Monday, May 25, 2026

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 శ్రీరమణాశ్రమ నిర్మాణపు పనులు జరిగేటప్పుడు చాలాసార్లు మహర్షి వచ్చి అక్కడే ఏదోఒక రాయిమీద కూర్చుని ఎవరు ఏ పని చేస్తున్నారో అని చూస్తూ, పనులను స్వయంగా పర్యవేక్షించేవారు. కొన్నిసార్లు మహర్షి కూడా పనిలోకి దిగేవారు._*
*_"ఇట్లా బయటకి వస్తే ఎంతో ఆరోగ్యం. ఆ ఆరడుగుల సోఫా అనేది నిజంగా నాకు ఒక జైలే !" అనేవారు మహర్షి తరచుగా. ఇలా కట్టడాల పని చూడాలనిపించినప్పుడల్లా వచ్చేసి పనివారి దగ్గర గంటల కొద్దీ గడిపేవారు. 'తమ దర్శనం కోసం భక్తులు వచ్చారు ! రావాలి !!' అని ఆశ్రమ సేవకులు వచ్చి చెప్పేదాకా కదిలేవారు కాదు మహర్షి._*
*_ఒకసారి ఆశ్రమ సేవకుడు రావడం చూసి అక్కడున్న పనివారితో "అదిగో ! చూడండి ! చూడండి !! నా కోసం అరెస్ట్ వారెంట్ వస్తోంది. నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలి" అన్నారు మహర్షి !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

No comments:

Post a Comment