Thursday, August 13, 2026

99% మందికి తెలియని 7 శక్తులు! | 7 Hidden Powers of Mind | Sanmaarg Thoughts

99% మందికి తెలియని 7 శక్తులు! | 7 Hidden Powers of Mind | Sanmaarg Thoughts

Author Name:Sanmaarg Thoughts

Youtube Channel Url:https://www.youtube.com/@sanmaargthoughts18

Youtube Video URL:https://www.youtube.com/watch?v=m95jUfzJOmw



Transcript:
(00:00) భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం ఏమిటని అడిగితే మీరేం చెప్తారు జీవితమా ఆరోగ్యమా కుటుంబమా లేక తెలివా మీ సమాధానం ఏదైనా కావచ్చు కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని మీరు విన్న తర్వాత మీ సమాధానమే పూర్తిగా మారిపోవచ్చు ఎందుకంటే అవేవి కూడా మీకు భగవంతుడు ఇచ్చిన శక్తులు కావు అవన్నీ ఒకరోజు ఉంటాయి ఒకరోజు పోతాయి కానీ నేను ఇప్పుడు చెప్పే శక్తులు మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటాయి.
(00:27) ఆ మహాశక్తులు మీరు పుట్టినప్పటి నుంచి మీతోనే ఉన్నాయి. వాటిని మీరు ప్రతిరోజు వాడుతున్నారు కానీ వాటి విలువ మీకు తెలియదు. కొంతమంది వాటిని ఉపయోగించి గొప్పవాళ్ళు అవుతున్నారు. మరి కొంతమందేమో తమలో అంత శక్తి లేదని అనుకొని జీవితాంతం వేరేవాళ్ళ సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటున్నారు. కానీ ఈరోజు నేను చెప్పే ఈ ఏడు మహాశక్తులను మీ జీవితంలో మీరు ఉపయోగించడం ప్రారంభిస్తే మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరు ఆశ్చర్యపోవడం కాదు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు.
(00:57) కాబట్టి మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలని స్ట్రాంగ్ గా మీరు అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా నన్ను ఫాలో అవ్వండి. మీలో దాగి ఉన్న ఏడు మహాశక్తుల్లోకి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తాను. ఈ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఇప్పుడే ఒక లైక్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాని వెల్కమ్ టు సన్మార్గ థాట్స్.
(01:21) మీలో దాగి ఉన్న మొదటి శక్తే వాక్ శక్తి. మన పెద్దలు ఒక మాట చెప్పారు వాక్కు కేవలం శబ్దం కాదు అది ఒక దేవత అని వాక్కుని వాక్ దేవి అని కూడా పిలిచారు ఎందుకంటే మాట పుట్టేది గొంతులో కాదు మాట పుట్టేది అంతరాత్మలో మన శాస్త్రాలు నాలుగు స్థాయిల వాక్కు గురించి చెప్పాయి. మొదటిది పరావాక్కు ఇది ఆత్మలో నిశశబ్దంగా పుట్టే భావం రెండవది పశ్యంతి ఇది భావరూపం తీసుకునే స్థితి. మూడవది మధ్యమ.
(01:50) ఇది మనసులో మాటగా ఏర్పడే స్థితి. నాలుగవది వైఖరి. ఇదే నోటి నుంచి బయటకి వచ్చే మాట. ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది. ఈ నాలుగు స్థాయిల గుండా ప్రయాణించిన మాటకు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తే సంకల్ప వాక్కు అని పిలవబడుతుంది. అంటే మీరు స్పష్టంగా నమ్మకంతో పదే పదే పలికే మాట అది కేవలం ఒక మాట కాదు అది ఒక బీజం. ఆ బీజం మీ జీవితంలో నాటుకొని కాలక్రమైన ఫలంగా మారుతుంది.
(02:16) దీన్నే మన ఋషులు వాచికం అన్నారు. అందుకే మంత్రం కూడా ఒక మాటే కానీ దాన్ని నమ్మకంతో స్పష్టతతో పవిత్రంగా పలికితేనే అది మీ జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది. మీరు కోరుకున్నది మీరు పొందాలంటే ముందుగా మీ నోటిని అందుకు తగినట్టుగా మలుచుకోవాలి. మీరు దేని గురించి పదే పదే మాట్లాడతారో దాన్నే మీ మనసు నిజం చేయడానికి పని చేస్తుంది.
(02:39) మీరు ఏదైనా పని నాకు రాదు అని పదే పదే చెప్తూ ఉంటే అదే బీజంగా మారుతుంది. కానీ నేను ఏదైనా సాధిస్తాను అని మీరు నమ్మకంతో అంటే అదే బీజంగా మారి ఫలిస్తుంది. భగవద్గీత తపస్సుని మూడు రకాలుగా చెప్పింది. శరీర తపస్సు, మనో తపస్సు, వాక్ తపస్సు అని. అంటే అనుద్వేగక కరమైన మాట, సత్యమైన మాట, ప్రియమైన మాట, హితమైన మాట ఇదే వాక్ తపస్సు అంటే మాట్లాడడం కూడా ఒక తపస్సు అని భగవద్గీతలో చెప్పబడింది.
(03:07) కాబట్టి ఈ రోజు నుంచి మీరు కోరుకునే జీవితాన్ని మీ మాటలతోనే నిర్మించుకోండి. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. నేను మాట్లాడే ఈ మాట నిజమేనా ఇది నేను ఇష్టంగానే చెప్తున్నానా ఇది నాకు మంచిని చేస్తుందా అని మీలో మీరే క్వశ్చన్ చేయండి. మీకు ఏం కావాలో దాన్ని స్పష్టంగా గట్టి నమ్మకంతో మాటల్లో చెప్పండి. ఎందుకంటే మీ మాటే మీ తపస్సు మీ మాటే మీ జీవితాన్ని [సంగీతం] నిర్ణయిస్తుంది.
(03:31) రెండవ మహాశక్తి మనోశక్తి ఒకే సమస్య ఇద్దరి జీవితాల్లో వస్తుంది. అయితే వారిలో ఒకరు ఇక్కడితో నా జీవితం అయిపోయింది. ఈ సమస్యతో నా పని అంతమైపోయింది అని అనుకుంటారు. మరొకరేమో అదే సమస్య రాగానే ఇది నా మార్పుకు మొదలు అని దాన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్తారు. ఇక్కడ సమస్య ఒక్కటే చూసే విధానమే వేరు ఆ విధానాన్ని నిర్ణయించేదే మనోశక్తి మనసులో ఒక భావన పుడుతుంది.
(03:54) ఆ భావన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ నిర్ణయం అలవాటుగా మారుతుంది. అదే అలవాటు మీ జీవిత ఫలితంగా మీకు కనిపిస్తుంది. కానీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన మీరు నిజం అనుకుంటే మీరు చాలా పొరబడినట్టే మనసులో వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. మీలో ఉన్న భయం ఒక ఆలోచనను నిజంగా చూపిస్తుంది. ఎగ్జాంపుల్ కి మీరు మీ జీవితంలో ఏదైనా పని మొదలుపెట్టి అందులో మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి అక్కడ నిజంగా జరిగింది ఏంటి మీరు చేసిన ఒక పని మాత్రమే ఫెయిల్ అయింది.
(04:22) అంతే ఇదంతా ఒక సంఘటన మాత్రమే కానీ మీ మనసు అక్కడితో ఆగిపోదు వెంటనే మీకు ఒక తీర్పు ఇచ్చేస్తుంది. నేను పూర్తిగా ఫెయిల్ అయ్యాను అని. మీరు చేసిన ఒక ప్రయత్నం ఫెయిల్ అయితే మొత్తం మీరే ఫెయిల్ అయినట్టుగా మీ మనసు ముద్ర వేసేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి నేను చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది అనడం వేరు నేనే ఫెయిల్ అయ్యాను అనడం వేరు.
(04:44) ముందుగా జరిగింది నిజం రెండోది మీ మనసు మీ మీద మోపిన తప్పుడు తీర్పు. ఈ తేడాను మీరు గుర్తించినప్పుడే విఫలమైన ప్రయత్నాన్ని పక్కన పెట్టి మీ జీవితంలో తదుపరి అడుగును మీరు వేయగలరు. ఈ తేడాని తెలుసుకోవడమే మీలో ఉన్న మనోశక్తిని మేలుకొలుపుతుంది. రోజులో కొన్ని నిమిషాలు మీలో వచ్చే ఆలోచనలను గమనించండి. అవి వచ్చిన వెంటనే వాటిని నిజమని నమ్మకండి. గుర్తుపెట్టుకోండి మీ మనసు ఎప్పుడు మీకు సేవకుడిలా ఉండాలి. యజమానిగా కాదు.
(05:10) మీ మనసు ఇలా అశాంతిగా అలజడిగా ఉన్నప్పుడు ఆ అలజడి మీలోనే ఆగిపోదు. అది వెంటనే మీ శరీరానికి కూడా వ్యాపిస్తుంది. ఆ అలజడి వల్ల మీ శ్వాస మారుతుంది. మీ గుండె వేగం మారుతుంది. అలా మారినప్పుడు మనసుకి శరీరానికి మధ్య ఉన్న ఈ అనుసంధానాన్ని గమనించే మూడవ మహాశక్తి ఇప్పుడు మీకు అవసరం. అదే ప్రాణశక్తి. మూడవ మహాశక్తి ప్రాణశక్తి.
(05:34) యోగశాస్త్రం చెప్తుంది ప్రాణమే జీవానికి మూలం అని. మీ జీవితం మొదలైన క్షణం నుంచి చివరి క్షణం వరకు మీతో ఉండే ఒక నిశబ్ద ప్రవాహమే ఈ ప్రాణశక్తి. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాస వేగంగా మారుతుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే శ్వాస సహజంగా లోతుగా ఉంటుంది. మీలో ఉన్న స్థితిని మీ శ్వాసే బయట పెడుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణాయామాన్ని ఒక తపస్సుగా చెప్పారు.
(05:58) శ్వాసను అదుపు చేయగలిగిన వాడే మనసుని అదుపు చేయగలడు అని. అందుకే ఎవరైనా మిమ్మల్ని కోపెట్టినప్పుడు వెంటనే మాట్లాడకుండా ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఆ చిన్న విరామం మీకు గొప్ప స్వేచ్ఛని ఇస్తుంది. ఆ క్షణంలో మీరు కోపానికి బానిసగా కాకుండా సరైన నిర్ణయాన్ని ఎంచుకోగలరు. ప్రతిరోజు కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాసను గమనించండి.
(06:20) బలవంతంగా శ్వాసను లోపల తీసుకోవడం లాంటి పనులుఏమీ చేయవద్దు. కేవలం అలా వస్తూ పోతూ ఉన్న శ్వాసని గమనించండి అంతే. ఇదే ఋషులు చెప్పిన ధ్యాన మార్గం. మీలో శక్తి ఎప్పుడూ ఉంది. కానీ అది చల్లాచెదురుగా ఉంది. ఆ శక్తికి ఒక దిశ కావాలి. అక్కడే నాలుగవ మహాశక్తి మేలుకుంటుంది. ఇప్పటి వరకు మీరు మూడు శక్తులను తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే మిగతా నాలుగు శక్తులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేవి కాబట్టి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి.
(06:47) అలాగే వింటున్నామని ఇప్పుడే ఒక కామెంట్ కూడా చేయండి. నాలుగవ మహాశక్తి సంకల్ప శక్తి. మన శాస్త్రాలు చెప్పాయి సంకల్పాత్సిద్ధిహి అని. అంటే దృఢమైన సంకల్పం నుంచే సిద్ధి కలుగుతుంది అని దీని అర్థం. సంకల్పమే ప్రతి సాధనకు మొట్టమొదటి మెట్టు అని మన ఋషులు బోధించారు. ఈ ప్రపంచంలో ఏ కోరిక లేని మనిషి అనేవాడు ఉంటాడా చెప్పండి. ప్రతి మనిషిలో ఏదో ఒక కోరిక ఉంటుంది.
(07:12) కానీ ఆ కోరిక ఉన్న ప్రతి మనిషి ఎందుకు విజయం సాధించడం లేదు ఎందుకంటే ఆ కోరికకు దిశను చూపించినప్పుడు మాత్రమే అది లక్ష్యంగా మారుతుంది. ఆ లక్ష్యానికి క్రమశిక్షణ ఇచ్చినప్పుడు మాత్రమే అది సంకల్పంగా మారుతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలైన సంకల్ప శక్తి అంటే ఏదో ఒక రోజు చాలా ఉత్సాహంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం కాదు నిజమైన సంకల్ప శక్తి అంటే ఎవ్వరు చూడని రోజుల్లో కూడా ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకోవడం ఫలితం కనిపించకపోయినా అలసట వచ్చినా తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం వదలకుండా ముందుకు సాగిపోవడమే నిజమైన సంకల్పం చాలా మంది
(07:45) పెద్ద పెద్ద ప్రమాణాలు చేస్తారు. కొద్ది రోజులకు అవన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే వారి మాటలు పెద్దవే కానీ ఆ సంకల్పాల కోసం వారు చేసే పనులు మాత్రం చాలా చిన్నవి కాబట్టి మీరు మీ జీవితంలో ఒక పెద్ద మార్పుని గనుక కోరుకొని ఉంటే ఆ మార్పుకు సంబంధించిన ఒక చిన్న పనిని ప్రతి రోజు చేయడం అలవాటు చేయండి సంకల్ప శక్తి అంటే ఎప్పుడు పడిపోకపోవడం కాదు పడిపోయిన తర్వాత కూడా మళ్లీ లేవడం ఇదే తపస్సు మార్గం అంటే నిలకడగా నిరంతరంగా ముందుకు సాగడం కొన్ని శక్తులు జనాల మధ్య పెరగవు వాటికి బయట శబ్దం తగ్గాలి అప్పుడే ఐదవ మహాశక్తి మీకు కనిపిస్తుంది. ఆ శక్తియే మౌన శక్తి మన
(08:24) ఋషులు చెప్పారు మౌనం సర్వార్థ సాధనం అని అంటే మౌనమే అన్ని సాధనలకు మూలం అని దీని అర్థం. అందుకే ఎంతో మంది మహర్షులు జ్ఞానం పొందింది మాటలో కాదు మౌనంలోనే మీరు నాకు ఒక మాట చెప్పండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు తీస్తారు? ఫోన్ తీయకుండా నిశబ్దంగా కూర్చోవచ్చు కదా నిశబ్దంగా కూర్చోవడం ఎందుకు కష్టం మౌనం అనేది మాట్లాడకపోవడం మాత్రమే కాదు మీ లోపల జరుగుతున్న దాన్ని వినడానికి సిద్ధపడడం కూడా మౌనమే మౌనంలో మీ తప్పులు మీకు గుర్తొస్తాయి మీ నిజమైన కోరికలు బయట పడతాయి.
(08:57) అందుకే చాలామంది మౌనం నుంచి పారిపోతారు. కానీ తనను తాను వినలేని మనిషి తనకు నిజంగా ఏం కావాలో ఎలా తెలుసుకుంటాడు. తనకేం కావాలో తెలుసుకునే శక్తిని పొందే మార్గాన్ని మన శాస్త్రాలు ఎప్పుడూ చెప్పాయి. అదే మౌన వ్రతం ప్రతిరోజు కొద్దిసేపు సెల్ ఫోన్ లేకుండా మాటలు లేకుండా ప్రశాంతంగా కూర్చోండి అప్పుడు మీలో వచ్చే ప్రతి భావాన్ని వెంటనే మార్చడానికి ప్రయత్నించకండి అప్పుడు మీలో ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి ఎన్నో రకాల భావాలు వస్తాయి వాటన్నిటిని మార్చాలని ప్రయత్నం చేయకండి కేవలం వాటిని అలా గమనించండి అంతే ఇదే మౌన సాధన అంటే మీలో చాలా ఆలోచనలు ఉన్నాయి చాలా భయాలు ఉన్నాయి
(09:32) చాలా బాధలు కూడా ఉన్నాయి కానీ మీరు వాటిలో ఏదీ కాదు వాటిని గమనించే ఒక లోతైన స్థలం మీలో ఉంది దాన్నే మన గ్రంథాలు సాక్షి భావం అన్నాయి. ఆ స్థలాన్ని మీరు గుర్తించినప్పుడే మీలో ఆరవ మహాశక్తి వెలుగులోకి వస్తుంది. అదే చైతన్య శక్తి నీకు కోపం వచ్చిందని నీకు తెలుసు మరి ఆ కోపాన్ని గమనిస్తున్నది ఎవరు నీ మనసు నువ్వు ఓడిపోతావని చెబుతుంది.
(09:56) ఆ మాటను వింటున్నది ఎవరు? ఈ ప్రశ్నల దగ్గరే చైతన్య శక్తి ప్రారంభం అవుతుంది. చైతన్యం తక్కువగా ఉన్నప్పుడు మనిషి తన ప్రతిస్పందనే తన జీవితం అని అనుకుంటాడు. ఎవరైనా కోప్పడితే తను కూడా కోపంగా మారిపోతాడు. ఎవరైనా విమర్శిస్తే తన విలువలను అనుమానిస్తాడు. ఈ చైతన్యం పెరిగినప్పుడు స్పందించే ముందు ఒక విరామం వస్తుంది.
(10:17) అప్పుడు నేను ఇలా ఎందుకు స్పందిస్తున్నాను అని ప్రశ్నించుకోగలడు. నువ్వు నీ భావోద్వేగం కాదని నువ్వు తెలుసుకున్నప్పుడు దానికి ఎలా స్పందించాలో నువ్వు ఎంచుకోగలవు. కానీ ఇక్కడే చాలా మంది ఆగిపోతారు. వారికి చాలా జ్ఞానం ఉంటుంది. మంచి మాటలు కూడా తెలుసు. అయినా వారి జీవితం మారదు. ఎందుకంటే వారికి తెలిసిన దాన్ని వారి జీవితంలోకి తీసుకెళ్ళే చివరి శక్తి వారిలో ఇంకా పని చేయడం లేదు కాబట్టి ఆ చివరి మహా శక్తే కర్మ శక్తి మీకు గొప్ప ఆలోచన ఉండవచ్చు మంచి లక్ష్యాలు మంచి సంకల్పం మంచి అవగాహన కూడా ఉండవచ్చు కానీ వాటి కోసం మీరు పని చేయకపోతే మీలో ఉన్న శక్తి మొత్తం మీలోనే బంధించబడుతుంది.
(10:54) అన్నింటిని ఫలితంగా మార్చేదే ఈ కర్మశక్తి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక దీపాన్ని గనుక మనం వెలిగించామ అనుకోండి ఆ దీపం వెలుగు గది మొత్తం పడాలంటే దాన్ని పైకి ఎత్తి సరైన చోట పెట్టాలి. అలాగే మీలో ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని చేతిలోకి తీసుకురానంత వరకు ఆ వెలుగు మీలోనే ఆగిపోతుంది. విశ్వం మీకు అవకాశాన్ని చూపించవచ్చు కానీ దాన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్ళవలసింది మీరే.
(11:20) మీరు చేసే ప్రతి ప్రార్థన మీకు ఒక దిశని ఇవ్వచ్చు కానీ ఆ దిశలో నడవాల్సింది మీరే. మీరు పొందిన జ్ఞానం మీకు వెలుగుని చూపించవచ్చు కానీ ఆ వెలుగులో అడుగు వేయాల్సింది మీరే ఒక మంచి ఆలోచనను పనిగా మార్చినప్పుడు అది కర్మశక్తి ఒక సంకల్పాన్ని రోజువారి అలవాటుగా మార్చినప్పుడు అది కర్మశక్తి ఒక వైఫల్యాన్ని పాఠంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నించినప్పుడు అది కర్మశక్తి మీరు ఏం ఆలోచిస్తున్నారో అనేది కాదు ఆ ఆలోచన ఆధారంగా మీరు ఏం చేస్తున్నారో అనేదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది.
(11:49) మాట్లాడడం ఆలోచించడం చేయడం. ఈ మూడింటిలో చివరిదాన్ని మాత్రమే ఈ ప్రపంచం గుర్తిస్తుంది. మొదటి ఆరు శక్తులు మీలో వెలుగును కలిగిస్తాయి కానీ చివరిదైన ఈ ఏడవ శక్తియే ఆ వెలుగును జీవిత ఫలితంగా మారుస్తుంది. నీ మాట నీ ప్రపంచాన్ని నిర్మిస్తుంది. నీ మనసు నీ దారిని నిర్ణయిస్తుంది. నీ ప్రాణశక్తి నీలో బలాన్ని నిలబెడుతుంది.
(12:11) నీ సంకల్పం నీ కోరికకు దిశ ఇస్తుంది. నీ మౌనం నీ నిజాన్ని వినిపిస్తుంది. నీ చైతన్యం నీలో ఏం జరుగుతుందో చూపిస్తుంది. నీ కర్మ ఆ అంతర్గత శక్తిని నీ జీవిత ఫలితంగా మారుస్తుంది. ఇవన్నీ కూడా బయట నుంచి ఎవరో ఇవ్వాల్సిన శక్తులు కావు. ఇవన్నీ నీ లోపలే ఉన్నాయి. వీటిని మీరు గుర్తించక ఇవి ఉపయోగించని శక్తిగా ఉపయోగపడని సామర్థ్యంగా మిగిలిపోతున్నాయి.
(12:34) నిన్ను నువ్వు కొన్ని ప్రశ్నలు అడుగు నీ మాట నీకు బలాన్ని ఇస్తుందా నీ మనసు నీకు ఒక ఫ్రెండ్ గా ఉందా? నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరు చూడని సమయంలో కూడా నువ్వు నిలబెట్టుకుంటున్నావా నిశబ్దంగా కూర్చోగలవా నీ భావోద్వేగాలను గమనిస్తున్నావా నీకు తెలిసిన దాన్ని తక్షణమే పనిగా మారుస్తున్నావా ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. మీ జీవితాన్ని మార్చే తలుపు బయట ఎక్కడా లేదు అది మీలోనే ఉంది.
(12:57) నీ దగ్గర ఎలాంటి శక్తి లేదని ఎప్పుడూ అనుకోవద్దు. నీ దగ్గర అత్యంత శక్తివంతమైన ఏడు మహా శక్తులు ఉన్నాయి. వాటిని సరైన దారిలో నువ్వు ఉపయోగించుకుంటే నీ ప్రపంచం నీకు ఎలా మారుతుందో అది నేను మాటల్లో చెప్పనవసరం లేదు. నీ ప్రపంచం ఎలా మారుతుందో నీకే కనిపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కి మీరు ఇప్పటి వరకు ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసి మీ జీవితంలో ఈ ఏడు శక్తుల్లో ఏది బలంగా ఉందని మీకు అనిపిస్తుంది ఏది ఇంకా మేల్కొనాలి అనేది కామెంట్ లో తప్పకుండా ఇప్పుడే కామెంట్ చేయండి.
(13:25) అండ్ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నీకు బయట నుంచి ఎలాంటి శక్తులు రావు. నువ్వు ఉపయోగించని శక్తులు ఇప్పటికే నీలో చాలా ఉన్నాయి. వాటిని గుర్తించి వాటికి ఒక్కసారి ఇప్పుడే థాంక్స్ చెప్పు. ఇలాంటి మరెన్నో రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ ని గనుక మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టండి.
(13:43) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ!

No comments:

Post a Comment