ఒక రోజు నేను జాగింగ్ వెళ్లేటప్పుడు
రోడ్డు పక్కన వందల వేప
చెట్లు ఉంటాయి ..సీజన్
కదా లక్షల వేప గింజలు
చెట్ల నుండి రాలి ఆ రోడ్ మీద
పడి ఉంటాయి..వాటిని
ఎవ్వడూ పట్టించుకోడు..
ఒక అవ్వ వచ్చి వాటిని
పరక తీసుకుని ఊడ్చడం
చూసాను...ఆమె ప్రతి రోజూ
ఊడుస్తూ కుప్పులు కుప్పలు
గా చేస్తూ ఉంది...అలా ఓ పది
రోజులు గడిచాయి...ఒక రోజు
అదే రోడ్ ముందు ఆ అవ్వ ఒక
లారీ ముందు నిలబడి ఎవరితోనో
మాట్లాడుతూ ఉంది..అక్కడికి వెళ్ళి
నిలబడ్డాను...ఆ లారీ అతను ఒక లక్ష
రూపాల కట్టలు ఆమె చేతిలో పెట్టాడు..
అవ్వను అడిగాను... అవ్వా..ఎందుకు ఆయన
అంత డబ్బు ఇచ్చాడు అని..దానికి ఆ అవ్వ
నాయనా...గత పదహైదు రోజుల నుండి పోగు చేసిన
ఆ వేప గింజలన్నింటినీ అమ్మే సాను..దాని తాలూకూ
డబ్బు ఇది అని అన్నది..
వేప గింజలు విడి విడి గా పడి ఉంటే
దానికి ఏ విలువా లేదు..అదే వాటన్నింటినీ
ఏకం చేస్తే వాటికి లక్ష రూపాయలు రాబట్టే
శక్తి ఉందా...? అంత పవర్ వచ్చిందా..? అనిపించింది...
అలాగే...పలు పలు విధాలుగా విడి పోతున్న
మనస్సుకు ఏ విలువా లేదు .. ఏ పవర్ లేదు..
దేన్నీ ఆకర్షించే శక్తి లేదు.. ఏ పవర్ లేదు..
అదే మనస్సును పరి పరి విధాలుగా విడిపోతున్న
ఆలోచనల నుండి దాని పోగు చేసి ఏకం చేస్తే
అది దేన్నైనా సాధించే శక్తి పుంజుకుంటుంది.
కృష్ణుడు చిటికెన వేలుతో ఆ పర్వతాన్ని ఎత్తి
పట్టేంత పవర్...జీసస్ సముద్రాన్ని రెండుగా
విడగొట్టేంత పవర్...ప్రవక్త చంద్రుణ్ణి రెండు
భాగాలుగా విడదీసేంత పవర్,,,ఆది శంకరులు
తాను ఇంకో శరీరంలో ప్రవేశించేంత పవర్...
అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే
అవుతుంది...
దేవుడూ...పొద్దున లేచింది మొదలు
ఆ పలు పలు విధాలుగా ఆలోచనలుగా
చింతనలుగా విడిపోతున్న ఆ మనస్సును
ఏకం చెయ్యి...ఏదైనా ఇట్టే అనుకుంటే ఆట్టే
జరిగిపోతుంది...నా లైఫ్ లో ఏ అద్భుతమూ,,
అనుకున్నది ఏదీ జరగలేదు అని ఏడవకు ..
మనస్సు ఏకంగా,,ఒక్కటిగా,,శూన్యంగా లేదు
అని మాత్రం గ్రహించు..దేవుడూ...
దేవుడూ.. తస్మాత్..ఏకం చెయ్యి ...
❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️
No comments:
Post a Comment