Thursday, August 20, 2026

 కొంచెం ఓపికగా చదవండి ప్లీజ్..
వండర్ఫుల్ పోస్ట్ బై Siva Siva గారూ

మళ్ళీ కలుద్దామా? 
                  ****************************
అంటే ఇప్పుడేదో విడిపోయామని కాదుకానీ.....లాస్ ఏంజెల్స్ లో నేను ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నరోజుల్లో....ఒకరోజు మా వరప్రసాద్ గాడు "మా అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడంలేదురా" అని కంగారుగా ఉన్నాడు.....పోనీ పక్కన మీ మేనమామవాళ్ళే అన్నావ్ కదా ఒకసారి ఆయనకి ఫోన్ చేసి చెప్పురా అంటే....వాళ్ళకీ మాకు ఏడేళ్ళుగా మాటల్లేవు అన్నాడు .....పోనీ వాళ్ళపిల్లలకి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి చూసిరమ్మని చెప్పు అంటే.... లేదురా వాళ్ళుకూడా నాలుగేళ్ళుగా చికాగోలోనే వుంటున్నారు....అమ్మ మాట్లాడడంలేదు కదా అని మేముకూడా వాళ్ళ పిల్లలతోకూడా మాట్లాడడంలేదు అన్నాడు.....ఎంత బాధాకరం సార్ ఇది.... కేవలం వాడొక్కడే కాదు.....ఇప్పుడు ప్రతిఒక్క కుటుంబంలో జరుగుతున్నదిదే .....అప్పటిదాకా కలిసిమెలసివున్న బంధువులమధ్య ఏ చిన్నగొడవ వివాదాలకు కారణం అవుతుందోకూడా అర్ధంకావడంలేదు.....

మన ముందుతరంలో మట్టి మిద్దెలు ఉన్నప్పుడు మనుషులమధ్య సంబంధాలుకూడా అలానేఉండేవి..... ఏదయినా కారణంవల్ల గోడకిఉన్న మట్టిపోతే మళ్ళీ కొత్తమట్టి తెచ్చి చక్కగా అలికేవాళ్లు....అలాగే చిన్నచిన్న మనస్పర్ధలవల్ల విడిపోయిన మన చుట్టాలుకూడా మూడురోజులు మూతి ముడుచుకుని ఉన్నా నాలుగోరోజు నవ్వుపులుముకొని చక్కగా కలిసిపోయి.....ఒకచోట కూర్చుని....ఒకే తోటకూర కట్ట  చెరికొంచెం వొలుస్తు కూర్చునేవాళ్ళు ....మరిప్పుడు?? ......మట్టిమిద్దెల స్థానంలో అద్దాల మేడలు వచ్చాయి....అద్దం ఒకసారి పగిలిపోతే ఇంక ఎప్పటికీ దాన్ని అతికించలేము..... అలాగే మనుషుల మధ్య సంబంధాలు కూడా చిన్నచిన్న మనస్పర్ధలకే మళ్ళీ ఎప్పటికీ కలుసుకోలేనంతగా దెబ్బతింటున్నాయి .....పెద్దపెద్ద భవంతులలో....చిన్న మనసుతో బ్రతుకుతున్నాం.....ఏదన్నా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా పంచుకోడానికి బంధువులెవరూ లేక....దేవుడితోనే  చెప్పుకుంటున్నాం .....చివరికి నట్టింట్లో కొలువై మన కుటుంబానికి నాలుగు దిక్కులనుంచి వచ్చే ఆపదలనుంచి రక్షించే దేవుడినికూడా పూజగది పేరుతో ఇంట్లో ఒకమూలకి నెట్టేశాం.....

అందునా ఇంతకుముందు మన బంధువులందరూ ఒకేదగ్గిర నివసించేవాళ్ళు..... ఉద్యోగరీత్యా వేరే ఊర్లలో నివసించేవాళ్ళు చాలా తక్కువగా వుండేవాళ్ళు....అందుకనే ఏమైనా చిన్న చిన్న పొరపొచ్చాలున్నా ఒకేదగ్గిర ఉండడంతో కాలంతోపాటే వాళ్ళ మనసులోకూడా ఆ వివాదం తాలూకు బేధాభిప్రాయాలు తొలిగిపోయి మళ్ళీ కలిసిపోయేవాళ్లు....మరిప్పుడో??....ఒకరు హైదరాబాద్ లో, మరొకరు బెంగుళూరులో, ఇంకొకరు అమెరికాలో, లండన్లో, ఢిల్లీలో, ముంబైలో.....ఇలా వేరువేరు చోట్ల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.....ఎప్పుడో ఒకసారి కలవడం...ఆ కలిసిన ఒక్కసారికూడా ఏదో చిన్న మాటతేడాకే మనస్పర్ధలొచ్చేస్తున్నాయి....విడిపోతున్నారు .....మళ్ళీ కొన్ని సంవత్సరాలవరకు కూడా కలుసుకునే అవకాశం కలగక అలానే శాశ్వతంగా దూరమవుతున్నారు......మనుషులమధ్య ఈర్ష్యలు, అసూయలు ఎక్కువయ్యాయి......మనం బావుండాలి......మన బంధువులు మనకన్నా కొంచెం తక్కువ బావుండాలి అనుకునేవాళ్లు ఎక్కువయ్యారు.....

ఇప్పటిదాకా మన ముందుతరం ఇంకాబ్రతికే ఉండడంవల్ల పండగలకి ఊరికి రమ్మని పిలుస్తుండడంవల్ల వాళ్లకోసమైనా  మన ఊరికి, మన ఇంటికి వస్తున్నాం....ఆ వచ్చినప్పుడు చుట్టాలని, చుట్టుపక్కల వాళ్ళని, ఊర్లో తెలిసిన వాళ్ళని పలకరిస్తున్నాం......కాలంతో పాటే మన ముందు తరం మనకు దూరమయితే రేపు మనల్ని పండగకి ఊరికి రమ్మని పిలిచేవాళ్ళు కూడా కరువవుతారు......మన పిల్లలకి ఆ బాధ తెలియకపోవచ్చు కానీ...... పండగకి ఒక్కసారి వచ్చిపో అని మనల్ని పిలిచే వాళ్ళులేక....ఆప్యాయంగా పలకరించే మన అనేవాళ్ళు లేక మనతరంవాళ్ళు పడే బాధలు వర్ణించలేనివి .....ఇలాగేఉంటే అమెరికావాళ్ళే మనకన్నాబాగా కలిసి ఉంటున్నకింద లెక్క.....జీవితం చాలా చిన్నది..... ఇంత చిన్నజీవితంలో ఎందుకు మనకీ పంతాలు, పట్టింపులు, కోపాలు, తాపాలు, అలకలు?.....ఏ చూపు చివరిచూపు అవుతుందో....ఏ పలుకు చివరి పలుకవుతుందో .....ఎవరికి తెలుసు..... పడుకుంటే మళ్ళీ నిద్రలేస్తామో లేదోకూడా తెలియదు సార్.....అందుకే మనం మారాలి ....మారదాం... మారలేమా?..... అందర్నీ కలుపుకుందాం.....మాట్లాడదాం.....మనసు నిండా మాట్లాడదాం....మనసు కుదుటపడేదాకా....మనసు తేలికపడేదాకా మాట్లాడదాం.... కలుద్దాం .....మనకి చుట్టం అవుతాడు అన్న అనుమానం వచ్చినా వెళ్ళి కలుద్దాం.... ఎదగడం అంటే మనమొక్కరే ఎదగడం కాదు.....మనతో పాటు చుట్టుపక్కల అందరూ ఎదగడం......ఇది తెలుసుకుని .....చిన్నచిన్న మనస్పర్ధలకే విడిపోయి జీవితాన్ని నరకంచేసుకోకుండా...... మన బంధువులతో కలిసిమెలసి సంతోషంగా....సుఖంగా కలిసి జీవిద్దాం

దయచేసి మీ బంధువులకి....మీకు తెలిసిన స్నేహితులకి share చెయ్యండి....మనవల్ల ఒక్కరు కలిసినా మనకెంతో మేలు జరుగుతుంది.....

No comments:

Post a Comment