కలియుగంలో ఇలా తపస్సు చెయ్యచ్చు This Is How We Can Practice Tapas In Kali Yuga
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=N9y8pgU0JMM
Transcript:
(00:01) ఒకళ్ళు మీతో మాట్లాడేటప్పుడు వింటూనే సమాధానం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే మీరు నేర్చుకున్నది చాలా తక్కువండి మీరు భోజనం చేస్తున్నప్పుడు రుచిని ఆస్వాదించకుండా వంట వండిన వాళ్ళని తలుచుకోకుండా వాళ్ళకి కృతజ్ఞత మనసులో చెప్పుకోకుండా ఇంకేదో ఆలోచిస్తున్నారంటే మీ జీవితం మీ చేతిలో లేదని అర్థంండి అలా మెగానికల్ గా సాగిపోతున్నది అని అర్థం అన్నమాట కృతజ్ఞతకు దూరమై నలుగురితో ఉంటూనే కూడాను ఒంటరిగా జీవిస్తున్నావ అని కూడాను చెప్పవలసి ఉంటుందండి అలాగే మనందరం వాకింగ్ చేస్తూ ఉంటాం కదా
(00:47) అలా నడుస్తున్నప్పుడు శరీర కండరాల మీద కదలిక మీద ఆ మాటక వస్తే ప్లెజెంట్ పెయిన్ మీద అన్ప్లెజెంట్ పెయిన్ మీద మనకి మనకి గనక ఏకాగ్రత లేకపోతే మనం మన శరీరాన్ని మీద పట్టు కోల్పోతున్నామ అని అర్థంఅండి. ఏదో మెకానికల్ గా నడిచేస్తున్నాం అంతే గనీ ఆ నడకలో ఉన్న మాధుర్యాన్ని మన మనసుకి పట్టించుకోవట్లేదని అర్థంఅండి అంటే ఏ పని చేసినా కూడాను ఆ పనులు రమిస్తూ చేయాలండి రమిస్తూ చేయాలి.
(01:21) ఇప్పుడు నిద్రపోయే ముందు కూడాను తీవ్రంగా ఆలోచిస్తున్నాం అంటే అసలు మనకి ప్లానింగ్ కూడాను సరిగా లేదని అర్థం అండి నిక్కచ్చిగా చెప్పాలి అంటే మనలో పిరికితనం ఎక్కడో దోగుచులాడుతున్నది అని అర్థంండి సో ఇవన్నీ చూడటానికి వినటానికి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ వాస్తవం ఏమిటంటే ఇవన్నీ మనల్ని మన నుంచి దూరం చేస్తున్నాయండి.
(01:47) మనం అంటే ఏమిటో మనకు తెలియకుండా చేస్తున్నాయి. అసలు మనకి మనమే కొత్తవాళ్ళుగా కనబడేటట్టు చేస్తున్నాయండి అంటే వాస్తవంలో జీవించలేకపోవడం అన్నది మన మనసు మీద మన ఏకాగ్రత మీద మన స్కిల్ మీద వెరసి మన కుటుంబ జీవనం మీద ప్రభావితం చూపెడుతున్నదండోయి మనల్ని సగటు మానవులుగా బానిసలుగా మారుస్తున్నది. ఒక పని చేస్తూ ఇంకో దాని గురించి తీవ్రంగా ఆలోచించడం అన్నమాట అంటే జీవించడమే మరిచిపోతున్న పరిస్థితి ఒక విధంగా చెప్పాలి అంటే మన జీవితమే ఎవరి చేతుల్లోనో వెళ్ళిపోతున్నది కదా అని బాధపడవలసి వస్తుందండి అలా బాధపడుతున్నామా లేదా అనేది
(02:34) పక్కన పెట్టండి ఎందుకంటే మెకానికల్ గా చేసేటప్పుడు ఇంత సీరియస్ గా ఇంత సూక్ష్మంగా ఇంత సున్నితంగా మనం ఆలోచించాం కానీ లోలోపల జరగవలసిన నష్టం ఇష్టం జరిగిపోతూ ఉంటుందండి మంచి ఉదాహరణ చెప్తానండి భర్త ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. రోజుక రెండు సార్లు మూడు సార్లు కారణాలు ఎన్నైనా కావచ్చు అతనివి అంటే ఒక్కొకసారి అవాచకాలు కూడా అంటే భూతులు కూడా మాట్లాడొచ్చు ఆ కోపంలో అప్పుడు ఇదిఒక క్యారెక్టర్ అంతే మనం ఏం చేయలేము నేను చేయగలిగింది ఏదైతే ఏదైతే ఉందో అదే చేస్తాను.
(03:18) అంతే ఈ మహానుభావుడు గురించి ఆలోచిస్తూ ఉంటే నా ఆనందాన్ని నా సంతోషాన్ని ఎందుకు కోల్పోవాలి ఇది మామూలే అని నిజాయితిగా సమర్ధించుకొని చదవవలసిన పుస్తకంలో మునిగిపోయి ఆ పుస్తకంలోని భావాన్ని గనుక ప్రపంచాన్ని మర్చిపోయి రమించగలిగితే అంతకుమించిన ధైర్యం లేదండి అసలు పరిణితి అంటే ఇదే ఇంతకంటే పెద్దగా డెఫినిషన్ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకో ఉదాహరణ చెప్తానండి మీకు తెలుసు కదా అసలు నేను ప్రాక్టికల్ ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తానుని ఇప్పుడు 70 దాటిన అమ్మ మొట్టమొదటిసారిగా తూలి కింద పడింది.
(03:59) 70 ఏమి తగలలేదు కానీ ఐదు నిమిషాలు అపస్మారకంలో పోయి మళ్ళీ మామూలుగా తయారయింది. చేయవలసింది ఏంటి చెప్పండి మానవ మాత మాత్రులుగా లేకపోతే కొడుకుగా కంగారుపడతాం కదా సో ఒక నిమిషం కంగారుపడి అసలు ఇలా ఎందుకు జరిగింది అని సాయంత్రంలోగా కారణం తెలుసుకొని ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది నిగ్రహానికి ప్రతీక ధైర్యానికి సూచిక జరిగేదే జరుగుతుంది మన మానవ ప్రయత్నంలో మనం ఉందాం అన్న ఒక ఆధ్యాత్మికతకు శ్రీకారం చుట్టం లాంటిదండి వెరసి మళ్ళీ ధైర్యమే కదా ధైర్యం కోల్పోయిన మరుసటి క్షణం ముసిలితనం వచ్చేయడం కాయం
(04:45) నేను ఎక్కడో సెంటెన్స్ చదివాను. సో భయపడే కొద్ది మనుషులే కాదండి ప్రత్యద్దులే కాదు శత్రువులే కాదు జీవితం కూడా మనల్ని భయపడుతుందండి వాస్తవంలో అద్భుతంగా జీవించగలిగితే ఒక్కటి చెప్తున్నానండి అంతకు మించిన తపస్సు లేదండి ఈ కలియుగంలో లౌకిక ప్రపంచంలో ఇప్పుడు ఈ కలియుగంలో తపస్సు అంటే ఎక్కడికో అడవికి వెళ్ళిపోయి కళ్ళు మూసుకోవడం కాదండి మనం ఉన్నచోట చేస్తున్న పనిలో పూర్తిగా ఉండగలగటం అంతేనండి ఇప్పుడు వాకింగ్ చేసేటప్పుడు నేను ఒక ప్రక్రియని అవలంబిస్తానండి.
(05:28) ఎందుకంటే వాకింగ్ చేస్తున్నప్పుడు మనం ఏ ఆలోచన అయినా చేయొచ్చు కదా కానీ వాకింగ్ మీద కాన్సంట్రేషన్ పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఎప్పటినుంచో ఒక ప్రక్రియకులోనే [గొంతు సవరించుకోవడం] అని చెప్పాను కదా నడుస్తున్నప్పుడు ఏం చేస్తానుంటే కొంచెం అలా తలకాయ కిందకి ఉంచి అడుగు ఎక్కడ వేస్తున్నానా నేల మీద అని చూస్తూ గబగబా నడుస్తుంటాం ఈ గబగబ అడుగులు పడుతూ ఉంటే మనసు కూడా కదలకుండా ఆ భూమిమీద పడే ప్రత్యేకమైన స్థలం మీదనే ఏకాగ్రత నిలుపుతుంది అన్నమాట మనసు అలా తెలియకుండా కొంత దూరం పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే అనిపిస్తుంది అరే ఇంత దూరం
(06:06) వచ్చేసాను అని చెప్పేసి అంటే అది ఏకాగ్రతలో ఒక భాగం అండి అంటే వాకింగ్ ని కూడాను ధ్యానంగా చేయగలగటం అనేది కూడాను గొప్ప విషయమే ఇప్పుడు నేనేదో చెప్పానని కాదండి ప్రాక్టీస్ చేస్తే మటుకు మనసు పరిపర విధాలు పోకుండా ఆ చేస్తున్న పని మీదనే లగ్నం లగ్నం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఒక పని చేస్తూ ఇంకో పనిని ఆలోచించడం అంటే ఏమవుతుంది అంటే మన అంతర్గతంగా ఉన్న ఈ పాజిటివ్ ఎనర్జీ అలా చీరిపోతున్నది అని అర్ధం అండి పెరిగితనానికి కూడా నువ్వు ప్రతీక అన్నమాట ఇప్పుడు శరీరం ఒకచోట మనసు ఒకచోట ఉంటే జీవితం కాదండి భయంతో బతుకు నేర్చడమే అంతకంటే ఏమి కాదు.
(06:50) ఈ వ్యసనం గనుక ఎలా కంటిన్యూ అయిందంటే ఈ వ్యసనమే మన శక్తిని నెమ్మది నెమ్మదిగా తినేస్తూ ఉంటుందండి. సో మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుత క్షణంలో సంపూర్ణంగా జీవించటం అనేదే కలియుగ తపస్సు అండి అని టైటిల్ కూడా ఇదే పెట్టాను. ఇప్పుడు వాస్తవంలో జీవించకుండా గతంలోనూ వర్తమానంలోనూ జీవించటం అనేది మనకి తెలియదు కానీ మెల్లమెల్లగా అది స్లో పాయిజన్ గా తయారైపోయి దీర్ఘకాలిక ఒత్తిడికి కారణం అవుతుందండి ఆందోళనకు దారితీస్తుంది.
(07:25) ప్రతి విషయంలో కూడాను కంగారుగా తొందరపాటు గురయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఈ వ్యసనం పరాకష్ట గనక చేరితే మనం సరిగ్గా తినలేమండి తింటున్న స్పృహ కూడా ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ మెదడు ఈ పేగుల మధ్య ఉండే గట్ బ్రెయిన్ యక్సిస్ ఉంటుందండి మెడికల్ పరిభాషలో అంటారు ఈ గట్ బ్రెయిన్ యక్సిస్ ఉంటుంది కదా అది దెబ్బ తింటుందటండి ఈ నోట్స్ రాసుకుంటూ ఉంటే నాకు తెలిసిందన్నమాట ఇప్పుడు మీ మనసు ఎప్పుడు పరిగెడుతూనే ఉందనుకోండి పోనీ నిద్రపోయిన కలలో కూడాను అటువంటి భయాలే వచ్చి పరిగెడుతూ ఉందనుకోండి మీ మనసు శరీరానికి డౌట్ వచ్చేస్తుంది అసలు నేను
(08:04) సురక్షితంగా ఉన్నానా లేదా ఎప్పుడోకప్పుడు కూలిపోత ేమో అని అనుకుంటూ ఉంటుందండి అది అందుకనే భోజనాన్ని కూడాను మనం ఒక తపస్సుగా మార్చుకోవాలండి తపస్సుగా మార్చుకోవాలి. ఫోన్ పక్కన పెట్టాలి టీవీ ఆఫ్ చేయాలి ఆ రుచిని అద్భుతంగా ఆస్వాదిస్తూ అన్నపూర్ణ దేవికి కృతజ్ఞత చెప్పుకోవాలండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య శిక్ష్యర్థం భృక్షాం దేహించ పార్వతి నా ఆహారము మనసు ద్వారా జ్ఞానంగా మారి అదఒక అద్భుతమైన వైరాగ్య భావనకి తాబిపాలి అలా చేయు తల్లి అని మనం అన్నపూర్ణ దేవిని ప్రార్థించడం దాదాపు చాలా ఏళ్ల క్రితం భోం చేసే ముందు
(08:50) నేను ఒక పెద్ద ప్రేయర్ని తయారు చేసుకున్నానండి అది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ పడుతుంది అన్నమాట బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మపుణ బ్రహ్మణవతం బ్రహ్మయతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అంటూ అది సాగుతుంది అన్నమాట ఇప్పుడు భగవద్గీత దగ్గరికి వెళ్ళినట్లయితే కృష్ణుడు కూడాను మనసు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్పలేదండి అనలేదు కూడాను ఆయన ఏం చెప్పాడంటే వెళ్ళిన మనసుని మళ్ళీ తిరిగి తీసుకురావడాన్ని నేర్చుకో అని చెప్పాడండి.
(09:19) ఇప్పుడు కర్మ ఉంది కాబట్టే కదా మనం శరీరం ధరించి భూమి మీదకి వచ్చాం. సో కర్మ కొద్ది కష్టాలు ఎలాగే ఉన్నాయి అప్పుడప్పుడు ఏదో సుఖం ఆనందం ఉంటుంది అనుకోండి అది వేరు ఈ వర్షం లాంటి సమస్యల్లో మనం తడుస్తూనే ఉంటాం కానీ ఈ నియంత్రణ అనే గొడుగును గనుక పట్టుకోగలిగితే పరిస్థితి కొంతవరకు ఆ మాటకు వస్తే మనసు కొంతవరకు మన చేతిలో ఉంటుందండి ఇప్పుడు భార్యా భర్తల మధ్య సమస్యలు ఉంటాయి ఉండనియండి పిల్లల సమస్యలు ఉంటాయి ఉండనియండి మరి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కదా ఉండనివ్వండి ఇబ్బంది ఏముంది వృద్ధాప్యం వస్తుంది రానివ్వండి ఆపగలరా నష్టం
(10:03) వస్తుంది రానివ్వండి ఆపగలరా ఒకోసారి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా బాగా నష్టానికి గురైతాం ఏం చేయగలం ఒకోసారి అవమానం కూడా ఎదురైతూ ఉంటుంది భరించాలి తప్పదు రానివ్వండి చేయగలిగింది ఒకటేనండి తప్పించుకోలేని అయుష్టాలను ఇష్టాలుగా మార్చుకోవడమే తపస్సు అండి అంతకంటే ఏమ లేదు నోట్స్ రాసుకుంటూ ఉంటే నాకు ఎందుకో ఒక్కసారిగా ఇలా రాయాలనిపించింది అన్నమాట ఇది డెఫినిషన్ో కాదో నాకు తెలియదు కానీ తప్పించుకోలేని అయిష్టాలను ఇష్టాలుగా మార్చుకోవడమే తపస్సు ఇప్పుడు సమస్య లేని జీవితం ఉండాలి అని అనుకోవడం అమాయకత్వం అండి ఇప్పుడు చెదరకుండా వెదరకుండా జీవిద్దామని
(10:43) అనుకోవడం మడుకు నిజమైన ధైర్యం అండి అలా జీవించడం అనేది పరిణితి కూడా అలా జీవించగలిగితే ఇంతకు మించిన తపస్సు లేదండి ఇప్పుడు విత్తనం విత్తుతున్నాను రేపు విపత్తు వస్తుందేమో అని అనుకుంటే ఎలాగండి అంటే రాని దాని గురించి ఆలోచించే భయపడటం అనేది హాశాస్పదం అండి చివరికి జీవితమే నవ్వులు పాలయ్యే అవకాశం ఉంది కదా వర్షం నీ చేతిలో ఉందా లేదు కదా కానీ లోపల హర్షం మడుగు నీ చేతిలోనే ఉంది కదండీ అట్లాగే పంట వచ్చింద తర్వాత ధర నీ చేతిలో ఉందా లేదు కదా కానీ నువ్వు ఉంటున్న ఈ ధర నీదే కదండ అంటే ఇక్కడ ధర అంటే పృథ్వి అండి ప్రాస కోసం
(11:30) వాడిన అంత అర్థాన్ని ఇవ్వాలి కాబట్టి నేను ఇలా అంటున్నానండి ఆ మాటక వస్తే ఎంత పంట వస్తుందో మనకు తెలుసా తెలియదు కదా కానీ ఈ ఈ జీవితమఅనే పండిన పంటని పండించుకోవడం అనేది మన చేతిలోనే ఉంది కదండీ అంటే జీవితాన్ని పండించుకోడం మన చేతిలోనే ఉంది కదా ఇది గనుక పూర్తిగా అర్థమైతే కర్మయోగ హృదయం అర్థమైనట్టండి అంతే ఇప్పుడు ధ్యానం అంటే అలా కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదండి కళ్ళు తెరిచి చేస్తున్న పనిలో మనసును పూర్తిగా ఉంచటమే అసలైన ధ్యానం అంతే అంతకంటే ఏమీ లేదు.
(12:15) ఇక్కడ ఒక చిన్న ఎడిషన్ అండి చాలా ఇంపార్టెంట్ ఎడిషన్ అది ఏంటంటే ఇంకో తపస్సు ఉందండి దాన్నే శాస్త్రం ఏమంటుంది అంటే వాచక తపస్సు అంటుంది ఎవరిని అనవసరంగా కలవర పెట్టని మాట సత్యమైన మాట ప్రియమైన మాట హితమైన మాట అలాగే సద్గంధ పఠనం ఇవన్నీ కూడాను వాచక తపస్సులేనండి ఎప్పుడైతే ఆ గ్రంథం మీ మనసులో నిబడీకృతమైందో ఆ మెదడులో అలా నిలబడిందో అది మాట రూపంలో వచ్చేస్తుంది అండి వద్దంటున్నా కూడా ఆగదున్నమాట కాబట్టి ఇవన్నీ కూడాను వాచక తపస్సులే కేవలం ఈ మాటని నియంత్రించడం తపస్సు కాదండి మాటకు ముందు మనసుని శుద్ధి చేసి సమాయుక్తం
(13:02) చేసుకోవడం కూడాను తపస్సు కిందే లెక్క అన్నమాట ఎప్పుడైతే అలా మనసు సమాయుక్తం అయిందో మీరు ప్రపంచాన్ని మర్చిపోయి కర్మలో రమిస్తారండి అసలు జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద నిర్ణయం కాదండి కానీ చిన్న చిన్న క్షణాల్లో ఎంత సంపూర్ణంగా జీ జీవించాము అన్నదే అసలైన జీవితం. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే [గొంతు సవరించుకోవడం] పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మనస్పర్ధలు ఉన్న భార్యా భర్తలు కూడా ఒక చోట కూర్చొని చర్చిస్తారు.
(13:30) అమ్మాయి పెళ్లి గాన లేకోతే పిల్లవాడి చదువు గురించి గాన కానీ పెద్ద కొండ అనే జీవితాన్ని మనం అధిరోహిస్తున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కుతాం కదండీ కానీ ఎలా దారిపడతాం చిన్న చిన్న రాళ్ళ మీద అలా కాలుపెట్టి తెలియకుండా దారిపడతాం అన్నమాట అందుకనే ఈ మాట చెప్పాను జీవితాన్ని మార్చేది పెద్ద నిర్ణయాలు కావు చిన్న చిన్న క్షణాల్లో మనం ఎంత సంపూర్ణంగా సహనాన్ని కోల్పోకుండా జీవించామ అన్నదే అసలు జీవితం అండి ఇప్పుడు చిరునవ్వుతో అభిప్రాయానికి వెంటనే రాకుండా పరిస్థితిని సునిశ్చితంగా గమనించడం కూడా ఒక అద్భుతమైన తపస్సేనండి.
(14:14) ఇప్పుడు వయసు వస్తూనే ఉంటుంది. ఆగదు 60 వచ్చాయ 70 వచ్చాయి 80 వచ్చాయ 90 వస్తాయి ఒకసారి 100 ఏళ్ళు కూడా వస్తాయి కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని క్షణాలు తపస్సులో ఉన్నామ అన్నది చాలా ముఖ్యంఅండి అదే జీవించడం [గొంతు సవరించుకోవడం] అంటే మిగతాది కేవలం బ్రతకడమే ఇక్కడ బ్రతకడానికి జీవించడానికి కొంచెం తేడా ఉందండి బ్రతకడం పూర్తిగా వ్యక్తిగతమే నీ భార్య బిడ్డల్ని పోషించుకోవడం అన్నమాట జీవించడం అంటే నువ్వు జీవిస్తూ సమాజాన్ని కూడా నువ్వు జీవింప చేయడం అన్నమాట ఒక్కటండి జరిగిపోయిన దాన్ని మటుకు మనం మార్చలేము కదా జరగబోయే దాన్ని మటుకు నియంత్రించలం ఈ
(15:00) రెండు మన చేతిలో లేవు కానీ విచిత్రం ఏంటంటే భగవంతుడు అప్పుడప్పుడు ఈ రెండిటి మధ్య వర్తమానం అనే ఒక అవకాశాన్ని ఇస్తూ అమృతపు చుక్కలు ఇస్తూ ఉంటాడండి వీటిని మనం ఆస్వాదించగలగాలి. వీటిని మనం ఆస్వాదించగలగాలండి. అలా ఆస్వాదించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం కొంతమంది సామాన్య మానవులు ఇంకతానే తలుచుకొని పదే పదే బాధపడుతూ ఉంటారండి ఆరోజు నేను కొంచెం సమయం కేటాయించి ఉంటే ఇంకా బాగుండేది కదా అని అనవసరంఅండి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు కేటాయించు కావాలంటే ఆ సమయం పుష్కలంగా ఉంది కదా కానీ మనసు ఉందా లేదా ఆలోచించు అలాగే చిన్న ఎడిషన్ అంటే
(15:47) తపస్సులో భాగం ఒ చిన్న విషయం అది ఏంటంటే ప్రిపేర్డ్ టాక్ ఉండాలి అట్లాగే ప్రిపేర్డ్ రైటింగ్ ఉండాలి. ఈ రెండే మన జీవితాన్ని తీర్చి దిద్దుతాయి నేను ఏ వీడియో చేసినా కూడాను అసలు పూర్తిగా నేను నోట్స్ రాసుకుంటానండి. అందువల్ల వీలైనంతగా నా టాక్ ప్రిపేర్డ్ టాక్ గా ఉంటుంది. రాసేటప్పుడు కూడాను కొంచెం జాగ్రత్తగా రాసుకుంటాను ఒకటి 10 సార్లు చూసుకుంటాను అంతే.
(16:11) అలా చూసుకున్నప్పుడు [గొంతు సవరించుకోవడం] ఏమవుతుందంటే ఒకదాని తర్వాత ఒకటి మాటలు అలాగ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కటండి చివరి క్షణాల్లో మనకి డబ్బు ఉంటుంది ఇల్లు ఉంటుంది పరివారం ఉంటుంది కొద్ద గొప్ప పేరు ఉంటుంది. కానీ నిజాయితిగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే కోల్పోయిన ఆ క్షణాలు ఎన్ని ఉన్నాయో అవి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయా రావు కదండి చివరిగా ఒక మాట అండి చివరిగా ఒక మాట భగవంతుడు మనల్ని ఈ భూమి మీద పంపించేటప్పుడు దైవత్వాన్ని మెండుగా పెట్టి పంపిస్తాడుండి సో మనందరం కూడాను దేవతలమే మనలో కూడాను దైవత్వం ఉంది.
(16:51) లౌకిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్న మనుషులం అన్నమాట కానీ దురదృష్టం ఏంటంటే విచారపడాలసిన విషయం ఏంటంటే మనం అందరం కూడాను ఆధ్యాత్మికంగా అపరిపక్వ దశలో ఉన్న ఉండాలి అందుకనే అద్భుతమైన తపస్సు చేయాలి మనం అంతేనండి అందుకంటే ఏం లేదు ఎందుకో ఆలోచించాను పొద్దున్నే సరే ఈ విషయం మీద ఎందుకు కూర్చోకూడదు అని ఆలోచించానండి అందుకనే ఇలాగ మీ ముందుకు వస్తున్నాను అన్నమాట.
(17:24) ఈ వీడియోని ఇంకొక్కసారి గనక వింటే తెలియకుండా ఒక నిశశబ్దానికి గురైపోతామండి. దాన్నే నోబుల్ సైలెన్స్ అంటారు. దాన్ని గనుక మనం ప్రాక్టీస్ చేస్తూ అది జీవితంలో గనుక ఒక భాగం అయితే తొందరపడి మాట్లాడమండి తొందరపడి విశ్లేషించం. కదా [గొంతు సవరించుకోవడం] తపస్సులో ఉండడానికే ఇష్టపడతామండి. ప్రాక్టీస్ మీద వస్తుందండి. సో ఇదండి ఈ వీడియోలోని విషయం [నవ్వు] వినంత కృతజ్ఞతలు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.
(17:51) నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 లైక్ బటన్ బెల్ ఐకాన్ మీరు ఎటు నొక్కుతూనే ఉన్నారు కాబట్టి సంతోషం చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడూ చేస్తూనే ఉంటాను కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో మెసేజ్ రూపంలో పెట్టండి. అవి చదివిన తర్వాత నాకు అర్థమవుతుంది నేను ఎక్కడ ఉన్నాను అని ఎందుకంటే ఒకోసారి నేను పొరపాటు చేసే అవకాశం ఉంటుంది కదండీ ఎన్ని విషయాలు చెప్పినా కూడా మీరు కొంచెం అలా సరిదిద్దారు అనుకోండి ఇంకొన్ని మంచి వీడియోలు చేస్తానేమో కదా సో ఇదండి వీడియోలో సంగతి నమస్కారం
No comments:
Post a Comment