Thursday, August 20, 2026

 శివుడు ఎప్పుడైనా పార్వతీదేవిపై కోపగించుకున్నారా? ఏం జరిగింది?


కొన్ని సరదాగా చేసే పనులు కూడా సరిదిద్దుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది.

ఇది జీవులకే కాదు, దేవతలకు కూడా తప్పదు. ఓ సంతోష సమయంలో పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళు మూసింది, క్షణమే. శివుడు " సోమసూర్యాగ్నిలోచనుడు" - సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆయన కనులు. కళ్ళుమూస్తే పరిస్థితి ఏమిటి. వారికి క్షణమే, చిన్నసమయమే. కాని ఆ సమయం మనకు కొన్ని వందల వేల సంవత్సరాలు. సృష్టి అంతా ఓ కుదుపుకు లోనయింది. శివుడు ఆగ్రహంతో " పోయి తపస్సుచేసుకుని ప్రక్షాళన చేసుకో " అని పార్వతిని కోప్పడ్డారు.

వచ్చి కాంచీపురంలో తపస్సుచేసి కామాక్షీదేవి అయింది. తపస్సు చేస్తూన్నా వదిలేరా స్వామి, లేదు భయంకరమయిన నీటిప్రవాహాన్ని పంపారు. ఆవిడ దుర్గని పంపి ఔపాసన పట్టించేసింది తెలియక. వెంటనే ఇంకా ఉధృతంగా ప్రవాహం వచ్చింది. అప్పుడు తెలుసుకుంది, అది శివుడి ఆగ్రహం అని. వెంటనే శివలింగాన్ని కౌగిలించుకుని " కంప, కంప ( రక్షించండి ) " అంది. ఆ ప్రవాహమే " కంపానది " అయింది.

పార్వతీదేవి తరువాత ఏమి చేయాలి అని అడిగారు శివుణ్ణి. అరుణాచలం వెళ్ళి గౌతమమహర్షిని కలవమన్నారు. అమ్మవారు మహర్షికి శిష్యురాలయి ఆయన చెప్పిన అద్భుతమయిన " అరుణాచలవైభవం " విని పాపప్రక్షాళన చేసుకుని స్వామిని చేరారు.

ధర్మాన్ని విస్మరిస్తే మెత్తగా ఉండవు శిక్షలు.

మన సనాతనధర్మానికి, వాజ్మయానికి సాటిలేదు, రాబోదు.

ఏతత్ సర్వం శ్రీ కంచి కామాక్షీదేవతార్పణమస్తు.

శుభమస్తు

No comments:

Post a Comment