రెయిన్ కూడా మన లైఫ్ లో ఇదే ట్రిక్ ప్లే చేస్తుంది. బయట ప్రపంచంలో జరిగే విషయాలు వేరు కానీ మన మనసు లోపల మనం గీసుకునే మ్యాప్ అది వేరు. ఉదాహరణకి మీరు ఒక షాపింగ్ మాల్కో లేకపోతే ఆన్లైన్ వెబ్సైట్ లోకి వెళ్ళారు. అక్కడ ఒక బ్రాండెడ్ షర్ట్ లేదా ఒక వస్తువు మీకు కనిపించింది.
(01:54) దాని అసలు ధర₹5000 రూపాయ కానీ దాని పక్కన 70% డిస్కౌంట్ అని ఉంది. కేవలం 1500 రూపాయలకే అది మీకు వస్తుందని రాసిఉంది. ఇంత మంచి ఆఫర్ మళ్ళీ రాదు నేను చాలా లాభపడతాను అని ఒక బ్రమను మీ బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. ఆ మ్యాప్ ని చూసి వెంటనే మీరు క్రెడిట్ కార్డు తీసి ఆ వస్తువుని కొనేస్తారు. కానీ ఒక్కసారి ఆ మైండ్ మ్యాప్ నుంచి మీరు బయటకి వచ్చి ప్రాక్టికల్ గా ఆలోచించండి.
(02:15) వాస్తవానికి రియాలిటీలో అక్కడ జరిగింది ఏంటి? మీ అకౌంట్ లో నుంచి 1500 డబ్బు బయటికి వెళ్ళిపోయింది. అంటే మీరు ₹3,500 ఏమి సేవ్ చేయలేదు.1500 1500 రూపాయలు ఖర్చు చేశారు. నిజానికి ఆ వస్తువు అవసరం మీకు అసలు లేకపోయినా మీ బ్రెయిన్ గీసిన ఆ డిస్కౌంట్ అనే మ్యాప్ ని చూసి మీరు లాభపడ్డాను అని అనుకుని నష్టపోతున్నారు. మన జీవితంలో ప్రతిరోజు ఇది జరుగుతుంది.
(02:38) బయటఉన్న వాస్తవాన్ని మనం వదిలేసి మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఆ తప్పుడు మ్యాప్లను చూసి మనం మోసపోతుంటాం. లేనిపోని అపోహలు పెంచుకుంటాం. అందుకే ఆ తప్పుడు మ్యాప్ల వెనుక అసలైన నిజాన్ని చూడడం మనం నేర్చుకోవాలి. చాలామంది వాళ్ళ లైఫ్ లో కూడా ఒక ఫెయిల్యూర్ రాగానే నా జీవితం ఇంతే నేను దేనికి పనికి రాను అని వాళ్ళ మైండ్ లో ఒక ఫిక్స్డ్ మ్యాప్ ని లాక్ చేసేసుకుంటారు.
(03:01) కానీ నిజానికి బయట ప్రపంచంలో చాలా అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ఎల్పి మనకు నేర్పించే మొదటి పాఠం ఇదే మీ బ్రెయిన్ లో వచ్చే ప్రతి ఆలోచనని ప్రతి భయాన్ని గుడ్ గా నమ్మేయకండి. అది కేవలం మీ మైండ్ గీస్తున్న ఒక చిన్న రాంగ్ మ్యాప్ మాత్రమే. ఒక్కసారి ఆ ఆలోచనల నుంచి బయటకి వచ్చి చూస్తే రియాలిటీలో ప్రపంచం చాలా పెద్దది మీకున్న సమస్య చాలా చిన్నది అని మీకు అర్థంవుతుంది.
(03:24) మీ మైండ్ లో ఉన్న ఆ పాత తప్పుడు మ్యాప్ ని మీరు గనుక మార్చగలిగితే మీ లైఫ్ లోని రూట్ ఆటోమేటిక్ గా కరెక్ట్ గా మారిపోతుంది. ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్రియేటివ్ జీనియస్ అయిన వాల్ డిస్నీ ఒక చిన్న ఐడియా నుంచి వందల కోట్ల బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారో తెలుసా? ఆయన బ్రెయిన్ లో ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఉండేది దాన్నే ఎన్ఎల్పి లో ఒక పవర్ఫుల్ టూల్ లాగా మార్చారు.
(03:51) మనలో ప్రతి ఒక్కరి లోపల ఎప్పుడూ కూడా ఒక యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త అవకాశం వచ్చినప్పుడు లేకపోతే ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు ఒక కొత్త బిజినెస్ ఐడియా వచ్చినప్పుడు మన మైండ్ లో మూడు వేరు వేరు క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయి. ఈ మూడు క్యారెక్టర్లని సరైన క్రమంలో వాడటమే డిస్నీ స్ట్రాటజీ రహస్యం. ఆ మూడు క్యారెక్టర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
(04:08) ముందుగా ద డ్రీమర్ మీ మైండ్ లో ఒక ఐడియా రాగానే ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా అడ్డంకులు లేకుండా ఆ ఐడియా ఎంత పెద్ద సక్సెస్ అవ్వచ్చో ఊహించుకోవడం నా దగ్గర బడ్జెట్ ఉందా నా దగ్గర స్కిల్ ఉందా అని ఏ రకమైన లాజిక్లు ఆలోచించకుండా కేవలం ఆ ఐడియా వల్ల వచ్చే అద్భుతమైన అవకాశాలను మాత్రమే ఒక కలలాగా మనం ఊహించుకుంటాం. ఇదే డ్రీమర్ చేసే పని.
(04:31) అలాగే ద రియలిస్ట్ కల కనడం అయిపోయాక ఇప్పుడు మీ మైండ్ లోని రెండో క్యారెక్టర్ రియలిస్ట్ ని బయటకి తీస్తారు. ఇక్కడే ఇన్నర్ బాటిల్స్ మొదలవుతాయి. ఈ రియలిస్ట్ ఏం చేస్తాడంటే సరే ఆ కల నిజం కావడానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి టైం ఎంత ఉంది యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి ఆ కలని ఒక రియల్ ప్లాన్ లాగా మారుస్తాడు.
(04:51) మూడోది క్రిటిక్ చాలా మంది ఈ క్రిటిక్ ని ముందే వాడేసి ఐడియాల్ని స్టార్టింగ్ లోనే చంపేస్తూ ఉంటారు. కానీ ఈ స్ట్రాటజీలో క్రిటిక్ ని చివర్లో వాడాలి. ఈ క్రిటిక్ ఏం చేస్తాడంటే ఆ ప్లాన్ లో ఉన్న లోపాలుఏంటి ఎక్కడ రిస్క్ ఉంది రేపు పొద్దున ఏం ప్రాబ్లం రావచ్చు అని నెగిటివ్ యాంగిల్ లో ఆలోచించి ఆ ప్లాన్ ని మరింత స్ట్రాంగ్ గా మారుస్తాడు. ఈ డిస్నీ స్ట్రాటజీ బ్యూటీ ఏంటో తెలుసా దీన్ని మీరు కేవలం మీ పర్సనల్ లైఫ్ లోనే కాదు ఆఫీస్ లో మీ టీం తో గాని లేదా ఒక గ్రూప్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు గాని అద్భుతంగా వాడుకోవచ్చు.
(05:20) సాధారణంగా ఒక గ్రూప్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఒకరు ఒక ఐడియా చెప్పగానే ఇంకొకరు వెంటనే ఇది వర్కవుట్ అవ్వదు అని ముందే క్రిటిక్ లాగా మాట్లాడేస్తుంటారు. దానివల్ల ఆ గ్రూప్ లో క్రియేటివిటీ అనేది పెరగదు చచ్చిపోతుంది. దాని బదులుగా మీ టీం్ ని మూడు రూముల్లో కూర్చోబెట్టండి లేదా మూడు సెషన్లుగా డివైడ్ చేయండి.
(05:37) సెషన్ వన్ లో టీం్ లో ఉన్న ప్రతి ఒక్కరు డ్రీమర్స్ లాగా ఆలోచించాలి. ఎవరు ఎవరిని తప్పు పట్టకూడదు. కేవలం ఐడియాలు మాత్రమే చెప్పాలి. సెషన్ ట లో ఆ వచ్చిన ఐడియాల్ని రియలిస్ట్ గా మారి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ప్లాన్ చేయాలి. సెషన్ 3 లో చివరగా అందరూ క్రిటిక్స్ లాగా మారి ఆ ప్లాన్ లో ఉన్న లోపాలు ఏంటో వెతికి వాటిని సరిదిద్దుకోవాలి.
(05:56) నాట్ ఓన్లీ ఇన్ టీమ్స్ మీకు పర్సనల్ గా ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా మీద మీరు కూడా హ్యాపీగా కూర్చుని ఈ స్ట్రాటజీ వాడొచ్చు. మీ లోపల ఏవో యంజైటీస్ ఉన్నాయి. దానికి కూడా ఈ త్రీ కేటగిరీ స్ట్రాటజీతో ఆలోచించి మీ యంజైటీలో ఎంత నిజం ఉంది అని మిమ్మల్ని మీరే ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఈ మూడు క్యారెక్టర్లని ఇప్పుడు మనం మాట్లాడుకున్న పద్ధతి ప్రకారం వాడుతారో మీ లోపల ఉండే ఆ కన్ఫ్యూషన్ ఆ ఇన్నర్ బాటిల్స్ పూర్తిగా తొలగిపోతాయి.
(06:21) మీ టీం లో లేదా మీ పర్సనల్ లైఫ్ లో ప్రతి అవకాశాన్ని మీరు సక్సెస్ గా మార్చగలరు. ఎందుకంటే ఒక ప్లాన్ కి కలలు కనే డ్రీమర్ ఎంత ముఖ్యమో దాన్ని నిజం చేసే రియలిస్ట్ కూడా అంతే ముఖ్యం. అలాగే క్రిటిక్ కూడా ఇంకా ఇంకా ముఖ్యం. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు మీకు నేను తెలుగు గీక్స్ అకాడమీ లోని ఒక అప్డేట్ చెప్పాలి అది చెప్పేస్తాను. మన అకాడమీలో ద టైం మాస్టరీ అనే కోర్స్ ని మనం స్టార్ట్ చేశం.
(06:42) దాంట్లోని ఫస్ట్ మోడ్యూల్ లోని ప్రీ రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయిపోయాయి. సో కొన్న వాళ్ళు తప్పకుండా చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అలాగే ఇంకా కొనని వాళ్ళు తప్పకుండా అకాడమీలో మూడు కోర్సులు ఉన్నాయి. అలాగే ఒక ప్యాకేజ్ కూడా ఉంది. ఒక డీల్ కూడా నడుస్తుంది ప్యాకేజ్ లో సో మీకు నచ్చిన కోర్సు ని తప్పకుండా తెలుగు వీక్స్ అకాడమీలో ఒకసారి చూడండి.
(06:58) దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎదుటి వ్యక్తి మైండ్ లో ఏం నడుస్తుందో వాళ్ళు నోరు విప్పకముందే మనం ఎలా కనిపెట్టాలి ఎన్ఎల్పి లో ఒక పక్కా సైంటిఫిక్ రూల్ ఉంది. ఒక మనిషి మాట్లాడే మాటలు కేవలం 7% మాత్రమే మిగతా 93% ఇన్ఫర్మేషన్ వాళ్ళ వాయిస్ స్టోన్ లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో దాగి ఉంటుంది. దాన్నే నాన్ వెర్బల్స్ అని అంటారు.
(07:24) అంటే మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ హావభావాలు కూడా ఒక లాంగ్వేజ్ మాట్లాడతాయి. అదే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. దీన్ని మీరు గనక సరిగ్గా అబ్సర్వ్ చేయడం నేర్చుకుంటే వాళ్ళ ఆలోచనలు మీకు ఒక పక్కా డైరెక్షన్ ని చూపిస్తాయి. ఇది మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఒక సప్లయర్ తన ప్రొడక్ట్ ని అమ్మడానికి వచ్చాడు.
(07:44) ఆ డీల్ వాల్యూ 5 లక్షల డాలర్లు రూమ్లో పెద్ద పెద్ద మేనేజర్లు ఇన్వెస్టర్లు కూర్చుని ఉన్నారు. ప్రెజెంటేషన్ అంతా అయిపోయింది. ఆ సప్లయర్ ఒక ప్రైస్ చెప్పాడు. అదే 5 లక్షల డాలర్ ఆ రూమ్లో ఉన్న మెయిన్ హెడ్ కి ఆ ప్రైస్ వినగానే పైకి గంభీరంగా నార్మల్ గా ఉంటూ సరే మీ ప్రైస్ బాగుంది మేము డిస్కస్ చేసి చెప్తాం అని అంటాడు. బయట ప్రపంచానికి ఆ హెడ్ చాలా పాజిటివ్ గా మాట్లాడినట్టు అనిపించింది.
(08:04) ఆ సప్లయర్ టీం కూడా అబ్బా డీల్ ఓకే అయిపోవచ్చు అని సమ్మర్ పడటం మొదలు పెట్టారు. కానీ ఆ టీం్ లో ఉన్న ఒకే ఒక ఎన్ఎల్పి ఎక్స్పర్ట్ మాత్రం వెంటనే ఆ సప్లయర్ కి సైగ చేసి వద్దు ఒక 10% డిస్కౌంట్ ఇవ్వు అని చెప్పాడు. మిగతా వాళ్ళంతా షాక్ అయ్యారు. ఆయన అంత పాజిటివ్ గా చెప్తే నువ్వేంటి ప్రైస్ తగ్గించమంటున్నావ్ అని అడిగారు. కానీ ఆఎన్ఎల్పి ఎక్స్పర్ట్ ఏం గమనించాడో తెలుసా ఆ 5 లక్షల డాలర్ల ప్రైస్ చెప్పిన మరుక్షణమే ఆ కంపెనీ హెడ్ కి తెలియకుండానే అతని గొంతు దగ్గర ఉన్న ఒక నరం చాలా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది.
(08:32) అతని శ్వాస వేగం పెరిగింది. అతని పెదాలు కొంచెం గట్టిగా ప్రెస్ అయ్యాయి. పైకి అతను చాలా ప్రశాంతంగా మాట్లాడిన అతని నాన్ వెర్బల్ సిగ్నల్స్ మాత్రం ఈ ప్రైస్ నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నేను ఈ డీల్ ని రిజెక్ట్ చేయబోతున్నాను అని చాలా క్లియర్ గా ఒక డైరెక్షన్ ని చూపించాడు. ఆ సిగ్నల్ ని ముందే రీడ్ చేసిన ఈఎన్ఎల్పి ఎక్స్పర్ట్ వెంటనే ప్రైస్ తగ్గించేసరికి ఆ కంపెనీ హెడ్ రిలాక్స్ అయ్యి వెంటనే డీల్ మీద ఓకే అని సైన్ చేశాడు.
(08:56) సో ఒకసారి ఆలోచించండి ఆ నాన్ వెర్బల్స్ ని గనుక అతను గమనించకపోయి ఉంటే 5 లక్షల డాలర్ల డీల్ అక్కడే క్యాన్సిల్ అయిపోయిది. మన డే టు డే లైఫ్ లో కూడా ఇదే జరుగుతుంది. మీ ఆఫీస్ లో బాస్ మీ వర్క్ చూసి పైకి బాగుంది అని అంటున్న అతని చేతులు ఫోల్డ్ అయి ఉండి అతను వెనకడుగు వేస్తున్నాడు అంటే అతనికి మీ వర్క్ నచ్చలేదు అని అర్థం. మీ బిజినెస్ క్లైంట్ మీతో మాట్లాడుతున్నప్పుడు అతని కాళ్ళు డోర్ వైపు తిరిగి ఉన్నాయి అంటే అతనికి మీ మాటలు బోరు కొడుతున్నాయి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు అని అర్థం. మనుషులు మాటలతో
(09:28) అబద్ధం చెప్పగలరు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో ఎప్పటికీ అబద్ధం చెప్పలేరు ఎందుకంటే నాన్ వెర్బల్స్ అన్ని మన సబ్కాన్షియస్ మైండ్ నుండి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఎదుటి వ్యక్తి బాడీ ఇచ్చే ఆ చిన్న చిన్న హింట్స్ ని మీరు గనక పట్టుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏం దాచాలనుకుంటున్నారో కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది.
(09:47) మీరు నిజంగానే అవతల వ్యక్తి మైండ్ ని రీడ్ చేయడం మొదలు పెట్టొచ్చు. సో మీకు గనుక మైండ్ రీడింగ్ మీద ఇంకా మంచి మంచి విషయాలు ఈఎన్ఎల్పి పుస్తకంలో నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. తప్పకుండా దాని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సరే ఇప్పుడు మన లోపల జరిగే ఇంకొక పెద్ద మాయ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రతి సెకండ్ మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి మన బ్రెయిన్ కి దాదాపు 20 లక్షల బిట్ల ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది.
(10:14) కానీ మన బ్రెయిన్ అంతా ఆ డేటాని ఒకేసారి తీసుకోలేంు. ఒకవేళ తీసుకుంటే మైండ్ క్రాష్ అయిపోతుంది. అందుకే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఒక పవర్ఫుల్ సెన్సార్ బోర్డ్ ఉంటుంది. బయట నుంచి వచ్చే ఆ లక్షల కోట్ల ఇన్ఫర్మేషన్ ని వడగట్టి కేవలం మనకు కావాల్సిన ఆ 130 బిట్స్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మన కళ్ళకు చూపిస్తుంది. ఈ వడకట్టే ప్రాసెస్ లో మన మైండ్ మూడు ఫిల్టర్స్ ని వాడుతుంది.
(10:36) ఈ ఫిల్టర్స్ ఏంటో మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే లైఫ్ లో ఎప్పుడూ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూనే ఉంటారు. ఆ మూడు ఫిల్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది డిలీషన్ మీ లైఫ్ లో 100 మంచి విషయాలు జరుగుతున్న మీ బ్రెయిన్ వాటన్నిటిని డిలీట్ చేసి కేవలం ఏదో ఒక నెగిటివ్ విషయాన్ని మాత్రమే పట్టుకొని మీకు చూపిస్తుంది. ఉదాహరణకి మీరు ఆఫీస్ లో ఒక అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారా అని అనుకుందాం.
(10:58) మీ కొలీగ్స్ అందరూ వచ్చి సూపర్ ఇరగతీసావు అని పొగిడారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఇంకొంచెం బెటర్ చేయాల్సింది అని అన్నాడు. మీ బ్రెయిన్ ఏమంటుందో తెలుసా ఆ మిగతా 100 మంది చెప్పిన పాజిటివ్ కామెంట్స్ ని పక్కకు పెట్టేసి అంటే డిలీట్ చేసేసి ఆ ఒక్క నెగిటివ్ కామెంట్ ని పట్టుకొని రాత్రంతా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. రెండోది డిస్టోర్షన్ అంటే బయట జరిగిన నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా మనకి నచ్చినట్టు వంకరగా ఊహించుకోవడం రోడ్డు మీద వెళ్తుంటే మీకు తెలిసిన వ్యక్తి ఒకరు అటువైపు నుండి వచ్చారు.
(11:25) కానీ అతను మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోయాడు. రియాలిటీలో అతను ఏదో ఆలోచనలో ఉండి మిమ్మల్ని గమనించకపోవచ్చు కానీ మీ మైండ్ ఆ నిజాన్ని డిస్టార్ట్ చేస్తుంది. అతనికి అహంకారం పెరిగింది వాడు బలిస్సు కొట్టుకుంటున్నాడు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు నన్ను కావాలని అవమానించాడు అని లేని సీన్ ని క్రియేట్ చేస్తుంది.
(11:42) గొడవలు అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇక ఆఖరిది మోస్ట్ డేంజరస్ ఫిల్టర్ జనరలైజేషన్ జీవితంలో ఒకటి లేదా రెండు బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అవ్వగానే ఈ ప్రపంచమే ఇంత అందరూ ఇంతే అని ఒక ఫిక్స్డ్ రూల్ ని రాసేసుకుంటుంది. ఒక బిజినెస్ లో ఫెయిల్ అవ్వగానే బిజినెస్ లు చేయడం మన వల్ల కాదు మన జాతకంలో సక్సెస్ లేదు అని జనరలైజ్ చేసేస్తాం లేదా ఒకరు మిమ్మల్ని మోసం చేయగానే మనుషుల్లో ఎవరిని నమ్మకూడదు అందరూ మోసగాలే అని ఒక బౌండరీని గీసేసుకోవడం సో ఒకసారి ఆలోచించండి మీ మైండ్ లో ఉన్న ఈ మూడు ఫిల్టర్స్ వల్ల మీరు అసలైన ప్రపంచాన్ని చూడకుండా మీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక నకిలిీ ప్రపంచంలో
(12:17) బ్రతుకుతున్నారు.ఎన్ఎల్పి ఎన్ఎల్పి మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడైనా మీ లైఫ్ లో డిప్రెషన్ లేదా యంజైటీ వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ మనస్సాక్షిని అడగండి. నా బ్రెయిన్ ఇప్పుడు ఏ సమాచారాన్ని డిలీట్ చేస్తుంది నిజాన్ని ఎలా వంకరగా మారుస్తుంది ఎక్కడ జనరలైజ్ చేస్తుంది అని అడగండి. ఈ మూడు ఫిల్టర్ల మాయ నుంచి మీరు ఎప్పుడైతే బయటికి వస్తారో మీ మైండ్ లోని సెన్సార్ బోర్డ్ క్లీన్ అవ్వడం మొదలవుతుంది.
(12:41) అప్పుడు మీకు సమస్యలు రావడం తగ్గుతాయి. వాటి వెనుకున్న అసలైన సొల్యూషన్స్ మీకు క్లియర్ గా కనిపించడం మొదలవుతుంది. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం వీడియో ముగించే ముందు ఫాస్ట్ గా రివైస్ చేసేద్దాం. ముందుగా చాప్టర్ వన్ ద మ్యాప్ ఇస్ నాట్ ద టెర్రిటరీ నీ మైండ్ లో క్రియేట్ చేసే ఫియర్ మ్యాప్ లో అసలైన వాస్తవం లేదు అంటే అసలైన నిజం లేదు. ఆ ఆలోచనల డ్యూప్లికేట్ మ్యాప్ నుంచి బయటిక వస్తేనే నిజమైన ప్రపంచం నీకు కనిపిస్తుంది.
(13:01) చాప్టర్ 2 ద డిస్నీ స్ట్రాటజీ డ్రీమర్ రియలిస్ట్ క్రిటిక్ అనే ఈ మూడు క్యారెక్టర్లని ఇదే పద్ధతిలో వాడితే మీ క్రియేటివ్ డ్రీమ్స్ ని ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ గా మనం మార్చొచ్చు కన్ఫ్యూషన్ లేకుండా ముందుకు వెళ్లొచ్చు. చాప్టర్ త్రీ మైండ్ రీడింగ్ సైన్స్. మనుషులు మాటలతో అబద్దాలు చెప్పినా బాడీ లాంగ్వేజ్ తో ఎప్పటికీ దాచలేం. గొంతు నరం శ్వాస వేగం.
(13:21) ఇలాంటి నాన్ వెర్బల్స్ ని మనం గనక గట్టిగా పట్టుకుంటే ఎదుటి వాడి మైండ్ ని ఈజీగా రీడ్ చేసేయవచ్చు. చాప్టర్ఫోర్ ద త్రీ మెంటల్ ఫిల్టర్స్ డిలీషన్ డిస్టార్షన్ జనరలైజేషన్ ఈ మూడు ఫిల్టర్స్ నిజాన్ని వంకరగా మారుస్తాయి మనల్ని మోసం చేస్తాయి. ఈ మూడు ఫిల్టర్ల మాయ నుంచి మనం బయట పెడితే మైండ్ సెన్సార్ బోర్డ్ క్లీన్ అయిపోతుంది. సొల్యూషన్స్ కనిపించడం మొదలవుతుంది.
(13:39) సో మీ బ్రెయిన్ లో ఉన్న ఆ పాత తప్పుడు ప్రోగ్రామింగ్ ని మార్చడమే ఎన్ఎల్పి యొక్క అసలైన మ్యాజిక్. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీ మైండ్ లోని ఫిల్టర్లను అలాగే మీ మ్యాప్లను మీరు మార్చుకున్న రోజే ఈ నకిలి భ్రమల నుంచి బయటపడి మీ జీవితాన్ని మీరే బాగుపరుచుకుంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి.
(13:58) అలాగే తెలుగు గీక్స్ అకాడమీలో మన కోర్స్ ని గనుక మీరు ట్రై చేయాలి అనుకుంటే దానికి లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పిండి కామెంట్ లో ఉంటుంది. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్.
No comments:
Post a Comment