Thursday, August 13, 2026

ఈరోజు తాజ్ మహల్‌ను మళ్లీ ఎందుకు కట్టలేము? | The Real Reason Explained

ఈరోజు తాజ్ మహల్‌ను మళ్లీ ఎందుకు కట్టలేము? | The Real Reason Explained

Author Name:ssffacts

Youtube Channel Url:https://www.youtube.com/@ssffacts

Youtube Video URL:https://www.youtube.com/watch?v=heE_ZuWTr1s



Transcript:
(00:00) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఈరోజే తాజ్మహల్ ను కొనగలడు కానీ అదే డబ్బుతో దాన్ని మళ్ళీ కట్టలేడు. ఎలన్ మస్క్, బిల్ గేట్స్, [సంగీతం] ముకేష్ అంబాని వీళ్ళంతా కలిసినా సరే బెస్ట్ ఇంజనీర్లు ఏఐ రోబోట్లు అపరిమితమైన డబ్బు ఇవన్నీ ఉన్నా కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వదు. కారణం డబ్బు కాదు టెక్నాలజీ కూడా కాదు. 400 ఏళ్ల క్రితం ఒకేసారి కలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు ప్రపంచంలో మళ్ళీ దొరకవు.
(00:28) అందుకే ఈ వీడియో మొత్తం ఒకే ప్రశ్నకు సమాధానం. తాజ్మహల్ ను ఈరోజు ఎందుకు మళ్ళీ కట్టలేం చివరిదాకా చూడండి. చివర్లో ఒక నెంబర్ చెప్తాను అది వినగానే మీరే షాక్ అవుతారు. మొదటి అడ్డంకి మన కంటికి కనిపించదు. [సంగీతం] అది నేల లోపల దాగి ఉంది. తాజ్మహల్ ను యమునా నది ఒడ్డున అది తడి బురద నేల మీద కట్టారు. లక్షల టన్నుల బరువున్న కట్టడాన్ని అలాంటి నేల మీద పెడితే మహా అయితే కొన్ని దశాబ్దాల్లోనే కూలిపోవాలి.
(00:54) కానీ 400 ఏళ్లయినా ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఎలా మొగల్ ఇంజనీర్లు ఆ బురద నేలలో వందల బావులు తవ్వి వాటిలో యబోని మహాగని లాంటి కఠినమైన కలపను [సంగీతం] దూర్చారు. ఈ కలప నీటిలో ఎప్పుడూ మునిగి ఉంటే ఉక్కులా గట్టిపడుతుంది. యమునా నది నీరు ఆ బావుల్లోకి ఎప్పుడూ ఇంకుతూ ఉండటంతో ఆ కలపరాయి కంటే గట్టిగా మారిపోయింది. నిజానికి తాజ్మహల్ నేల మీద లేదు.
(01:17) ఆ కలప స్తంభాల మీద తేలుతూ నిలబడింది. మరి ఈరోజు ఏ ఇంజనీరింగ్ కంపెనీ అయినా నదీ తీరంలో కాంక్రీట్ లేకుండా కేవలం కలప పునాదితో అంత రిస్క్ తీసుకుంటుందా ఏదీ తీసుకోదు. [సంగీతం] పైగా ఆధునిక నిబంధనలు దీన్ని అస్సలు ఒప్పుకోవు. కాబట్టి ఈరోజు కేవలం [సంగీతం] ఫౌండేషన్ వేయడానికే అయ్యే ఖర్చు అక్షరాల 22200 కోట్ల రూపాయలు అప్పటికీ నేల మీదకు ఇంకా ఒక తెల్ల రాయి కూడా రాదు.
(01:42) ఇక్కడ మొదటి అడ్డంకి డబ్బు కాదు. ప్రకృతి మీద అంత రిస్క్ తీసుకునే తెగింపు ఈరోజు మనకి లేదు. అందుకే ఆ పునాది రహస్యం లేకుండా తాజ్మహల్ ను మళ్ళీ కట్టడం అసాధ్యం. సరే పునాది సిద్ధమైంది అనుకుందాం. కానీ ఇంకా ఒక్క తెల్ల రాయి కూడా ఆగ్రాకు చేరలేదు. మీకు తెలుసా తాజ్మహల్ లోపల ఉండేవి నిజానికి ఇటుకలు. తెల్ల మార్బుల్ అనేది కేవలం పైపూత మాత్రమే.
(02:07) పూర్తిగా మార్బుల్ తోనే కడితే బరువు 83% పెరిగిపోయి పునాదికే ముప్పు వస్తుంది. ఇక ఈ రాయి రాజస్థాన్ లోని మక్రానా నుండి 300 కిలోమీటర్ల దూరం నుండి వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే సూర్యోదయంలో గులాబీ రంగు, మధ్యాహ్నం స్వచ్ఛమైన తెలుపు, రాత్రి వెన్నెల్లో వెండి రంగులో మెరుస్తుంది. ఇలాంటి రాయి ప్రపంచంలో మరెక్కడా దొరకదు. 7000 టన్నుల రాయిని తీసుకురావడానికి 1000కి పైగా ఏనుగులను వాడారు.
(02:35) 9 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్ాంప్ కట్టారు. ఈరోజు ఇదే పని చేయాలంటే అసలు సమస్య డబ్బే కాదు అక్కడ ఆ మార్బులే లేదు. 400 ఏళ్ల పాటు జరిగిన తవ్వకాల వల్ల మక్రానా గనుల్లో ఆ క్వాలిటీ రాయి ఇప్పుడు దాదాపు అయిపోయింది. మిగిలిన 400 గనులు అన్నీ కలిసి రెయిన్బో లో పనిచేసినా సరే ఆ క్వాలిటీ రాయిని ఇంత భారీ స్థాయిలో తీయడానికి కనీసం 28 వారాలు పడుతుంది.
(03:00) మొత్తం మార్బుల్ అలాగే నిర్మాణ ఫ్రేమ్ వర్క్ ఖర్చు 9000 కోట్ల రూపాయలు 1000 ఏనుగులు చేసిన పనిని ఈరోజు వందల మిషన్లు కలిసి చేయొచ్చు. టెక్నాలజీ మారింది కానీ ఆ ముడి రాయే ఇప్పుడు లేదు. అందుకే ఆ మార్బుల్ లేకుండా తాజ్మహల్ ను మళ్ళీ కట్టడం మరింత అసాధ్యం. మార్బుల్ కూడా వచ్చేసింది. ఇక తాజ్మహల్ కట్టేయొచ్చా లేదు తాజ్మహల్ గోడల మీద కనిపించే పూల డిజైన్లు పెయింటింగ్స్ కావు.
(03:24) పాలరాతి లోపల రత్నాలను చెక్కి [సంగీతం] బిగించిన పని అది. దీన్ని పియత్ర దుర అంటారు. ఒక్క పువ్వులోనే 60 కి పైగా చిన్న రాతి ముక్కలు ఉంటాయి. రెండు రాళ్ల మధ్య కనీసం వెంట్రుకంత గ్యాప్ కూడా లేకుండా అమర్చిన అద్భుతం అది. ఈరోజు మన దగ్గర లేజర్ కటింగ్స్ సిఎన్సి మిషన్లుఏఐ అన్ని ఉన్నాయి కానీ రాయికున్న సహజమైన నునుపు దాని వంపును కంటితో అంచనా వేసి కలిపే నైపుణ్యం మిషన్ దగ్గర లేదు కేవలం మనిషి కంటికి మాత్రమే ఉంది.
(03:54) ఈ కళను నేర్చుకోవడానికే ఒక కళాకారుడికి 20 ఏళ్ళు పడుతుంది. ఇది ఒక [సంగీతం] ఉద్యోగం కాదు తరతరాలుగా వస్తున్న వారసత్వం. ఇప్పుడు ఆగ్రాలో ఈ కళను [సంగీతం] బతికిస్తున్న కుటుంబాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. మీరు ఎంత డబ్బు పెట్టినా ఒక కళాకారుడి 20 ఏళ్ల అనుభవాన్ని ఎప్పటికీ కొనలేరు. ఇదే స్థాయి [సంగీతం] పనికి ఇప్పుడు 5000 మంది కళాకారులు కావాలి.
(04:16) వాళ్ళ శ్రమకే 2000 కోట్ల రూపాయలు అవుతుంది. అందుకే ఆ చేతులు [సంగీతం] ఆ ఓపిక లేకుండా తాజ్మహల్ ను మళ్ళీ కట్టడం అసాధ్యం. సరే పునాది, మార్బుల్, కళాకారులు అన్నీ ఏదోలా సెట్ అయ్యాయి అనుకుందాం. అయినా ఇంకా ఒక్క అడ్డంకి మిగిలే ఉంది. అదే ఒక అధికారం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని అధికారం అది షాజహాన్ ఒక్క మాట చెప్తే చాలు 20వేల మంది కూలీలు 22 ఏళ్ల పాటు నిరంతరంగా పని చేశారు.
(04:44) భూమి కావాలంటే భూమి తీసుకున్నాడు. వనరులు కావాలంటే సామ్రాజ్యం నలుమూలల నుంచి రప్పించాడు. ఎవరూ ప్రశ్నించలేదు. ఎవరూ కోర్టుకి వెళ్ళలేదు. ఈరోజు అలాంటి నిర్మాణం మొదలు పెడితే భూసేకరణ కేసులే సంవత్సరాల తరబడి నడుస్తాయి. పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూపులు పైగా యమునా నది ఒడ్డున ఇప్పటికే కఠినమైన నిర్మాణ నిషేధాలు ఉన్నాయి.
(05:06) ఆ పైన కార్మిక చట్టాలు, టెండర్లు, బడ్జెట్ ఆమోదాలు ఒక్క రాజు నిర్ణయం తీసుకున్న చోట ఈరోజు వందల మంది అధికారులు వేల పేజీల అనుమతులు కావాలి. ఆనాటి నిరంకుశ అధికారం పోయింది. ప్రజాస్వామ్య జవాబుదారీతనం వచ్చింది. అది మంచిదే కానీ దానివల్ల ఇలాంటి ఒకే వ్యక్తి నిర్ణయ నిర్మాణాలు ఇక ఎప్పటికీ సాధ్యం కావు. అందుకే ఆ అధికారం లేకుండా తాజ్మహల్ను మమల్లి కట్టడం అసాధ్యం.
(05:32) ఇవన్నీ కలిపితే మొత్తం ఖర్చు దాదాపు 13వేల కోట్ల రూపాయలు భూమి, తోటలు, ఫౌంటైన్లు ఇవన్నీ కలిపితే ఇది 2 బిలియన్ డాలర్లు దాటుతుంది. ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్దాం. 400 ఏళ్ల క్రితం తాజ్మహల్ కోసం ఖర్చు పెట్టిన మొత్తం మొగల్ సామ్రాజ్యం మొత్తం వార్షిక ఆదాయంలో 15% ఏ దేశమైనా తన మొత్తం ఆదాయంలో 15% ఎలాంటి ఆర్థిక లాభం లేని ఒక్క స్మారక చిహ్నం కోసం ఖర్చు పెడుతుందా? ఈరోజు ఏ ప్రభుత్వము ఒప్పుకోదు.
(06:02) ఏ ఇన్వెస్టర్ కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఆధునిక ప్రపంచం లాభం కోసం పని చేస్తుంది. షాజహాన్ కి లాభం అవసరం లేదు. అతనికి కావాల్సింది తన ప్రేమకు ఒక శాశ్వతత్వం మాత్రమే. మనకి ఈరోజు టెక్నాలజీ ఉంది డబ్బు ఉంది కానీ 22 ఏళ్ల పాటు ఎలాంటి తిరిగి రాబడి లేని ఒక కలను నమ్ముకునే ఓపిక లేదు. అందుకే ఆ ఆర్థిక నమూనా ఆ ఓపిక లేకుండా తాజ్మహల్ ను మళ్ళీ కట్టడం పూర్తిగా అసాధ్యం.
(06:28) మార్బుల్ చనిపోయింది. బురద నేలపై కట్టిన ఆ పునాది రహస్యం పోయింది. కళాకారులు కనుమరుగవుతున్నారు. ఒక్క రాజుకున్న అధికారం పోయింది. ఆర్థిక నమూనా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మొదట అడిగిన ప్రశ్నకు మళ్ళీ వద్దాం. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు బెస్ట్ ఇంజనీర్లు ఏఐ అన్నీ కలిసిన తాజ్మహల్ ను మళ్ళీ నిర్మించగలరా సాంకేతికంగా చూస్తే బహుశా సాధ్యమే కావచ్చు డబ్బు ఉంది మిషన్లు ఉన్నాయి కానీ లేనిదల్లా ఒక్కటే ఆ పిచ్చి ఆ అపరిమితమైన మక్కువ మొగల్ ఇంజనీర్లు కేవలం రాయి మీద రాయి పేర్చలేదు.
(07:02) వాళ్ళు తమ కాలంలోని అత్యంత ధనిక సామ్రాజ్యపు మొత్తం మొక్కువను ఆ తెల్ల పాలరాతిలో బంధించారు. తాజ్మహల్ ఒక కట్టడం కాదు అది మానవ నాగరికత ఒక్కసారి మాత్రమే వేసిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ సంతకం అది ఇప్పటికే పుట్టేసింది. కాబట్టి తదుపరిసారి తాజ్మహల్ ని చూసినప్పుడు దాన్ని కేవలం ఒక అందమైన కట్టడంగా మాత్రమే చూడకండి. దాన్ని ఒక శాశ్వతంగా మూసుకుపోయిన [సంగీతం] తలుపుగా చూడండి.
(07:29) మరి మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఏదైనా దేశం తన సంపదలో 15 శాతం ఇలాంటి ఒక్క జ్ఞాపకం కోసం ఖర్చు చేయగలదా మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి

No comments:

Post a Comment