నీ అందం, నీ వయసు ఎప్పటికీ శాశ్వతం కాదు బ్రదర్! | Time Is Running Out For You | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3EPW2s-SDTA
Transcript:
(00:07) ప్రతి మనిషి ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడతాడు. ఉదయం లేచిన వెంటనే వేడి వేడి కాఫీ తాగడం ఆ తర్వాత కొంచెం సేపు సోషల్ మీడియాలో గడపడం ఆ తర్వాత ఉద్యోగానికి రెడీ అవ్వడం లేకపోతే కాలేజీకి వెళ్ళడం మళ్ళీ అంతా పని ముగించుకొని రాత్రికి ఇంటికి వచ్చేసి బిర్యానీ తిని పడుకోవడం చాలా మంది దీన్నే లైఫ్ అనుకుంటారు.
(00:27) నిజం ఏంటంటే మీరు బ్రతకట్లేదు. మీరు కేవలం ఒక భ్రమలో కాలక్షేపం చేస్తున్నారు. మీ చుట్టూ ఒక పెద్ద గొలుసు ఉంది. అది కంటికి కనిపించదు. కానీ మిమ్మల్ని గట్టిగా బంధించేస్తుంది. ఆ గొలుసు పేరే పాపం. పాపం అంటే ఏదో నరకానికి వెళ్ళాక దొరికే శిక్ష కాదు ఈ క్షణంలో మీ మనసు మీకు నచ్చినట్లు కాకుండా దానికి నచ్చినట్లు మిమ్మల్ని ఏడిపిస్తుందే అదే పాపం.
(00:52) మీ కంట్రోల్ లో మీరు లేకపోవడమే ఈ అసలైన పాపం. సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన సత్యం ఉంది. మనం చేసే ప్రతి చిన్న తప్పు ప్రతి చెడు ఆలోచన మనల్ని ఒక చీకటి గదిలోకి నెట్టేస్తుంది అని మీరు బయట తిరుగుతున్నారు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నారు లోపల మాత్రం ఒక ఖైదీలా బ్రతుకుతున్నారు. సమాజంలో ఎవరైనా విచ్చలవిడిగా దుర్మార్గంగా బతికితే మనం ఏమంటాం ఏదో ఒక రోజు వాడి పాపం పండుద్ది.
(01:16) కచ్చితంగా వాడు కుక్క చావు చేస్తాడు అని చెప్పేసి అంటాం. కానీ నిజానికి వాడు చావక్కర్లేదు. బతికుండంగానే వాడి లోపల ప్రశాంతత చచ్చిపోతుంది. పాపానికి ఉన్న అతి పెద్ద పవర్ ఏంటో తెలుసా అది మిమ్మల్ని నీడలా పట్టుకుంటుంది. మీరు ఎంత స్పీడ్ గా పరిగెత్తినా ఏ పబ్బుకు వెళ్ళినా ఎంత తాగినా ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది పాపాలు చేసేవాడిని అస్సలు వదలదు.
(01:40) మీరు రహస్యంగా కొన్ని తప్పులు చేస్తారు. ఎవరికీ తెలియదు అనుకుంటారు. కానీ సడన్ గా మీ జీవితంలోనో మీ కుటుంబంలోనో ఏదో ఒక ప్రాబ్లం రాగానే మీ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. నేను చేసిన ఆ తెప్పే ఇప్పుడు నా చుట్టూ తిరుగుతుందా అని ఒక భయం మిమ్మల్ని లోపల నుంచి నిద్ర పోనీయకుండా చేస్తుంది. దీన్నే సైకాలజీలో గిల్ట్ కాంప్లెక్స్ అంటారు.
(02:00) మన హిందూ ధర్మం దీన్నే కర్మ సిద్ధాంతం అని కూడా అంది. మీరు ఏది విసిరితే అది మీ పైకి తిరిగి వస్తుంది. మీరు బాహ్యంగా ఎన్ని గంగల్లో మునిగినా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా లోపల ఉన్న కుళ్ళు మారనంత కాలం మీకు విముక్తి లేదు. ఆ మునకలు కేవలం మీ శరీరానికి తప్ప మీ ఆత్మకి కాదు అందులోని మీ ఆత్మ శుద్ధి అవ్వదు. మీరు ఎప్పుడైనా గమనించారా మనకి విపరీతమైన పిచ్చి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మీరు బిజీగా రోజంతా కష్టపడుతున్నప్పుడు రావు.
(02:29) మీరు ఏ పని లేకుండా బెడ్డు మీద ప్రశాంతంగా పడుకొని చేతిలో ఉన్న ఫోన్ కూడా పక్కన పడేసి ఆలోచిస్తూ ఉంటారు చూడండి. అప్పుడు వస్తాయి. నిజం ఏంటంటే ఖాళీ మనసు అనేది పాపానికి ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాంటిది. మీరు ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు లేకపోతే అవతల వాళ్ళకి కావాలని చెప్పి చెడు తలపెట్టినప్పుడు మీ మనసు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి విపరీతమైన పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి.
(02:54) సో దీన్ని బట్టి మీకు ఒక విషయం అయితే బాగా అర్థమవుతుంది. అదేంటంటే మనకి అన్యాయం చేసినవాడు అంత ప్రశాంతంగా ఉండడు. వాడు ఒంటరిగా కూర్చున్నప్పుడు వాడు బెడ్డు మీద పైన తిరుగుతున్న ఫ్యాన్ చూస్తున్నప్పుడు వాడు చేసిన పాపాలు వాడు చేసిన తప్పులు వాడికి కంటిన్యూస్ గా గుర్తు వస్తూనే ఉంటాయి. వాడు నిరంతరం నరకం అనిపిస్తూనే ఉంటాడు. వాడి జేబులో ఎంత డబ్బు ఉన్నా వాడికి ఎంత ఆస్తి ఉన్నా సరే ఆదిశంకరాచార్యులు గారు హ్యూమన్ సైకాలజీ గురించి అద్భుతమైన మాట ఒకటి చెప్పారు.
(03:25) మన మనసు అనేది ఒక కోతి లాంటిది దానికి సరైన పని చెప్పకపోతే అది చెత్త కుప్పల మీద కూర్చుంటుంది. ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఖాళీగా ఉండటం. అలా ఖాళీగా ఉండటం వల్లే మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు. అశ్లీలతకి అక్రమ సంబంధాలకి అలవాటు పడుతున్నారు. ఆ సమయంలో మీ మనసు మీతో ఏముంటుందో తెలుసా ఏం పర్లేదురా కాసేపు సరదాగా ఎంజాయ్ చెయ్ ఎవరికి తెలుస్తుందని మిమ్మల్ని ఆ ఊబిలోకి లాగేస్తుంది.
(03:54) కానీ ఎవ్వరు చూడకపోయినా ఎవ్వరు ఏం నష్టపోరు కానీ మీకు మీరు తెలుస్తున్నారు కదా మీరు మీ మనసు చెప్పిన మాట విని ఆ ఊబిలో మీరు వెళ్ళిపోతున్నారు కదా ఆ ఒక్క లాజిక్ చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను క్లియర్ గా వినండి. ఎప్పుడైతే మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏ పని చేయకుండా ప్రశాంతంగా తిరుగుతున్నప్పుడు మనం ఎటువంటి అలవాట్లని సరదాగా స్టార్ట్ చేస్తామో అదే సిగరెట్ తాగడం అవ్వచ్చు, మందు అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు వీటినైతే మనం సరదాగా స్టార్ట్ చేస్తామో అవి మనం బిజీగా ఉన్నప్పుడు కూడా మనల్ని వదలవు.
(04:25) మీరు వదిలించుకుందాం అనుకున్నా సరే ఆ ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఎవడైనా సరే ఇక్కడ చెడు అలవాట్లు కోసమే పుట్టినవాడు కాదు. వాడేదో సరదాగా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేసి ఆ అలవాట్లు వాడిని వదలకపోవడం వల్ల వాటికి బానిస అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు.
(04:48) సో మీకు క్లియర్ గా అర్థమయింది అనుకుంటున్నాను మనం సరదాగా మొదలుపెట్టే అలవాట్లే మనల్ని వదలవు. మీరు వదిలించుకోవాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినా సరే అవి మిమ్మల్ని వదలవు. అది ఎందుకు వదలవు అంటే మీ మనసు మీ కంట్రోల్ లో ఉండదు కాబట్టి మీ ఆలోచన విధానం మీ చేతిలో నుంచి చేయజారిపోయింది కాబట్టి దీన్నే ఆదిశంకరాచార్యుల వారు చాలా అద్భుతంగా చెప్పారు.
(05:11) అందులోనూ ఆయన మనిషి మనసు అనేది కోతి లాంటిది అని చెప్పి అన్నారు. ఎక్కడికి ఎప్పుడు ఎలా పరిగెడుతుందో ఆ కోతికే తెలియదు కాబట్టి మన మనసుని మనం కంట్రోల్ లో పెట్టుకుందాం. లేకపోతే మన అలవాట్లే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది యువత జీవితంలో జరుగుతుంది కూడా సరిగ్గా ఇదే వాళ్ళ మనసు వాళ్ళ కంట్రోల్ లో ఉండదు. వాళ్ళ అలవాట్లు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాయి.
(05:35) వ్యసనాలు, అక్రమ సంబంధాలు, ఈజీ మనీ కోసం చేసే మోసాలు ఇవన్నీ ప్రారంభంలో ఈజీగానే ఉంటాయి. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. జస్ట్ ఒకే ఒకసారి టచ్ చేసి వదిలేస్తాను అనుకొని మీ హ్యాండ్ వేస్తారు కానీ మీరు టచ్ చేసిన మరుక్షణమే సీన్ రివర్స్ అయిపోతుంది. తర్వాత మీ కంట్రోల్ తప్పుతుంది. మీరు దాన్ని వదలాలనుకున్న ఆ వ్యసనమే మిమ్మల్ని వదిలి పెట్టదు. మీ జీవితాన్ని మీ ప్రశాంతతని నాశనం చేసి అవతలపడేస్తుంది.
(06:01) ఈ సమస్య అంతా ఎందుకు వస్తుందో తెలుసా? మీలో ఉన్న అజ్ఞానం వల్ల మరియు మీరు బతుకుతున్న కంఫర్ట్ జోన్ వల్ల ఆదిశంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు సత్సంగత్వే నిసంగత్వం నిత్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వం నిశ్చల తత్వం నిశ్చల తత్వమే జీవన్ముక్తి అంటే మీ మైండ్సెట్ మారాలంటే మొదట మీరు తిరిగే పద్ధతి ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న పరిసరాలు మారాలి.
(06:27) కానీ మీరు ఏం చేస్తున్నారు? చెత్త ఆలోచనలు వచ్చే మైండ్ ని అలాగే ఉంచి రోజంతా ఫ్యాన్ వార్స్ ని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. అంటే పొలిటికల్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఫిలిమ్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఫ్యాన్ వార్స్ ని మీరు చూస్తూ పండగ రోజుల్లో మాత్రం కాసేపు గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టేసి వస్తున్నారు. ఆ ఒక్క కొబ్బరికాయతో మీ పాత పాపాలన్నీ అలాగే మీ అలవాట్లన్నీ కడిగిపోతాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు.
(06:53) అలా ఎలా కుదిరిద్ది నిజం ఏంటంటే బాహ్యంగా మీరు ఎన్ని ఆచారాలు చేసినా లోపల మార్పు రానంత కాలం అంతా వేస్ట్. మీరు ఒక నదిలో మునిగి లేచినంత మాత్రాన మీ ఒంటి మీద ఉన్న మురికి పోతుందేమో కానీ మీ మనసులో ఉన్న కుళ్ళు పోదు. ఈ ప్రపంచంలో ఏ పండుగ అయినా సరే వాటి కేవలం కొత్త బట్టలు వేసుకొని స్వీట్లు తినే ఆచారాలుగా మార్చేశారు ఈ జనరేషన్ వాళ్ళు.
(07:18) పండగ అంటే బాహ్యమైన హడావుడి కాదు మీ అంతరంగంలో రావాల్సిన ఒక తీవ్రమైన నిశశబ్దం ఒక పెద్ద మార్పు ఆ మార్పు రానంత కాలం మీరు ఏ కర్మ చేసినా అది కేవలం ఒక డ్రామా మాత్రమే అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి అయినా లేకపోతే మరే పండుగలయినా సరే మనం ఏమనుకుంటాము కొత్త బట్టలు వేసుకొని ఆ పండగకి తగిన విధంగా ఇంట్లో వంటలు చేసుకొని ఏదో ఒక 10 నిమిషాలు దేవుడి ముందు నుంచుని దండం పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటాం.
(07:45) కానీ పండగల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంతరంగంలో రావాల్సిన ఒక తీవ్రమైన నిశ్శబ్దం ఒక పెద్ద మార్పు అనేది మన అంతరంగంలో రావాలి అలా రానప్పుడు ఎన్ని పండగలు మన జీవితంలోకి వస్తే ఏంటి ఎన్ని కొత్త బట్టలు మనం వేసుకుంటే ఏంటి ఇన్ని గంటలు దేవుడు ముందు పొర్లు దండాలు పెడితే మనక ఏంటి? ఆ అంతరంగ మార్పు అనేది మనలో రావాలి కదా అలా రావటానికే కదా పండగలు ఉంది.
(08:10) మీకు తెలుసా మీ మైండ్ ఎప్పుడూ ఒక బ్రమలో బ్రతుకుతూ ఉంటుంది. ఆదిశంకరాచార్యుల వారు దీన్నే మాయ అన్నారు. తాడును చూసి పాము అనుకొని భయపడటం ఎంత అజ్ఞానమో ఈ తాత్కాలిక లోకంలో దొరికే చిన్న చిన్న శారీరక సుఖాల్లో అలాగే వ్యసనాల్లో ఆనందం ఉంది అనుకోవడం అంత పెద్ద అజ్ఞానం అని. ఆ అజ్ఞానమే మిమ్మల్ని ప్రతికూలమైన దారిలోకి లాగుతుంది. మీరు చేసే తప్పులు ఎవరికీ తెలియవు అనుకుంటారు కానీ సైకాలజీ ప్రకారం మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రతి ఒక్క విషయాన్ని రికార్డ్ చేసుకుంటుంది.
(08:41) అందుకే బయట ఏ చిన్న తేడా జరిగినా మీ లోపల ఒక తెలియని భయం ఆవేదన మొదలవుతాయి. మరి ఈ నరకం నుంచి ఎలా బయట పడాలి? బయటపడాలంటే ఏం చేయాలి? అసలు బయట పడటం ఎలా? దానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే వివేకం మరియు చిత్తశుద్ధి. శంకరాచార్యుల వారు తమ భజగోవిందం శ్లోకంలో ఒక అద్భుతమైన రియాలిటీ చెక్ ఇచ్చారు. వయసు అయిపోయాక శరీరం సహకరించినప్పుడు భగవంతుడు గురించి ఆలోచిస్తే లాభం లేదు.
(09:09) శక్తి ఉన్నప్పుడే మీ మేదస్సు పదునుగా ఉన్నప్పుడే మీ మనసును కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. నిజమైన అంతర్గత శుద్ధి కేవలం బాహ్యమైన కర్మకాండల వల్ల రాదు. అది మీ అంతరంగంలో మీరు తీసుకునే ఒక బలమైన నిర్ణయం వల్ల వస్తుంది. అందులో మొదటిగా ఆ వ్యసనాన్ని లేదా తప్పుడు ఆలోచనల్ని జయించాలంటే మీ మనసుకి అంతకంటే గొప్పదైన పవిత్రమైన పనిని అలవాటు చేయాలి. ఖాళీగా కూర్చోవడం బంద్ చేయండి.
(09:35) మీ ఎనర్జీని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు మల్లించండి. మన హిందూ ధర్మంలో నిష్కమ కర్మ అని ఊరికే అనలేదు. ఫలితాన్ని ఆశించకుండా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తూ సమాజానికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ మైండ్ లో ఉన్న చెత్తంతా క్లియర్ అయిపోతుంది. పాపం అనే పాము మీ వాకెట్ లోకి రావటానికి కూడా ధైర్యం చేయదు. రెండవది మీ అపరాధ భావన అంటే గిల్టీ కాంప్లెక్స్ నుంచి బయటపడాలి.
(10:03) జరిగిపోయిన గతాన్ని పట్టుకొని ఏడవటం వల్ల ఉపయోగం లేదు. మీరు ఇంతకుముందు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. లేకపోతే మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. ఇప్పుడు వాటిని తలుచుకొని బాధపడటం వల్ల ఉపయోగం లేదు. అపరాధ సహస్రిని క్రియంతే అహర్నిసంమయ అని మన పెద్దలు ఊరికే అనలేదు. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పుల్లోనే కూరుకుపోవడం మూర్ఖత్వం.
(10:28) మీ తప్పుని మీ హృదయపూర్వకంగా అంగీకరించి ఇకపై ఈ మార్గంలో నడవను అని ఒక దృఢమైన సంకల్పం చెప్పుకున్నప్పుడే మీ అంతరంగం మళ్ళీ పవిత్రమవుతుంది. ఆదిశంకరాచార్యుల వారు బోధించిన జ్ఞాన మార్గం ఇదే. జ్ఞానం అనే నిప్పు ముందు ఎంతటి పాత పాపాలైనా సరే ఎండిపోయిన గడ్డి పరకల్లా బూడిద అవ్వాల్సిందే కాబట్టి వాటిని బూడిద చేస్తారా మీరు అలాగే కంటిన్యూ చేస్తారా అనేది మీ ఛాయిస్ ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మీరు ఎలా రీడిజైన్ చేసుకోవాలో చూద్దాము.
(11:00) మన సనాతన ధర్మంలోని వైరాగ్యం చాలా అవసరం. వైరాగ్యం అంటే అడవులోకి వెళ్ళడం కాదు మీ కళ్ళ ముందు ఎన్ని ఆకర్షణలు ఉన్నా వాటి వల్ల మీ బుద్ధి చలించకుండా ఉండటమే నిజమైన వైరాగ్యం ఒక రోడ్డు మీద వెళ్తుంటే మీకు ఎన్నో బ్రాండెడ్ షాపులు పబ్బులు ఎంటర్టైన్మెంట్స్ కనిపిస్తాయి. మీరు వాటన్నిటికీ లోబడి మిమ్మల్ని మీరు చెడగొట్టుకోకుండా వాటికి దూరంగా మీ లక్ష్యం వైపు వెళ్తారు చూశారు అది నిజమైన వైరాగ్యం అంటే మీ లైఫ్ ని మీరు రీడిజైన్ చేసుకోవడాన్నే వైరాగ్యం అంటారు.
(11:31) చాలా మంది వైరాగ్యం అనే పేరుకి రకరకాల అర్థాలు తీస్తారు. దాని నిజమైన అర్థం ఏంటంటే మీ లైఫ్ ని మీరు రీడిజైన్ చేసుకోవడం. అలా డిజైన్ చేసుకోవాలంటే ముఖ్యంగా మీ జీవిత లక్ష్యం ఏంటో మీకు తెలియాలి. అల్టిమేట్ గోల్ ఏంటో మీకు తెలిస్తే ఈ చిన్న చిన్న పాపాలు అనేవి మీ దగ్గరకి కూడా రావు. అందులోనూ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం చెప్తాను వినండి కాలం తన ఆట ఆడుకుంటూ వెళ్తూ ఉంటుంది.
(11:56) మీ ఆయుషషు కరిగిపోతూ ఉంటుంది. కానీ మీలో ఉన్న అత్యాశ తప్పుడు కోరికలు మాత్రం మిమ్మల్ని వదలవు. ఈరోజు మీ వయసు మీ అందం మీ బలం శాశ్వతం అనుకొని అహంకారంతో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. కాలం చాలా క్రూరమైనది. అది అన్నింటిని లాగేసుకుంటుంది. ఆ రియాలిటీ మీకు ఎప్పుడైతే అర్థంవుతుందో అప్పుడే మీ జీవితం మెరుగవడం మొదలవుతుంది.
(12:18) కాబట్టి రియాలిటీకి దగ్గరగా ఉండండి. మీరు ఏ గుడికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రానికి తిరిగినా మీ లోపల మార్పు రానంత కాలం అంతా శూన్యం. ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఆదిశంకరాచార్యులు గారు చెప్పినట్లు మిమ్మల్ని బంధించింది ఈ లోకం కాదు మీ లోపల ఉన్న అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని వివేకంతో మార్చేయండి ఛాయిస్ మీదే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి అందులోనూ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
(12:49) అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్.
No comments:
Post a Comment