99% of People Don't Know the Power of Ashtavakra Gita
Author Name:Mr Bhanuprasad
Youtube Channel Url:https://www.youtube.com/@MrBhanuprasadOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GFLlCjf0DKU
Transcript:
(00:00) మీరు నిజంగా ఎవరు ఈ బాడీయా ఈ మైండా ఈ థాట్స్ ఈ యొక్క ప్రశ్నకు సమాధానం తెలిసిపోతే జీవితంలోని అన్ని బాధలు భయాలు కోరికలు అసంతృప్తి ఒక్క క్షణంలో అంతమవుతాయని ఒక మహర్షి చెప్పారు. ఆ మహర్షి పేరు అష్టవక్రుడు ఆయన చెప్పిన అద్భుతమైన జ్ఞానమే అష్టవక్రగీత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మ, భక్తి, ధర్మం గురించి బోధిస్తే అష్టవక్రగీతలో మాత్రం నేరుగా ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తారు ఈ గ్రంథం సాధారణ పుస్తకం కాదు ఇది మనలో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించే అర్థం ఈ వీడియోలో అష్టవక్రగీత అంటే ఏంటి? దీనిలోని ప్రధాన బోధనలు ఏమిటి? ఎందుకు
(00:37) ప్రపంచంలోని గొప్ప ఫిలాసఫర్స్ ఈ గ్రంథాన్ని అత్యున్నత ఆధ్యాత్మిక గ్రంథంగా భావిస్తారు? అన్నింటిని వివరంగా తెలుసుకుందాం. అష్టవక్రుడు ఎవరు? అష్టవక్రుడు చిన్న వయసులోనే మహాజ్ఞాని ఆయన శరీరంలో ఎనిమిది వంకర్లు ఉండేవి అందుకే ఆయనకు అష్టవక్ర అనే పేరు వచ్చింది. చిన్నప్పుడే వేదాలను పూర్తిగా అర్థం చేసుకున్నాడు.
(00:59) ఒకసారి రాజు జనకుని సభలో అనేకమంది పండితులు ఉన్నారు. అక్కడికి అష్టవక్రుడు వెళ్ళగానే అందరూ ఆయన వంకర శరీరాన్ని చూసి నవ్వారు. అప్పుడు అష్టవక్రుడు ఇలా అన్నాడు. మీరు జ్ఞానులు కాదని ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు నా శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆత్మని చూడడం లేదు. ఈ మాట విన్న రాజు జనకుడు ఆశ్చర్యపోయిండు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది ప్రపంచ ప్రసిద్ధమైన అష్టవక్రగీత.
(01:20) అష్టవక్రగీత అంటే ఏంటి? అష్టవక్రగీత అనేది అష్టవక్రుడు మరియు జనకుని మధ్య జరిగిన సంభాషణ. మొత్తం 20 అధ్యాయాలు సుమారు 300 శ్లోకాలు. ఈ గ్రంథంలో ఎలాంటి కథలు లేవు. యుద్ధం లేదు, పూజల గురించి లేదు, స్వర్గం గురించి లేదు. నేరుగా ఒకే విషయం. నువ్వు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమే మొత్తం గ్రంథం. ఫస్ట్ పార్ట్ నువ్వు శరీరం కాదు మనం చిన్నప్పటి నుంచి ఒక తప్పు నమ్మకంతో జీవిస్తున్నాం.
(01:48) నేనే ఈ శరీరం నేనే ఈ మనసు అష్టవక్రుడు చెబుతాడు అది అబద్ధం శరీరం మారుతుంది. చిన్నప్పుడు ఒక శరీరం యవ్వనంలో మరో శరీరం వృద్యాప్యంలో ఇంకో శరీరం కానీ నేను అనే ఈ అనుభూతి మాత్రం మారడం లేదు. అంటే శరీరం మారుతుంది కానీ చూసేవాడు మారడం లేదు. ఆ చూసేవాడే ఆత్మ. శరీరం కేవలం ఒక వస్త్రం. ఆత్మ అసలు నువ్వు సెకండ్ పార్ట్ మనసే బంధనం అష్టవక్ర గీత ప్రకారం ప్రపంచం మనల్ని బాధ పెట్టదు మన మనసే బాధ పెడుతుంది. ఒక సంఘటన జరుగుతుంది.
(02:17) మనసు దానిపై వ్యాఖ్యానం చేస్తుంది. అక్కడి నుంచే బాధ మొదలవుతుంది. కోరికలు, అసూయ, కోపం, భయం ఇవన్నీ బయట లేవు. మనసులోనే ఉన్నాయి. మనసు ప్రశాంతమైతే ప్రపంచం కూడా ప్రశాంతంగానే కనిపిస్తుంది. థర్డ్ పార్ట్ సాక్షిగా ఉండు. ఇది అష్టవక్రగీతలు అత్యంత ముఖ్యమైన సందేశం. నువ్వు అనుభవించేవాడివి కాదు చూసేవాడివి కోపం వచ్చింది దానిని గమనించు భయం వచ్చింది దానిని గమనించు ఆలోచనలు వస్తున్నాయి వాటిని గమనించు గమనిస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు అదే నిజమైన నువ్వు అదే సాక్షి ఫోర్త్ పార్ట్ కోరికలే దుఃఖానికి కారణం మనిషి ఎందుకు బాధపడుతున్నాడు అష్టవక్రుడు ఒకే సమాధానం
(02:56) చెప్తాడు కోరిక ఏదైనా పొందాలనే కోరిక పోయింది తిరిగి రావాలనే కోరిక ఇతరుల కంటే గొప్పవాడిని కావాలనే కోరిక కోరిక ఉన్నంతవరకు మనసు ప్రశాంతంగా ఉండదు. కోరికలు తగ్గిన కొద్దీ ఆనందం పెరుగుతుంది. ఫిఫ్త్ పార్ట్ ముక్తి ఇప్పుడే సాధ్యం. చాలా మంది అనుకుంటారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తేనే ముక్తి వస్తుందని కానీ అష్టవక్రుడు అలా చెప్పడు.
(03:19) నువ్వు నిజంగా నిన్ను తెలుసుకున్న క్షణమే ముక్తి. అది భవిష్యత్తులో జరగదు. ఇప్పుడే జరుగుతుంది ఈ క్షణంలోనే. ఈ గ్రంథం ఎందుకు అంత ప్రత్యేకం. భగవద్గీత మన జీవితాన్ని ఎలా జీవించాలో చెప్తుంది. అష్టవక్రి గీత మాత్రం జీవితం అనే భావనను దాటి పోవాలని చెప్తుంది. ఇది మత గ్రంథం కాదు తత్వ గ్రంథం ఆత్మ జ్ఞానానికి నేరుగా తీసుకెళ్లే మార్గం అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక తత్వవేత్తలు దీనిని అత్యున్నత అద్వైత గ్రంథంగా భావిస్తారు.
(03:47) మన జీవితంలో ఎలా ఉపయోగించాలి? ప్రతిరోజు కొన్ని నిమిషాలు నిశబ్దంగా కూర్చోండి. మీ ఆలోచనలను గమనించండి. మీ భావాలను గమనించండి. ఎలాంటి తీర్పు ఇవ్వకండి కేవలం సాక్షిగా ఉండండి. కొద్ది కొద్దిగా మీలో ప్రశాంతత పెరుగుతుంది. బయట పరిస్థితులు మారకపోయినా మీ అంతరంగం మారిపోతుంది. అష్టవక్రగీత మనకు కొత్త జ్ఞానాన్ని ఇవ్వదు. మనలో ఇప్పటికే ఉన్న సత్యాన్ని గుర్తు చేస్తుంది.
(04:10) మీరు శరీరం కాదు, మీరు మనసు కాదు, మీరు జన్మించలేదు మీరు చనిపోరు. మీరు శాశ్వతమైన చైతన్యం. ఈ ఒక్క సత్యాన్ని అనుభవించిన వారికి జీవితంలో భయం ఉండదు, బాధ ఉండదు, బంధనం కూడా ఉండదు.
No comments:
Post a Comment