ఆఖరి చూపుకి వెళితే కీడు జరుగుతుందా? || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nMABl5rlyho
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం చావుకి పెళ్లికి తేడా తెలియని నీచమైన సొసైటీలో మనం బ్రతుకుతున్నామ అన్నది మీకు తెలుసా ఈ మధ్యకాలంలో పెళ్లిల కంటే చావులే ఎక్కువగా అవుతున్నాయి అన్నమాట ఇది పచ్చి నిజం ప్రతి ఇంట్లో చావు సంబరాలు అన్నది మస్తు జరుగుతున్నాయి. ఇప్పుడున్న మతి లేని వాళ్ళకు అంటే జనాలకు చావు ఒక ఫ్యాషన్ అయిపోయింది.
(00:30) చావు అంటేనే ఒక పండగ దాన్ని పెళ్లిలాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. మరి ప్రతి ఇంట్లో పుట్టుక చావు రెండు ఉంటాయి ఈ రెండిటికీ వేరు వేరు తారతమ్యాలు చాలానే ఉంటాయి. మరి పెళ్లిలకి టైం ఇవ్వడం మానేసి చావులకే ఎక్కువ టైం ఇస్తున్నారు నేను మొన్న ఒక వీడియో చేశాను పెళ్లిలకి వెళ్ళట్లేదు వెళ్ళిన జస్ట్ ఇలా వెళ్లి వస్తున్నారు పెళ్లి భోజనం చేయకుండానే వచ్చేస్తున్నారు అసలు ఎందుకు మనల్ని పెళ్లికి పిలిచారా భోజనం అది మన గురించి వండారా మనం లెక్కలో ఉన్నామా ఆ ఫుడ్ వేస్ట్ అయిపోతుందా అని ఆలోచన కూడా లేదు అంటే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నమాట మరి చావు అంటే ఎంత ముచ్చటపోయింది
(01:14) ఎంత పండగ అయిపోయింది పెళ్లి భోజనాల గురించి వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కచ్చితంగా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. మరి ఇదివరకు రోజుల్లో చావు అంటే ఎలా ఉండేది పండు ముసల వాళ్ళకే మరణం సంభవించేది. వయసులో ఉన్నవాళ్ళు గాని చిన్న వయసులో ఉన్నవాళ్ళు గాని చనిపోతే పచ్చికాయ బద్దలయిందిరా బాబు అని జీవితాంతం కుమిలిపోతూ ఉండేవారు.
(01:44) మరి అటువంటి రోజులు ఇప్పుడుఏమనా ఉన్నాయా ఎవరైనా చచ్చిపోతుంటే ఆనందాలు పండగలు డీజే ప్రోగ్రామలు వీడు బరువు ఏదో వీళ్ళు మోసినట్టు ఎవరో తెలియని బయటోళ్ళు కూడా బంధువులు కూడా ఇలాగే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చాలా ఖుషి అవుతున్నారు అన్నమాట మా చిన్నతనంలో చావు అంటే ఒక ఆశ్చర్యం వేసేది ప్రతి ఇంట్లో ప్రతి గుమ్మం ముందు ఒక 90 ఏళ్ళు 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువమంది ఉండేవారు మా వీధిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు వంట కూడా చేసుకునేవారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలాగే నిద్రలోనే చనిపోయేవారు కాబట్టి చావు గురించి మాకు పెద్ద అవగాహన ఉండేది కాదన్నమాట మరి ఈ రోజుల్లో చనిపోతే మన
(02:29) దగ్గర బంధువులు మన పక్కన మన పక్కన ఉన్నవాళ్లే మన గల్లీల్లో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా సరదా పడిపోతున్నారు. మరి ఇంత క్రూరంగా మనిషి ఎందుకు మారిపోయాడు మనిషిలో తెలియని ఒక రక్కసి రాక్షసి ఎందుకు దాగి ఉంది మనిషి ఆలోచనలు ఇంకా మారవా నెక్స్ట్ తరాలు ఉన్న వాళ్ళని కూడా మనం ఇదే ఆలోచనలతో వాళ్ళ బుర్రలు కూడా ఖరాబ్ చేస్తామా ఇవన్నీ ఒక సందేహాలతో నా మెదడు నిండిపోయింది కాబట్టే ఈరోజు రోజు ఇది వీడియో రూపంలో మీ ముందుకు వచ్చింది.
(03:12) ఇప్పుడున్న జనాలు ఎలా ఉన్నారో మీ అందరికీ తెలుసండి ప్రతి ఒక్కరి ఇళ్లల్లో చావులు జరుగుతున్నాయి బాగా ఎక్కువ జరుగుతున్నాయి అది కరోనా కావచ్చు క్యాన్సర్లు కావచ్చు ప్రమాదాలు కావచ్చు అనుకోని డిసీజలు కావచ్చు లేదా బలవంతంగా ప్రాణం తీసుకోవడం కావచ్చు చాలా జరుగుతున్నాయి. అరే మనిషి చనిపోతే అయ్యో పాపం అనటం మానేసి శవాన్ని పక్కనే ఉంచుకొని కూడా నవ్వులు డైలాగులు దొంగ ఏడుపులు ఇంకా ఎత్తుపుడుపు మాటలు ఎన్ని చేస్తున్నారండి జనాలు పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా డ్రెస్సెన్స్ మెయింటైన్ చేయాలి చావు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా డ్రెస్ ఉండాలి ఎటువంటి మాటలు ఉండాలి కనీసం బాధ లేకపోయినా
(04:00) నువ్వు అయ్యో పాపం అనకపోయినా ఎంత మౌన పాటించాలి ఇవేమీ తెలియట్లేదు అంతేకాకుండా చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఎడుపుల్లో వాళ్ళు ఉంటే వీళ్ళు అక్కడ తిండికి వెతుక్కోవడం మన చుట్టాలతో సహాయండి కచ్చితంగా మీరు వినాల్సిందే అందరి ఇల్్లల్లో ఇది మీరు ఫేస్ చేసే ఉంటారు. ఒకరేమో ఇవాళ శనివారం నేను తిన్న మినపట్టు అంటారు బుధవారం నాకు పరోటా కావాలంటారు చావు ఇంట్లో పొయ్యే ఎలగకూడదు కదా మీ అందరికీ తెలుసు మరి అన్నం కోసం అలమటించబోతారు ఆకలి ఆకలి అంటారు శవాన్ని పెట్టుకొని వీళ్ళు కంచాల నిండ అన్నం పెట్టుకొని బుక్కుతూ ఉంటారు.
(04:39) చచ్చినోడు చచ్చాడు దరిద్రం వదులుద్ది అని అనుకుంటున్నారు అది చిన్న వయసు వాళ్ళా ఎంత బతుకు బతికిన పెద్దవాళ్ళా వాళ్ళ అనుభవాలు జ్ఞాపకాలను నెమర వేసుకొని వాళ్ళ గురించి ఒక మంచి మాట కూడా చెప్పుకోవట్లేదు. ఎందుకు బతుకుతున్నామఅండి మనం ఛి థూ అని చెప్పి ఊస్తారన్నమాట ముందు తరం వాళ్ళకి ఇవన్నీ తెలిస్తే కచ్చితంగా తెలుస్తున్నాయి వెనక తరం వాళ్ళతో మనల్ని పోల్చుకొని అలాగే ఊస్తారు.
(05:10) మరి ఇకనైనా మనం చేసే పనిలో మార్పు రావాలి కదా అలా రావట్లేదు మరి చావు అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అది 11 రోజుల 20 రోజుల 16 రోజులా అంటే దినకార్యాలు అయ్యేంతవరకు అమ్మయ్య నాకుొక కాలక్షాపం దొరికింది. వెళ్ళిపోతారు పొద్దున్నే కాపీలు టిఫిన్లు దగ్గర నుంచి వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం మళ్ళీ స్నాక్స్ టీలు అన్ని అన్ని అక్కడే తిని ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఆరారా టీలు తాక్కుంటూ దొంగ మాటలు దొంగ ఏడుపులు చెప్తూ కోడల మీద అత్తగారికి అత్తగారి మీద కోడలకి ఎగేస్తూ ఉంటారు.
(05:52) మొగుడిని తీసుకెళ్లి చంపేసిందని అలాగే అత్తగారి టార్చర్ వల్లే కొడుకు చనిపోయాడని ఇంకా వేరవేరు రిలేషన్స్ అయితే ఎలా ఎక్కేస్తారో మీ అందరికీ తెలుసు అక్కడ వచ్చిన జనాల్లో ఒక అనుమానపు ముద్ర వేస్తారన్నమాట అదే క్వశ్చన్ మార్క్ గా ఉండి వాళ్ళు చచ్చేంతవరకు ఆ భారాన్ని ఆ అవమానాన్ని మోస్తూ ఉండేటట్టు చేస్తారన్నమాట ఈ నోర్లు మంచివి కాదు సుమా చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఈ వీడియోని అంద అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మన అనుకున్న వాళ్లే మనకి పక్కలో బెల్లా తయారయ్యారు.
(06:30) అంతేకాదు ఈ దొంగెడుపులు ఏడుస్తూ ఉంటారు ఈ ఎక్కేస్తూ ఉంటారు ఇంతలో ఎవరైనా వస్తే బోరమని ఏడుస్తూ ఉంటారు ముక్కు తుడుచుకుంటూ ఉంటారు. ఈ డ్రామాలు సీరియల్లో విలన్స్ కూడా వేయలేరున్నమాట. అంత ఈజీగా వీళ్ళు వేసేస్తున్నారు. మరి ఇంకొంత లోతుగా ఆలోచిస్తే అసలు మనిషి చనిపోయినా కూడా చూడడానికి వెళ్ళట్లేదు. ఆఖరి చూపుకైనా మొఖం కనబడద్ది అని చెప్పి ఎంతో దూరాభారం నుంచి కూడా మన బంధువులు మన స్నేహితులు మనకి పరిచయస్తులు కూడా వచ్చి ఒక్కసారైనా మొఖం చూసి వెళ్తారు ఆ రోజులు ఇప్పుడు లేవండి చనిపోయాడా ఆ వార్త తెలిసిందిగా అయ్యో పాపం అన్నవాడు ఒకడు ఆ పోనీలే ఎప్పటికైనా చావల్సిందేగా అన్నవాడు
(07:13) ఒకడు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఇదివరకు చనిపోయిన ఇళ్లలో చూస్తే ఆ సెవన్ తీసుకెళ్ళినప్పుడు ఎంతోమంది వందల మంది వేల మంది కూడా వచ్చేవారన్నమాట అంతమంది ఉండి దగ్గరుండి సాగనంపేవారు కలో చేయేసేవారు ఆ కార్యక్రమంలో పాలు పంచుకునేవారు చాలా బాధతో విషాదకరమైన ఛాయలు అలుముకునేవి మరి ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనం కనీసం చూడటానికి వెళ్ళాం చాలా ఈజీగా తీసుకుంటాం ముట్టుకోకూడదు పట్టుకోకూడదు అంటాం స్నానాలు జపాలు ఇవన్నీ కచ్చితంగా శాస్త్రంలో ఉన్నాయి చేయాలి కానీ చూడటానికి వెళ్ళిపోతేనే చనిపోతారు అన్న టాక్ ఒకటి పుట్టించారండి ఎవరైనా చనిపోయినవాళ్ళ
(07:57) దగ్గరికి వెళ్తే వీళ్ళు చనిపోతారంట వెంట వాళ్ళు తీసుకుపోతారంట ఇదఎక్కడ ఘోరం అసలు మధుని మాట్లాడుతున్నారా అంతో ఇంతో చదువుకున్నారు కదా ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు కదా మరి మీ నుంచి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు అంతే కాదండి ఆ చావు భోజనాలు తింటే కీడు జరుగుద్దంట వీళ్ళంట్లో వాళ్ళు కూడా అలాగే ఎగిరిపోతారంట ఇది ఎంత తప్పండి ఆ తర్వాత నుంచి దినకార్యాలు అయ్యేంతవరకు వెళ్లి సరదాగా అక్కడ కూర్చొని మచ్చడించి తిండి తిప్పలు కాపీలు టిఫినీలు తాగేసి తినేసి అప్పుడు వాళ్ళ పొట్లో భోజనం ఏమైపోద్దండి ఇంటికి వస్తారు బుడా బుడా స్నానాలు చేసేస్తారు మళ్ళీ మామలే మళ్ళీ
(08:36) ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళినట్టు వెళ్ళిపోతారు. మరి ఇది ఎంత నీచమైన ఆలోచనలో ఒక్కసారి ఆలోచించండి మనం ఎంతకి దిగజారిపోయాం పాతాళానికి పడిపోయాం చావు అంటే ఏంటది తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోవటం చావు పుట్టుకలు అందరి ఇల్లల్లో ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఏ సందర్భానికి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి మీ వస్త్రధారణ ఎలా ఉండాలో తెలుసుకోండి ఒక మనిషి ఆ ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు ఎంత వెలుతు ఉంటది ఆ జ్ఞాపకాలతో వాళ్ళఎంత నలిగిపోతారు తర్వాత కుటుంబ పరిస్థితి ఏంటి పిల్లలు ఆమె లేకపోతే ఆయన తల్లిదండ్రులు ఇలా ఎవరి రిలేషన్ వాళ్ళు వాళ్ళు ఎలా జీవన ప్రయాణం
(09:18) సాగిస్తారు వాళ్ళ తిండి తెప్పలుఏంటి వాళ్ళ బాగోగులు మంచి చెడ్డలు ఏంటి ఇవేమి పట్టించుకోవడం లేదు కనీసం అప్పుడప్పుడైనా ఆరాధిస్తూ ఉండండి ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో సంబరం జరిగింది రేపు మన ఇంట్లో జరుగుద్ది అన్నది సంగతి మర్చిపోకండి. ప్రతి ఇంట్లో ఇవి జరిగే సంబరాలే కానీ చేదోడు వాదోడుగా మనం ఎంతో ధైర్యాన్ని ఇస్తే ఆ ఫ్యామిలీ మళ్ళీ నిలుచొని చూపెడుతుంది వాళ్ళ పిల్లల్ని పిల్లల్ని ముందుకు తీసుకువెళ్లే ధైర్యాన్ని వాళ్ళకి మీరు ఇస్తారు జనరేషన్స్ కూడా మీకు చాలా గౌరవాన్ని ఇస్తాయి.
(09:58) మేము కష్టంలో ఉన్నప్పుడు ఫలానా మామయ్య అయితే ఫలానా పిన్ని గారు ఇలా వచ్చి మాకు ధైర్యం చెప్పారు మాకు చాలా హెల్ప్ చేశారు అన్న రుణం వాళ్ళు ఉంచుకుంటారు. రుణానుబంధాలు లేవు మంచి చెడ్డలు లేవు ఎవరు గుర్తించుకుంటున్నారు అన్న మాట అనకండి అందరూ ఇలాగే ప్రవర్తిస్తే మంచి అన్నది మరుగున పడిపోద్ది ఇప్పటికే అడ్రెస్ లేకుండా పోయింది.
(10:23) ఇకనైనా మనం తొలి అడుగు వేయాలని నేను ఆశిస్తున్నాను. మరి ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది పరిస్థితి చావు ఇల్లల్లో ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. చావు ఇంట్లో అసలు పోయే ఎలిగేది కాదు ఆ మూడు రోజులు వచ్చి పోయి ఓలు అన్నాలు తీసుకొచ్చేవారు బాడీ ఉండగా అసలు ఎవర అన్నం ముట్టేవారు కాదు ఇంటికివచ్చిన బాంధువులతో సహా ఆ టీలు తాగి కాలక్షాపం చేస్తూ ఉండేవారు చుట్టుపక్కలలో ఆరారా టీ తీసుకొచ్చి కాచి ఇచ్చేవారు ఈ పూట నువ్వు ఇస్తే ఈ పూట నేను ఇస్తానమ్మా అని చక్కగా సంప్రదించుకునేవారు.
(10:56) అంతకుముందు వాళ్ళైతే పూర్తిగా పెద్ద కార్యాలు అయ్యేంత వరకు పోయెలిగేది కాదు అంత సపోర్ట్ గా ఉండేవారు మన చుట్టుపక్కలలే బంధువులే వచ్చి వాళ్ళతోనే అంటే ఎవరి ఇంట్లో చనిపోయారో వాళ్ళతోనే నెల రోజులు ఉండి అన్ని పనులు చూసుకొని అన్ని చక్కబెట్టి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి వెళ్ళేవారు మరి ఇప్పుడు బంధువులు రాబందు లాగా పీక్ తింటున్నారు.
(11:21) ఇరుగు పొరుగు వాళ్ళ కన్నా వాళ్లే చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు మరి ఈ బంధువుల గురించి కూడా ఒకరోజు మనం వీడియో చేసుకుందాం మరి దగ్గరు ఉండి ధైర్యాన్ని చెప్పి వాళ్ళు ఏం చదువుకోలేదండి ఆ రోజుల్లో శాస్త్రాన్ని ఫాలో అయ్యారు పెద్దాలని ఫాలో అయ్యారు కష్టం తెలిసి ఉన్నారు మంచి మనసుతో ప్రవర్తించారు అన్నమాట అందుకనే ముందు జనరేషన్స్ చాలా ధైర్యంగా ఎదిగినయి మనవరకు వచ్చినయి కానీ మన తరాలకే మనం ఈ ధైర్యాన్ని ఇవ్వలేం మరి మనమందరం బాగా లోతుగా ఆలోచించి వెనకటి రోజులని ఫాలో అవుదామని నేను మరీ మరీ చెప్తున్నాను.
(12:03) ఉమ్మడి కుటుంబాల వ్యవస్థని మీరు విచ్చిన్నం చేయొద్దు దయచేసి మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ఎందుకంటే మన కుటుంబ సభ్యులు మనం ఎక్కువ ఉన్నప్పుడే మనకి మహాబలం ఐకమత్యమే మహాబలం ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకి ఒంటరి జీవితాలు ఒంటరి చావులు ఒంటరి ఏడుపులు ఒంటరి బ్రతుకులు ఇవన్నీ మాయమైపోవాలంటే కచ్చితంగా ఉమ్మడ కుటుంబాలు రావలసిందే మళ్ళీ ప్రేమానుబం బంధాలు పెనవేసుకోవలసిందే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారని వెనకటి రోజులు ఫాలో అవుతారని అందరినీ మంచి చేసుకొని ఉంటారని ఈ టెక్నాలజీ యుగాన్ని మనం దూరం పెట్టాలని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మరి నా వీడియోస్
(12:47) అన్ని సొసైటీలో చేంజ్ తీసుకురావడానికే ఉమ్మడి కుటుంబాలు డెవలప్ అవ్వటానికే పాత కుటుంబ వ్యవస్థలు గాని పాత మంచి మనుషులు గాని అలాగే పోకుళ్ళు గాని మనమందరం మళ్ళీ తెచ్చుకోవాలని నా వీడియోస్ అన్నీ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క వీడియో కంప్లీట్ గా చూడండి. నా వీడియోస్ ద్వారా ఒక్క ఫ్యామిలీ అన్నా మారుతుంది అన్న ఆశతో మీకు ఈ వీడియో అందిస్తున్నానండి.
(13:15) తద్వారా ఈ సొసైటీలో చేంజ్ వస్తది అన్న ధీమాతోనే చెప్తున్నాను కాబట్టి అందరూ మీ బాధ్యతని మర్చిపోకుండా కచ్చితంగా నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూడాలని చెప్పి మనవి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది [సంగీతం]
No comments:
Post a Comment