Sunday, May 24, 2026

Why Failure and Heartbreak Are Your Greatest Spiritual Teachers

Why Failure and Heartbreak Are Your Greatest Spiritual Teachers

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7l5q8JvcYfc



Transcript:
(00:06) మనం ఈ సమాజంలో ఒక పద్ధతి ప్రకారం బ్రతకాలని కొన్ని రూల్స్ లను సృష్టించుకున్నాం. కానీ ఆ రూల్సే ఒకానొక దశలో మనల్ని మింగేసే ఒక మహా యంత్రంలా ఎలా మారుతాయో అని చెప్పాడు ఫ్రాన్స్ కాఫ్కా. ఈ వ్యవస్థ గురించి మాట్లాడాల్సి వస్తే కాఫ్కా పేరు తీయకుండా ఆయన రాసిన ద ట్రయల్ అనే కథ గురించి ప్రస్తావించకుండా ముందుకు వెళ్ళడం అసాధ్యం.
(00:30) ఎందుకంటే వ్యవస్థ అంటే కేవలం ఒక ఆఫీసో లేక ఒక కోర్టు భవనమో కాదు అది మనిషి మెదడుని తొలిచేసే ఒక అంతు చిక్కని అయోమయం ఇక్కడ సమస్య కేవలం డబ్బు ఉన్నవాడికి లేని వాడికి మధ్య ఉండే తేడా మాత్రమే కాదు అసలు సమస్య ఈ వ్యవస్థ యొక్క స్వభావంలోనే ఉంది. ఈ వ్యవస్థలో నువ్వు ఎవరు నీ నీటి ఏంటి అన్నది ముఖ్యం కాదు. ఆ యంత్రంలో నువ్వు ఒక చిన్న కాగితం ముక్కవయ్యావా లేదా అన్నదే ముఖ్యం.
(00:54) కాఫ్కా సృష్టించిన జోసెఫ్ కే అనే పాత్రను తీసుకుంటే ఈ వ్యవస్థ అసలు రంగ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరోజు ఉదయం జోసెఫ్ కే నిద్రలేవగానే తనని ఎవరో అరెస్ట్ చేశారని తెలుస్తుంది. అతను ఏం తప్పు చేశాడు ఎందుకు అరెస్ట్ చేశారు ఎవరు అరెస్ట్ చేశారు ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. అసలు ఈ వ్యవస్థ ఇచ్చే అతి పెద్ద తలనొప్పి ఇదే నీ మీద నింద ఉంటుంది కానీ అది ఎందుకో నీకు తెలీదు.
(01:18) నువ్వు నిరపరాధివని నిరూపించుకోవడానికి ప్రయత్నించే కొద్దీ ఆ వ్యవస్థ నిన్ను ఇంకా లోపలికి లాగేసుకుంటుంది. సాధారణంగా మనం చట్టం అంటే ఏమనుకుంటాం ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది. చేయకపోతే రక్షణ ఉంటుంది అనుకుంటాం. కానీ కాఫ్కా చూపించిన ప్రపంచంలో చట్టం అనేది ఒక అభేద్యమైన కోట లాంటిది. ఆ కోట తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కానీ నువ్వు లోపలికి వెళ్ళలేవు.
(01:40) దీనికి ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతాడు. ఒక మనిషి చట్టం అనే ద్వారం దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళాలని అడుగుతాడు. అక్కడ ఒక ద్వారపాలకుడు నిలబడి ఉంటాడు. నేను లోపలికి వెళ్ళొచ్చా అని ఆ మనిషి అడిగితే ఆ పాలకుడు ఇప్పుడు వద్దు తర్వాత రా అంటాడు. ఆ మనిషి అక్కడే కూర్చుని ఎదురుచూస్తూ ఉంటాడు. రోజులు గడుస్తాయి ఏళ్లు గడుస్తాయి ఆ మనిషి ముసలివాడైపోతాడు.
(02:02) చనిపోయే ముందు అతను అడుగుతాడు. ప్రతి ఒక్కరికి చట్టం కావాలి కదా మరి ఇన్నేళ్లలో నేను తప్ప ఎవరు ఇక్కడికి రాలేదేంటి అని. అప్పుడు ఆ ద్వారపాలకుడు ఈ ద్వార మనం ఈ సమాజంలో ఒక పద్ధతి ప్రకారం బ్రతకాలని కొన్ని రూల్స్ లను సృష్టించుకున్నాం. కానీ ఆ రూల్సే ఒకానొక దశలో మనల్ని మింగేసే ఒక మహా యంత్రంలా ఎలా మారుతాయో అని చెప్పాడు ఫ్రాన్స్ కాఫ్కా ఈ వ్యవస్థ గురించి మాట్లాడాల్సి వస్తే కాఫ్కా పేరు తీయకుండా ఆయన రాసిన ద ట్రయల్ అనే కథ గురించి ప్రస్తావించకుండా ముందుకు వెళ్ళడం అసాధ్యం.
(02:35) ఎందుకంటే వ్యవస్థ అంటే కేవలం ఒక ఆఫీసో లేక ఒక కోర్టు భవనమో కాదు అది మనిషి మెదడుని తొలిచేసే ఒక అంతు చిక్కని అయోమయం. ఇక్కడ సమస్య కేవలం డబ్బు ఉన్నవాడికి లేని వాడికి మధ్య ఉండే తేడా మాత్రమే కాదు అసలు సమస్య ఈ వ్యవస్థ యొక్క స్వభావంలోనే ఉంది. ఈ వ్యవస్థలో నువ్వు ఎవరు నీ నీటి ఏంటి అన్నది ముఖ్యం కాదు. ఆ యంత్రంలో నువ్వు ఒక చిన్న కాగితం ముక్కవయ్యావా లేదా అన్నదే ముఖ్యం.
(03:00) కాఫ్కా సృష్టించిన జోసెఫ్ కే అనే పాత్రను తీసుకుంటే ఈ వ్యవస్థ అసలు రంగు ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరోజు ఉదయం జోసెఫ్ కే నిద్రలేవగానే తనని ఎవరో అరెస్ట్ చేశారని తెలుస్తుంది. అతను ఏం తప్పు చేశాడు ఎందుకు అరెస్ట్ చేశారు ఎవరు అరెస్ట్ చేశారు ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. అసలు ఈ వ్యవస్థ ఇచ్చే అతి పెద్ద తలనొప్పి ఇదే నీ మీద నింద ఉంటుంది కానీ అది ఎందుకో నీకు తెలియదు.
(03:23) నువ్వు నిరపరాధివ అని నిరూపించుకోవడానికి ప్రయత్నించే కొద్దీ ఆ వ్యవస్థ నిన్ను ఇంకా లోపలికి లాగేసుకుంటుంది. సాధారణంగా మనం చట్టం అంటే ఏమనుకుంటాం ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది. చేయకపోతే రక్షణ ఉంటుంది అనుకుంటాం. కానీ కాఫ్కా చూపించిన ప్రపంచంలో చట్టం అనేది ఒక అభేద్యమైన కోట లాంటిది. ఆ కోట తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కానీ నువ్వు లోపలికి వెళ్ళలేవు.
(03:45) దీనికి ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతాడు. ఒక మనిషి చట్టం అనే ద్వారం దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళాలని అడుగుతాడు. అక్కడ ఒక ద్వారపాలకుడు విలబడి ఉంటాడు. నేను లోపలికి వెళ్లొచ్చా అని ఆ మనిషి అడిగితే ఆ పాలకుడు ఇప్పుడు వద్దు తర్వాత రా అంటాడు. ఆ మనిషి అక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. రోజులు గడుస్తాయి ఏళ్లు గడుస్తాయి ఆ మనిషి ముసలివాడు అయిపోతాడు.
(04:07) చనిపోయే ముందు అతను అడుగుతాడు. ప్రతి ఒక్కరికీ చట్టం కావాలి కదా మరి ఇన్నేళ్లలో నేను తప్ప ఎవరు ఇక్కడికి రాలేదేంటి అని అప్పుడు ఆ ద్వారపాలకుడు ఈ ద్వారం కేవలం నీకోసమే నిర్మించబడింది నువ్వు చనిపోతున్నావు కాబట్టి ఇప్పుడు దీన్ని మూసేస్తున్నాను అని చెప్పి తలుపులు వేసేస్తాడు. ఈ కథలో ఉన్న నిగూడార్థం ఏంటంటే వ్యవస్థ అనేది నీకోసం పని చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ అది నిన్ను కేవలం నిరీక్షణలోనే ఉంచుతుంది.
(04:32) నీ జీవితం మొత్తం ఆ వ్యవస్థ గుమ్మం దగ్గరే కరిగిపోతుంది తప్ప నీకు అందాల్సిన న్యాయం అందదు. ఆ ద్వారపాలకుడు ఎవరో కాదు వ్యవస్థలో ఉండే అసంఖ్యాకమైన రూల్స్, పద్ధతులు, సంతకాలు ఈ వ్యవస్థలో అధికారులు మనుషుల కంటే ఎక్కువగా ప్రాసెస్ అంటే పద్ధతికే ప్రాధాన్యత ఇస్తారు. ఒక ఫైలు కదలాలంటే అది ఒక క్రమంలోనే వెళ్ళాలి అంటారు. కానీ ఆ క్రమం ఎక్కడికి దారి తీస్తుందో ఎవరికీ తెలియదు.
(04:55) కాఫ్కా రాసిన ప్రపంచంలో కోర్ట్లు అందమైన భవనాల్లో ఉండవు. అవి పాత ఇళ్ల అటకల మీద దుమ్ము పట్టిన గదుల్లో చీకటి సందుల్లో ఉంటాయి. అంటే న్యాయం అనేది వెలుగులో ఉండదు. అది ఎప్పుడూ నీడల్లోనే దాగుంటుంది. నువ్వు ఒక అధికారిని కలిస్తే అతను ఇంకో అధికారిని చూపిస్తాడు. ఆ రెండోవాడు మూడో వాడిని చూపిస్తాడు. ఈ క్రమంలో నువ్వు కలిసే ప్రతి మనిషి ఒక యంత్రం లాగే ప్రవర్తిస్తాడు తప్ప ఒక మనిషిగా నీ బాధను అర్థం చేసుకోడు.
(05:20) వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కూడా ఆ వ్యవస్థ మీద కంట్రోల్ ఉండదు. ఒక చిన్న క్లర్క్ దగ్గర నుంచి పై అధికారి దాకా అందరూ ఆ యంత్రంలో చిక్కుకున్న వాళ్లే. ఎవరికీ పూర్తి బాధ్యత ఉండదు కాబట్టి ఎవరూ నిన్ను రక్షించలేరు. ఇక్కడ ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్య ఉండే సంబంధం కంటే ఒక కాగితానికి ఇంకో కాగితానికి ఉండే సంబంధమే బలమైంది.
(05:42) నీ పేరు మీద ఒక కాగితం రాసి ఉంటే నువ్వు మనిషివని చెప్పినా ఆ వ్యవస్థ నమ్మదు. ఆ కాగితల్లో ఏముందో అదే నిజమని నమ్ముతుంది. ఈ వ్యవస్థ ఇచ్చే ఇంకో పెద్ద చిక్క ఏంటంటే అది నిన్ను నిరంతరం ఒక అపరాధ భావనలో ఉంచుతుంది. నువ్వు ఏ తప్పు చేయకపోయినా వ్యవస్థ నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నేను ఎక్కడో ఏదో పొరపాటు చేసి ఉంటాను అని నువ్వే అనుకునేలా చేస్తుంది.
(06:02) ద ట్రయల్ అనే బుక్ లో జోసెఫ్ కే కూడా అలాగే ఫీల్ అవుతాడు. మొదట్లో తను నిర్దోషినని గట్టిగా వాదించిన అతను కాలక్రమేన ఆ వ్యవస్థ పెట్టిన టెన్షన్ కి లోనై తనంతట తానుగా ఆ వ్యవస్థకు లొంగిపోతాడు. ఇదొక రకమైన మానసిక దాడి వ్యవస్థ నిన్ను శారీరకంగా హింసించాల్సిన అవసరం లేదు. నిన్ను అయోమయంలో నెట్టి నీ సమయాన్ని వృధా చేసి నిన్ను సమాధానం లేని ప్రశ్నలతో వేధిస్తే చాలు నువ్వు మానసికంగా చచ్చిపోతావు.
(06:27) ఆఖరికి జోసెఫ్ కే ని చంపేటప్పుడు కూడా ఎందుకు చంపుతున్నారో చెప్పరు. ఒక కుక్కలా చనిపోయాడు అని ఆయన రాస్తాడు. అంటే వ్యవస్థ ముందు ఒక మనిషి విలువ ఒక జంతువు కంటే తక్కువగా మారిపోతుంది. ఇక్కడ సామాన్యుడు వఐపి అనే తేడా కంటే కూడా మనిషి తన ఉనికిని కోల్పోయి ఒక కేసు నెంబర్ గా మిగిలిపోవడం అనేది అసలైన విషాదం. చాలా మంది అనుకుంటారు మనం బాగా చదువుకుంటే లేదా మనకు తెలివి తేటలు ఉంటే ఈ వ్యవస్థను ఎదుర్కోవచ్చు అని.
(06:51) కానీ వ్యవస్థకు నీ తెలివి తేటలతో పని లేదు. దానికి కావాల్సింది కేవలం విధేయత. నువ్వు ఎంత తెలివిగా వాదించినా ఆ వ్యవస్థలోని లూప్ హోల్స్ నిన్ను ఇంకా చిక్కుల్లోకి నడతాయి. ఒక లాయర్ ని పెట్టుకుంటే అతను నీకు సహాయం చేస్తాడు అనుకుంటావు. కానీ ఆ లాయర్ కూడా వ్యవస్థలో ఒక భాగమే. అతను నీ కేసును గెలిపించడం కంటే ఆ కేసును సాగదీయడానికే ఎక్కువ ఇష్టపడతాడు.
(07:12) ఎందుకంటే కేసు నడుస్తున్నంత కాలమే అతనికి మనుగడ ఉంటుంది. ఇలా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఈ వ్యవస్థ అనే మాయాజాలం నడుస్తూనే ఉంటుంది. ఇందులో న్యాయం జరగడం అనేది ఒక అద్భుతం అయితే అన్యాయం జరగడం అనేది ఒక సాధారణ విషయం. ఈ వ్యవస్థలో ఉండే గందరగోళం ఏదో అనుకోకుండా జరగలేదు. అది పనికట్టుకొని సృష్టించబడింది.
(07:34) ఎందుకంటే గందరగోళం ఉన్నచోటే మనిషిని భయపెట్టడం సులభం. క్లారిటీ ఉంటే మనిషి ప్రశ్నిస్తాడు. అదే అయోమయం ఉంటే మనిషి బ్రతిమాలుతాడు. వ్యవస్థకు కావాల్సింది బ్రతిమాలే మనుషులు తప్ప ప్రశ్నించే మనుషులు కాదు. మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఒక చిన్న పేపర్ కోసం నెలలు తరబడి వేచి చూడడం ఒక అధికారి సంతకం కోసం పడిగాపులు కాయడం ఇవన్నీ చూసినప్పుడు మనకు కోపం వస్తుంది.
(07:56) కానీ మనం చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ వ్యవస్థకు ఒక ముఖం అంటూ లేదు. నువ్వు ఎవరి మీద కోప్పడతావ్ ఆ క్లర్క్ మీద అతను అంటాడు నా పైన ఉన్న సర్ ఇంకా సైన్ చేయలేదు అని. ఆ సర్ దగ్గరికి వెళితే హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ రాలేదు అంటారు. ఇలా ఒకరి మీద ఒకరు నెట్టేసుకోవడమే ఈ వ్యవస్థ అసలు పని. ఇక్కడ ఎవరూ విలన్లు కాదు కానీ అందరూ ఆ విలనీలో భాగస్వామునే ఒక మనిషి చనిపోయినా ఆ ఫైల్ మాత్రం నడుస్తూనే ఉంటుంది.
(08:22) మనిషి ప్రాణం కంటే ఆ ఫైల్ ప్రాణమే ఈ వ్యవస్థలో ఎక్కువ. కాఫ్కా చూపించిన ఈ లోకం నేటికి మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. టెక్నాలజీ మారినా కాలం మారినా ఆ మానసిక హింస మాత్రం అలాగే ఉంది. మనం ఒక మాయా లోకంలో ఉన్నాం. అక్కడ మనం నడుస్తున్నాం అనుకుంటాం కానీ మనల్ని ఎవరో నడిపిస్తున్నారు. మనం మాట్లాడుతున్నాం అనుకుంటాం కానీ మన నోటి వెంట వచ్చే మాటలు కూడా ఆ వ్యవస్థ డిజైన్ చేసినవే.
(08:45) ఫైనల్ గా చెప్పాలంటే ఈ వ్యవస్థ అనేది ఒక అంతు లేని కథ. [సంగీతం] ఇందులో క్లైమాక్స్ ఉండదు కేవలం సాగ చేయడం మాత్రమే. సామాన్యుడు ఈ యంత్రంలో పడి నలిగిపోతూ తనని తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలే అతని జీవితం అయిపోతాయి. ఈ వ్యవస్థ ముందు నిలబడి గెలవడం అంటే అది ఒక అసాధ్యమైన పని. ఎందుకంటే మనం పోరాడుతున్నది ఒక మనిషితో కాదు ఒక కనిపించని గోడతో [సంగీతం] ఆ గోడకు వినికిడి లేదు చూపు లేదు కానీ అది నిన్ను ప్రతి అడుగులోనూ అడ్డుకుంటుంది.
(09:11) ఈ వ్యవస్థ అనే తలనొప్పికి మందు ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఆ మందు తయారు చేయాల్సిన వాళ్ళు కూడా ఆ తలనొప్పితోనే బ్రతుకుతున్నారు. మనం కేవలం ఆ వ్యవస్థ ఇచ్చే రిథంకి అనుగుణంగా అడుగులు వేస్తూ ఎప్పుడు మన మీద ఆ తలుపులు మూసుకుపోతాయా అని ఎదురుచూసే బాటసారులం మాత్రమే. వ్యవస్థ అనేది ఒక చక్రం అది తిరుగుతూనే ఉంటుంది. దాని కింద నలిగేది మాత్రం ఎప్పుడూ మనిషే.
(09:33) ఆ చక్రం వేగాన్ని తగ్గించే శక్తి ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే ఆ చక్రాన్ని తిప్పుతున్నది మన అందరిలోని భయం మరియు స్వార్థం. ఆ భయం ఉన్నంతకాలం కాఫ్కా చెప్పిన ఆ చీకటి గదులు ఆ అంతు చిక్కని కోర్టులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

No comments:

Post a Comment