స్పీడ్ బ్రేకర్
.................
పరమ బుద్ధుని జీవితంలో
కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ..
అవి మన వేగాన్ని ఆపడానికి లేవు..
అవి ఎన్నో ఆక్సిడెంట్స్ ని ఆపి
మన ప్రయాణాన్ని సులభతరం
సురక్షతం చెయ్యడానికి
ఉన్నాయి...
ఒక్కొకసారి ఆ స్పీడ్ బ్రేకర్
మన నుండి సంవత్సరాలు సమయం
తీసుకోవచ్చు...ఇంకా కొన్ని స్పీడ్ బ్రేకర్స్
ఒకటి లేదా రెండు జన్మలు కూడా తీసుకోవచ్చు..
అయితే ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర మనకు
చిరాకు వస్తుంది..ఎన్నో సందేహాలు వస్తాయి .
సహనం నశిస్తుంది..ఇంతకూ నేను సరైన
మార్గంలో ఉన్నానా..? అని కూడా అనుమానం
వస్తుంది...నేను చేస్తున్నది కరెక్టేనా..? అని కూడా
అనిపిస్తుంది...
ఆ స్పీడ్ బ్రేకర్ అది మనలోని ఏ గుణాన్ని
ప్రేరేపించేది అయినా కావచ్చు...అది మన
వ్యసనం అవ్వొచ్చు...లేదా అది మన
ఇష్టం కూడా అవ్వొచ్చు....ఎక్కడో దాన్నుండి
పొందాల్సిన అనుభవం ఉంది కాబట్టి.. నేర్వాల్సిన
పాఠం ఉంది కాబట్టి అది మనల్ని అక్కడ
నిలిపి ఉంచింది...అని అర్థం చేసుకుంటే
మళ్ళీ మజిలీకి ఫ్రెష్ గా రెడీ అవుతాం...
దేవుడూ..♥️♥️♥️🙏🙏🙏❤️❤️❤️
No comments:
Post a Comment