Sunday, May 24, 2026

 *ॐ             श्री शिवानन्दलहरी*
                 *శ్రీ శివానందలహరీ*
   *SREE SIVAANANDA*
                                  *LAHAREE*

     *(श्रीमच्छंकरभगवतः कृतौ)*
   *(శ్రీ శంకరాచార్య విరచితమ్)*
*(BY SREE AADI SANKARA)*

                        
                         *ఉపోద్ఘాతము - 3*

    *గంగోదకంతోనూ, శుద్ధోదకంతోనూ అభిషేకం చేస్తాము.*
    *బిల్వదళాలతో అర్చన చేస్తాము.*
    *ప్రత్యేకమైన అర్చనాదులు చేస్తూ,* 
    *దైవం వేరని - ఆయన అనుగ్రహం పొందడానికి వాటిని మార్గాలుగా అనుసరిస్తాము.*

*శివానందలహరి - ప్రత్యేకత*

    *శివానందలహరిలో పేర్కొన్న ఉదాహరణలు*
    
*1.కోతిపిల్లను ఆడించే భిక్షుకుడు,*
*2.ఒక గుడార నిర్మాణ వివరములు,*
*3.ఏతాముతో నీరుతోడి పొలాలను పండించుట,*     
*4.అగడ్త-ప్రాకారములు గల దుర్గ వివరములు,*     
*5.గుహలోని సింహవర్ణన,*
*6.వేటాడుటలో వినోదము,* 
*7.వసంత ఋతు వైభవము,*
*8.హంసల సరోవరాశ్రయము,*   
*9.చక్రవాక చకోరాల ప్రకృతి సౌందర్యారాధన,*
*10.నవ వధువుకు తన భర్త సుగుణ వర్ణన యొక్క ఆవశ్యకత,*  
*11.భూమియందు దాగిన నిక్షేపమును బలి,మంత్రములతో సంపాదించుట*
    *- వంటి ఎన్నో ప్రాపంచిక విషయములని మనం నిత్యజీవితంలో వింటూంటాం చూస్తూంటాం.*

    *ఈ అన్నిటియందూ శివారాధన నిరూపించగల పరుసవేది (లోహాన్ని బంగారంగా మార్చే రాయి - Philosopher’s stone) వంటిది శ్రీ శంకరుల* 
  *- భావనా శక్తీ,*
  *- సర్వ ప్రాపంచిక విషయ విజ్ఞానమూ.*

    *లౌకిక కర్మలను ఈశ్వరోపాసన సదృశముగ భావింపుమని బోధ.*
    *ఆ విధముగ పోల్చుకొనడం ప్రారంభదశ మాత్రమే!*
    *కానీ, క్రమంగా ఒకనాడు సర్వకర్మలు వాటి భౌతిక రూపమును వదలి ఈశ్వరమయమే కాగలదని భావించవచ్చు.*
    *అది అంతఃకరణం యొక్క పరిణామ దశ.*
    *దీనిని మనం శివానందలహరి గ్రంథంలో పూర్తిగా తెలుసుకోగలుగుతాం.*     

    *తద్వారా, లేచింది మొదలు పడుకునే వరకూ దైనిందిక జీవితంలో*
  *- మాయా ప్రకృతులతో కూడిన ఇనుము వంటి జీవులం,*
  *- పరమాత్మ అనే పరుసవేదితో అనుభూతి పొందగలుగుతాం.*
  *- తద్వారా జీవితాలు సువర్ణమయం చేసుకోగలుగుతాం.*

    *శివానుగ్రహంతో,*
    *రేపటి నుంచీ శివానందలహరీ శ్లోకాలు రోజుకొకటి చొప్పున విశ్లేషించుకొందాం.*
              
https://youtu.be/h8qlcoPKG5o

  *— రామాయణం శర్మ* 
           *భద్రాచలం*

No comments:

Post a Comment