Thursday, August 13, 2026

Mind Blowing Psychological Facts You Must Know! | Mr Bhanuprasad

Mind Blowing Psychological Facts You Must Know! | Mr Bhanuprasad

Author Name:Mr Bhanuprasad

Youtube Channel Url:https://www.youtube.com/@MrBhanuprasadOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dVU5Fdgxz2M



Transcript:
(00:00) ఫాక్ట్ నెంబర్ వన్ మీ మెదడు నెగిటివ్ విషయాలను ఎక్కువ గుర్తుంచుకుంటుంది. ఒకరు 100 ప్రశంసలు చేసినా ఒకరు విమర్శిస్తే అదే రోజంతా గుర్తుంటుంది. ఫాక్ట్ నెంబర్ టూ మొదటి అభిప్రాయం చాలా శక్తివంతమైంది. ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు మొదటి కొన్ని సెకండ్లలోనే వారి గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వారు చేసే మంచి పనులను కూడా ఆ మొదటి అభిప్రాయంతోనే పోల్చి చూస్తాం.
(00:24) అందుకే మొదటి పరిచయంలో చిరునవ్వు మంచి బాడీ లాంగ్వేజ్ ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం.ఎక్కు ఎక్కువగా ఆలోచించడం సమస్యను పెంచుతుంది. ఓవర్ థింకింగ్ అనేది సమస్యలకు పరిష్కారం కాదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల భయం పెరుగుతుంది. ఆందోళన పెరుగుతుంది. నిద్ర తగ్గుతుంది. చాలా సమస్యలు నిజ జీవితంలో ఉండవు. మన ఊహల్లో మాత్రమే ఉంటాయి. మనిషి తన పేరును వినడం ఇష్టపడతాడు.
(00:48) ప్రపంచంలో ప్రతి మనిషికి అత్యంత మధురమైన పదం వారి సొంత పేరు. మీరు మాట్లాడేటప్పుడు వారి పేరుతో పిలిస్తే వారు మీ మాటలను ఎక్కువగా శ్రద్ధగా వింటారు. నవ్వు అంటు వ్యాధి లాంటిది ఎవరైనా నవ్వితే మనకు కూడా నవ్వాలని అనిపిస్తుంది. ఎందుకంటే మన మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ ఇతరుల భావోద్వేగాలను అనుకరిస్తాయి. అందుకే మంచి వాతావరణంలో ఉంటే మన మూడు కూడా బాగుంటుంది.
(01:13) కృతజ్ఞత చెప్పే వ్యక్తులు ఎక్కువ సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు మీకు ఉన్న మూడు మంచి విషయాలను గుర్తు చేసుకుంటే మీ మెదడు నెగిటివ్ కంటే పాజిటివ్ పై దృష్టి పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇదే గ్రాటిట్యూడ్ యొక్క శక్తి. మనం ఎక్కువగా భయపడేది ఇతరులు ఏమనుకుంటారు. నిజానికి ప్రతి ఒక్కరు తమ జీవితాలతోనే బిజీగా ఉంటారు.
(01:35) మన గురించి రోజంతా ఎవరూ ఎక్కువగా ఆలోచించరు. అయినా మనం మాత్రం అందరూ మనల్నే చూస్తున్నారని అనుకుంటాం. చిన్న లక్ష్యాలు పెద్ద విజయాలకు దారి తీస్తాయి. ఒకసారి పెద్ద మార్పు చేయాలని ప్రయత్నిస్తే మెదడు దాన్ని తిరస్కరిస్తుంది. కానీ రోజుకు 10 నిమిషాల అలవాటు సంవత్సరం తర్వాత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. సంగీతం మన భావోద్వేగాలను మార్చగలదు. మీరు వింటున్న పాట మీ మూడ్ ను పూర్తిగా చేంజ్ చేస్తుంది.
(02:01) అందుకే బాధలో ఉన్నప్పుడు సాాడ్ సాంగ్స్ వింటే మరింత బాధ పెరుగుతుంది. మనం చూసే వారిలాగే మారిపోతాం. మీ స్నేహితులు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తారు. మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో వారిలా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. తక్కువ నిద్ర వల్ల నిర్ణయాలు సరిగ్గా ఉండవు. తక్కువ నిద్ర తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని పెంచుతుంది. మన మెదడు కథలను ఎక్కువగా గుర్తుంచుకుంటుంది.
(02:28) వాస్తవాల కంటే కథలను మన మెదడు చాలా కాలం గుర్తుంచుకుంటుంది. అందుకే మంచి ఉపాధ్యాయులు కథల ద్వారా బోధిస్తారు. మౌనం కూడా ఒక శక్తి. ఎవరైనా ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం చెప్పకుండా కొన్ని సెకండ్లు మౌనంగా ఉంటే ఎదుటి వ్యక్తి మరింత సమాచారం చెప్తాడు. మీ శరీర భంగిమ మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. నిటారుగా నిలబడడం కళ్ళల్లోకి చూసి మాట్లాడడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
(02:55) సోషల్ మీడియా పోలికలను పెంచుతుంది. ఇతరుల జీవితంలోని ఉత్తమ క్షణాలను మన జీవితంలోని సాధారణ రోజులతో పోల్చుకుంటాం. దీనివల్ల అసంతృప్తి పెరుగుతుంది. మంచి అలవాట్లు నిర్ణయాలపై ఆధారపడవు. అలవాట్లు రోజు ఒకే సమయంలో చేస్తే అవి ఆటోమేటిక్ గా మారిపోతాయి. మనం వినాలనుకున్నదే ఎక్కువగా నమ్ముతాం. మన అభిప్రాయాలకు సరిపోయే సమాచారాన్ని మాత్రమే నమ్మే స్వభావాన్ని సైకాలజీలో కన్ఫర్మేషన్ బయస్ అంటారు.
(03:26) అందుకే కొత్త కోణాలను కూడా వినడం అవసరం. చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకుంటే పెద్ద లక్ష్యాలు ఈజీ అవుతాయి. ప్రతి చిన్న విజయం మెదడులో ప్రోత్సాహాన్ని పెంచుతుంది. దీంతో పెద్ద లక్ష్యాలపై పని చేయడానికి ఉత్సాహం వస్తుంది. ఇతరులకు సహాయం చేయడం మీకే ఆనందాన్ని ఇస్తుంది. ఎవరికైనా సహాయం చేసినప్పుడు మన మెదడులో సంతోషానికి సంబంధించిన కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
(03:50) [గొంతు సవరించుకోవడం] అందుకే దయ మనకే మేలు చేస్తుంది. మీరు మీతో మాట్లాడే విధానం మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. రోజంతా మనం మనతోనే మాట్లాడుకుంటూ ఉంటాం. నేను చేయలేను. అంటే మెదుడు కూడా అదే నమ్ముతుంది. నేను నేర్చుకుంటాను. అంటే అవకాశాలను వెతకడం స్టార్ట్ చేస్తుంది. అందుకే మీ మాటలను మార్చండి. ఆలోచనలను మార్చండి. మీ జీవితం కూడా మారుతుంది.
(04:14) ఈరోజు మనం తెలుసుకున్న 20 సైకాలజికల్ ఫాక్ట్స్ కేవలం ఆసక్తికరమైన విషయాలు మాత్రమే కాదు. రోజువారి జీవితంలో ఉపయోగపడే శాస్త్రీయ పరిశీలన ఆధారంగా వచ్చిన అవగాహనలు.

No comments:

Post a Comment