కూతురి కాపురం లో నిప్పులు పోస్తున్న తల్లి! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=od-Y2FyoIRo
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కూతుర్ల కాపురాలు నాశనం చేస్తున్న తల్లుల గురించి మాట్లాడుకుందాం. ఆడపిల్ల తల్లి కూతురిని కాపురం చేయనివ్వట్లేదు ఒక కుటుంబం కూలిపోవడానికి ఒక కుటుంబం నాశనం అయపోవడానికి కారణం ఎవరు ప్రతి చిన్న గొడవను పెద్దదిగా మారుస్తున్నారు భర్తపై అనుమానాలు పెంచుతున్నారు అంతేకాదు అత్తగారి ఇంట్లో నీకు విలువ లేదు నీ మొగుడు దగ్గర నీకు విలువ లేదు నువ్వు అక్కడుండి ఏం చేస్తావ్ వెంటనే పుట్టింటికి వచ్చాయి అని చెప్పి వెధవ సలహాలు ఇస్తున్నారు.
(00:36) ఇటువంటి కారణాలన్నీ చివరకు ఒక కుటుంబాన్ని విడగొట్టే పరిస్థితికి తీసుకొస్తుంది. మరి ఎప్పుడైనా మీరిది గ్రహించారా తల్లి ప్రేమ తప్పు కాదండి కానీ ఆ ప్రేమ కూతురి జీవితాన్ని నాశనం చేసేటట్టు ఉండకూడదు. పెళ్లి తర్వాత కూతురికి సపోర్ట్ చేయాలి కాదనట్లేదు. ఇది అందరి విషయంలో జరుగుతుంది ఆమె కాపురాన్ని నాశనం చేసేటట్టు ఆమె కాపురంలోకి తొంగి చూసేటట్టు నిర్ణయాలు తీసుకోకూడదు ఆమెకి ఇవ్వకూడదు సమాజం మారాలి అంటే ముందు మన ఆలోచనలు మారాలి ఇదివరకు ఈ రోజులు ఉన్నాయా అమ్మాయిని పెళ్లి చేసి అత్తగారి ఇంటికి పంపిన తర్వాత మొత్తం మీదే బాధ్యత అని చెప్పి వాళ్ళు అప్పగింతలు చేసేసినప్పుడే
(01:20) వదిలించేసుకునేవారు అలా అని ప్రేమ లేదని కాదు మంచి జడ్డలో మధ్య మధ్యలో గ్రహించుకుంటూ ఉండేవారు అత్తగారు మామగారే తల్లిదండ్రులని భర్తే భగవంతుడని అదే భర్త తండ్రిలా లాలిస్తాడని పాలిస్తాడని ఇవి చెప్పేవారు మరి ఈ రోజుల్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు శ్రీదేవు గారు అని మీరు నన్ను మళ్ళీ క్వశ్చన్ వేయొచ్చు. ఏ రోజులైనా సరే మన ఆచార వ్యవహారాలకి భారతీయ సంప్రదాయాలకి మన పద్ధతులకి పెద్ద పీట వేసింది ఏమిటి అంటే వివాహ బంధం కుటుంబ వ్యవస్థ పిల్లల పెంపకం అది క్రమశిక్షణగా మరి ఇవన్నీ లేనప్పుడు ఏ రోజులతో మనం పోల్చుకుంటే ఏమిటి ముందు రోజులు అత్తగారు
(02:06) మామగారు తల్లిదండ్రులా సాకేవారు ఇప్పుడు ఎవరు అలా ఉన్నారు అని అంటున్నారు. చిటికీ మాటికి గొడవలు అనుమానాలు పెద్దలంటే గౌరవం లేకపోవటాలు కూడా కారణం అవ్వచ్చు. ఈర్షా ద్వేషాలు అసూయలు కూడా జీవితాలని నాశనం చేస్తుంది. మరి ఇకనైనా మనం మారాలా వద్దా ముందుకు వెళ్ళాలా ఇంకా ఊబిలో కూరుకుపోవాలా కచ్చితంగా కామెంట్ చేయండి.
(02:31) ఈ రోజుల్లో చాలా కాపురాలు బయట వాళ్ళ వల్ల పాడవట్లేదండి. కేవలం ఇంట్లో వాళ్ళ జోక్యం వల్లే కాపురాలు నాశనం అవుతున్నాయి. కూలిపోతున్నాయి అంతేకాకుండా ఆడపిల్ల ప్రతి విషయం తల్లికి చెప్పడం పుట్టింట్లో అది షేర్ చేసుకోవడం ఉన్నవి లేనివి చెప్పడం దీనివల్ల వాళ్ళ సమస్యని భూతద్దంలో చూస్తారు తల్లిదండ్రులు తల్లి విపరీతంగా ఆ సమస్యని 100 రెట్లు పెంచుతుంది అది అక్కడితో ఆగదు కోర్టులకు వెళ్లి విడాకులు తీసుకునే అంతవరకు వస్తుంది.
(03:09) మరి దీనంతటికీ కారణం ఎవరు? కేవలం అమ్మాయి తల్లి అలాగే అమ్మాయి అతి గారాభం పెళ్లికి ముందు కూతురిని ఒక యువరాణిలా చూస్తారు. అదే పెళ్లియన తర్వాత బాధ్యతలతో నిండిన ఒక గృహినిగా మార్చాలి. అతిగారాబాలు చేయకూడదు. ఈ చిన్న చిన్న కారణాలే భార్యా భర్తల మధ్య గొడవలని పెంచుతాయి. పెద్ద గొడవల కింద మారతాయి. ఇవన్నీ తెలిసి అమ్మాయి తల్లి ప్రతి చిన్న విషయానికి పుట్టింటికి వచ్చేసాయి పుట్టింటికి వచ్చేసాయి అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం ఆ అమ్మాయిని రప్పించడం చేస్తారు.
(03:47) కానీ మీ అందరికీ తెలియనిది ఏమిటి అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడం చాలా కష్టం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఈ సొసైటీలో 100 కి 95 శాతం తల్లులు ఇలాగే ఉన్నారు. ఇదివరకు తల్లులతో పోల్చుకుంటే వీళ్ళు వేస్ట్ అని చెప్పొచ్చు మాట అందరి తల్లుల్ని నేను పాయింట్ అవుట్ చేయట్లేదు ఎవరైతే కూతురుల కాపురాలని చక్కదిద్దుకుంటున్నారో వాళ్ళ బాధను పోగొడుతున్నారో ఓదారుస్తున్నారో ఇంకా ధైర్యాన్ని పెంచుతున్నారో ఒక గృహినిగా ఎలా ఓర్పుగా ఉండాలో నేర్పుతున్నారో అటువంటి తల్లిలందరికీ నా జోహర్లు మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఆ 95 మంది శాతం ఉన్నారు చూసారా వాళ్ళ గురించి తెల్లారి కోడి
(04:31) కూస్తే చాలండి. వెంటనే కూతురికి ఫోన్ వెళ్ళిపోవాలి. ఆ కూతురు ఇంకా మంచం దిగదు ఫోన్ల మీద ఫోన్లు చేయటం వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం ఉచిత సలహాలు ఇవ్వటం ఉదయం టిఫిన్లు కాణంచి భోజనం కాణంచి వంట వారుపు అన్ని వాళ్ళ అమ్మ ఏం చెప్తే వీళ్ళు అదే వండడం భర్త ఇష్టా ఇష్టాలని తెలుసుకోరుమాన్నమాట భర్తని కూడా ఒక వెదవలా చూడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు.
(04:59) ఎక్కువ మాట్లాడితే నా కూతురు మీకు పనిమనిషా అని అత్తగారు మామగారి మీద గొడవలకు వస్తారు అదే మొగుడు అడిగితే నీకు పనిమనిషి ఏంట్రా నా కూతురిని ఎంత చదివించాం ఏం ఉద్యోగం చేస్తుందో తెలుసా నీకన్నా నా కూతురు జీతమే ఎక్కువ నీ ఇంట్లో నా కూతురు వంట చేయాలా పని చేయాలా అని చెప్పి సాధిస్తారు. అమ్మాయి తల్లికి అల్లుడు అసలు నచ్చడు అన్ని కాపురాల్లో చూసుకుంటే ఎక్కువ శాతం ఇలాగే ఉంటున్నాయి.
(05:28) నా కూతురిని నేను తీసుకెళ్ళపోతా అనటం వల్లే అమ్మాయి ఇంకా పేట రేగిపోతూ ఉంటుంది. కష్ట సుఖాలు తెలియ చెప్పరు పెళ్లికి ముందు నుంచే అమ్మాయి మీద ఒక విధమైన ఆలోచనలు రుద్దుతారు. అమ్మాయి పెళ్లి చేసుకోనంటే నువ్వు ఎక్కడికి వెళ్లొద్దమ్మ నా బంగారు తల్లి నా చిట్టి తల్లి నీకు ఈ ఊర్లో సంబంధమే చూస్తాను మన గల్లీలో ఉన్న సంబంధమే చూస్తాను మన ఇంటి పక్కనోళ్లనే చూస్తాను మన బంధువుల్లోనే చూస్తాను వాళ్ళని ఇల్లరికం తెచ్చుకుందాం ఈ మాటలే చెప్తూ ఉంటారు వాళ్ళ మైండ్ అలా ప్రిపేర్ చేయడం వల్ల అమ్మాయి ముందు నుంచే అత్తగారి ఇంటికి వెళ్ళే ఆలోచనల్ని అరికట్టుకుంటుంది అమ్మాల దగ్గరే
(06:04) ఉండిపోవాలని ఆ ప్రేమ ఆ బ్రమలో ఉండిపోతుంది కాబట్టే అటే ఈ రోజుల్లో పిల్లలు అత్తగారులు ఎల్లకెళ్లి కాపురం చేసే ఉద్దేశాలు ఎవరికీ లేవున్నమాట లేదంటే వేరు కాపురాలు పెట్టేస్తున్నారు అది జాబ్ పర్పస్ అవ్వచ్చు లేదా మన వర్క్ పర్పస్ కూడా అలాగే జరుగుతుంది. ఒకే వీధిలో తల్లితండ్రి వేరుగా ఉంటున్నారు కొడుకులు వేరుగా ఉంటున్నారు ఎందుకంటే అత్త మామని అడిగితే కోడలు పోరు పళలా బాతున్నావ్ అంటున్నారు.
(06:37) కోడల్ని అడిగితే మా అత్తగారు మామగారిని నేను ఎందుకు చూడాలి నేను ఎందుకు వంట చేయాలి అని డైరెక్ట్ గా మొఖం మీదే చెప్పేస్తుంది వాళ్ళని నేను ఎందుకు చూడాలి అని మరి ఈ సొసైటీలో మార్పు ఎప్పుడు వస్తది ఒకరికొకరు ఇలాగే ఎల్లి మీద పుల్లి పుల్లి మీదే ఎల్లి అన్న సామితలు చెప్పుకుంటూ పోతే జీవితాలు ఏమైపోతాయి పెళ్లి అంటే రెండు మనసులు కలయకండి అది భార్యా భర్తల బంధాన్ని ముడివేస్తుంది నూరేళ్ల బంధంతో పెనవేసుకుపోతుంది.
(07:03) మరి ఇటువంటి బంధాన్ని అమ్మాయి తల్లి ఎందుకు దూరం చేయాలని చూస్తుంది తెగే అంతవరకు ఎందుకు లాగుతుంది అమ్మాయిని ఎందుకు వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలని చూస్తున్నారు కొన్ని ఇళ్లల్లో పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మ ప్రేమ హద్దులు దాటిపోతుంది అనమాట తనకే పిల్లలు ఉన్నట్టు తనే కూతురిని కన్నట్టు కూతురు తను లేకపోతే జీవించలేదేమో అనుక్షణం భయంతో తల్లి ఇన్సెక్యూరిటీ ఆలోచనలతో ఉంటుంది అంటే అంటే నా కూతురు వాళ్ళ ఇంట్లో అంత పని చేయాలా వండి పెట్టాలా ఒక్కదే ఉండగలదా అత్త మామలు చూసుకోవాలా ఇప్పుడు వాళ్ళు లేరునుకోండి ఒక్క భర్త గురించే పోని చెప్పుకుందాం. అది
(07:46) అసలు కరెక్ట్ కాదు ఒక భర్త భార్య అన్నది అది కాపురం అవుద్ది కానీ కుటుంబం అవ్వదు ఇది కూడా మీరు తెలుసుకోవాలి వండి పెట్టాలా వాడి బట్టలో ఉతకాలా వాడికి చాకిరి చేయాలా వాడి పక్కన పడుకోవాలా వాడిని సుఖ పెట్టాలా ఈ ఆలోచనలు కూడా ఉంటాయన్నమాట అంత అల్లారు ముద్దుగా పుత్తడి బొమ్మలాగా అపురూపంగా చూసుకున్న కూతురు ఇవన్నీ చేయాలా అని ఒకేసారి ఆ ఏజ్ వచ్చేసరికి ఆ బాధ్యతలు వచ్చేసరికి కూతురి మీద కదా అతి ప్రేమ అది హద్దులు దాటిపోతుంది అన్నమాట దీనంతటికీ కారణం ఇదే అంతేకాకుండా ఎంతసేపు అల్లుడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు.
(08:28) వాడు కూలీ నాలి చేసుకున్నోడు అదే ఉద్యోగం మా అయితే 20,000 వస్తుందా 30,000 వస్తుందా 10,000 వస్తుందా? ఎందుకు నీకు ఆ జీతం అరాకరా జీతాలు మనకఎందుకు కనీసం నీకు చీర కొనగలడా ఎందుకు ఆడితో వద్దు మన ఇంటికి వచ్చాయి అని చెప్పి ఎంతసేపు భార్యా భర్తల్ని విడదీయాలని చూస్తున్నారు బంధం తెగేంతవరకు లాగుతున్నారు. విడాకులు ఇప్పేస్తా అంటున్నారు నీకు ఇంకో పెళ్లి చేస్తాం అంటున్నారు.
(08:54) మరి ఇటువంటి అడ్డదారిని వెళ్లే తల్లుల్ని ఏం చేయాలి కానీ అందరి తల్లులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కూతురి జీవితం బాగుంటేనే తల్లి సంతోషంగా ఉంటుంది అని మీకు అర్థం అవ్వాలి తల్లితండ్రి పుట్టింటోళ్ళు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తూ లక్షల కొద్దీ శాలరీస్ తెస్తున్నాడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్యాకేజీలు సంవత్సరానికి 50 లక్షల శాలరీ ఉంటుందా లేదా ఒక కారు ఉంటుందా పెద్ద బంగ్లా ఉంటుందా లేదా కోటీశ్వరుడికి ఇచ్చామా ఆస్తిబాస్తులు ఉన్నవాడికి ఇచ్చామా అనేది ముఖ్యం కాదని మీరు తెలుసుకోలేకపోతున్నారు గుడ్డి జీవితంలో బతుకుతున్నారు అన్నమాట
(09:32) ఒక్కొక్కసారి మీరు అనుకున్న ఆలోచనలు కూడా తిరగబడొచ్చు మీరు అనుకుంటున్న ఆ గవర్నమెంట్ జాబు సాఫ్ట్వేర్ వాడి దగ్గర సుఖం లేకపోవచ్చు నీ కూతురికి ఇంత సమయం కూడా ఇవ్వకపోవచ్చు నీ కూతురికి అచ్చట ముచ్చటా తీర్చకపోవచ్చు వాడు ఖరీదైన కార్లో తిప్పుతాడు గానీ తన పక్కనే చెయి పట్టుకొని నడవడం డ్రైవర్ ని ఇచ్చి పంపుతాడు అది కావాలా మీకు లేదా నడుచుకొని వెళ్ళిన సైకిల్ మీద వెళ్ళిన ఒక మోటార్ స్కూటర్ మీద వెళ్ళిన పెల్లాన్ని వెనక ఎక్కించుకొని వెళ్ళే మొగుడిని చూసి సంతోషపడతారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కొక్కసారి ఇంకా ఆలోచనలో తారుమారు అవ్వచ్చు మీరు
(10:12) అనుకుంటున్న ఆస్తులు ఉన్నవాళ్ళు అమ్మాయిని చిత్ర హింస పెట్టొచ్చు చిత్రవద చేయొచ్చు సుఖం లేకపోవచ్చు ఇంకా గొడ్డి చాకరి చేయొచ్చు కేవలం భర్తకి వండుకోలే లేకపోతున్నారంటే ఇంకా అత్త మామలకి ఇంటికి వచ్చిన బంధువులకి పెద్ద ఫ్యామిలీలకి ఏం చేస్తారు అప్పుడు మీ కూతురిని ఒక పని మనిషిలా చూసే రాత కూడా పట్టొచ్చేమో ఏమో ఇదే సుఖమైన జీవితంఏమో కూలి పని చేసినా కూలి నాలి చేసినా రోజుకి 500లో 100 రూపాయలో తీసుకొచ్చినా పచ్చడి అన్నమే పెట్టినా వాడి దగ్గరే ప్రేమ ఉంటుంది.
(10:43) వాడే కడ వరకు తోడుంటున్నాడు. వాడితోనే సుఖం ఉంటుందని మీరు మర్చిపోతున్నారు. ఒక్కొక్కసారి సాడిస్ట్ సైకో భర్తలు కూడా తగలొచ్చు వాళ్ళు ఎంత పెద్ద శాలరీని తెచ్చినా ఎంత గవర్నమెంట్ జాబులయినా ఎంత సాఫ్ట్వేర్లు అయినా కోటీశ్వరులైనా మరి ఇదంతా మర్చిపోతున్నారా మీరు కూతురు జీవితం ఎక్కడ ఉందో ఎక్కడ ఆనందం వెతుక్కోవాలో మీరు గుర్తు చేయాలని చెప్పి తల్లులందరికీ నేను నమస్కరిస్తున్నాను చేతులెత్తి కొంతమంది అత్తగారులు తెలియక చేస్తారో లేదా అహంకారంతో చేస్తారో కూడా తెలియదున్నమాట కేవలం అహంకార రారంతో కన్న కూతురి జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారని మీరు
(11:22) మర్చిపోతున్నారు. మాట్లాడితే నా కూతురు అత్తగారి ఇంట్లో ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి భర్తతో ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి వారిస్తూ ఉంటారు. ప్రతిదీ డబ్బుతో పోల్చుకుంటూ ఉంటారు. ఒంటి మీద నగలు మేము పెట్టినవి వేవి అంటే కూతురికి ఒంటి మీద నగలు అమ్మగారులు పెడతారు కదా పుట్టింటోళ్ళు అవి అవసరాలకి వీళ్ళు దేనికైనా కొదవ పెట్టుకున్నా కూడా వీళ్ళు సహించరు.
(11:47) రోల్ గోళ్ళు నగలేసుకోవడం ఏంటి నీకుఎందుకు పట్టింది ఆ కర్మ మన ఇంటికి వచ్చాయి అంటారు మాట్లాడితే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనే ప్రయత్నం కోటేశ్వరుల సంబంధాలక ఇస్తే ఒక 50 వేల లక్ష రూపాయలు పట్టుచీరలు కొంటారు గానీ అదే చిన్న జీతమైనా కూలి నాలి చేసుకున్నా అదే వంద రూపాయల చీర కొని ఇచ్చిన మీ అల్లుడు ఆ కొంగు పట్టుకొని తిరుగుతాడు మరి మీరు అనుకుంటున్న ఆ గొప్పింటి సంబంధాలు 50వేల చీర కొంగు పట్టుకొని తిరుగుతాడా అది ఎక్కడ నలిగిప పోతుందా అని చెప్పి పనివాళ్ళతో సపారీలు చేయిస్తూ ఉంటాడు.
(12:21) భర్త తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ అమ్మాయిలందరూ అర్థం చేసుకోండి. అదే మంచి మనిషిని చెడ్డవాడిగా సమాజానికి చూపించడం ఇది చాలా అన్యాయం మాట. మీ ఆలోచనలో కూడా కొంతవరకు న్యాయం ఉంది తల్లి వైపు నుంచి కూడా ఎందుకంటే కొన్ని పెళ్లి సంబంధాలలో కొంతమంది అబ్బాయిలు అంటే మీ భర్తలు చాలా వరస్ట్ గా ఉంటారు నీచంగా ఉంటారు ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకా టార్చర్ పెడుతూ ఉంటారు.
(12:53) అయినా కూడా ఓర్పుగా కాపురాలు చేయాలని చెప్పాలే గాని తల్లులు కాపురం విడదీయాలని చూడకూడదు అన్నమాట. మరి ప్రాణం పోయిన తర్వాత మా బిడ్డని మేము తీసుకెళ్ళమా అని చెప్పి మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ వేయొచ్చు. అటువంటి సిచువేషన్ లో ఇటువంటి క్రూయల్ మైండ్సెట్ మీరు ఉపయోగించండి. మంచి మనిషిని చెడ్డవాడిగా ముద్ర వేయకండి దయచేసి మంచి మనుషులను దూరం చేయకండి.
(13:19) భార్యాభర్తల బంధాన్ని విడదీయకండి. విడాకుల వరకు తీసుకురాకండి. కుటుంబాల్ని నాశనం చేయకండి. ఇంకా మీరు మంచి మాటలతో అత్త మామలని కూడా దగ్గర పెట్టుకోమనే చెప్పాలి బంధువుల్ని ఆదరించమనాలి అందరిని కలుపుకోమనాలి అత్తగారి వైపు వాళ్ళ అమ్మగారి వైపు వాళ్ళ అని తారతమ్యం లేకుండా మీరు బంధుత్వంలో ప్రేమను పంచమని చెప్పాలన్నమాట అప్పుడే కూతురి జీవితం బంగారపు భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది.
(13:51) ఇంకా ముందు తరాలకి ఒక డైనమిక్ లేడీ ఒక ఐరన్ లేడీ కుటుంబాన్ని ఎంత బాగా లాక్కొచ్చింది అని గొప్ప పేరు ఉంటుంది. ప్రతి బంధంలో ఓర్పు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమండి అప్పుడే ఆ ప్రయాణం సాఫీగా సాగుద్దని నా ఉద్దేశం. ఒక ఆడపిల్ల పెళ్లి తర్వాత ఆమె కొత్త జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. మార్పులు చేర్పులు సర్దుబాటులు ఎన్నో ఉంటాయి. కొత్త ప్రదేశాల్ని కొత్త చోటుల్ని కొత్త ఇల్లిని కొత్త మనుషుల్ని ఇంకా కొత్త రుచుల్ని ఎన్నో అర్థం చేసుకొని ఓర్పుగా జీవించవలసి ఉంటుంది.
(14:28) మరి ఇందులో చిన్న చిన్న పొరపాట్లు దొర్లితే పెద్దవారి దగ్గర సలహాలు, సూచనలతో ముందుకు వెళ్ళాలి గాని సరైన నిర్ణయాలు తీసుకోకుండా జీవితాల్ని వీధుని పాలు, రోడ్డు పాలు, కోటుపాలు చేసుకోకండి. ఒక అమ్మాయి పెళ్లి అంటే ఆమె జీవితంలో కొత్త అధ్యాయం ఆ అధ్యాయాన్ని ప్రేమతో నింపాలి గానీ అనుమానాలతో కాల్చేయకూడదు అది మన చుట్టుపక్కనోళ్ళు మన బంధువులు మన ఇంట్లో వాళ్లే ఆ అమ్మాయిని అనుమానపు బతుకులో బ్రతికేటట్టు చేస్తున్నాం అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాను ఈ కొత్త మనుషులు ఏంటి కొత్త గొడవలుఏంటి అని చాలా సందేహాలతో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోకుండా చాలా అసహనాన్ని కి గురవుతూ ఉంటారు. అంతేకాకుండా
(15:14) ఏ చిన్న గొడవనైనా సరే పెద్దది చేయాలని చూసే తల్లులు కనీసం భర్తతో కాపరాం కూడా చేయనివ్వకుండా భర్తకి దూరం ఉండు వాడిని పస్తులు ఉంచు వాడి తిక్క కుదుర్చు ఇటువంటి మాటలు కూడా చెబుతూ ఉంటారు. దీనివల్ల ఎంత పాపం మూట కట్టుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. తల్లి కూతురికి బలం కావాలి గానీ బలహీనత కాకూడదు కూతురు ఏడ్చినప్పుడు ఓదార్చాలి భయపడుతున్నప్పుడు ధైర్యం చెప్పాలి.
(15:46) అంతేగాన ప్రతిసారి దీన్నే ఆశరాగా తీసుకొని కాపురం వదిలేయమని చెప్పకూడదు. ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. ఒక్కొక్కసారి భర్త కావాలని ఏరి కోరి బ్రతిమిలాడుతున్నా కూడా కాపురాలకి వెళ్ళకుండా భీష్మించుకొని ఆ జన్మాంతం పుట్టెలలోనే పడున్న ఇల్లాల్ని మీరు చూసే ఉంటారు. కావాలంటే ఒకసారి మీ బంధువుల్లో మీ చుట్టుపక్కన వాళ్ళ చెక్ చేసుకోండి.
(16:13) ఈ అబ్బాయి మాత్రం వేరే పెళ్లి అంటే రెండో పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా ఉంటాడు. ఇంత అహంకారం చూపించినందుకు ఆమెకు ఎటువంటి పెళ్లి కుదరకపోగా సమాజంలో ఒక మాయని మచ్చవేసి మొగుడిని వదిలేసింది అని హీనంగా మాట్లాడుకోవడం వల్ల ఆ అమ్మాయి జీవితం అక్కడితోనే ఎండైపోతుంది. పరివసానం జీవితాంతం కుమిలిపోతుంది నేను తప్పు చేశానా అని ఇటువంటి పరిస్థితులు ఏ ఆడపిల్ల తీసుకొచ్చుకోకూడదని మీ భర్తతో అది ఎటువంటి సమస్య అయినా సరే ఎగ్జిస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
(16:45) వాడు రాజా మంత్రా సైనికుడా బటుడా ఇవేమి ఆలోచించొద్దు మనకి భగవంతుడు ఇచ్చేది ఒకటే ఒక్క లైఫ్ అది మనకి రాసిపెట్టి ఉంటుంది. ఆ జీవితాన్ని ఆ జీవిత నిర్ణయాన్ని మనకి భగవంతుడు ఏమఇచ్చాడో దాన్ని ఆనందంగా తీసుకుంటేనే మన లైఫ్ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఒక్క క్షణం కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితాంతం బాధిస్తుంది. మరి ఇటువంటి వేదన మీకు అవసరమా? ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
(17:18) ప్రతి ఒక్క తల్లికి నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను కూతురు కాపురంలో నిప్పులు పోయకండి. మరి ఇదివరకు రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చేవారో ఎలా ఓర్పు నేర్పులతో కాపురం చేయమనేవారో ఇటువంటి బంగారపు మాటలు వాళ్ళకి బోధించండి. మరి ఈ వీడియో చూశారు కదా మీ ఫ్యామిలీలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.
(17:44) ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment