మహాభారతంలో శకుని, కర్ణుడు, ద్రౌపదిల గురించిన ఈ నిజాలు మీకు తెలుసా?| Myths vs Facts of Mahabharata
Author Name:M HARIKRISHNA
Youtube Channel Url:https://www.youtube.com/@morlaharikrishna3644
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bNZ7FcbEO8Q
Transcript:
(00:00) అందరికీ నమస్కారం మహాభారతం అనగానే మనకు ఎన్నో అద్భుతమైన కథలు ఉద్వేగభరితమైన ఘట్టాలు గుర్తొస్తాయి కదా కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనమంతా అక్షరాలా నిజమని నమ్మే నాలుగు ఫేమస్ మహాభారత ఘట్టాలు అసలు వ్యాస మహర్షి రాసిన మూల గ్రంథంలోనే లేనే లేవు అవునండి మీరు విన్నది నిజమే అవన్నీ కేవలం సినిమాల్లో మన రంజన కోసం సృష్టించిన నాటకీయ పరిణామాలు మాత్రమే సరే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఆమూ మూల గ్రంథాల్లో ఏముందో వాస్తవాలు ఏమిటో ఈరోజు స్పష్టంగా చూద్దాం.
(00:35) ముందుగా ఆ నాలుగు ముఖ్యమైన కథల గురించి మాట్లాడుకుందాం. 15వ శతాబ్దంలో కొందరు కవులు తీసుకున్న స్వేచ్ఛ అలాగే 20వ శతాబ్దంలో వచ్చిన మన సినిమాలో ఈ ప్రాచీన గ్రంథాలలోని వాస్తవాలను ఎలా మార్చేసాయో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. నాటకీయత కోసం అసలు చరిత్ర ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. మన మొదటి అంశం శకుని ప్రతీకారం అలాగే ఆ ఎముకల పాచికల కథ మనం సినిమాల్లో చూసినట్లుగా దుర్యోధనుడు శకుని కుటుంబాన్ని ఒక చీకటి గదిలో బంధించి రోజుకు ఒక్క మెతుకు మాత్రమే పెట్టి హింసిస్తాడు కదా ఆ ఒక్క మెతుకుని శకునికి ఇచ్చి మిగతా వాళ్ళంతా చనిపోతారు.
(01:14) అప్పుడు చనిపోయే ముందు శకుని తండ్రి తన వెన్నెముకతో పాచికలు తయారు చేసుకోమని చెబుతాడు. ఆ పాచికలతోనే శకుని కౌరవులను నాశనం చేస్తాడని మనం విన్నాం. కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించండి అసలు శకుని తండ్రి నిజంగానే ఆ కారాగారంలో ఆ చీకటి గదిలో మరణించాడా శ్రీకృష్ణ పాండవీయం లాంటి అద్భుతమైన సినిమాల్లో మనల్ని కట్టిపడేసిన ఈ ఉత్కంఠభరితమైన కథ అసలు వ్యాస మహాభారతంలో ఉందా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం నేరుగా శాస్త్రపరంగా మూల గ్రంథాన్ని పరిశీలించాల్సిందే.
(01:48) ఇక్కడ గమనిస్తే ఒకవైపు సినిమాల్లో మనం చూసిన కల్పిత కథ ఉంది అందులో శకుని తండ్రి సుబలుడు కారాగారంలో ఆకలితో చనిపోతాడు కానీ అసలు వ్యాస మహాభారతాన్ని తీసి చూస్తే అక్కడ ఒక పెద్ద లాజికల్ మిస్టేక్ కనిపిస్తుంది. అదేంటంటే ధర్మరాజు చేసిన రాజసూయ యాగానికి సుబలుడు ప్రాణాలతో ఎంతో సజీవంగా హాజరయ్యాడని అందులో స్పష్టంగా రాసింది.
(02:16) అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రాజసూయ యాగానికి వచ్చిన గెస్ట్ లిస్ట్ వ్యాస మహాభారతంలోని శ్లోకాల ప్రకారం ఈ జాబితాను గమనిస్తే ధృతరాష్ట్రుడు భీష్ముడు విధురుడు దుర్యోధనుడు మరియు గాంధార రాజు సుబలుడు తన కుమారుడైన శకునితో కలిసి వచ్చారు అని ఉంది. ఒక్కసారి ఆలోచించండి. కారాగారంలో చనిపోయిన వ్యక్తి రాజసూయ యాగానికి ఎలా వస్తాడు దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఆ ప్రతికారం ఆ ఎముకల పాచికల కథ కేవలం డ్రామా కోసం అల్లబడిన కల్పితమని ఇక మన రెండవ ఘట్టం మత్స్య యంత్రం అసలు కర్ణుడు ఎందుకు గెలవలేకపోయాడు సినిమాల్లో మనం రెండు రకాల కథలు చూసాము.
(02:56) కర్ణుడు బాణం వేయబోతుంటే కృష్ణుడు తన వేణువును విసిరి ఆ మత్స్య యంత్రాన్ని కదిలించాడని ఒక సినిమాలో ఉంటే కర్ణుడు ఏకంగా ఐదు బాణాలు వేసి కూడా దాన్ని కొట్టలేకపోయాడు అని ఇంకో సినిమాలో చూపించారు. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే కర్ణుడు ఓడిపోయింది నిజంగానే కృష్ణుడి వేణువు వల్లనా లేక తనలో ఆ నైపుణ్యం లేకపోవడం వల్లనా మోసపోవడం లేదా అసమర్ధుడిగా మిగిలిపోవడం అనే ఈ సినిమాటిక్ యాంగిల్స్ చారిత్రకంగా నిజమేనా అసలు ఆ అద్భుతమైన స్వయంవరంలో ఏం జరిగిందో చూద్దాం.
(03:31) వ్యాస మహాభారతంలో ఆ స్వయంవరంలో జరిగిన అసలు సీక్వెన్స్ ని చూస్తే సినిమాల్లో చూయించిన వాస్తవం బయటపడుతుంది. ముందుగా దుర్యోధనుడు ప్రయత్నించి కింద పడిపోయాడు. ఆ తర్వాత శిశుపాలుడు జరాసందుడు లాంటి మహావీరులు కూడా ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. వీళ్ళందరి తర్వాత మాత్రమే కర్ణుడు ఆ మత్స్య యంత్రాన్ని చేదించడానికి ముందుకు వచ్చాడు. సరిగ్గా ఆ క్షణములో ఏం జరిగిందో వ్యాస మహర్షి చాలా క్లియర్ గా రాశారు.
(03:55) కర్ణుడు విల్లు పట్టుకొని ముందుకు రాగానే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా నేను సూత పుత్రుని వరించెను అని అందరి ముందు మొహం మీదే తేల్చి చెప్పేసింది. అప్పుడు కర్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చిన్న చిరునవ్వుతో తన ధనస్సుని కింద పెట్టేసి ఆకాశంలో ఉన్న సూర్యుడి వైపు చూసి వెనుదిరిగాడు. అంతే చూశారుగా ఇక్కడ ఎంత పెద్ద తేడా ఉందో ఒకవైపు సినిమాలో ద్రౌపది నిర్ణయానికి విలువ లేకుండా చేసి కృష్ణుడు మోసం చేశాడనో కర్ణుడికి స్కిల్ లేదనో చూపించారు.
(04:23) కానీ వ్యాస మూలాల్లో చూస్తే ద్రౌపది నిర్ణయాధికారం ఆమె ఛాయిస్ స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణుడు మోసం చేయలేదు కర్ణుడు ఫెయిల్ కాలేదు. సింపుల్ గా ద్రౌపది రిజెక్ట్ చేసింది అంతే కదా మయసభలో ద్రౌపది నవ్విందా మయసభలో దుర్యోధనుడు నీళ్ళలో పడిపోయినప్పుడు ద్రౌపది పగలబడి నవ్విందని మనమంతా నమ్ముతాం. ఆ ఒక్క అవమానమే ద్రౌపది వస్త్రాపహరణానికి ఆఖరికి కురుక్షేత్ర యుద్ధానికే దారి తీసిందని అనుకుంటాం కదా కానీ వ్యాస మహాభారతం ప్రకారం ఆ సంఘటన జరిగినప్పుడు ఆమె అసలు ఆ దరిదాపుల్లోనే లేదు.
(04:59) మరి ఎవరు నవ్వారు అంటారా దుర్యోధనుడు కింద పడిపోయినప్పుడు అక్కడ ఉన్నది కేవలం భీముడు అర్జునుడు నకుల సహదేవులు మరియు కొంతమంది పనివాళ్ళు మాత్రమే వాళ్లే నవ్వారు. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ఏంటంటే అలా నవ్విన ఆ భీముడే స్వయంగా వెళ్లి దుర్యోధనుడికి తుడుచుకోవడానికి పొడి బట్టలు కూడా ఇచ్చాడు. ఇది అసలు వాస్తవం. తర్వాతి కాలంలో అంటే 15వ శతాబ్దపు రచనల్లో ఆ తర్వాత వచ్చిన నాటకాల్లో సినిమాల్లో ఆ డ్రామాని ఆ సెంటిమెంట్ ని పెంచడం కోసం అన్యాయంగా ఆ నిందను ద్రౌపదిపై మోపేశారు.
(05:32) నిజమైన మూలకథ మరుగున పడిపోయి ఈ కల్పిత కథే జనాధరణ పొందటం వల్ల ద్రౌపది పాత్రను మన సమాజం తరతరాలుగా తప్పుగా అర్థం చేసుకునేలా చేశయి మాధ్యమాలు. ఇక మన చివరి అంశానికి వెళ్లే ముందు పద్మవ్యూహం అంటే ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పద్మవ్యూహం అంటే శత్రువులను బంధించడానికి వికసిస్తున్న తామరపువ్వు ఆకారంలో అత్యంత క్లిష్టంగా నిర్మించే ఒక సైనిక ఫార్మేషన్ శత్రువులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉచ్చుపన్నే అద్భుతమైన వ్యూహం ఇది.
(06:04) ఈ వ్యూహం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది అభిమన్యుడి కథ. అభిమన్యుడు తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం గురించి వివరిస్తాడు కదా లోపలికి ఎలా వెళ్ళాలో చెప్పేసరికి సుభద్రకు నిద్ర వస్తుంది. కాబట్టి బయటకి ఎలా రావాలో ఆ కడుపులో ఉన్న అభిమన్యుడికి తెలియలేదని అందుకే కురుక్షేత్రంలో అతడు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాడని ఒక అద్భుతమైన కథ మనందరికీ తెలుసు.
(06:29) కానీ ఇది మన పురాణాల్లోని వేరు వేరు కథలు ఒకదానితో ఒకటి ఎలా మిక్స్ అయిపోతాయో అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తల్లి గర్భంలో ఉండగానే నేర్చుకోవడం అనే కాన్సెప్ట్ ప్రహ్లాదుడి కథలోనూటికి నూరు పాళ్ళు నిజం కానీ సినిమాల్లో ఆ ప్రహ్లాదుడి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి అభిమన్యుడికి ఆపాదించారు. అసలు వ్యాస రికార్డుల ప్రకారం వాస్తవం ఏమిటంటే అభిమన్యుడు పుట్టి పెద్దవాడఅయ్యాక మాత్రమే అర్జునుడి దగ్గర విల్లువిద్య నేర్చుకున్నాడు.
(06:56) వ్యాసమూలాల్ని ఇంకాస్త డీప్ గా చూస్తే అర్జునుడు స్వయంగా తన కొడుక్కి నాలుగు భాగాల విలువిద్యను నేర్పించాడు. తన కుమారుడి స్కిల్ చూసి అర్జునుడు ఎంతో గర్వపడేవాడు. కానీ ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే అర్జునుడు ఏనాడు అసలు ఎప్పుడూ అభిమన్యుడి దగ్గర పద్మవ్యూహం గురించి టాపిక్ే తీసుకురాలేదు. అసలు ఆ ప్రస్తావనే తేయలేదు. ఇక చివరిగా ఎంటర్టైన్మెంట్ వర్సెస్ హిస్టరీ.
(07:20) ఇవన్నీ చూసాక మనకు అర్థమయ్యేది ఒక్కటే ఎంటర్టైన్మెంట్ కి వాస్తవ చరిత్రకి మధ్య ఉన్న గ్యాప్ సినిమా లేదా నాటకం లాంటి మాధ్యమాలకు ఉండే పవర్ మామూలుది కాదు వందలేలుగా ఉన్న ప్రాచీన గ్రంథాల కంటే కూడా బాక్స్ ఆఫీస్ హిట్స్ ఆ నాటకేతే ప్రజల మనసుల్లో ఎంత బలంగా నాటుకుపోతాయో ఈ ఘట్టాలు మనకు ప్రూవ్ చేస్తున్నాయి. సినిమాలు మనల్ని తప్పుదోవ పట్టించాలని ఉద్దేశపూర్వకంగా చేసిన మోసం కాదుఇది.
(07:46) కేవలం ప్రేక్షకులను కట్టిపడేయడానికి పాత్రలను కాస్త డ్రమాటిక్ గా మార్చారంతే కానీ మన ప్రాచీన గ్రంథాలు ఎంతో సంక్లిష్టమైన మానవ స్వభావాలను వాస్తవాలను చాలా నాచురల్ గా ఆవిష్కరించాయి. కేవలం వినోదం కోసం చేసిన చిన్న చిన్న మార్పులు తరాలు గడిచే కొద్దీ మన కల్చరల్ మెమరీని ఎలా మార్చేసాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
(08:11) సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. కేవలం కొన్ని సినిమాలు వేల సంవత్సరాల నాటి ఒక గొప్ప ఇతిహాసాన్ని ఇంత కన్విన్సింగ్ గా మన బుర్రలో మార్చి రాయగలిగితే ఆ అద్భుతమైన సినిమా స్క్రిప్టుల వెనక ఇంకెన్ని చారిత్రక వాస్తవాలు కనుమరుగైపోయాయో కదా ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment