Friday, August 14, 2026

మన వెనక గోతులు తవ్వేవాళ్లను ఎలా గుర్తించాలి? ఈ విషయాలు తెలుసుకోండి! 🫣

మన వెనక గోతులు తవ్వేవాళ్లను ఎలా గుర్తించాలి? ఈ విషయాలు తెలుసుకోండి! 🫣

Author Name:Itluu Mee Sravani

Youtube Channel Url:https://www.youtube.com/@itluumeesravani

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x52N66RXXHw



Transcript:
(00:00) మీ గురించి మీ వెనక ఎవరో చెడుగా మాట్లాడుతున్నారని తెలిస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా మన ముందు చాలా మంచిగా మాట్లాడతారు. కానీ మన వెనక మాత్రం మన గురించి చెడుగా మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు లేదా ఆఫీస్ కాలీగ్స్ కావచ్చు అయితే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా? నిజం ఏంటో తెలుసుకోకుండానే రియాక్ట్ అవ్వడం ఉదాహరణకు మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మీ గురించి ఎవరో తప్పుగా చెప్పారు అనుకోండి వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి గొడవ పడకండి.
(00:34) ముందుగా మీ ఫ్రెండ్ తోనే ప్రశాంతంగా మాట్లాడండి. నా గురించి ఇలా చెప్పారట నిజమేనా అని అడగండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు చేరే మాటల్లో నిజం కంటే అపార్థమే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా మీ పర్సనల్ విషయాలను పదే పదే ఇతరులతో పంచుకుంటున్నారని మీకు స్పష్టంగా తెలిసినప్పుడు వాళ్ళతో మీ పర్సనల్ మేటర్స్ పంచుకోవడం తగ్గించండి.
(00:58) ముఖ్యంగా స్టూడెంట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. కాలేజీలో అందరితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు కానీ అందరికీ మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్, ఫ్యూచర్ ప్లాన్స్, పర్సనల్ మేటర్స్ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్షిప్ వేరు ట్రస్ట్ వేరు ఆఫీస్ లో కూడా ఇదే మన మీద పూర్తి నమ్మకం లేని కొలీగ్ తో పర్సనల్ విషయాల కంటే వర్క్ విషయాలకే పరిమితం అవ్వడం మంచిది.
(01:16) ఇది ఆటిట్యూడ్ కాదు మన బౌండరీ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని వెంటనే ఎవరినైనా ఫేక్ ఫ్రెండ్ లేదా టాక్సిక్ పర్సన్ అని నిర్ణయించకండి. ముందు నిజం తెలుసుకోండి మాట్లాడండి అదే ప్రవర్తన పదే పదే జరుగుతుంటే అప్పుడు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది ఎందుకంటే మన పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా ముఖ్యం. మన గురించి ఎవరో ఏదో మాట్లాడారని రోజంతా అదే ఆలోచిస్తూ బాధపడాల్సిన అవసరం లేదు.
(01:44) మనల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళతో సమయం గడపండి. అవసరమైతే ట్రస్టెడ్ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ లేదా కౌన్సిలర్ తో మాట్లాడండి గుర్తుపెట్టుకోండి మన వెనక గోతులు తవ్వే వాళ్ళతో మనం కూడా గోతులు తవ్వాల్సిన అవసరం లేదు. నిజం తెలుసుకోండి బౌండరీ పెట్టుకోండి మీ పీస్ ని కాపాడుకోండి నేను మీ శ్రావణి మళ్ళీ ఇంకో మంచి విషయంతో కలుద్దాం. నమస్కారం.

No comments:

Post a Comment