🔥 Why Are Indian Babies Born Smaller? | ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయం 👩🍼 | By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0QxQRX781ro
Transcript:
(00:04) ఒక యూరోపియన్ బేబీతో పోలిస్తే ఇండియన్ బేబీ పుట్టినప్పుడే దాదాపు 800 గ్రాములు తక్కువ బరువుతో పుడుతుంది. అలా ఎందుకో తెలుసా? అండ్ డయాబెటిస్ రావడానికి కారణం మనం తినే ఫుడ్ అందులోని షుగర్ మాత్రమే కాదు. మనం పుట్టకముందే మనలో ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల కారణాలు ఏంటి ఇలా ప్రతిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.
(00:31) ముందుగా ఈ టేబుల్ ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో డిఫరెంట్ కంట్రీస్ లో పుట్టే పిల్లల యవరేజ్ బర్త్ వెయిట్ ఎంత ఉంటుందో ఇచ్చారు. నెదర్లాండ్ లో ఒక బిడ్డ పుట్టినప్పుడు యవరేజ్ వెయిట్ దాదాపు 3.5 kg ఉంటుంది. నార్వే డెన్మార్క్ లో 3.5 నుంచి 3.6 kg వరకు ఉంటుంది. యూకే లో దాదాపు 3.4 నుంచి 3.5 5 kg అమెరికా అండ్ చైనాలో దాదాపు 3.3 kg ఉంటుంది.
(00:58) ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే మన దగ్గర ఒక బిడ్డ యవరేజ్ బర్త్ వెయిట్ కేవలం 2.7 నుంచి 2.9 kg మాత్రమే ఉంటుంది. అంటే ఒక యవరేజ్ యూరోపియన్ బేబీ ఇండియన్ బేబీ కంటే పుట్టినప్పుడే దాదాపు 600 నుంచి 800 gలు ఎక్కువ బరువుతో ఉంటుంది. ఇప్పుడు ఇంకో డాటా చూడండి లో బర్త్ వెయిట్ అంటే 2.5 5 kg కంటే తక్కువ బరువుతో పుట్టే పిల్లలు. ఐస్లాండ్ లో దాదాపు 4% పిల్లలు లో బర్త్ వెయిట్ తో పుడుతున్నారు.
(01:28) అమెరికాలో ఇది 8.3% గ్లోబల్ యవరేజ్ చూసుకుంటే 14.6% 6% ఉంది. కానీ ఇండియాలోఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ప్రకారం దాదాపు 17 నుంచి 18% వరకు ఉంది. కొన్ని ఇంటర్నేషనల్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియాలో యాక్చువల్లీ 27% పిల్లలు లో బర్త్ వేతో పుడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2కోట్ల 50 లక్షల మంది పిల్లలు తక్కువ బరువుతో పుడితే అందులో దాదాపు 52% సౌత్ ఏషియాలోనే పుడుతున్నారు.
(01:57) డెవలపింగ్ కంట్రీస్ లో పుట్టే లో బర్త్ వెయిట్ బేబీస్ లో దాదాపు 40% మన ఇండియాలోనే పుడుతున్నారు. అయితే మన పిల్లలు ఎందుకు ఇంత తక్కువ బరువుతో పుడుతున్నారు అంటే దానికి మీ అందరి మైండ్ లో వచ్చే ఈజీయస్ట్ ఆన్సర్ మనది పూర్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇలా జరుగుతుంది అని కానీ అది కంప్లీట్ ఆన్సర్ కాదు. ఇది సగం ఆన్సర్ మాత్రమే ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఈ మొత్తం వీడియోలోనే చాలా షాకింగ్ పాయింట్ కాబోతుంది.
(02:25) డిఫరెన్స్ కేవలం ఆ 800గ్రమల వెయిట్ మాత్రమే కాదు ఆ 800గములు అసలు దేనిలో తక్కువగా ఉన్నాయి అనేది అసలు విషయం. సైంటిస్ట్ ఇండియన్ బేబీస్ ని యూరోపియన్ బేబీస్ ని మెజర్ చేసి కంపేర్ చేసినప్పుడు వాళ్ళకు కనిపించిన విషయం ఫీటల్ మెడిసిన్ అండర్స్టాండింగ్ ని పూర్తిగా మార్చేసింది. అంతేకాదు ఈ డిస్కవరీకి ఈరోజు ఇండియాలో పెరుగుతున్న డయాబెటీస్ హార్ట్ డిస్క్స్ తో కూడా డైరెక్ట్ కనెక్షన్ ఉంది.
(02:50) అది ఏంటో అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక ఇంపార్టెంట్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే పూణే మటర్నల్ న్యూట్రిషన్ స్టడీ. ఈ స్టడీలో వాళ్ళు పూణే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో ఉన్న మదర్స్ ని వాళ్ళ బేబీస్ ని తీసుకొని ఇంగ్లాండ్ లోని సౌత్ హాంటన్ మదర్స్ వాళ్ళ బేబీస్ తో కంపేర్ చేశారు. ముందు మదర్స్ డాటా చూద్దాం ఎందుకంటే అసలు స్టోరీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది.
(03:12) ఇండియన్ మదర్ యవరేజ్ ఏజ్ 21.4 ఇయర్స్ యవరేజ్ వెయిట్ 44.6 kg హైట్ 1.52 mబఎఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ 18.2 2 అదే సౌత్ హాంటన్ ఇంగ్లాండ్ మదర్ ని చూస్తే యవరేజ్ ఏజ్ 26.8 వెయిట్ 63.6 kg హైట్ 1.63 mబఎఐ 23.4 4 ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ చూడండి ఒక మదర్ వెయిట్ 44 kg మరో మదర్ వెయిట్ 63 kg దాదాపు 19 kgల డిఫరెన్స్ ఏజ్ లో మాత్రం దాదాపు ఐదు సంవత్సరాల డిఫరెన్స్ దీని రిజల్ట్ ఏంటంటే ఇండియన్ బేబీ యవరేజ్ బర్త్ వెయిట్ దాదాపు 2.
(03:56) 7 kg ఉంటే సౌత్ హాంటమ్ లో పుట్టిన బేబీ వెయిట్ దాదాపు 3.5 5కg ఉంటుంది. ఇక ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ వస్తుంది. రీసర్చర్లు కేవలం బేబీస్ వెయిట్ మాత్రమే కాదు వాళ్ళ డిఫరెంట్ బాడీ పార్ట్స్ ని కూడా మెజర్ చేశారు. హెడ్ మెజర్ చేశారు ఆర్మ్స్ మెజర్ చేశారు అబ్డమెన్ మెజర్ చేశారు. స్కిన్ కింద ఉండే ఫ్యాట్ కూడా మెజర్ చేసి డిఫరెన్స్ ని చూశారు.
(04:18) అప్పుడు వాళ్ళు మూడు షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. మొదటిది ఇండియన్ బేబీస్ లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ అబ్డామినల్ సర్కంఫరెన్స్ అంటే పొట్ట యొక్క చుట్టు కొలతలు కనిపించింది. అబ్డామినల్ సర్కంఫరెన్స్ ద్వారా లోపల ఉన్న లివర్ కిడ్నీ లాంటి ఆర్గాన్స్ ఎంత డెవలప్ అయ్యాయో తెలుస్తుంది. రెండవది మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్ లో చాలా డిఫరెన్స్ కనిపించింది.
(04:40) బేబీ ఆర్మ్ సర్కంఫరెన్స్ ద్వారా ఆ బేబీలో మజిల్ ఎంత డెవలప్ అయిందో తెలుస్తుంది. ఇక మూడవది అన్నిటికన్నా తక్కువ డిఫరెన్స్ ఎక్కడ కనిపించిందంటే స్కిన్ కింద ఉండే ఫ్యాట్ లో ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ ని కలిపి చూడండి. మదర్ బాడీలో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోతే గర్భంలో పెరుగుతున్న బేబీ తన ఆర్గాన్ మజల్స్ ని డెవలప్ చేయడం తగ్గిస్తుంది. కానీ ఫ్యాట్ ని మాత్రం సేవ్ చేసుకుంటుంది.
(05:02) దీనికే ఒక పేరు కూడా ఉంది. అదే థిన్ ఫ్యాట్ ఇండియన్ బేబీ అంటే బయట సన్నగా ఉంటాడు కానీ బాడీలో ఫ్యాట్ మాత్రం ఉంటుంది. ఇక్కడ బేబీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే బేబీ తన సిచువేషన్ కి తగ్గట్టుగా చాలా తెలివిగా అడాప్ట్ అవుతుంది. ఒకసారి బేబీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. మదర్ హోమ్ లో ఉన్న బేబీకి అందుతున్న మెసేజ్ ఏమిటంటే బయట ఫుడ్ షార్టేజ్ ఉంది.
(05:28) ఎందుకంటే మదర్ కూడా చాలా సన్నగా ఉంది. ఆమెకు కూడా సరైన న్యూట్రిషన్ అందడం లేదు. సో బేబీ ఏం చేస్తుందంటే బయట వెళ్ళిన తర్వాత తక్కువ ఫుడ్ తో సర్వైవ్ అయ్యేలా తన బాడీని ప్రిపేర్ చేసుకుంటుంది. అందుకే మజిల్ తక్కువగా డెవలప్ చేస్తుంది. ఎందుకంటే మజిల్ కి ఎక్కువగా ఎనర్జీ కావాలి. అదే సమయంలో ఫ్యాట్ ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫ్యాట్ ఎనర్జీని స్టోర్ చేసి ఉంచుతుంది.
(05:50) సైన్స్ లో దీన్ని ఫీటల్ ప్రోగ్రామింగ్ అంటారు. ఒకవేళ ఇలాంటి బేబీ పుట్టిన తర్వాత నిజంగానే ఫుడ్ షార్టేజ్ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ లో ఈ బేబీ చాలా హెల్తీగా పెరుగుతుంది. ఈ అడాప్టేషన్ తన లైఫ్ ని సేవ్ చేస్తుంది. తక్కువ ఫుడ్ తో కూడా చాలా బాగా సర్వైవ్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఆ బేబీ బయటకి వచ్చేసరికి పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి.
(06:11) ఈరోజు ఇండియాలో ఫుడ్ అవైలబిలిటీ గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. సిటీస్ లో ఎక్కడ చూసిన ఫుడ్ే ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, రైస్, రోటీ, షుగర్ ఇలా అన్ని అవైలబుల్ ఉన్నాయి. కానీ బేబీ బాడీ మాత్రం ఫుడ్ షార్టేజ్ ఉందని ఆ విధంగా ప్రోగ్రామ్ అయి ఉంది. అలాంటి బేబీ ఒక్కసారిగా అబండెన్స్ ఫుడ్ ఉన్న వల్డ్ లోకి వచ్చేసరికి ప్రాపర్లీ అడ్జస్ట్ కాలేకపోతుంది.
(06:36) దాని రిజల్ట్ మజల్ తక్కువగా ఉంటున్నాయి. అంటే బాడీలో షుగర్ ని స్టోర్ చేసుకునే స్పేస్ తక్కువ ఫ్యాట్ ఎక్కువ అంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువగా అక్యములేట్ అవుతుంది. ఈ రెండు కలిసి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తాయి. అందుకే మన దేశంలో బయట చాలా సన్నగా కనిపించే వాళ్ళకి కూడా డయాబెటిస్ వస్తుంది. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి.
(06:57) ఇండియాలో కనిపిస్తున్న డయాబెటిస్ ఎపిడెమిక్ కి ఫౌండేషన్ 45 ఇయర్స్ ఏజ్ లో హాస్పిటల్ బెడ్ మీద మీకు డయాబెటిస్ డిటెక్ట్ అయినప్పుడు పడడం లేదు. దాని ఫౌండేషన్ మదర్ వూమ్ లోనే పడుతుంది. పర్సన్ పుట్టకముందే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర చాలా మంది బేబీస్ తక్కువ బరువుతో పుట్టడానికి మదర్ వీక్ గా ఉండడం కూడా ఒక మేజర్ రీజన్.
(07:18) అయితే ఇప్పుడు అసలు ఈ మదర్స్ ఎందుకు వీక్ గా ఉంటున్నారో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా కొన్ని నెంబర్స్ చూడండి.ఎన్ఎఫ్హెచ్ఎస్ ఎన్ఎఫ్హెచ్ఎస్ 4 నుంచిఎన్ఎఫ్హెచ్ఎస్ 5 మధ్య ఇండియాలో 15 నుంచి 49 ఇయర్స్ ఉమెన్ లో ఎనీమియా అంటే రక్తహీనత 53% నుంచి 57% కి పెరిగింది. యాక్చువల్లీ ఇది డిక్రీస్ అవ్వాలి. కానీ రివర్స్ లో ఇంక్రీస్ అయింది. ప్రెగ్నెంట్ ఉమెన్ లో కూడా 50.
(07:43) 4% నుంచి 52.2% 2% కి పెరిగింది. అంటే మనం ఎకనామికలీ గ్రో అవుతున్నాము కానీ ఎనీమియా ఉన్న వుమెన్ పర్సంటేజ్ మాత్రం పెరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి రక్తహీనత ఉంది. ఇప్పుడు ఎనీమియా వల్ల ప్రాబ్లం ఏంటో చూడండి. బ్లడ్ మెయిన్ జాబ్ ఏంటి? బాడీకి ఆక్సిజన్ న్యూట్రిషన్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం.
(08:07) మదర్ బ్లడ్ లోనే ఎనీమియా ఉంటే గర్భంలో పెరుగుతున్న బేబీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఎలా వెళ్తుంది? ఇంకో విషయం దాదాపు 23% ఇండియన్ ఉమెన్ బిఎంఐ 18.5 కంటే తక్కువగా ఉంది. మెడికల్ టర్మ్ లో వాళ్ళు అండర్ వెయిట్ ప్రెగ్నెన్సీకి ముందే మదర్ వెయిట్ తక్కువగా ఉండడం లో బర్త్ వెయిట్ బేబీ పుట్టడంతో డైరెక్ట్ లింక్ అయిపోంది. ఇక మూడవది బహుశా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏజ్ మనం ముందు మాట్లాడుకున్నాం పూణే స్టడీలో ఇండియన్ మదర్ యవరేజ్ ఏజ్ 21.4 ఇయర్స్ అని.
(08:38) ఒక అమ్మాయి 18, 19 లేదా 20 ఇయర్స్ లోనే మదర్ అయితే ఆమె ఓన్ బాడీ ఇంకా గ్రో అవుతూనే ఉంది. ఆమె బోన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఆమె బాడీ డెవలప్మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలాంటి సమయంలో ఈమె బాడీ ఒకేసారి రెండు పనులు చేయాలి. ఒకటి తన ఓన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండవది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ న్యూట్రిషన్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు రెండు ప్రాపర్లీ జరగవు.
(09:05) మదర్ బాడీ కూడా పూర్తిగా డెవలప్ కాదు బేబీ కూడా పూర్తిగా డెవలప్ కాదు. దీనికి ఇంకో సోషల్ యాంగిల్ కూడా ఉంది. మన చాలా హౌసెస్ లో ఇప్పటికీ ఉమెన్ చివర్లో తింటారు. ముందు మెన్ తింటారు తర్వాత చిల్డ్రన్ తింటారు తర్వాత ఎల్డర్స్ తింటారు చివరికి మిగిలిన ఫుడ్ ని ఉమెన్ తింటారు. ఉమెన్ ప్రెగ్నెంట్ అయినా కూడా చాలాసార్లు ఆమెకు ఇద్దరికీ సరిపోయేంత ఫుడ్ అందదు.
(09:26) కొన్ని ప్లేసెస్ లో అయితే కావాలనే ప్రెగ్నెంట్ ఉమెన్ కి తక్కువ ఫుడ్ ఇస్తారు ఎందుకంటే బేబీ ఎక్కువగా గ్రో అయితే డెలివరీ టైం లో ప్రాబ్లం అవుతుంది అని అంటే లో బర్త్ వెయిట్ అనేది కేవలం మెడికల్ ఇష్యూ మాత్రమే కాదు ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా ఫ్యామిలీలో ఆ ఉుమెన్ పొజిషన్ ఏంటి ఆమెకు ఏ ఫుడ్ దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుంది ఎంత దొరుకుతుంది ఇవన్నిటిని కొన్నిసార్లు సొసైటీ డిసైడ్ చేస్తుంది.
(09:49) ఇందులో అన్నిటికన్నా సాాడ్ పార్ట్ ఏమిటంటే ఇది ఒక సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఒక ట్రాప్ ఒక అమ్మాయి లో బర్త్ వెయిట్ తో పుడుతుంది. ఆమె మాల్ నరిషడ్ గా పెరుగుతుంది. దాంతో చిన్నగా వీక్ గా ఉంటుంది. యంగ్ ఏజ్ లోనే ఈ అమ్మాయికి పెళ్లి చేస్తారు. వెంటనే ఆమె మదర్ కూడా అయిపోతుంది. కానీ ఆమె ఓన్ బాడీ బేబీకి కంప్లీట్ న్యూట్రిషన్ ఇవ్వలేకపోతుంది.
(10:12) దాంతో ఆమె కూడా ఒక లో బర్త్ వెయిట్ బేబీకి జన్మనిస్తుంది. ఒకవేళ ఆ బేబీ కూడా గర్ల్ అయితే సేమ్ స్టోరీ నెక్స్ట్ జనరేషన్ కి మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే ఇది ఒక జనరేషనల్ ప్రాబ్లం మాత్రమే కాదు మదర్ నుంచి డాటర్ కి వెళ్తున్న ఒక ఇన్హెరిటెన్స్ లాంటిది. ఏదో ఒక జనరేషన్ లో ఈ విషయస్ సైకిల్ ని బ్రేక్ చేయకపోతే ఇంప్రూవ్మెంట్ రావడం చాలా కష్టం.
(10:36) దీని ఇంపాక్ట్ ఎంత సివియర్ గా ఉంటుందంటే ఒక స్టడీ ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో ఎనీమియా ఉన్న మదర్ లో స్టిల్ బర్త్ రిస్క్ 1.4 టైమ్స్ ఉంటుంది. బేబీ చనిపోయే రిస్క్ 1.7 టైమ్స్ ఉంటుంది. లో బర్త్ వెయిట్ బేబీ రిస్క్ 1.3 టైమ్స్ ఉంటుంది. మరి దేశంలో ఇంత జరుగుతుంటే మన హెల్త్ కేర్ సిస్టం ఏం చేస్తుంది అంటే దీనికి ఆన్సర్ చాలా మిక్స్డ్ గా ఉంది.
(11:00) మన హెల్త్ కేర్ సిస్టం కొన్ని మంచి సక్సెస్ఫుల్ పనులు చేసింది. అలాగే కొన్ని అతి పెద్ద ఫెయిల్యూర్స్ కూడా చేసింది. ముందు సక్సెస్ గురించి చూద్దాం. గత 20 సంవత్సరాల్లో ఇండియా ఒక పెద్ద బ్యాటిల్ గెలిచింది. అదే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే హాస్పిటల్లో లేదా హెల్త్ ఇన్స్టిట్యూట్ లో డెలివరీ జరగడం. ఒకప్పుడు చాలా మంది బేబీస్ ని హౌస్ లోనే కనేవారు.
(11:19) ప్రాపర్ గా ట్రైనింగ్ లేని వ్యక్తుల ప్రెజెన్స్ లో పుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియాలో దాదాపు 89% డెలివరీస్ ఇన్స్టిట్యూషన్స్ లో అంటే హాస్పిటల్ లో జరుగుతున్నాయి. దీనివల్ల ఇండియాలో మటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా వరకు తగ్గాయి. ఇప్పుడు ఫెయిల్యూర్స్ చూద్దాం ఎందుకంటే అసలు స్టోరీ ఇక్కడే ఉంది. మొదటి గ్యాప్ న్యూట్రిషన్ డెలివరీని హాస్పిటల్ లో చేయించుకోగలుగుతున్నాం కానీ ప్రాపర్ న్యూట్రిషన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాం.
(11:44) ఎందుకంటే మనం ముందు చూసినట్టుగా ఎనీమియా రేట్ తగ్గడం లేదు పెరుగుతుంది. ఒక ఉమెన్ ని డెలివరీ రోజు హాస్పిటల్ కి తీసుకెళ్ళడం వల్ల ప్రీవియస్ నైన్ మంత్స్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కరెక్ట్ అయిపోదు. బేబీ ఎంత డెవలప్ అవుతుంది అనేది డెలివరీ డే మీద డిపెండ్ కాదు. మదర్ ఓమ్లో గడిపిన 270 డేస్ మీద డిపెండ్ అవుతుంది.
(12:06) ఆ టైంలో మదర్ ఏం తీసుకుంది ఎటువంటి ఆహారం తీసుకుంది అనే విషయం పైన డిపెండ్ అవుతుంది. ఇక రెండవ గ్యాప్ క్వాలిటీఎన్ఎఫహచ్ఎస్ 5 ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో దాదాపు 78% ఉమెన్ ఐరన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు. అంటే ఐదుగురిలో ఒకరు అది కూడా తీసుకోవడం లేదు. కేవలం 18% ఉమెన్ కి డవార్మింగ్ మెడిసిన్స్ అందింది. ఇది ఎనీమియా విషయంలో చాలా ఇంపార్టెంట్.
(12:30) ఇక రెండవ గ్యాప్ ఇనీక్వాలిటీ రీసెర్చర్లు డిఫరెంట్ స్టేట్ లో చెకప్ డాటాను చూసినప్పుడు అంటే ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ తమ బాడీని ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ల దగ్గర చెక్ చేయించుకుంటున్నారు అన్న విషయాన్ని చూసినప్పుడు ఆ పర్సంటేజ్ కొన్ని స్టేట్స్ లో 11% గా ఉంటే మరికొన్ని స్టేట్స్ లో 92% గా ఉంది. అంటే ఒక స్టేట్ లో ఆల్మోస్ట్ ప్రతి ఉమెన్ కి ప్రాపర్ కేర్ అందుతుంది.
(12:51) మరో స్టేట్ లో ప్రతి 10 మందిలో ఒక్కరికి కూడా అందడం లేదు. ఈ డిఫరెన్స్ బేబీస్ బర్త్ వెయిట్ లో కూడా డైరెక్ట్ గా కనిపిస్తుంది. సిటీస్ తో కంపేర్ చేస్తే విలేజెస్ లో లో బర్త్ వెయిట్ బేబీస్ ఎక్కువ ఎస్పెషల్లీ వెస్టర్న్ సెంట్రల్ ఇండియా విలేజెస్ లో ఇంకా ఎక్కువ. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ సైన్స్ చాలా క్లియర్ గా ఉంది.
(13:12) మొదటిది మ్యారేజ్ అండ్ మదర్హుడ్ ఏజ్ ఒక గర్ల్ కి తన బాడీ కంప్లీట్లీ డెవలప్ చేసుకోవడానికి దొరికే ప్రతి ఎక్స్ట్రా ఇయర్ ఫ్యూచర్ లో ఆమె బేబీ వెయిట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. రెండవది న్యూట్రిషన్ ప్రెగ్నెన్సీ తర్వాత కాదు ప్రెగ్నెన్సీ కి ముందే స్టార్ట్ అవ్వాలి. ఉమెన్ ప్రెగ్నెంట్ అయ్యాక న్యూట్రిషన్ గురించి ఆలోచించడం సరికాదు ఎందుకంటే అప్పటికే ఆమె బాడీ ఎలా డెవలప్ అయిందో అలా ఉంటుంది.
(13:37) అందుకే టీనేజ్ గర్ల్స్ కి ఐరన్ ప్రోటీన్ ప్రాపర్ ఫుడ్ ఇవ్వడం మనం చేసే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో ఒకటి. నెంబర్ త్రీ ఎనీమియాతో స్ట్రాంగ్ గా ఫైట్ చేయాలి. కేవలం ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోదు. మీరు తీసుకునే ఫుడ్ లో ప్రాపర్ ఐరన్ ఉందా? ఐరన్ అబ్సర్ప్షన్ కి సంబంధించిన ప్రాబ్లం ని మీరు ప్రాపర్ గా అడ్రెస్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి.
(13:59) ఇక నాలుగవది బహుశా అన్నిటికన్నా డిఫికల్ట్ మన ఇంట్లో ఫుడ్ విషయంలో ఈక్వాలిటీ ఉండాలి. ఉమెన్ చివర్లో తినాలి అనే థింకింగ్ కంప్లీట్ గా పోవాలి. ఈ వీడియో పర్పస్ ఏ మదర్ ని బ్లేమ్ చేయడం కాదు ఎందుకంటే ఆ మదర్ కూడా తనకంటే ముందు స్టార్ట్ అయిన ఒక సైకిల్ లో పార్ట్. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఒకటే.
(14:19) మనం సాధారణంగా బేబీ హెల్త్ అనేది బేబీ పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. ఫస్ట్ వ్యాక్సిన్ ఫస్ట్ మిల్క్ ఫస్ట్ చెకప్ ఇక్కడి నుంచే హెల్త్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. కానీ నిజానికి బేబీ హెల్త్ బేబీ పుట్టడానికి చాలా ముందే డిసైడ్ అవుతుంది. బేబీ హెల్త్ అనేది ఒక మదర్ కూడా కానీ టీనేజ్ గర్ల్ ప్లేట్ లో ఉండే ఫుడ్ తో డిసైడ్ అవుతుంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ యంగ్ పాపులేషన్ లో ఒకటి మన దగ్గర ఉందని మనం ప్రౌడ్ గా చెబుతాము.
(14:47) కానీ ఆ యంగ్ పాపులేషన్ ఎంత స్ట్రాంగ్ గా హెల్దీగా ఉందనేది చాలా ఇంపార్టెంట్. అది డిసైడ్ చేసేది మన ప్లేట్ లో ఉన్న ఫుడ్ మన ఇల్్లలో ఉమెన్ ఏం తింటున్నారు ఎంత తింటున్నారు ఆ ఫుడ్ మీద ఫస్ట్ రైట్ ఎవరికి ఉంది ఇవి డిసైడ్ చేస్తాయి. ఇవి మారినప్పుడే మన దగ్గర హెల్దీ బేబీస్ పుడతారు. మొత్తంగా ఇవే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలి అనుకుంటున్న విషయాలు.
(15:09) మీలో ఎంతమంది ఈ విషయాలని కొత్తగా తెలుసుకుంటున్నారు అండ్ ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ కొత్తగా మదర్ అవుతున్న అవ్వాలి అనుకుంటున్న మహిళలకి కపుల్స్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేసి ప్రతి ఒక్కరిలో ఈ అవేర్నెస్ వచ్చేలా చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(15:30) ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై
No comments:
Post a Comment