Sunday, May 24, 2026

 ఇది ముగ్గురు స్నేహితుల నిజమైన కథ.


---

మొదటి వాడు చాలా తెలివైనవాడు, స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ పొజిషన్‌ వదిలేవాడు కాదు. ప్రతి విషయంలో టాపర్‌.

రెండోవాడు సాధారణం, ఫెయిల్‌ అవ్వడు కానీ తరగతి నుంచి తరగతికి కేవలం నెట్టుకొని వెళ్లేవాడు.

మూడోవాడు చతురుడు, మోసగాడు,omanipulation లో నిపుణుడు.

కానీ ఈ ముగ్గురూ మంచి స్నేహితులు… చాలా దగ్గర. స్కూల్ పూర్తయ్యాక…

మొదటి వాడు—ఆ తెలివైన వాడే—ఇంజనీర్ అయ్యాడు. Indian Engineering Services పరీక్ష పాస్ చేసి, క్లాస్ వన్ ఆఫీసర్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో చీఫ్ అయ్యాడు.

రెండోవాడు ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసి సివిల్ సర్వీసెస్‌ పరీక్ష రాశాడు. ఉత్తీర్ణత సాధించి, తన మొదటి స్నేహితుడు పని చేస్తున్న శాఖలో అతనికంటే ఉన్నత స్థాయి అధికారిగా నియమితుడయ్యాడు.

మూడోవాడు స్కూల్ తరువాత చదవటం కూడా పట్టించుకోలేదు. సరైన సమయంలో సరైన రాజకీయ పార్టీని ఎంచుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత కేబినెట్ మంత్రిగా మారాడు. అతడి ఆధ్వర్యంలోనే మిగతా ఇద్దరు స్నేహితులు పనిచేస్తున్నారు.

ఇది కల్పిత కథ కాదు.

×××××××××××××××××× నిజాలు:

మొదటి వాడు — ఈ. శ్రీధరన్ — మెట్రోమ్యాన్

రెండోవాడు — టి.ఎన్. శేషన్ — మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్

మూడోవాడు — కె.పీ. ఉన్నికృష్ణన్ — ఐదు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికై, వి.పీ.సింగ్ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రి

========== ముగ్గురు స్నేహితులు — అదే స్కూలు, అదే టీచర్లు… కానీ విధి మాత్రం వేర్వేరు మార్గాల్లో నడిపించింది! 🤔🤔🤔🤔

No comments:

Post a Comment