Thursday, August 20, 2026

 *_అంతరం.._*

_నేలకూ నింగికి మధ్య.._

_విత్తుకు పైరుకు మధ్య.._

_నేతకు నీతికి మధ్య.._

_మాటకు..చేతకు మధ్య.._

_రోగానికి.._
_వైద్యానికి మధ్య.._

_న్యాయానికి.._
_న్యాయస్థానానికి మధ్య.._

_చట్టానికి..అమలుకు మధ్య_

_దేవుడికీ..భక్తుడికి మధ్య.._

_సంస్కృతికి.._
_సంస్కారానికి మధ్య.._

_నిబంధనకు.._
_అమలుకు మధ్య.._

_అవసరానికి.._ 
_అందుబాటుకు మధ్య.._

_కులానికి కులానికి మధ్య.._

_మతానికి మతానికి మధ్య.._

_గొప్పోడికి పేదోడికి మధ్య.._ 

_నీకు..నాకు మధ్య.._

_అసలు.._
_మనిషికీ..మనిషికీ మధ్య.._

_అంతిమంగా.._
_*నీకు..నీలోని నీకు మధ్య..!*_

(_సురేష్..9948546286_)
           _..7995666286_

No comments:

Post a Comment